పవన్కు నాలుగు నెలలు సరిపోతుందా..? | big challenge for director Trivikram | Sakshi
Sakshi News home page

పవన్కు నాలుగు నెలలు సరిపోతుందా..?

Published Thu, Jan 19 2017 12:35 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్కు నాలుగు నెలలు సరిపోతుందా..? - Sakshi

పవన్కు నాలుగు నెలలు సరిపోతుందా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన నెక్ట్స్ సినిమాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమాను కాటమరాయుడు సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. అయితే ఇంత వరకు షూటింగ్ కూడా మొదలు కాని ఈ సినిమాకు రిలీజ్ డేట్ను కూడా ఫైనల్ చేశారాన్న టాక్ వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో పవన్, త్రివిక్రమ్ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

కాటమరాయుడు మార్చి నెలాఖరున రిలీజ్ అవుతోంది. అంటే త్రివిక్రమ్ సినిమాను ఏప్రిల్లో ప్రారంభిస్తారు. ఏప్రిల్లో మొదలైన సినిమాను, నాలుగు నెలల కాలంలో షూటింగ్తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి, ఆగస్టు 11న రిలీజ్ చేయాలి. ప్రతీ సినిమాను సంవత్సరం పాటు తెరకెక్కించే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్లకు ఈ సమయం సరిపోతుందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. మరి అనుకున్నట్టుగా పవన్, త్రివిక్రమ్లు నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తారేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement