ఖైదీకే కాదు కాటమరాయుడుకీ అతనే విలన్ | Tarun Arora to lock horns with Chiranjeevi and pawan kalyan | Sakshi
Sakshi News home page

ఖైదీకే కాదు కాటమరాయుడుకీ అతనే విలన్

Published Thu, Dec 22 2016 2:28 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ఖైదీకే కాదు కాటమరాయుడుకీ అతనే విలన్ - Sakshi

ఖైదీకే కాదు కాటమరాయుడుకీ అతనే విలన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పవన్ ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ నటుడు విలన్గా నటించనున్నాడు.

చిరంజీవి రీ ఎంట్రీ సినిమాగా తెరకెక్కుతున్న ఖైదీ నంబర్ 150 లో విలన్గా నటిస్తున్న తరుణ్ అరోరానే కాటమరాయుడులోనూ విలన్గా నటిస్తున్నాడట. వీరమ్ సినిమాకు రీమేక్గా తెరకెక్కుతున్న కాటమరాయుడులో ఓ పవర్ ఫుల్ రోల్లో కనిపించనున్నాడు తరుణ్. ముఖ్యంగా పవన్, తరుణ్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలుస్తాయన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ సినిమాలో తరుణ్ అరోరాతో పాటు రావు రమేష్ కూడా విలన్గా కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement