
శ్వేత మృతదేహం
అనంతపురం, పుట్టపర్తి టౌన్: తనకు ఇష్టం లేదంటున్నా పెళ్లి సంబంధం చూస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అర్బన్ సీఐ వెంకటేష్‌నాయక్ తెలిపిన మేరకు... పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని 17వ వార్డు బీడుపల్లిలో ఈడిగ జనార్దన కుమార్తె శ్వేత (27) ఎంబీఏ పూర్తి చేసింది. తనకు పెళ్లి ఇష్టంలేదని, ఇప్పుడే చేసుకోనని తల్లిదండ్రులకు పలుమార్లు తెలిపింది. అయినా తల్లిదండ్రులు కూతురు జీవితం బాగుండాలని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాలుగురోజుల క్రితం వద్దన్నా పెళ్లి సంబంధం చూస్తున్నారంటూ శ్వేత మనస్తాపం చెందింది. తన చావుకు తల్లిదండ్రులు కానీ, ఇతరులు కానీ కారణం కాదని లేఖ రాసి మంగళవారం రాత్రి ఇంట్లోనే చీరతో ఫ్యానుకు ఉరివేసుకుంది. బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేవగానే ఉరికి వేలాడుతున్న శ్వేత కనిపించింది. సమాచారం అందుకున్న అర్బన్ సీఐ వెంకటేష్‌నాయక్ తమ సిబ్బందితో వచ్చి పరిసరాలు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment