
మెగా ఫార్ములాకే పవన్ ఓటు
ఈ మధ్య కాలంలో మెగా హీరోలు తమ సినిమాల ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడకుండా ఉండేందుకు ఆడియో వేడుకలకు దూరంగా ఉంటున్నారు. సరైనోడు సినిమా నుంచి మెగా హీరోలు నటించిన ఏ సినిమాకు ఆడియో వేడుకను నిర్వహించలేదు. రామ్ చరణ్ ధృవ, మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లతో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన విన్నర్ సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ను నిర్వహించలేదు.
ఇప్పుడు ఇదే ఫార్ములాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఫాలో అవుతున్నాడట. మిగిలిన మెగా హీరోల బాటలోనే పవన్ కూడా తన తాజా చిత్రం కాటమరాయుడు సినిమాకు ఆడియో వేడుక నిర్వహించవద్దని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి మూడో వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గోపాల గోపాల ఫేం డాలీ( కిశోర్ పార్థసాని) దర్శకుడు. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్నాడు.