సాక్షి, విజయవాడ: పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. చిరంజీవి, నాగార్జున లాంటి సినీపెద్దలు సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని చెప్పారు. సినీపెద్దలతో సంబంధిత మంత్రి చర్చలు చేస్తున్నారని తెలిపారు. బ్లాక్ టికెట్లని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తప్పా? అని ప్రశ్నించారు. టికెట్ల విక్రయాలకు ఆన్‌లైన్ విధానాన్ని తీసుకువస్తే నీకు నష్టమేంటి? అని నిలదీశారు. శనివారం ఓ సినిమా ఆడియో ఫంక‌్షన్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు.
‘పావలా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్. రాష్ట్ర ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య దూరం పెంచడానికే పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడుతున్నట్లు ఉంది. నీవు అడ్డంగా కోట్లు సంపాదించుకోవాలి. రెండేళ్లుగా ప్రజలే పవన్ తాట తీశారు. సినీ పరిశ్రమలో దోపిడీని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సినిమా కార్యక్రమంలో రాజకీయాలు ఎందుకు మాట్లాడాడు?. రాజకీయాల్లో పనికి మాలిన స్టార్.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్న నేత సీఎం జగన్’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment