vellampalli Srinivasa Rao
-
వెలంపల్లికి నేతల పరామర్శ
సాక్షి, అమరావతి: సీఎం జగన్‌పై దాడి జరిగిన ఘటనలో గాయపడిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వెలంపల్లి ఇంటికి వెళ్లి ఆయన కంటికి అయిన గాయం గురించి ఆరా తీశారు. డాక్టర్‌ను కలిసి చికిత్స పొందాలని సూచించారు. ఘటన జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. సజ్జల వెంట రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు కాకుమాను రాజశేఖర్, కనకారావు మాదిగ, గుబ్బా చంద్రశేఖర్ ఉన్నారు. -
సీఎం జగన్‌పై హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు అయింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదుతో సింగ్‌నగర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నం ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మరోవైపు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే ఘటనాస్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. పక్కా ప్లాన్ ప్రకారం సీఎం జగన్‌పై దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. క్లూస్ టీమ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏసీపీ స్థాయి అధికారులతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం రాత్రి 8.10 గంటలకు సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్‌కు చేరుకోగానే ఆయనపై హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్ కణతకు గురిచూసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగడంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి.. ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. కాగా ఆ వస్తువు పదును, వేగాన్ని బట్టి అది రాయి, గ్రానైట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ ఎడమ కంటిపై భాగాన గాయమయ్యాక.. ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కూ తగలడంతో ఆయనకు కూడా గాయమైంది. చదవండి: రక్తమోడినా సడలని సంకల్పం -
అతనొక కారుడు కట్టిన రాక్షసుడు...బోండా ఉమాపై రెచ్చిపోయిన వెల్లంపల్లి
-
ఏపీ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదు: వెల్లంపల్లి
-
చంద్రబాబు,పవన్ కి వెల్లంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
-
ఒక్క హగ్‌తో యెల్లో బ్యాచ్‌కి చెక్
ఎన్టీఆర్, సాక్షి: పార్టీ విజయం కోసం కొన్ని మార్పులు తప్పవని.. అలాంటప్పుడు అలకలు సహజమని.. పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు ముందు నుంచే చెబుతున్నాయి. అయితే యెల్లో మీడియా మాత్రం ఈ అలకల్ని భూతద్ధంలో పెట్టి చూపించే యత్నం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ్టి విజయవాడ సెంట్రల్ పరిణామాలు.. ఆ బ్యాచ్ నోళ్లు మూయించాయి. వైఎస్సార్సీపీ నుంచి తొలి గెలుపు విజయవాడ సెంట్రల్‌దే కావాలని.. వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గెలిపించాలంటూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గురువారం పిలుపు ఇచ్చారు. అంతేకాదు విజయవాడలో పార్టీ కొత్త కార్యాలయం ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అయితే టీడీపీ అనుకూల మీడియా చానెల్స్, పత్రికలు చాలారోజుల నుంచి వీళ్ల మధ్య ఏదో వైరం నడుస్తున్నట్లు చూపించే యత్నం చేసింది. ఒక అడుగు ముందుకేసి ఆయన పార్టీని కూడా వీడుతారంటూ ఊహాజనిత కథనాలు రాశాయి. అయితే ఆ రోతరాతలకు ఒక్క హగ్‌తో చెక్ పెట్టారు ఈ ఇద్దరూ. విజయవాడ సెంట్రల్ సింగ్ నగర్ లో వైఎస్సార్సీపీ ఇంఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి ఆఫీస్‌కు ర్యాలీ తన ఆఫీస్ నుంచి మల్లాది వచ్చారు. ఈ సందర్భంగా మల్లాదికి వెల్లంపల్లి ఆత్మీయ స్వాగతం పలికారు. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నాని.. పలువురు నేతలు కూడా పాల్గొన్నారు. సమిష్టిగా పని చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాతామని ఈ సందర్భంగా ఈ ఇద్దరు ప్రకటించారు. -
ఇన్ని రోగాలున్న చంద్రబాబు ఏపీకి అవసరమా?
సాక్షి, కృష్ణా: రోగాలు ఉన్నందుకే చంద్రబాబుకు స్కిల్ స్కాం కేసులో కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉంటూనే టీడీపీ అధికార ప్రతినిధిగా దగ్గుబాటి పురందేశ్వరి పని చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు బెయిల్ పరిణామంపై విజయవాడలో మంగళవారం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. ‘‘కోర్టు చంద్రబాబుకు మద్యంతర బెయిల్ ఇచ్చింది రోగాలు ఉన్నాయనే. చంద్రబాబు నేరం చేయలేదని వాళ్ల న్యాయవాదులు ఎక్కడా చెప్పలేదు. అనారోగ్యాలతో బెయిల్ తెచ్చుకున్నారు. ప్రపంచంలో ఉన్న రోగాలన్నీ చంద్రబాబుకి ఉన్నట్లు చూపించి బెయిల్ తెచ్చుకున్నారు. చంద్రబాబుకి ఇచ్చింది షరతులతో కూడిన బెయిల్ మాత్రమే. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లాల్సిందే’’ అని వెల్లంపల్లి అన్నారు. చంద్రబాబు కనీసం 50 రోజులు కూడా సక్రమంగా లేరని.. ఇన్ని రోగాలు ఉన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరమా? అని వెల్లంపల్లి ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు రాజకీయాలకు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరాడు. తెలంగాణ ఎన్ని కల్లో పోటీ చేయిస్తామని చెప్పి కాసాని జ్ఞానేశ్వర్‌ను మోసం చేసారు. కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందంతో పోటీ చేయడం లేదని జెండా పీకేశారు. బీసీలను చంద్రబాబు మరోసారి మోసం చేశారు’’ అని వెల్లంపల్లి విమర్శించారు. ఇప్పుడు తెలంగాణాలో పోటీచేసే అవకాశం లేకుండా పార్టీ జెండా పీకేసిన చంద్రబాబు.. 2024లో ఏపీలోనూ అదే పని చేస్తారన్నారు. పవన్ టీడీపీతో కలిసినా ఏపీలో ప్రయోజనం లేదన్నారు. ‘‘తండ్రి జైలులో ఉంటే నారా లోకేష్ ఎక్కడ ఉన్నట్లు?. విజయనగరం భువనేశ్వరి కాకుండా లోకేష్ వెళ్లచ్చు కదా?. ఎందుకు వెళ్ళలేదు?’ అని వెల్లంపల్లి ప్రశ్నించారు. లోకేష్ అసమర్ధుడని టీడీపీ క్యాడర్ భావిస్తుందన్నారాయన. ఎన్డీఆర్ చావుకు కారణమవ్వడమే కాకుండా నందమూరి కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు అవినీతిలో దగ్గుబాటి పురందేశ్వరికి కూడా వాటా ఉంది. బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ.. టీడీపీకి అధికార ప్రతినిధిగా పురందేశ్వరి కొనసాగుతున్నారు. అమిత్ షా వద్దకు లోకేష్‌ను పురందేశ్వరి తీసుకెళ్లలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబును కాపాడడానికే పురందేశ్వరి కంకణం కట్టుకున్నారని.. చంద్రబాబును జైలు నుంచి బయటకు తేవాలి, సీఎంను చేయాలన్నదే పురందేశ్వరి లక్ష్యం అని వెల్లంపల్లి ఆరోపించారు. -
సీరియస్ గా కామెడీ చేస్తున్న టీడీపీ నేతలు..!
-
బెజవాడ గడ్డ జగనన్న అడ్డ..పవన్, లోకేష్ పై వెల్లంపల్లి సెటైర్లు
-
అక్రమ అరెస్ట్ అనే వాళ్లు ఒకసారి ఇది చూడండి..
-
దమ్ముంటే పుంగనూరులో గెలిచి చూపించాలి :వెల్లంపల్లి
-
రంగా పేరు తలిచే అర్హత టీడీపీకి లేదు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకుంది ఎవరో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వైఎస్సార్సీపీ నేతలు అన్నారు. రంగా వెన్నులో దిగిన కత్తి, ఆయనపై విసిరిన బాంబు.. టీడీపీది కాదా.. చంద్రబాబుది కాదా.. సైకిల్ది కాదా అని ప్రశ్నించారు. రంగాను చంపిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఆయన బొమ్మ పెట్టుకునే అర్హత కూడా లేదన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా ప్రశ్నించారు. వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించన ఈ కార్యక్రమానికి మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి రమే‹Ùనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. రంగా వ్యక్తి కాదు ఒక శక్తి.. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్‌కళ్యాణ్‌కు లేదన్నారు. చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడొద్దని అన్నారు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన తమకే ఉందన్నారు. రంగా పేరును కలకాలం నిలిచేలా చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రంగా ఒక వ్యక్తి కాదని శక్తి అని పేర్కొన్నారు. ఆయన అందరి వాడన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అందరిలోనూ ధైర్యం నింపగల శక్తిమంతుడు రంగా అని కొనియాడారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే వైఎస్సార్, రంగానే కారణమన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి రంగా ఒక ఐకాన్ అని పేర్కొన్నారు. మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం కాపులకు ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా రంగాతో కలిసి నడిచిన పది మందిని ఘనంగా సత్కరించారు. అనంతరం రంగా జీవిత చరిత్రలో కొన్ని అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎపీఎండీసీ చైర్మన్ పుణ్యశీల, వైఎస్సార్సీపీ నేతలు భవకుమార్, మహమూద్, రాధారంగా మిత్రమండలి నాయకులు చెన్నుపాటి శ్రీను పాల్గొన్నారు. -
ప్రజలకు మేలు జరగడం వారికి ఇష్టం లేదు: వెల్లంపల్లి
-
పవన్ కంటే KA పాల్ 100 రెట్లు నయం : మాజీ మంత్రి వెల్లంపల్లి
-
సమష్టిగా నడుద్దాం.. క్లీన్ స్వీప్ చేద్దాం
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో అంతా సమష్టిగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో అన్ని శాసనసభ స్థానాల్లోనూ వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం తథ్యమని విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేశారు. సంక్షేమ పథకాల ద్వారా బటన్ నొక్కి డీబీటీ(ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో 88 శాతం కుటుంబాలకు మంచి చేశామని.. విద్య, వ్యవసాయ, వైద్య రంగాలలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చామని.. వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని వివరించారు. దాంతో ప్రజల్లో మార్పు ప్రస్ఫుటంగా కన్పిస్తోందన్నారు. గడప గడపకూ వెళ్లి.. ప్రజలతో మమేకమై.. చేస్తున్న మంచిని చెప్పి.. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరాలని ఉద్బోధించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకురావాలని మార్గనిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడి.. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం ఏమన్నారంటే.. ప్రజలతో మమేకమవ్వండి ► నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తుండటానికి ప్రధాన కారణం.. ఒకటి కార్యకర్తలను కలుసుకోవడం, రెండు మరో 14–15 నెలల్లో జరగనున్న ఎన్నికలకు సమాయత్తం చేయడం. సచివాలయాల వారీగా కన్వీనర్లు, అలాగే ప్రతి 50 – 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమిస్తున్నాం. పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్దాం. గృహ సారథుల్లో ఒకరు కచ్చితంగా మహిళ అయి ఉండాలి. ► గడపగడపకూ కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవ్వండి. మూడున్నరేళ్లుగా చేస్తున్న మంచిని అక్కాచెల్లెమ్మలకు వివరించండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. ఏ ఒక్కరికైనా ఏ చిన్న సమస్య ఉన్నా, అర్హత ఉండి మిస్ అయిపోతే దాన్ని పరిష్కరించి మంచి చేయాలి. అర్హులెవ్వరూ మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో ఇంత ధ్యాస పెడుతున్నాం. గతంలో ఎవ్వరూ, ఎప్పుడూ ఇంత ధ్యాస పెట్టలేదు. ఏడాదిలో రెండుసార్లు అలాంటి వారికి అన్నీ మంజూరు చేస్తున్నాం. ప్రస్ఫుటంగా రాజకీయ మార్పు ► రాష్ట్రంలో 88% ఇళ్లకు మంచి చేశాం. ప్రతి అక్క, చెల్లెమ్మ పేర్లతో సహా చేసిన మంచిని పారదర్శకంగా చెప్పగలం. అందుకనే రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయ మార్పు జరుగుతోంది. కుప్పంలాంటి చోట్ల మున్సిపాల్టీ, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఇలా అన్ని ఎన్నికల్లో 80%కి పైగా క్లీన్ స్వీప్ చేయగలిగాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కూడా 21 డివిజన్లలో 14 చోట్ల గెలిచాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నచోట కూడా మనం అధికంగా వార్డులు గెలవగలిగాం. మార్పు అనేది కనిపిస్తోంది. దీనికి నిదర్శనమే కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు. టార్గెట్ 152 కాదు.. 175 ► వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా 175 కు 175 సీట్లు మనం గెలవాలి. అలాంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఏ వార్డులోకి వెళ్లినా, గ్రామంలోకి వెళ్లినా.. ప్రతి ఇంట్లో కూడా సంతోషం కనిపిస్తోంది. ► మన ప్రాంతంలో స్కూళ్లు మారుతున్నాయి.. చదువులు మారుతున్నాయి.. ఆస్పత్రులు మారుతున్నాయి. ఆర్బీకేల ద్వారా వ్యవసాయం మారుతోంది. ఇంత మార్పు అన్నది ఎప్పుడూ జరగలేదు. వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తి స్థాయిలో వస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో మనం తీసుకొచ్చిన మార్పులన్నీ పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ ఎన్నికలకు మనం అంతా కలిసికట్టుగా పని చేయాలి. ఎలాంటి విభేదాలున్నా పక్కన పెట్టాలి. ► వచ్చే ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందాం. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించాం. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 152 కాదు.. 175 స్థానాల్లో గెలవడమే మన టార్గెట్. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం. 30 ఏళ్లపాటు మంచి పరిపాలన ప్రజలకు అందిస్తాం. ► నాకు ఎన్ని కష్టాలు ఉన్నాసరే.. బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నాను. మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి. ఒకరికొకరు కలిసి ఈ ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలి. ప్రతి ఇంటికీ వెళ్లి.. వారి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మనకు ఓటు వేయని వారి ఇళ్లకు కూడా మనం వెళ్లాలి. చేసిన మంచిని వారికి వివరిస్తే.. కచ్చితంగా వారిలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మనం వెళ్లకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. అందుకనే ప్రతి ఇంటికీ వెళ్లాలి. అందరి ఆశీర్వాదాలు కోరాలి. మంచితనంతో మన ప్రయత్నం మనం చేయాలి. ► విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. బుధవారం మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన ఈ వివాహ వేడకకు సీఎం ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతన వధూవరులు సాయి అశ్విత, మంచుకొండ చక్రవర్తిలను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వెంట మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, రాహుల్లా, డొక్కా మాణిక్య వరప్రసాద్, ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉన్నారు. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) -
బాబు, పవన్ ఇప్పటంలో సినిమా రాజకీయాలు చేశారు: వెల్లంపల్లి
-
ఆ ఇద్దరూ ఏ రకంగా పోటీనో.. ఎవరికి పోటీనో చెప్పాలి: మాజీ మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: పవన్ కల్యాణ్, చంద్రబాబులపై దాడి చేయించాల్సిన అవసరం మాకేంటి అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు మాకు ఏ రకంగా పోటీనో.. ఎవరికి పోటీనో చెప్పాలన్నారు. సింపథీ కోసమే చంద్రబాబు, దత్తపుత్రుడి తాపత్రయమని మండిపడ్డారు. పవన్ లెటర్ ఇవ్వడం.. చంద్రబాబు ప్రెస్ మీట్లు పెట్టడం.. అసాంఘిక కార్యక్రమాలు సృష్టించడం అలవాటైపోయిందని అన్నారు. 'ప్రభుత్వం నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే ఈ రకమైన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ కోసం రూ.250 కోట్ల డీల్ అవసరమా?. రెండు చోట్ల ఓడిపోయిన పవన్ మాకు పోటీనా?. ఎక్కడ పోటీ చేస్తాడో తెలియన పవన్ గురించి ఎవరైనా ఆలోచిస్తారా?. చంద్రబాబు ఆరోపణలు అవాస్తవం. వాళ్లపై వాళ్లే రాయి వేయించుకుని సానుభూతి కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు గురించి ఆలోచన చేయాల్సిన అవసరం మాకు లేదు. పవన్‌కు సానుభూతి రాకపోవడంతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశాడు. పవన్ కల్యాణ్ వీకెండ్ పొలిటీషియన్. వారంలోరెండు రోజుల ఏపీకి కాల్షీట్లు ఇస్తాడు. ఇప్పటంపై పవన్‌కల్యాణ్‌కు నిజంగా ప్రేమ ఉందా?. ఇప్పటం గ్రామానికి ఇస్తానన్న రూ.50లక్షలు పవన్ ఎందుకివ్వలేదు?' అని మాజీ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. చదవండి: (ఎంత ఖర్చయినా వైద్యం చేయించండి: సీఎం జగన్ ఆదేశం) -
‘చంద్రబాబుకు మసాజ్, మాలిష్ చేయడానికే పవన్ పాలిటిక్స్‌లోకి వచ్చాడు’
సాక్షి, తాడేపల్లి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఫైరయ్యారు. కాగా, మంత్రి కారుమూరి బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ గర్జన విజయవంతమైంది. గర్జన సక్సెస్‌ను ఓర్చుకోలేక జనసేన గూండాలు దాడికి పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు, ఆయుధాలతో దాడికి తెగబడ్డారు. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ పనిచేస్తున్నారు. దత్తపుత్రుడు అనే పదానికి పవన్ పూర్తి అర్హుడు. యువతకు పవన్ కల్యాణ్ ఏం చేప్తున్నారు?. యువతతో పవన్ రౌడీయిజం చేస్తారా?. ఎంత మంది తోలు తీస్తారు పవన్?. ప్రజలు ఓట్లేసి మమ్మల్ని ఎన్నుకున్నారు. మమ్మల్ని కొడితే ప్రజల్ని కొట్టినట్టే కదా!. పవన్ కల్యాణ్ ముసుగు తొలగిపోయింది. పవన్ దత్తపుత్రుడు అన్నది నిన్నటితో తేలిపోయింది. ముద్రగడను చంద్రబాబు హింసించినా పవన్ నోరు విప్పలేదు. ప్యాకేజీ కోసం పవన్ యువతను పెడదారి పట్టించొద్దు. చంద్రబాబుకు పవన్ కొమ్ముకాస్తున్నారు. కాపుజాతిని అవమానించిన చంద్రబాబును ఎందుకు మోస్తున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబుకు మసాజ్, మాలిష్ చేయడానికి వచ్చావా?.. సాక్షి, విజయవాడ: మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబుకు సేవ చేసేందుకే పవన్ పార్టీ పెట్టాడు. పవన్, చంద్రబాబు ముసుగు తొలగింది. చంద్రబాబుకు మసాజ్, మాలిష్ చేయడానికి, కాళ్లు నొక్కడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు. పవన్ కల్యాణ్ పనికిమాలిన దద్దమ్మ, వెదవ. రాజకీయ నాయకుడిగా ఉండటానికి పవన్‌కు అర్హత లేదు. రౌడీ రాజ్యం తేవాలని పవన్ చూస్తున్నాడు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు వీధి రౌడీలా ఉన్నాయి. పవన్‌కు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా?. పవన్ ఎవరితో కలిసినా అసెంబ్లీ గేటు కూడా తాకలేవు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. నిజజీవితంలోనూ పవన్ చక్కగా నటిస్తున్నారు.. సాక్షి, రాజమండ్రి: బీజేపీ, టీడీపీని ఏకం చేయడమే పవన్ రోడ్మ్యాపా అంటూ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ఎంపీ భరత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబును కలవడంతో పవన్ ముసుగు తొలగిపోయింది. చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ మాట్లాడుతున్నారు. నిజజీవితంలోనూ పవన్ చక్కగా నటిస్తున్నారు. పవన్ పార్టీ ఎందుకోసం పెట్టినట్టు?. చంద్రబాబు ఎంతకైనా దిగజారుతాడు. బాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం.. దీన్నే కదా ప్యాకేజీ అంటారు. పవన్, కేఏ పాల్ ఇద్దరూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీలే.. వీరిద్దరూ బాబు సూచనలతో నడిచిన వారే. అమరావతి యాత్రతో రాజమండ్రిలో అల్లకల్లోలం సృష్టించారు. రౌడీషీటర్లు, బ్లేడ్ బ్యాచ్‌లను పెంచి పోషిస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
చంద్రబాబుకు సేవ చేసేందుకే పవన్ పార్టీ పెట్టాడు : వెల్లంపల్లి
-
విశాఖ దాడి ఘటనను చంద్రబాబు ఖండించకపోవడం దారుణం: వెల్లంపల్లి
-
కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు : వెల్లంపల్లి
-
చంద్రబాబు కుప్పం ప్రజలపై కక్ష కట్టాడు: వెల్లంపల్లి
-
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
-
'నాగబాబు అలా చెప్పడం.. చిరంజీవిని అవమానించడమే'
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 54వ డివిజన్లో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ భాగ్యలక్ష్మితో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'పవన్ కల్యాణ్ ఆంధ్రరాష్ట్రానికి పనికిరాడు. చిరంజీవి లేకుండా పవన్ కల్యాణ్ ఎవరికి తెలుసు. మెగాస్టార్ లేనిదే.. పవర్‌స్టార్ ఎక్కడ?. నాగబాబుకి విధి విధానం లేదు. చిరంజీవి ఫ్యాన్స్‌ను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేనకి సపోర్ట్ చేయాలని నాగబాబు చెప్పడం.. చిరంజీవిని అవమానించటమే. పవన్ కల్యాణ్ మాటలోడే తప్ప చేతలోడు కాదు. మొట్ట మొదట అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకొని పవన్ మాట్లాడాలి. మోడీ, అమిత్ షాలకు పవన్ వెదవ వేషాలు తెలుసు. బిజెపితో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ రాష్ట్ర సంక్షేమం కోసం ఒక్కరోజైనా పని చేశారా. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకొని పవన్ కల్యాణ్ బిజెపితో టచ్‌లో ఉన్నాడు. బిజెపి వాళ్లు పవన్ కల్యాణ్‌ని పట్టించుకోవడం లేదు. పవన్ మాత్రం బిజెపి భజన చేస్తున్నాడు' అని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (ఉద్యోగుల బాగు కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది: సజ్జల) -
భీమ్లానాయక్ అని బెదిరిస్తే.. భయపడేవారెవరూ లేరు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 'ఎనిమిదేళ్లుగా జగన్‌ను, వైఎస్సార్సీపీ నేతలను తిట్టడమే పవన్ పనిగా పెట్టుకున్నాడు. చంద్రబాబు పల్లకీ మోయడానికే పవన్ భజన చేస్తున్నాడు. జనసేన ఆవిర్భావ సభ అమ్ముడుపోవడానికి పెట్టిన సభే. 2024 ఎన్నికలకు చంద్రబాబుతో కలిసుంటాడని ఈ ఆవిర్భావ సభ సారాంశం. బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే.. చంద్రబాబును సీఎం చేస్తాడట. పవన్ కళ్యాణ్ వంటి బ్రోకర్ ఏపీకి అవసరం లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్‌ను నమ్ముకోవద్దని జనసేన కార్యకర్తలకు సూచిస్తున్నా. పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్వే కానీ.. నిజ జీవితంలో రబ్బర్ సింగ్వే. ఏదో పీకేస్తానని డబ్బా డైలాగులు చెబుతున్నావ్.. నీకంత దమ్ముందా. నువ్వు భీమ్లానాయక్ అని బెదిరిస్తే.. భయపడేవాడెవడూ లేడు. దమ్ముంటే ఏపీలో సరిగ్గా రెండు రాత్రులు నిద్ర చెయ్యి. ఫామ్ హౌస్‌లో పడుకుంటే కానీ నిద్రరాని నువ్వా మమ్మల్ని విమర్శించేది. చంద్రబాబు హయాంలో 45 దేవాలయాలు కూల్చేస్తే పందులు కాశావా. పుష్కరాల్లో 30 మంది చనిపోతే చంద్రబాబును ప్రశ్నించకుండా గాడిదలు కాశావా. చదవండి: (టీడీపీ బాగుండాలనే పవన్ కోరుకుంటున్నాడు: పేర్ని నాని) పవన్ కళ్యాణ్ నువ్వా మమ్మల్ని బెదిరించేది. నీ బెదిరింపులకు ఎవడూ భయపడడు . ఎక్కడికి వస్తావో రా చూసుకుందాం. వికేంద్రీకరణే మా లక్ష్యమని సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లారు. 151 సీట్లు సాధించారు. జీవిత కాలం ఫామ్ హౌస్‌లో కూర్చుని పుస్తకాలు చదవడం తప్ప ప్రజల జీవితాలను చదవడం నీకు తెలియదు. అమరావతిలో రైతులు పెట్టిన పెరుగన్నం తిని ధర్నా చేశావ్. ఫ్లైట్ ఎక్కి ప్యాకేజ్ తీసుకుని రూట్ మార్చేశావ్. చంద్రబాబుకు అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు. నీ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు లేదు. ఐపీఎల్ తరహాలో ప్యాకేజ్ రేటు పెంచుకోవడానికే జనసేన సభ. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం. త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప పవన్‌కు ఏమీ రాదు. మేం వ్యక్తిగత విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ పదినిమిషాలు కూడా తట్టుకోలేడు. చంద్రబాబు కంటే ఎక్కువ ఏడుస్తాడు. మమ్మల్ని, మా నాయకులను తూలనాడితే ఖబడ్ధార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో పేమెంట్లు తీసుకుని ఎంజాయ్ చేయడం తప్ప.. ప్రజల గురించి నీకు ఏం తెలుసు అంటూ తీవ్ర స్థాయిలో పవన్ కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. -
విజయవాడ కెనాల్ రోడ్డులో రథోత్సవం. కిక్కిరిసిన భక్తజనం (ఫొటోలు)
-
కాణిపాకం వినాయకునికి స్వర్ణ రథం సిద్ధం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తిరుమల శ్రీవారి తర్వాత కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం సిద్ధమైంది. దాదాపు 15 కేజీలకు పైగా బంగారంతో రథాన్ని తయారు చేయించారు. ఈ నెల 16వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నూతన స్వర్ణ రథం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించేందుకు దేవదాయ శాఖ నిర్ణయించింది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర సరస్వతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్ హాజరవుతారు. 2005లోనే ప్రతిపాదన 2005లోనే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామికి బంగారు రథం తయారు చేయించాలని అప్పటి ఆలయ పాలకమండలి తీర్మానించగా.. దేవదాయ శాఖ అనుమతి తెలిపింది. బంగారు రథం కోసం దాతల నుంచి ప్రత్యేక విరాళాలు సేకరించడంతో పాటు ఆలయంలో ప్రత్యేక హుండీని ఏర్పాటు చేశారు. 2005 నుంచి గత ఏడాది సెప్టెంబర్ వరకు హుండీ ద్వారా రూ.3,57,85,102.85 విరాళాలు వచ్చాయి. దాతల నుంచి రూపంలో మరో రూ.1,67,09,616 కలిపి మొత్తం రూ.5.25 కోట్ల వరకు అందాయి. బంగారు రథం తయారీ బాధ్యతలను దేవదాయ శాఖ 2009లోనే టీటీడీకే అప్పగించింది. ఇందుకు ఆలయ నిధుల నుంచి రూ.కోటి 2010 ఫిబ్రవరిలో టీటీడీకి చెల్లించారు. సిద్ధమైన వినాయకుని బంగారు రథం 2019 అక్టోబర్‌లో ఊపందుకుని.. 2019లో అక్టోబర్‌లో బంగారు రథం నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. 1,690 కేజీల చెక్క రథానికి బంగారం తాపడం చేయడానికి రూ.9.70 కోట్లు ఖర్చవుతుందని టీటీడీ తేల్చగా.. ఆలయ నిధుల నుంచి మరో రూ.5 కోట్లను కాణిపాకం ఆలయ అధికారులు 2019 అక్టోబర్‌లో టీటీడీకి చెల్లించారు. చెక్క రథానికి బంగారు తాపడం చేసే పనులు 2020 నవంబర్‌లో మొదలు కాగా, 2021 సెప్టెంబర్ నాటికి పూర్తయ్యాయి. ప్రతి నెలా ఊరేగింపు! ప్రతి గురువారం లేదా ప్రతి నెలా పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో నిర్వహించే సంకటహర గణపతి వ్రతం సందర్భంగా బంగారు రథంపై స్వామివారి ఊరేగింపు నిర్వహించాలనే ఆలోచన ఉందని.. దీనిపై ఆలయ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఈవో వెంకటేష్ చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో బంగారు రథం ఉపయోగించనున్నట్టు వివరించారు. బంగారు రథం తయారీకి ఇప్పటివరకు టీటీడీకి రూ.6 కోట్లను చెల్లించామని, తుది బిల్లు టీటీడీ నుంచి అందాల్సి ఉందని వెంకటేష్ తెలిపారు. -
సోము వీర్రాజు దేశ భక్తుడా? తెలుగుదేశం భక్తుడా?: వెల్లంపల్లి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడైన సోము వీర్రాజు దేశ భక్తుడా? తెలుగుదేశం భక్తుడా? అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుతో కలిసి ఆలయాలను కూల్చిన చరిత్ర బీజేపీదేనని వెల్లంపల్లి విమర్శించారు. సోము వీర్రాజు కార్పొరేటర్‌గా కూడా పనికిరాని వ్యక్తి అని ధ్వజమెత్తారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా? అని సూటిగా ప్రశ్నించారు. సోము వీర్రాజు, సీఎం రమేష్, సుజనా చౌదరిలు రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులని అన్నారు. చంద్రబాబుకు కొందరు బీజేపీ వలస పక్షులు అమ్ముడుపోయారని విమర్శించారు. కుల, మత, పార్టీలకు అతీతంగా సీఎం వైఎస్ జగన్ పాలన చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు 40 దేవాలయాలు కూలిస్తే సోము వీర్రాజు ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీతో కలిసి ప్రభుత్వం పంచుకుంటూ గుడులు కూల్చిన ఘనత బీజేపీదేని మండిపడ్డారు. ఆయన సోము వీర్రాజు కాదని, సారా వీర్రాజు అని ఎద్దేవా చేశారు. అటువంటి వ్యక్తి.. వైఎస్సార్సీపీపై మత, కుల ముద్ర వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో బీజేపీని ఎవరూ పట్టించుకోరని, అందుకే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చూస్తున్నారని మండిపడ్డారు. -
తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేసిన నేతలు
-
'ప్రజలతో మమేకం కావడం వైఎస్ కుటుంబానికే సాధ్యం'
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర పూర్తయి మూడేళ్లయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరి గౌతమ్‌రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. దేశంలో సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఘనత వైఎస్ జగన్‌ది అని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అన్ని వర్గాల ప్రజల కష్ట, నష్టాలు తెలుసుకున్న నాయకుడు జగన్. అందుకే సీఎం అయిన తర్వాత ప్రజామోదయోగ్యమైన పాలన చేస్తున్నారు. అందుకే పాదయాత్ర ముగిసి మూడేళ్లయినా జనం మర్చిపోలేదు' అని అన్నారు. చదవండి: ('ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది') మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా కోట్లమందిని జగన్ కలిశారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు చేసిన పాదయాత్ర ఒట్టి బూటకం. ప్రజలతో మమేకం కావడమనేది వైఎస్ కుటుంబానికే సాధ్యం. ఆరోగ్యశ్రీ నుంచి పెన్షన్ల పెంపు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు జగన్ కొనసాగిస్తున్నారు. అన్ని వర్గాల వారికీ పథకాలు అందిస్తున్న మనసున్న నేత సీఎం జగన్ అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన ఘనత జగన్‌ది అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఎండ, వాన, చలి ఏదీ లెక్కచేయకుండా జనం సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. జనం ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
మత రాజకీయాలు ఇక్కడ సాగవు
-
అశోక్ గజపతిరాజు హుందాగా వ్యవహరించాలి:మంత్రి వెల్లంపల్లి
-
దేవుడి ఆలయాన్ని సర్కస్ కంపెనీ అంటారా..?: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు వీరంగం సృష్టించడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్‌గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం) -
రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం వించ్ మోటారు సహకారంతో ట్రాక్ మీదుగా శిలా ఖండాలను ఒక్కొక్కటిగా కొండపైకి చేరవేసి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. మండపంతోపాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు. నీటి కొలను సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునికీకరిస్తారు. శంకుస్థాపన అనంతరం ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు దేవదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం దిగువున ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో కోదండ రాముడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొండపై నిర్మాణం పూర్తయిన వెంటనే విగ్రహాలను నూతన ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు. అశోక్‌గజపతిరాజు వీరంగం రామతీర్థం బోడికొండపై అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారు. దుండగులు ధ్వంసం చేసిన ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడాన్ని అశోక్ గజపతి రాజు తప్పుబట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని అశోక్ అధికారులపై చిందులు తొక్కారు. ఆ క్రమంలోనే శంకుస్థాపం బోర్డును సైతం అశోక్‌గజపతిరాజు పీకిపారేశారు. -
అలా ఆలోచించింది నాడు వైఎస్సార్.. నేడు సీఎం జగన్ మాత్రమే'
సాక్షి, విజయవాడ: ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు ఆనాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేపట్టారని దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రజాసంకల్ప పాదయాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో నిర్వహించిన సంబరాల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ పేదల గురించి ఏనాడూ ఆలోచించలేదు. క్యాపిటల్, పెట్టుబడిదారులు, తమ సామాజికవర్గం వారి గురించి మాత్రమే చంద్రబాబు ఆలోచన చేశాడు. పేదల గురించి ఆలోచించింది ఆనాడు వైఎస్సార్.. నేడు జగన్ మాత్రమే. ఎండ, వాన లెక్క చేయకుండా 14 నెలల పాటు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో అనేక ఘటనలు వైఎస్ జగన్‌కు ఎదురయ్యాయి. మ్యానిఫెస్టోని రెండేళ్లలోనే నెరవేర్చారు. భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేనంత గొప్పగా పరిపాలన చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్. ప్రజల నాడి, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి జగన్. ప్రజలకి మంచి చేయాలన్న మనసున్న వ్యక్తి. ఇచ్చినమాటను నిలబెట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది. చదవండి: (నాలుగేళ్ల ‘ప్రజా సంకల్పం’.. సీఎం జగన్ ట్వీట్) పళ్లున్న చెట్టుకే రాళ్లదెబ్బలు ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు కాబట్టే జగన్‌పై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకూ ప్రజలు మాకు అండగా నిలిచారు. రేపు జరగబోయే ఎన్నికల్లోనూ మాదే విజయం. ఏపీలో ప్రతిపక్షపార్టీల అవసరం లేదు. జనసేన, బీజేపీ, టీడీపీలు చూడ్డానికి మాత్రమే విడివిడిగా ఉండే రాజకీయ పార్టీలు. సీఎం జగన్‌పై దాడి చేయడానికి మాత్రం మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ప్రజలు మాతో ఉన్నారు. రాజకీయ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. రాజకీయ పార్టీలకు అతీతంగా భారతదేశంలో పాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని సగర్వంగా చెబుతున్నాం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (సందడిగా జగనన్న సంకల్ప యాత్ర నాలుగేళ్ల పండగ) -
ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు సంస్మరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఆదిశంకరాచార్యులు సందర్శించిన 14 దేవాలయాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు సంస్మరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నిర్వహించిన ఉత్సవాల్లో దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'జగద్గురు ఆదిశంకరాచార్యులు భగవత్ స్వరూపులు. కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను ప్రధాని మోదీ నిర్వహించడం సంతోషంగా ఉంది. ఆయన సందర్శించిన పవిత్రస్థలాల్లో సంస్మరణ ఉత్సవాలు నిర్వహించాం. ఆదిశంకరాచార్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్టించారు. అందుకే దుర్గమ్మ ఆలయంలో కూడా సంస్మరణోత్సవాన్ని నిర్వహించాము. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 14 ఆలయాల్లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను నిర్వహించాము. కేదార్‌నాథ్‌లో ప్రధాని నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశాము. ఆదిశంకరాచార్యుల విశిష్టతను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు' అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (నెల్లూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్..) -
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ప్రార్థించాను: బొత్స
సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఆశిస్సులు ప్రజలపై ఉండాలని తల్లిని ప్రార్థించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఉదయం ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారిని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని తల్లిని ప్రార్థించాను. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని కోరుకున్నాను. ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పైడితల్లి అమ్మవారి పండగను నిర్వహిస్తున్నాము' అని మంత్రి బొత్స అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల కోరిక నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నట్లు దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 'పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. విజయనగరంలో పండుగ వాతావరణం నెలకొంది. దేవాదాయ శాఖ తరుపున ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. రాష్ట్ర ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. సంక్షేమ పథకాల అమలులో ఎటువంటి అడ్డంకులు కలగకూడదని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ
సాక్షి, విజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు బుధవారం దర్శించకున్నారు. దర్శనానంతరం మంత్రి మాట్లాడుతూ.. 'అమ్మవారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించా. మంగళవారం మూలా నక్షత్రం రోజున లక్ష మందికి పైగా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్న అధిక సంఖ్యలో భక్తులు వచ్చినా చివరి భక్తుడి వరకు దర్శనం కల్పించాము. అందుకు సహకరించిన రెవెన్యూ, పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను' అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి: డీజీపీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని డీజీపీ గౌతమ్ వాంగ్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనం పొందారు. దర్శనానంతరం డీజీపీ మాట్లాడుతూ.. దసరా నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. వాటిని భక్తులు పెద్ద మనసుతో క్షమించాలి. దసరా శరన్నవరాత్రిలో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. విధి నిర్వహణ నిర్వహిస్తున్న పోలీసులందరికీ నా కృతజ్ఞతలు. దసరా నవరాత్రి ఉత్సవాలలో పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సీపీ బత్తిన శ్రీనివాసులు ముందుండి జరిపించడం చాలా సంతోషకరంగా ఉంది' అని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. చదవండి: (ఇంద్రకీలాద్రిపై వర్షం.. భక్తుల హర్షం) -
వాసవి మాత దర్శనం చేసుకున్న మంత్రి వెల్లంపల్లి
-
ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో దేవాదయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (కోస్టల్ బ్యూటీ.. విశాఖ అందాలపై ప్రత్యేక కథనం) -
రాజకీయాల్లో పనికి మాలిన స్టార్ పవన్ కల్యాణ్: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: పవన్ గురించి ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. చిరంజీవి, నాగార్జున లాంటి సినీపెద్దలు సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని చెప్పారు. సినీపెద్దలతో సంబంధిత మంత్రి చర్చలు చేస్తున్నారని తెలిపారు. బ్లాక్ టికెట్లని అరికట్టడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం తప్పా? అని ప్రశ్నించారు. టికెట్ల విక్రయాలకు ఆన్లైన్ విధానాన్ని తీసుకువస్తే నీకు నష్టమేంటి? అని నిలదీశారు. శనివారం ఓ సినిమా ఆడియో ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ‘పావలా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం వేస్ట్. రాష్ట్ర ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య దూరం పెంచడానికే పవన్ తప్పుడు వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడుతున్నట్లు ఉంది. నీవు అడ్డంగా కోట్లు సంపాదించుకోవాలి. రెండేళ్లుగా ప్రజలే పవన్ తాట తీశారు. సినీ పరిశ్రమలో దోపిడీని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. సినిమా కార్యక్రమంలో రాజకీయాలు ఎందుకు మాట్లాడాడు?. రాజకీయాల్లో పనికి మాలిన స్టార్.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని కోరుకుంటున్న నేత సీఎం జగన్’ అని తెలిపారు. -
పరిషత్ ఫలితాలతో విపక్షాల్లో గుబులు: వెల్లంపల్లి
-
పేదల గుండె చప్పుడు మహానేత వైఎస్సార్
సాక్షి, విజయవాడ: పేదల గుండెచప్పుడు మహానేత వైఎస్సార్ అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలు వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందన్నారు. అందరి హృదయాలు గెలిచిన మహానేత వైఎస్సార్ అని కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం వద్ద వైఎస్సార్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, దేవినేని అవినాష్, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఆరేళ్లలోనే వైఎస్సార్ 60 ఏళ్ల ప్రగతి... రాజన్న పాలన ఒక స్వర్ణయుగం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి వైఎస్సార్ బాటలు వేశారన్నారు. ఆరేళ్లలోనే వైఎస్సార్ 60 ఏళ్ల ప్రగతి చూపారన్నారు. పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో అనంతపురం జిల్లా: పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్ 12 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఓడిసి మండలం గౌనిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. మారాలలో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దు కుంట పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మైదుకూరు రోడ్డు లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోరుమామిళ్లలోని వైఎస్సార్ విగ్రహానికి పార్టీ మండల కన్వీనర్ సీఎం భాష, జిల్లా అగ్రి గోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు చిత్తా విజయ్ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులు అర్పించాయి. పశ్చిమగోదావరి జిల్లా: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఏలూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆయన విగ్రహానికి పూల మాలలువేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొఠారి అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, ఎమ్మెల్సీ కోయ మోషన్ రాజు, మేయర్ షేక్ నూర్జహాన్ , ఇడా చైర్మన్ ఈశ్వరి ,స్మార్ట్ సిటీ చైర్మన్ బొద్దాని అఖిల, సాహిత్య అకాడమీ చైర్మన్ పి. శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా: వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మహానేత వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్సార్ అని, చరిత్రలో నిలిచిపోయేలా పేదలకు సంక్షేమాన్ని అందించారని ఎమ్మెల్యే కాకాణి అన్నారు. ప్రజానేతగా జన హృదయాల్లో నిలిచిపోయారన్నారు. అలాంటి విలువలు, విశ్వసనీయతతో కూడిన పాలనను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్నారన్నారు. పేదల పెన్నిధిగా ఎదుగుతున్న సీఎం వైఎస్ జగన్‌కి మరో ఇరవై ఏళ్లు తిరుగులేదన్నారు. -
అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ అభిమతం: వెల్లంపల్లి
సాక్షి, అమరావతి: బినామీలను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు ఆరాటమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మూడు రాజధానుల కోసం దళితులు చేస్తున్నది ఉద్యమం కాదా? అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభిమతం అన్నారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. మూడు రాజధానులు వచ్చి తీరతాయని ఆయన స్పష్టం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్‌పై సుప్రీం తీర్పు అంటూ మాట్లాడుతున్నారు.. చంద్రబాబు చేసిన అక్రమాలు ఏమిటో అందరికీ తెలుసునన్నారు. మొన్నటి ఎన్నికల్లో అమరావతి కోసం ప్రజల్ని రెచ్చగొట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు దానికి భిన్నంగా తీర్పు ఇచ్చారన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ సంకల్పం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. -
ఆర్యవైశ్యులు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి : సజ్జల
-
దేవుళ్ల ఆస్తులు కాపాడలేని చైర్మన్లు ఎందుకు?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘బొబ్బిలి, విజయనగరం రాజుల ఆధీనంలోని దేవస్థానాలకు చెందిన భూములు అన్యాక్రాంతమవుతుంటే ఆ దేవాలయాల చైర్మన్లుగా ఉండి ఏం చేస్తున్నారు? చైర్మన్‌ను అని అనుకోవడం కాదు. భూముల్లో ఒక గజం స్థలం కూడా కాపాడలేకపోతే... దేవదాయ శాఖ చూస్తూ ఊరుకోవాలా? అలాంటి పరిస్థితుల్లో కచ్చితంగా జోక్యం చేసుకుంటుంద’ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.శనివారం జరిగిన విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రులిద్దరూ పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేకరులతో మాట్లాడారు. మాన్సాస్ ట్రస్ట్, బొబ్బిలి వేణుగోపాల స్వామి దేవాలయాల భూములపై లోతుగా పరిశీలిస్తే వేల ఎకరాల భూమి రికార్డుల్లో లేదని, దశల వారీగా అమ్ముకున్నట్లు దేవదాయశాఖ అధికారుల దర్యాప్తులో తేలిందన్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల సింహాచలం దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీ నాయకుడు ఆర్వీఎస్కే రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు బొబ్బిలిలోని భూములను కాపాడలేకపోయారని, ఆ పనిని ఇప్పుడు దేవదాయ శాఖ చేపడుతుందన్నారు. తప్పు జరిగిందని తేలితే చైర్మన్లైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆభరణాలను దేవాలయాల్లో ఉంచకుండా.. ఎవరి అనుమతితో తీసుకెళ్లి కోటలోని ఇంటిలో ఉంచారని ప్రశ్నించారు. ‘మాన్సాస్’ పదవి హక్కును కోర్టు తేల్చాలి.. విజయనగరంలోని మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవిపై హక్కు ఎవరిదో కోర్టు తేల్చాల్సి ఉందని మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పెద్దకొడుకు వారసురాలి హక్కుతో ట్రస్ట్ చైర్మన్ బాధ్యతలను సంచయిత గజపతిరాజు చేపట్టారని, దాన్ని సవాలు చేస్తూ అశోక్ గజపతిరాజు తెచ్చుకున్న కోర్టు తీర్పుతో ఆ పదవిని ఆమె కోల్పోయారని తెలిపారు. ఉన్నత న్యాయస్థానాలను ఆమె ఆశ్రయించారని, అలా వారసత్వపు అంశంపై అన్నదమ్ముల మధ్య వస్తున్న వివాదంతో ప్రభుత్వానికి సంబం«ధం లేదని స్పష్టం చేశారు. -
13న వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాలు
సాక్షి, అమరావతి బ్యూరో: వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విశిష్ట వ్యక్తులకు ఏపీ ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ఆగస్టు 13న సీఎం వైఎస్ జగన్ ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయవాడ బందరు రోడ్డులోని ఏ–1 కన్వెన్షన్ హాలును సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్‌లతో కలిసి మంత్రి గురువారం పరిశీలించారు. అవార్డుల ప్రదానోత్సవానికి వేదిక, ఇతర ఏర్పాట్లకు సంబంధించి ఏ–1 కన్వెన్షన్ హాలు ఏ మేరకు అనువుగా ఉంటుందో పరిశీలించి, కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్షించారు. వెలంపల్లి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విశిష్ట వ్యక్తులకు జూలై 7న వైఎస్సార్ జీవిత సాఫల్య, సాఫల్య పురస్కారాలను ప్రకటించిందని గుర్తు చేశారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.10 లక్షల నగదు, జ్ఞాపిక, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుకు రూ.5 లక్షల నగదు, జ్ఞాపికను అందిస్తామన్నారు. -
‘దీవెన’తో భవిత దేదీప్యం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): మన పిల్లలకు విద్యే మనం ఇచ్చే ఆస్తి.. దాని కోసం ఎంతైనా ఖర్చు పెడతాం.. అంటూ హామీనిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దానిని కార్యరూపంలో చేసిచూపుతున్నారు. వరుసగా రెండో ఏడాది జగనన్న విద్యా దీవెన నగదు విడుదల చేసి వారి ఉజ్వల భవితకు నాంది పలికారు. గురువారం తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా మంజూరైన నగదును కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ జె. నివాస్ పాల్గొన్నారు. విద్యా విప్లవం కొనసాగుతుంది.. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ విద్య ద్వారానే సమజాభివృద్ధి సాధ్యమని గుర్తించి విద్య విధానంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి ఆదర్శంగా నిలిచారన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న నాడు–నేడు పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. ఢిల్లీతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు ఈ పథకం అమలు తీరును అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఇది మనందరికీ గర్వకారణమన్నారు. రూ. 68.14 కోట్లు జమ.. జిల్లాలో జగనన్న విద్యాదీవెన రెండో విడత కింద 93,189 మంది విద్యార్థులకు చెందిన 82,107 మంది తల్లుల ఖాతాలో రూ.68.14 కోట్లు జమచేసినట్లు కలెక్టర్ జె. నివాస్ తెలిపారు. అనంతరం దీనికి సంబంధించిన చెక్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నీసా, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, కె.రక్షణనిధి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కె.మోహన్ కుమార్, సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి పాల్గొన్నారు. బాగా చదువుకుంటా.. సిద్ధార్థ డిగ్రీ కళాశాలో డిగ్రీ సెకండీయర్ చదువుతున్నాను. జగనన్న విద్యాదీవెనతో ఎంతో మంది పేదలు చదువుకుంటున్నారు. జగనన్న అందిస్తున్న ఆర్థిక సహాయం మా తల్లిదంద్రులు అప్పులు చేయకుండా వెసులుబాటు కల్పిస్తోంది. మేం బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించి, మంచి పేరు తెస్తాం. – భావన, డిగ్రీ విద్యార్థిని, విజయవాడ దీవెనతోనే చదువు కొనసాగిస్తున్నా.. విద్యాదీవెన నా చదువుకు సాయ పడుతోంది. పాలిటెక్నిక్ చదివాను.. ఆర్థిక ఇబ్బందులు, స్కాలర్షిప్ లేకపోవడం వల్ల ఉన్నత చదువులు చదవలేకపోయాను. వైజాగ్‌లో చిన్న ఉద్యోగంలో చేరాను. జగనన్న విద్యాదీవెన పథకం రావడంతో ఇంజినీరింగ్ చదవాలన్న నా కల నెరవేరుతోంది. విద్యాదీవెనతో ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాను. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్నాను. – మోహన్‌కృష్ణ, ఇంజినీరింగ్ విద్యార్థి, విజయవాడ -
సీఎం జగన్ అగ్రవర్ణ పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నారు
-
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు
-
పోయేటప్పుడు ఏం తీసుకుపోం కదా: సుచరిత
గుంటూరు : కరోనా నియంత్రణపై హోంమంత్రి మేకతోటి సుచరిత కలెక్టర్, డాక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కరోనా పేరుతో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన రేట్లు మాత్రమే అమలు చేయాలి అని తెలిపారు. పేషెంట్ ఆస్పత్రిలో చేరగానే వెంటనే మూడు లక్షలు కట్టండి.. నాలుగు లక్షలు కట్టండి అని ఒత్తిడి చేస్తే ఎలా అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి అని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటాం.. పోయేటప్పుడు కూడా తీసుకు వెళ్ళం కదా అన్నారు సుచరిత. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించండి: వెల్లంపల్లి సాక్షి విజయవాడ: కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ ఆసుపత్రులపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రత్యేక అధికారి సునీత, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 50 శాతం బెడ్స్ కేటాయించాలి అన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్‌పై కఠినంగా వ్యవహరించండి అని మంత్రి వెల్లంపల్లి అధికారులకు సూచించారు. చదవండి: కడుపులో బిడ్డను మోస్తూ... కర్తవ్యాన్ని మరువకుండా..! -
రెండో దశ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ. 125 కోట్లు మంజూరు
-
బెజవాడలోనూ బాబుకు పరాభవం
సాక్షి, అమరావతి: ప్రజా మద్దతుతో విజయవాడ నగర పీఠాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. కుప్పం తరహాలోనే విజయవా డలోనూ చంద్రబాబుకు పరాభవం తప్పదన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు విజయవాడ పర్యటన వల్ల ఆ పార్టీకి ఒరిగేదేమీలేదన్నారు. ఆయన చుట్టూ ఉండేవాళ్లకూ వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అందాయని, వాళ్లెవరూ చంద్రబాబుపై అభిమానం తో రావడంలేదని మంత్రి గుర్తుచేశారు. విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ను నిర్మించలేని అసమర్థుడు చంద్రబాబు అని ఎద్దేవాచేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే దాన్ని శరవేగంగా పూర్తిచేసిందని గుర్తుచేశారు. 2018లో 40 నుంచి వంద శాతానికి నీటి పన్నులు పెంచుతూ జీఓ ఇచ్చిన ఘనుడని మండిపడ్డారు. ఇలాంటి ఆయన పన్ను తగ్గిస్తానని మేనిఫెస్టోలో చెప్పడం నయవంచన కాదా? అని ప్రశ్నించారు. విజయవాడ కార్పొరేషన్ లోని 64 స్థానాలనూ వైఎస్సార్సీపీ ౖకైవసం చేసు కుని మేయర్ పీఠం దక్కించుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీలో బీఫారాలు కూడా తీసుకునే పరిస్థితి లేక ఎక్కడెక్కడి వాళ్లనో నిలబెట్టారని ఎద్దే వా చేశారు. కరోనా కష్టకాలంలో హైదరాబాద్‌లో కూర్చుని జూమ్ మీటింగ్‌లు పెట్టిన చంద్రబాబును ప్రజలు దగ్గరకు రానివ్వరని వెలంపల్లి చెప్పారు. -
చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు కొత్తేమీ కాదు..
సాక్షి, విజయవాడ: చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో సోమవారం ఉదయం చంద్రబాబునాయుడు చేసిన హంగామాపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ప్రభుత్వంపై బురద చల్లేందుకే చంద్రబాబు ఎయిర్ పోర్టు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. సోమవారం మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఇలాంటి డ్రామాలు కొత్తేమీ కాదని, ఏదో ఒక హడావిడి చేసి వార్తల్లో నిలిచేందుకు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తారని విమర్శించారు. చంద్రబాబు డ్రామాలను కవర్ చేసేందుకు పచ్చ మీడియా ఉండనే ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న నాలుగు ఛానల్లు ఇలాంటి చెత్త వార్తలను ప్రసారం చేసేందుకే పని చేస్తాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు చావు దెబ్బ కొట్టడంతో చంద్రబాబుకు మతి భ్రమించిందని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయనే భయంతోనే చిల్లర రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిరసన చేయకూడదన్న కనీస పరిజ్ఞానం లేని చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. తన డప్పు తానే వాయించుకునే చంద్రబాబుకు నియమ నిబంధనలను పట్టవా అని నిలదీశారు. నియమ నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా ఇలాంటి గతే పడుతుందన్నారు. మంగళగిరిలో కొడుకును, సొంత నియోజకవర్గంలో వార్డు మెంబర్లను కూడా గెలిపించుకోలేని చంద్రబాబు ఇక రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు. కుప్పం పంచాయతీ ఎన్నికల్లో పచ్చ పార్టీ మద్దతుదారులకు బుద్ది చెప్పిన అక్కడి ప్రజానికం, తదుపరి ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం నుంచి తరిమికొడతారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి లభిస్తున్న ఆదరణను చూసి టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
19న అంతర్వేదికి సీఎం జగన్
సఖినేటిపల్లి: రథసప్తమి పర్వదినాన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 19వ తేదీన తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి దర్శనార్థం రానున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం అంతర్వేదిలో సిద్ధమైన కొత్తరథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. రథసప్తమి రోజున భక్తుల ద్వారా రథాన్ని బయటకు తీసే అవకాశం ఉందని, ఈ తరుణంలో అంతర్వేదికి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కోరగా అంగీకరించారని చెప్పారు. రథం దగ్ధమైన ఘటనపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేసిన తరుణంలో భక్తుల మనోభావాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించిందన్నారు. అయితే, సీబీఐ దీనిపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రథానికి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మూడో రోజును పూర్ణాహుతి చేసి, అన్నిరకాల పూజలు చేయిస్తామని చెప్పారు. దీనికి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి విచ్చేస్తున్నారన్నారు. -
‘పంచాయతీ’ల్లో ఏకగ్రీవాలు కొత్తకాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై ఎన్నికల కమిషన్ వివరణ కోరడం తొందరపాటు చర్య అని, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కొత్తేమీకాదని మంత్రులు బొత్స సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగానికి, చట్టాలకు లోబడి తొలినుంచి పంచాయతీ ఏకగ్రీవ ఎన్నికలు ఉంటున్నాయని తెలిపారు. విజయనగరంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మంత్రి బొత్స మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా ఏకగ్రీవం అయితే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. గత ఎన్నికలతో పోల్చితే ఒక శాతం మాత్రమే అదనంగా జరిగిన దానికే ఎన్నికల కమిషన్ ఎలా వివరణ కోరుతుందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని గుర్తించి ఎన్నికల కమిషన్ పునరాలోచించుకోవాలని అన్నారు. మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో గందరగోళం సృష్టించి, అశాంతి రేకెత్తించాలని ఎన్నికల కమిషన్ ప్రయత్నిస్తోందని అన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలది..
సాక్షి, తాడేపల్లి: దేవాలయాలు కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలదేనని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ నేత మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండగా, 40కిపైగా దేవాలయాలను కూల్చివేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విగ్రహాలను చెత్త బండిలో తరలించిన చరిత్ర టీడీపీ, బీజేపీలదేనని ధ్వజమెత్తారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని టీడీపీ, బీజేపీ నేతలు కూడగట్టుకొని దేశవ్యాప్తంగా దుశ్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలని ఆయన తప్పుపట్టారు. రాజ్యసభలో జీవీఎల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందని దుశ్ప్రచారం చేయడం సరికాదన్నారు. టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో 40 దేవాలయాలు కూల్చేసినప్పుడు జీవీఎల్ ఎక్కడున్నారన్నారని నిలదీశారు. ఆలయాలపై దాడుల ఘటనలపై సిట్ దర్యాప్తులో ఒక్కో నివేదిక బయటికొస్తుంటే టీడీపీ, బీజేపీ నేతలు భయంతో వణికిపోతున్నారన్నారు. బీజేపీ నేతలు కూడా కొన్ని సంఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఆరోపించారు. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తుకు సిఫార్సు చేసినా, ఇంత వరకు కేంద్రం ప్రభుత్వం స్పందించలేదని, దీనికి జీవీఎల్ ఏమని సమాధానం చెప్తాడని నిలదీశారు. రాజమండ్రిలో అర్చకునికి డబ్బులిచ్చి విగ్రహాన్ని ధ్వంసం చేయించింది టీడీపీ కాదా అని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ స్పందించకపోవటాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీకి రావాల్సిన నిధుల గురించి జీవీఎల్ ఏరోజైనా రాజ్యసభలో మాట్లాడారా అని నిలదీశారు. టీడీపీ ఎంపీలు అమిత్ షా అపాయింట్మెంట్ కోరడంపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుది.. అందితే జట్టు, అందక పోతే కాళ్లు పట్టుకునే రకమని విమర్శించారు. రాష్ట్రంలో గుడులను కూల్చిన చరిత్ర టీడీపీ, బీజేపీలదైతే.. గుడులను నిర్మిస్తున్న ఘనత వైఎస్సార్‌సీపీదేనని స్పష్టం చేశారు. అంతర్వేది రథాన్ని 1.20 కోట్లతో త్వరితగతిన నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామతీర్థం విగ్రహాల కోసం అశోక్ గజపతిరాజు విరాళం పంపారని, ఆ విరాళాన్ని విగ్రహాల కోసం మాత్రమే వినియోగించాలని మెలిక పెట్టడంతో ఆయన చెక్‌ను వెనక్కు పంపామని పేర్కొన్నారు. -
నిమ్మగడ్డ శునకానందం పొందుతున్నారు..
సాక్షి, విజయనగరం: కరోనా కారణంగా రాష్ట్రంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఎన్నికల హడావిడి చేస్తున్న నిమ్మగడ్డ రమేశ్ చౌదరి శునకానందం పొందుతున్నారని దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్ చేశారు. ప్రజల ఆరోగ్యం కంటే చంద్రబాబు శ్రేయస్సే ప్రధానంగా పని చేస్తున్న ఆయన.. గతంలో ఎన్నికలు ఎందుకు ఆపారో, ఇప్పుడు ఎందుకు నిర్వహిస్తున్నారో తెలీడం లేదన్నారు. నిమ్మగడ్డ చర్యలు చంద్రబాబు ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. ఏదిఏమైనా తాము ఎన్నికలకు ఎప్పుడూ సిద్ధమేనని, తుది ఫలితాలు కచ్చితంగా తమకే అనుకూలంగా వస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సొంత మంటూ ఒక్క పథకం పేరైనా చెప్పుకోలేని 40 ఏళ్ల అనుభవజ్ఞులైన చంద్రబాబుకి మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్ చౌదరి చంద్రబాబుపై చర్యలు తీసుకునే సాహసం చేయగలరా అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈ ఎన్నికల్లో శత శాతం ఫలితాలతో ప్రజలు నిమ్మగడ్డకు బుద్ధి చెబుతారని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని 959 పంచాయతీల్లో శత శాతం ఫలితాలకు కృషి చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికలు నిమ్మగడ్డకు, చంద్రబాబుకు గుణపాఠం కానున్నాయని మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజు రామతీర్ధానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు జై శ్రీరాం అన్నంత మాత్రాన ప్రజలు ఆయన్ను నమ్మరన్నారు. రామతీర్థం ఘటన చాలా దురదృష్టకరమని, రామతీర్థంను మరో భద్రాద్రిగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
డీజీపికి లేఖ వీర్రాజు స్థాయికి సరికాదు: వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడుల కేసుల్లో టీడీపీ నేతల ప్రమేయం రుజువు కావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబులో ఆందోళన మొదలైందని మంత్రి వెల్లంపల్లి అన్నారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ, బీజేపీలు కుట్రలకు పాల్పడ్డాయని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేసిన నేపథ్యంలో, చంద్రబాబు వెన్నులో వణుకు పడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. దాడులకు సంబంధించిన తొమ్మిది కేసుల్లో 21 మంది టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందని, వారిలో 15 మందిని అరెస్టు చేశామని ఇటీవల రాష్ట్ర డీజీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆలయాలపై జరిగిన దాడుల కేసులపై మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. దాడుల కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయాన్ని బయటపెట్టిన రాష్ట్ర డీజీపీపై టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రమేయాన్ని సాక్ష్యాధారాలతో బయటపెట్టిన డీజీపీని చంద్రబాబు, బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. డీజీపీనే బెదిరించేలా సోము వీర్రాజు లేఖ రాశారని, ఇది అతని స్థాయికి సరికాదని వెల్లంపల్లి హితవు పలికారు. నిజాలను నిగ్గుతేల్చినందుకు డీజీపీ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. బూట్లు వేసుకొని పూజలు చేసే చంద్రబాబుకు హిందువుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేనానికీ ఆయన చురకలంటించారు. అన్ని కులాలు, మతాలను గౌరవించే ఏకైక ప్రభుత్వం తమదేనని, మానవత్వమే తమ సీఎం జగన్మోహన్రెడ్డి మతం, అభిమతమని వెల్లంపల్లి పేర్కొన్నారు. ఇంతకన్నా నిదర్శనం లేదు సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో పారదర్శక పాలన కొనసాగుతోందని, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలోకి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి 3వ స్థానం లభించటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ దక్కిన గౌరవమని ఆయన పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత కలహాలు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కుటిల బుద్ధితో దేవాలయాలలో విగ్రహాలు ధ్వంసం చేయించడం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విగ్రహాల ధ్వంసం, తప్పుడు ప్రచారం కేసులో అరెస్టయిన వారందరూ తెలుగుదేశం పార్టీకి చెందిన వారేనని ఆయన తెలిపారు. తమ ఉనికిని కాపాడుకోవటానికి చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవహారాలు చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం లేదని ఎంపీ మోపిదేవి ఎద్దేవా చేశారు. -
మరో కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం హయాంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. టీడీపీ ప్రభుత్వంలో కూల్చిన 9 ఆలయాల నిర్మాణంతో పాటు, 70 కోట్లతో ఇంద్రకీలాద్రిపై చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమిపూజ చేయనున్నారు. అందులో భాగంగానే కృష్ణానది ఒడ్డున సీతమ్మపాదాల వద్ద శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీపీ బత్తిన శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పర్యవేక్షించారు. చదవండి: ('టీడీపీ త్వరలో కనుమరుగవుతుంది') ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రామరాజ్యస్థాపనకు కృషిచేస్తున్నారు. కులాలు, మతాలు, పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు సంక్షేమం అందిస్తున్నారు. సీఎం జగన్‌కి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోంది. అర్ధరాత్రులు ఆలయాలపై దాడులకు తెగబడుతూ కుట్రలు పన్నుతోంది. టీడీపీ పాలనలో పట్టపగలే ఆలయాలు కూల్చితే ప్రశ్నించని పవన్ ఇప్పుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. రాజకీయ రాబందులకి రాష్ట్ర ప్రజలే గుణపాఠం నేర్పుతారు' అని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. చదవండి: (బాబుది నీచ బుద్ధి) -
రామతీర్థం ఆలయాన్ని పరిశీలించిన మంత్రులు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. విగ్రహ ధ్వంసం ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తు లేడు, కానీ ఇప్పుడు బాబుకు దేవుడు గుర్తొచ్చాడని విమర్శించారు. చంద్రబాబు ఆలయాలను కూల్చిన వ్యక్తి.. బాబు.. దేవాలయ ఆస్తులను తన బినామీలకు దారాదత్తం చేశారని చురకలు అంటించారు. మతాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహించారు. అసలు బాబుకు దేవుడంటే నమ్మకముందా? అని సూటిగా ప్రశ్నించారు. ఆలయాలను కూల్చిన వ్యక్తి సాంప్రదాయాల గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. బాబు పాపాలు చేశారు కాబట్టే వెంకటేశ్వర స్వామి ఓడించాడని వ్యాఖ్యానించారు. ఇక రామ తీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనక ఉన్నవారికి శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. దోషులను శిక్షించాలి అంతకు ముందు విశాకు వెళ్లిన వెల్లంపల్లి అక్కడ విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వామి సరూపానందేంద్ర సరస్వతి స్వామిని కలిశారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. దేవాలయాల్లో దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ఉపేక్షిస్తే దేవాదాయ శాఖ ప్రతిష్ట దిగజారుతుందన్నారు. రామతీర్థం ఘటనపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరారు. నివేదిక సమర్పణకు కమిటీకి కాలపరిమితి విధించాలని సూచించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రామతీర్ఠంలో అసలు ఏం జరిగిందంటే... రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. (చదవండి: రాముడి విగ్రహ ధ్వంసం 'దేశం' మూకల పనే?) చైర్మన్ పదవి నుంచి అశోక గజపతి తొలగింపు రామతీర్థం ఆలయంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనకు వ్యవస్థాపక ధర్మకర్త హోదాలో రామతీర్థం ఆలయ చైర్మనుగా కొనసాగుతున్న కేంద్ర మాజీమంత్రి అశోక గజపతి రాజు నిర్లక్ష్యం కూడా కారణమని దేవదాయ శాఖ పేర్కొంది. సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా, కనీసం ఆ ఆలయాన్ని ఆయన సందర్శించలేదు. సరికదా.. దానిపై సరైన రీతిలో స్పందించలేదు. దీంతో ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. దీనికితోడు విజయనగరంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం, తూర్పు గోదావరి జిల్లా మందపల్లిలోని మందేశ్వరస్వామి ఆలయం చైర్మన్ పదవుల నుంచి కూడా అశోక గజపతిరాజును తొలగించారు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) -
మత విద్వేషాల చిచ్చు పెట్టేందుకు బాబు యత్నం
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల అమలుతో జగన్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందన్న కుళ్లుతో ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో మత విద్వేషాల చిచ్చు పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. తానే కుట్ర చేసి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడన్నారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రామతీర్థం ఘటన తొలిసారి టీడీపీ సోషల్ మీడియాలోనే ప్రచారం జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. అలాగే రామతీర్థంలో చంద్రబాబు ప్రెస్‌మీట్ తరువాత దీనివెనుక ఆయన పూర్తి హస్తముందనే అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు. తన పాత్ర లేకపోతే రామతీర్థం వెళ్లిన చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ డిమాండ్ చేసినట్లుగా ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. అలాగైతే ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టలేవు.. ‘‘ఎల్లకాలం అధికారం తనకే ఉండాలని విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించినందుకు చంద్రబాబుకు మొన్నటి ఎన్నికల్లో అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ అధికారం కోసమని దేవుడి పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే ఈసారి అసలు ఆయన అసెంబ్లీలోకే అడుగు పెట్టే పరిస్థితి ఉండదు’’ అని వెలంపల్లి హెచ్చరించారు. బూట్లు వేసుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొనే చంద్రబాబు హిందువా? అని ప్రశ్నించారు. అలాంటి ఆయన దేవుడిపై భక్తిని ఒలకబోస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని దుయ్యబట్టారు. రామతీర్థం వెళ్లి చంద్రబాబు రాజధాని అమరావతి గురించే మాట్లాడి తన నైజం నిరూపించుకున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసు ఉచ్చు బిగిస్తుండేసరికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో లాలూచీ చేసుకోవడానికి జై శ్రీరామ్ అంటూ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఖబడ్దార్ అంటూ సీఎం జగన్‌కు వార్నింగ్ ఇవ్వడానికి చంద్రబాబెంత, ఆయన బతుకెంత.. అని మండిపడ్డారు. రామతీర్థం టెంపుల్‌కు ఇప్పటిదాకా చైర్మన్‌గా కొనసాగింది చంద్రబాబు పక్కన కూర్చున్న అశోకగజపతిరాజేనని, ఘటన జరిగాక ఆయనెందుకు స్పందించలేదని ప్రశ్నించారు. హిందూ దేవాలయాల్ని, భూముల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వానిదన్నారు. -
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పుష్కరాలు
-
చంద్రబాబు గుడిలను కూల్చేశారు: మంత్రి వెల్లంపల్లి
-
అంతర్వేది: కొత్త రథం నిర్మాణ డిజైన్లు ఖరారు
సాక్షి, అమరావతి: పాత రథం నమూనాలోనే అంతర్వేది ఆలయ కొత్త రథం నిర్మాణ డిజైన్లను దేవదాయ శాఖ ఖరారు చేసింది. 41 అడుగుల ఎత్తు, ఆరడుగుల వెడల్పుతో ఏడంతస్తుల్లో ఆలయ రథం ఉంటుంది. అంతర్వేది ఆలయ రథం నిర్మాణానికి సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్ అర్జునరావుతో సమీక్షించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలు జరగనున్నాయని.. అప్పటిలోగా కొత్త రథ నిర్మాణ ప్రక్రియ పూర్తి కావాలని మంత్రి ఆదేశించారు. ఆరు చక్రాలతో కూడిన కొత్త రథం నిర్మాణంతో పాటు, రథశాల మరమ్మతులకు రూ.95 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు వివరించారు. అంతర్వేదిలో దర్శనాలు నిలుపుదల సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 20 వరకు అధికారులు దర్శనాలను నిలిపివేశారు. అంతర్వేది, పరిసర ప్రాంతాల్లో కరోనా ఉధృతి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ సోమవారం తెలిపారు. స్వామి వారికి నిత్యం జరిగే కైంకర్యాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహిస్తారని చెప్పారు. చదవండి: టీడీపీ దుష్ర్పచారాన్ని నమ్మొద్దు -
ఏడంతస్తులు.. 41 అడుగుల ఎత్తుతో నిర్మాణం
సాక్షి, విజయవాడ: వచ్చే ఫిబ్రవరిలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయి. అప్పటిలోగా అందరి అభిప్రాయాల మేరకు.. ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాలని అధికారులను అదేశించిన్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం బ్రాహ్మణ వీధి దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ పి.అర్జునరావుతో మంత్రి వెలంపల్లి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించామన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా ఆకృతి రూపొందించామన్నారు. (చదవండి: ఈ అలజడి ఎవరి మనోరథం?) ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తులుగా రూపొందిస్తున్నమని వెలంపల్లి తెలిపారు. కొత్త రథం నిర్మాణంతో పాటు.. రథశాల మరమ్మతుల నిమిత్తం 95 లక్షల రూపాయలు ఖర్చవుతుందన్నారు. ఈ మేరకు దేవదాయశాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందన్నారు మంత్రి వెలంపల్లి. సమావేశంలో దేవదాయ శాఖ కమిషనర్ పి.అర్జునరావు, ఎస్ఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
టీడీపీ దుష్ర్పచారాన్ని నమ్మొద్దు
-
వచ్చేనెలలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు
సాక్షి, విజయనగరం : పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ తేదీలను ఆలయ ఈవో ప్రకటించారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2న మండల దీక్ష ప్రారంభం కాగా, అదేరోజు పందిరిరాట ఉంటుంది. 22న అర్థమండల దీక్ష, 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. నవంబరు 3న తెప్పోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయని ఈవో వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాల నిర్వాహణ ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో మాస్క్, వ్యక్తిగత దూరం లాంటి నిబంధనలను భక్తులు పాటించాలని విఙ్ఞప్తి చేశారు. అమ్మవారి సిరిమాను చెట్టు గుర్తింపు వంటి ప్రక్రియ సైతం నిబంధనల మేరకే కొనసాగుతుందని స్పష్టం చేశారు. వృద్దులు, చిన్నారులు, గర్బిణీలకు ప్రత్యేక దర్శనాలకు అనుమతి లేదని తెలిపారు. అయితే ఎంతమంది భక్తులకు దర్శనం కల్పించాలన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లాలో గల మూడు రథాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. -
‘రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదు’
సాక్షి, తాడేపల్లి : అంతర్వేది రథం కాల్చివేత చాలా బాధాకరమని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. రథం కాల్చివేత జరిగిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారని వెల్లడించారు. 95 లక్షల రూపాయలతో కొత్త రథాన్ని ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కులాలను మతాలను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రథాన్ని తగలబెట్టిన వారిని వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. (విజయవాడకు మరో వరం ప్రకటించిన సీఎం) విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముసుగులో కొంత మంది విద్రోహులు చర్చ్‌పై రాళ్లు రువ్వారని మంత్రి వెల్లంపల్లి అన్నారు. చర్చ్, మసీదు, గుళ్లపై దాడులు చేసే వారిని క్షమించమని హెచ్చరించారు. ఇంకా విచారణ జరుగుతుండగానే ఈ విషయంపై కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పుష్కరాల సందర్భంగా 40 దేవాలయాలను చంద్రబాబు కూల్చివేశారని, ఈ కూల్చివేతలో బీజేపీ జనసేనకు భాగస్వామ్యం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. దాడులు చేసే సంస్కృతి చంద్రబాబుదని, హైదరాబాద్‌లో కూర్చొని జూమ్‌లో చంద్రబాబు సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. (అంతర్వేది ఘటనపై స్పందించిన ఏలూరు రేంజ్ డీఐజీ) ‘సోము వీర్రాజును హౌస్ అరెస్ట్ చేయలేదు. అంతర్వేది ఆలయ ఈవోని సస్పెండ్ చేశాము. అంతర్వేది సంఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షింస్తాం. హిందూ దేవాలయాల్లో ఇతర మతస్తులను మా ప్రభుత్వం వచ్చాక తొలగించామం. మతాలు మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు దెయ్యం మాదిరిగా వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవకతవకలుపై 30 మంది అధికారులను తొలగించాము. పనికిమాలిన ఎంపీ రఘురామ కృష్ణమరాజు.. ఢిల్లీలో కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. (అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్) సోము వీర్రాజు మాటలను ఖండిస్తున్నాము. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మొద్దు. పవన్ కల్యాణ్ లాగా ఓట్లు కోసం రాజకీయాలు చేయడం మాకు తెలియదు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తన పిల్లలు క్రిస్టిన్ అన్నారు. ఎన్నికలు తరువాత హిందువులు అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడించారు. గత ప్రభుత్వం హయాంలో అంతర్వేది దేవాలయ భూముల అన్యాక్రాంతం చేయాలని చంద్రబాబు చూశారు. టీటీడీ నిధులు ఎక్కడ దారి మళ్లించారో సోము వీర్రాజు సమాదానం చెప్పాలి. చంద్రబాబు షూటింగ్ కోసం 29 మందిని చంపేశారు. పుష్కరాల పేరుతో వందల కోట్లు దోచేశారు. చంద్రబాబు పాపాల్లో బీజేపీ జనసేనకు భాగస్వామ్యం లేదా.’ అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలు, కులాలు ముఖ్యమంత్రికి సమానమేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ‘జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంకు మతాలతో సంబందం లేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా అధికారంలో లేనప్పుడు ఒక విధంగా మాట్లాడుతున్నారు. 40 దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు ఎందుకు నిజానిర్ధారణ కమిటీ వేయలేదు. ప్రభుత్వంకు కులాలు మతాలు అంటగట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులపై కొంత మంది దాడి చేయాలని చూడడం దుర్మార్గం.’ అని పేర్కొన్నారు. -
అవసరమైతే సీబీఐ విచారణ
సఖినేటిపల్లి/సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్థమైన çఘటనలో అవసరమైతే సీబీఐ విచారణకు వెనుకాడబోమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ దుర్ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని.. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని చెప్పారు. మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దేవదాయ కమిషనర్ అర్జునరావు, ఆర్జేసీ భ్రమరాంబ, రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్పర్సన్ అమ్మాజీ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావులతో కలిసి ఘటనా స్థలాన్ని వెలంపల్లి మంగళవారం సందర్శించారు. ఈ సమయంలో వీహెచ్‌పీ. భజరంగదళ్, హిందూ ధార్మిక సంఘాలు, హిందూ చైతన్య వేదిక, ధర్మవీర్ ఆధ్యాత్మిక వేదిక, సంఘ్ పరివార్ కార్యకర్తలు అక్కడకు వచ్చి ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రులు ఆందోళనకారుల తరఫున ధార్మిక సంఘ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రవికుమార్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ.. ఈ ఘటనను కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా చర్యలకు వెనుకాడేది లేదని స్పష్టంచేశారు. శ్రీశైలంలో గత ఐదేళ్లల్లో జరిగిన అవినీతికి సంబంధించి 30 మంది సిబ్బందిని సస్పెండ్ చేసిన విషయాన్ని వెలంపల్లి వారికి గుర్తుచేశారు. ఆలయ ఈవోపై ప్రభుత్వం వేటు కాగా, రథం ఉన్న పరిసరాల్లో పర్యవేక్షణ లోపం ఉండడంతో ఈవో ఎన్ఎస్ చక్రధరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, ఆలయానికి కొత్త రథం తయారీ, రథశాల మరమ్మతుల నిమిత్తం కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుంచి రూ.95 లక్షలను ఆయన మంజూరు చేశారు. -
అంతర్వేదిలో మంత్రుల పర్యటన
-
ఫిబ్రవరిలోగా అంతర్వేది రథ నిర్మాణం
సాక్షి, విజయవాడ: అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటన చాలా బాధాకరమని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. దేవదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపాటి అమ్మాజీతో కలిసి ఆయన సోమవారం మాట్లాడారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందన్నారు. మానవ తప్పిదమా....కావాలని ఎవరన్నా చేసిందా అనేదానిపై లోతైన విచారణ జరుగుతుందన్నారు. ఫిబ్రవరిలోగా 95 లక్షల రూపాయలతో అంతర్వేది రథం నిర్మాణం జరిగే విధంగా ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలిపారు. (అంతర్వేది ఆలయ రథం దగ్ధం) హిందువుల దేవాలయాల గురించి టీడీపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. పుష్కరాల వంకతో 40 గుళ్లు కూల్చేసిన చంద్రబాబు... గోదావరి పుష్కరాల్లో 23మందిని పొట్టనపెట్టుకున్న విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతర్వేది ఘటనపై నిజ నిర్దారణ కమిటీ వేసిన చంద్రబాబు.. పుష్కరాల్లో 23 మందిని పొట్టన పెట్టుకున్నపుడు ఎందుకు నిజ నిర్ధారణ వేయలేదని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో జరగకుండా ప్రతి దేవాలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రతిపక్షాలు కుట్ర చేశాయనే అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని ఒక కులానికి అంటగట్టాలని చూస్తున్నారని మంత్రి వెలంపల్లి అన్నారు. శాసనమండలిలో నారా లోకేష్‌కు సవాల్ విసిరితే పారిపోయారని, అలాంటి వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడమా అని ఎద్దేవా చేశారు. రథం దగ్ధం ఘటనపై ఆలయ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేశామని అలాగే ఈవోని బదిలీ చేసినట్లు మంత్రి తెలిపారు. అలాగే అంతర్వేదిలో సీసీ కెమెరా విభాగం చూసే ఉద్యోగిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు. విజయవాడ దుర్గగుడిలో జరిగిన క్షుద్ర పూజలపై విచారణ చేయిస్తున్నామని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండ చూస్తామని, రాజకీయ కోణంలో కావాలని కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అవాస్తవాలు నమ్మవద్దు అని ప్రతి ఒక్కరికి కోరుతున్నమని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
అంతర్వేది ఆలయ రథం దగ్ధం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/మలికిపురం/సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం శనివారం అర్ధరాత్రి దగ్ధమైంది. రథంపై ఏటా కల్యాణోత్సవాల తరువాత స్వామి, అమ్మవార్ల ఊరేగింపు వైభవోపేతంగా జరుగుతుంది. రథం దగ్ధం కావడంతో ఆదివారం భక్తులు ఆలయం వద్దకు చేరుకుని దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళన చేశారు. 40 అడుగుల ఎత్తు ఉన్న ఈ రథాన్ని ఆలయానికి నైరుతి దిక్కున ఉన్న పెద్ద షెడ్లో ఉంచారు. రథం వద్ద శనివారం అర్ధరాత్రి ఒంటిగంట తరువాత మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చేలోపే రథం ఆహుతైంది. తేనెపట్టు సేకరణ వల్లే..: రథం షెడ్డులో ఉన్న తేనెపట్టును సేకరించేందుకు కొందరు చేసిన యత్నం ఏకంగా రథం దగ్ధానికి కారణమైనట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. రథం ఎత్తుతో సమానంగా షెడ్డును ఇక్కడ నిర్మించారు. ఏటా ఉత్సవాలు పూర్తయ్యాక ఈ షెడ్డులో రథాన్ని ఉంచుతారు. షెడ్డు ఒకవైపు తెరచి, మూడువైపుల మూసి ఉంటుంది. తెరచి ఉంచిన వైపు రథాన్ని తాటాకులతో కప్పి ఉంచుతారు. షెడ్డులో ఇటీవల తేనెపట్టులు పట్టాయి. తేనెను పట్టుకునేందుకు శనివారం రాత్రి కొందరు విఫలయత్నం చేశారు. 20 అడుగులున్న గెడ తెచ్చి, దానికి కాగడా కట్టేందుకు కొక్కెం కట్టారు. కాగడాతో తేనెటీగలను చెదరగొట్టే యత్నం చేశారు. కాగడా ప్రమాదవశాత్తూ ఊడిపోయి, రథానికి ఒకవైపు ఉన్న తాటాకులపై పడింది. దీంతో మంటలు లేచాయి. ఈ మంటలకు రథం దగ్థమైంది. విజయవాడ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులకు దీనిపై ఆధారాలు లభించినట్లు తెలిసింది. మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక, దేవదాయ శాఖ, పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అంతర్గత విచారణకు ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు: మంత్రి వెలంపల్లి ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఘటనపై దేవదాయ కమిషనర్ అర్జునరావుతో పాటు జిల్లా ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించారు. కొత్త రథం ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలంటూ కమిషనర్‌కు సూచించారు. పూర్తిస్థాయిలో విచారణ: డీజీపీ ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. ఫోరెన్సిక్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం ప్రమాద ప్రదేశంలో ఆధారాలు సేకరిస్తోందని ఓ ప్రకటనలో తెలిపారు. మరోవైపు.. దీనిపై పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏలూరు రేంజి డీఐజీ మోహన్‌రావు తెలిపారు. సఖినేటిపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఘటనలో కుట్ర కోణంపై ఆధారాలు లభించలేదన్నారు. -
అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
సాక్షి, విజయవాడ: పట్టణంలో పశ్చిమ నియోజకవర్గంలోని 34వ డివిజనలో 2.20 లక్షల రూపాయల సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పారు. కరోనా వంటి విపత్కర సమయంలో కూడా అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగలేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 90 శాతం సంక్షేమ పథకాలను ఆయన ప్రజల వద్దకే తీసుకువచ్చారన్నారని ఆయన తెలిపారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని జూమ్ ద్వారా కులాలను, మతాలను రెచ్చగొట్టే వాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇకనైన కుళ్ళు రాజకీయాలు మానుకోవాలని, ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. -
‘హైదరాబాద్.. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది’
సాక్షి, చిత్తూరు : కాణిపాకం ఆలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి.తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణమని, ఆయన మంత్రి పదవి ఇవ్వడం వల్లే ఈ అదృష్టం దక్కిందన్నారు. కాణిపాకం గుడిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. (‘చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు’) సెప్టెంబర్ 11 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని గుడిల అభివృద్దే తమ లక్ష్యమని తెలదిపారు. కాణిపాకానికి మాస్టర్ ప్లాన్ దృష్టిలో ఉందని, దానిని త్వరలోనే అమలు చేస్తామన్నారు. వినాయక చవితి ఉత్సవాల గురించి ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిచ్చి పట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్నారని, వినాయక చవితి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయో చంద్రబాబు, రఘురామ కృష్ణమ రాజులు కాణిపాకానికి వచ్చి చూడాలని సవాలు విసిరారు. చంద్రబాబు హైదరాబాద్, రఘురామ కృష్ణమ రాజులు ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. (ఏపీ: జిల్లాల పునర్విభజనపై కీలక ఆదేశాలు) -
వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ
సాక్షి, అమరావతి: ప్రతి అంశంలోనూ తప్పుడు ఆరోపణలు చేసే మూర్ఖులు చంద్రబాబు పార్టీ నేతలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. ‘వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని 2019 ఎన్నికల మేనిఫెస్టోలోనే వైఎస్సార్సీపీ స్పష్టంగా చెప్పింది. మేనిఫెస్టోను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని నోటికి తాళాలు వేసుకుంటే మంచిది’ అని మంత్రి హితవు పలికారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం మీడియాకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ► డెడ్‌లైన్ పెట్టడానికి చంద్రబాబు స్థాయి ఏంటి? ఆయనకు సవాల్ విసిరే అర్హత లేదు. ఆయనకి ధైర్యం ఉంటే తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. ► అమరావతి శాసన రాజధాని. దానితో పాటు మరో రెండు రాజధానులు తెస్తే తప్పేముంది? n సీఆర్డీఏ చంద్రబాబు రియల్ ఎస్టేట్ అథారిటీ. ఆయన రియల్ ఎస్టేట్ కంపెనీని మేము రన్ చేయాలా? -
మూడు నియోజకవర్గాల్లో శరవేగంగా అభివృద్ధి పనులు
-
చివరి దశకు దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు
-
'ప్రజాధనం దోచుకున్న వారిని చట్టం వదలదు'
-
తాగి పడుకున్న దద్దమ్మలా మాట్లాడేది..
సాక్షి, విజయవాడ: దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను శుక్రవారం రోజున దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తాం. 97 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. మాది చంద్రబాబులా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చంద్రబాబు ఎప్పుడో పుష్కరాలకు ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం అని చెప్పి మాట తప్పారు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడు. (చదవండి: 'నా తండ్రి ఆశయాలని కొనసాగిస్తాను') విజయవాడకి కేంద్రం కేటాయించిన నిధులను కూడా టీడీపీ ప్రభుత్వం అమరావతికి మళ్లించింది. అమరావతి అనే బ్రమరావతిలో ప్రజలను చంద్రబాబు ఉంచాడు. కానీ మా ప్రభుత్వం విజయవాడలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కేశినేని నాని, గద్దె రామ్మోహన్, ఇతర నాయకులు విజయవాడ అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే గత ఐదేళ్లలో మాత్రం చంద్రబాబుతో నిధులు ఇప్పించులేకపోయారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలంటూ హడావిడి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఏడాదిలోనే అన్నీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా విజయవాడకు కేశినేని నాని ఏం చేశారో చెప్పాలి. ఇంట్లో తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఎవరినీ చట్టం వదలదు. అచ్చెన్నాయుడు కార్మికుల డబ్బును దోచుకున్నాడు కాబట్టే జైలుకెళ్లాడు. అదే విధంగా ఎవరు అక్రమాలు చేసినట్లు మా దృష్టికి వచ్చినా చర్యలు తప్పవు' అని పేర్కొన్నారు. చదవండి: కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేశాకే భక్తులకు అనుమతి
-
వెన్నుపోటు పొడవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య
-
నీచ రాజకీయాలు అవసరమా.. ‘కన్నా’?
సాక్షి, అమరావతి: టీటీడీ భూముల అమ్మకం విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన తప్పును కూడా ఈ ప్రభుత్వం చేసిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసత్య ప్రచారానికి పూనుకోవడం దారుణమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు దగ్గర డబ్బులకు అమ్ముడుపోయి బీజేపీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు ఆయన సిగ్గుపడాలని మండిపడ్డారు. ఇంత నీచ రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2016లో టీటీడీ బోర్డులో ఒక సబ్ కమిటీ వేసి, స్వామి వారి 50 ఆస్తులను అమ్మాలని నిర్ణయించడం వాస్తవం కాదా? ► అప్పటి టీటీడీ బోర్డులో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి సభ్యుడుగా ఉన్న విషయం నిజం కాదా? కన్నా లక్ష్మీనారాయణ సూటిగా సమాధానం చెప్పాలి. ► గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన ఆర్డర్‌ను రద్దు చేస్తూ ప్రస్తుత సీఎం పేషీ నుంచి ఆదేశాలు ఇస్తే అది కూడా రాజకీయం అంటూ మాట్లాడడం దుర్మార్గం. ► ప్రభుత్వాన్ని తప్పుపట్టే ముందు తమ పార్టీ నేత భాను ప్రకాష్‌రెడ్డికి కన్నా షోకాజ్ నోటీసులివ్వాలి. ► చంద్రబాబు 40 ఆలయాలు పడగొట్టినప్పుడు, గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోయినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు మాట్లాడలేదు? ► విజయవాడలో గుళ్లను కూల్చినప్పుడు అప్పట్లో బంద్‌కు పిలుపునిస్తే, అప్పటి రాష్ట్ర బీజేపీ నేతలు గానీ, కన్నా లక్ష్మీనారాయణ కానీ కనీసం మద్దతు ఇవ్వకపోగా, బంద్‌కు బీజేపీకి సంబంధం లేని ప్రకటించారు. ► చంద్రబాబు పూజలు కూడా బూట్లు వేసుకుని చేస్తారు. శంఖుస్థాపనలు చేసే సమయంలో కూడా చేతిలో పటం, కాళ్లకు బూట్లు ఉంటాయి. ► దేవాలయాల పట్ల వైఎస్ జగన్ ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తారు. దేవాలయాలకు వెళ్లనప్పుడు నిబద్ధతతో పూజలు చేస్తారు. దేవాలయాలను పునర్ నిర్మించేది, పరిరక్షించేది జగన్ ప్రభుత్వమే. ► బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతేగానీ మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచి పరిణామం కాదు. -
'నీ కబ్జాకోరు బాగోతాలు బయటకు తెస్తాం'
సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదులలో మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్లకు రాష్ట్రప్రభుత్వం వన్‌టైం సహాయం కింద రూ. 5వేల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లలో జమచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్‌ను నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిపై దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కన్నా ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారో చెప్పాలి. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసినందుకు మీరు నిరాహార దీక్ష చేస్తున్నారా..? టీటీడీ ఆస్తుల పరిరక్షణకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. కన్నా నూజివీడులో వెంకటాచలం భూములు 18 ఎకరాలు కబ్జా గురించి కొద్దీ రోజుల్లో బయట పెడతాం. మా ప్రభుత్వాన్ని కించపరచాలని చూస్తే ఊరుకునేది లేదు.’ అని మండిపడ్డారు. చదవండి: ‘ఆలయాలను కూల్చిన నీచుడు చంద్రబాబు’ అన్ని మతాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం మాది: మల్లాది విష్ణు ‘‘నూజివీడులో నీ కబ్జా కోరు నిజస్వరూపం త్వరలోనే బయటకు తెస్తాం. హిందూ మతం వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని మతాలకు న్యాయం చేస్తున్న ప్రభుత్వం మాది అంటూ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై ధ్వజమెత్తారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ కారణంగా మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పాస్టర్లు, ఇమామ్‌లు, మౌజన్లకు 5000 నగదు ఇవాళ అకౌంట్ లో పడింది. సీఎం వైఎస్ జగన్ ఎవరికి ఇబ్బంది వచ్చిన సాయానికి ముందుకు వచ్చారు. కానీ ఇవేమీ పట్టని కన్నా ఏసీలో కూర్చొని దీక్షలు చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టించే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ హయాంలో భూముల అమ్మకం నిర్ణయం చేస్తే దాన్ని మా సీఎం రద్దు చేశారు. ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే హిందూ మతం వ్యతిరేకం అంటూ మా పై దుష్ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, మీరు కలిసి చేసిన పాపానికి ప్రాయచ్చిత్తంగా మీరు దీక్షలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఇక్కడి పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. మీరు ఈ విషయాలపై అప్పటి మీ మంత్రి మాణిక్యాలరావును ప్రశ్నించండి’’ అని మల్లాది విష్ణు హితువు పలికారు. చదవండి: లాక్డౌన్ నిబంధనలు చంద్రబాబు బేఖాతర్ -
పురోహితులను ఆదుకోండి
భవానీపురం (విజయవాడ పశ్చిమ): పితృకర్మలు నిర్వహించే పురోహితులు లాక్డౌన్ కారణంగా ఉపాధిలేక అవస్థలు పడుతుండడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దిగువనున్న దుర్గాఘాట్ పక్కనే ఉన్న పిండప్రదాన కార్యక్రమాల రేవులో దాదాపు వంద మందికి పైగా పురోహితులు అపరకర్మలు చేయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కానీ, లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి వీరంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అపరకర్మలు చేయించుకునేందుకు ఎవరూ రాకపోతుండడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. చివరికి ఇల్లు గడవటమే కష్టంగా ఉంది. ఈ విషయం వైఎస్ విజయమ్మ దృష్టికి వెళ్లింది. మానవత్వంతో స్పందించిన ఆమె.. దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడి పురోహితులను ఆదుకోవాలని సూచించారు. దీంతో.. ఆమె సూచన మేరకు మంత్రి వెలంపల్లి శనివారం ఉదయం పిండ ప్రదాన రేవు పక్కనే ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాంగణంలో పురోహితులకు నిత్యావసర సరుకులను అందజేయనున్నారు. -
కరోనా అరికట్టేందుకు పటిష్ట చర్యలు : వెల్లంపల్లి
సాక్షి, విజయవాడ : విజయవాడ పశ్చిమనియోజకవర్గ సచివాలయ సిబ్బందికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నిత్యావసరాల సరుకులు పంపిణీ చేశారు. విపత్కర కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి సచివాలయసిబ్బంది, వాలంటీర్లు పనిచేస్తున్నారని మంత్రి అభినందించారు. ప్రభుత్వ పరంగానే కాకుండా పార్టీపరంగానూ ప్రతిఒక్కరూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు నిత్యావసరాల పంపిణీ చేసినట్టు మంత్రి తెలిపారు. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. -
'ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకుంటే మంచిది'
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ పరిపాలన ప్రక్రియలో మార్పులు సహజమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిస్పక్షపాతంగా పనిచేయాల్సింది పోయి ఒక పార్టీకి ప్రతినిధిలా వ్యవహరించారని తెలిపారు. కాగా డిపాజిట్లు కూడా రాని కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్‌పై విమర్శలు చేయడం శోచనీయంగా ఉందన్నారు. ఆర్డినెన్స్‌లో చట్టబద్దత ఉంది కాబట్టే గవర్నర్ దానిని ఆమోదించారని తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే తోక పార్టీలు పని చేస్తున్నాయని.. ఎలక్షన్ కమీషన్ నిస్పక్షపాతంగా పనిచేయాలనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో సతమవుతున్న వేళ పేదలకు రేషన్, పెన్షన్,ఆర్థిక సాయం అందాలన్న లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారు. ఆర్థిక సాయం వెయ్యి కాదు ఐదు వేల ఇవ్వాలన్న చంద్రబాబు కోడ్ లేని సమయంలో ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని నానా యాగీ చేస్తున్నారని ద్వజమెత్తారు. పేదలు పస్తులు ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యమని వెల్లంపల్లి తెలిపారు. చంద్రబాబు ఇప్పటికైనా నీచరాజకీయాలు మానుకోవాలని హిత బోధ చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ... ప్రతి పక్ష పార్టీలు బురద జల్లాలని చూస్తున్నాయన్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి పార్టీలకు, సామాజిక వర్గానికి కొమ్ము కాసే విధంగా పనిచేయకూడదన్నారు. ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం మూడు సంవత్సరాలు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ విలువలు కాపాడాలన్నారు. ఎలక్షన్ కోడ్ లేనప్పుడు పేద ప్రజలకు ప్రభుత్వం ఆర్ధిక చేయూత నిస్తే దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని జోగి రమేశ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తక్కువ వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించేలా, డబ్బు మద్యం ప్రలోబాలులేని ఎన్నికలు జరిగాలనే ప్రభుత్వం నూతన చట్టం తీసుకువచ్చారన్నారు. కోడ్ అమలులో ఉంటే కరోనా బాధితులు పరిస్థి ఏంటన్నారు. సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని సంప్రదించే నిర్ణయాలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్‌కు సూచించిందన్నారు. పేదల ఆర్థికసాయం అంశపై రమేశ్ కుమార్ రాజకీయం చేయాలని చూశారన్నారు. ఎన్నికల కమీషనర్ పదవీకాలం తగ్గింపు ప్రజా అభిప్రాయం ప్రకారమే జరిగిందని, కమీషనర్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించి సీఎం జగన్ నూతన వరవడికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. -
'వాటిని ఆచరణలో చూపింది వైఎస్ జగన్'
సాక్షి, విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో ఉన్న పూలే విగ్రహానికి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'పూలే లాంటి మహనీయుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. పూలే ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. 'పూలే ఆశయాలను ఆయన చూపిన బాటలోనే బలహీన వర్గాల కోసం అభినవ పూలేగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకువెళ్లాలన్న పూలే ఆలోచనలను ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్ జగన్. నామినేటేడ్ పోస్టుల్లో, వర్క్స్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50శాతం రిజర్వేషన్లు.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ తెచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్' అంటూ కొనియాడారు. చదవండి: జ్యోతిరావు పూలేకి సీఎం వైఎస్ జగన్ నివాళి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వానికి పూలే ఆదర్శం. ఆయన లక్ష్యాలు, సిద్ధాంతాలు మరవలేని. మహిళలకు విద్యావకాశాలు, వయోజన విద్య కోసం కృషిచేసిన పూలే జీవిత చరమాంకం వరకు బలహీన వర్గాలకోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి. కాగా పూలే బాటలో బలహీన వర్గాల కోసం రూ.5వేల కోట్లు నిధులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చుచేస్తున్నట్లు' తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. 'సమాజం కోసం అంకితభావంతో కృషిచేసిన వ్యక్తి పూలే. అదే మార్గంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని సీఎం వైఎస్ జగన్ 50శాతం రిజర్వేషన్లు తెచ్చి మరో అభినవ పూలేగా మారారని ప్రజలు కొనియాడుతున్నట్లు' ఆయన పేర్కొన్నారు. -
‘ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలి’
సాక్షి, విజయవాడ : ప్రజలకు కష్టాల్లో అండగా నిలవాల్సిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లు చేసుకుంటున్నాడని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. ప్రజలు రేషన్ షాప్ వద్ద సరుకులు తీసుకున్నప్పుడు కామెంట్ చేసిన పవన్‌కు.. బ్యాంకుల వద్ద జనం క్యూలో నిల్చున్నవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విజయవాడ భవానీపురం 40వ డివిజన్లో యరడ్ల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 5వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొని పేదలకు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నారని తెలిపారు. (కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయని) ప్రజలకు ఆరోగ్యం, శానిటేషన్, తాగునీటి సమస్యలు లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నేరుగా ప్రజలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ మా డబ్బు.. మా డబ్బు అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 1300 కోట్లు జీవో విడుదల చేశారని ఆయన గమనించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ఇచ్చేవి జన్‌ధన్ పథకంలో వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కరోనా కట్టడికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని తెలిపారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరవేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు మానుకొని.. ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని మంత్రి హితవు పలికారు. (భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్ ) వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. కమ్యూనిస్ట్ జెండా అడ్డు పెట్టుకుని బతికే వ్యక్తి రామకృష్ణ.. ప్రజలకు సేవ చేసే వారిని అవమానించడం మానుకోవాలని సూచించారు. డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులతో కలిసి కార్యకర్తలు కూడా తమవంతు సేవ చేస్తున్నారని ప్రస్తావించారు. వారిపై అవాకులు, చవాకులు మానుకోవాలని హెచ్చరించారు. నీచ రాజకీయాలు మానుకోకుంటే ప్రజలే మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగాలని, లాక్డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు. ప్రభుత్వం నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తోందని, ప్రభుత్వానికి సహకరిస్తే కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టవచ్చని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. (బీజేపీ కార్యకర్తలందరూ ఆ పని చేయండి: మోదీ) -
వ్యక్తులకు కొమ్ము కాస్తూ...
-
‘ఆ విషయాన్ని బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి’
సాక్షి, అమరావతి : ‘వెల్లంపల్లి- ఊసరవెల్లి’ అంటూ బీజేపీ చేసిన ట్వీట్‌కు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మించిన రాజకీయ ఊసరవెల్లి ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ఒక వేలు ఇతరుల వైపు చూపిస్తే నాలుగు వేళ్లు నీ వైపు చూపిస్తాయన్న విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీటర్ వేదికగా రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుపడ్డారు. ‘2009లో మంత్రిగా పనిచేసి..2014లో బీజేపీలో చేరి..2018లో వైఎస్సార్సీపీలోకి చేరడానికి సర్వం సిద్ధం చేసుకొని గుండెపోటు డ్రామాలత్బో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కించుకున్న మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కంటే రాజకీయ ఊసరవెల్లి ఎవరైనా ఉంటారా? గోదావరి-కృష్ణా పుష్కరాలలో వేల కోట్లను దోచి, వందల దేవాలయాలను కూల్చిన మీకు, మీ పార్టీ అధ్యక్షుడు కన్నాకు హిందూ దేవాలయాల గురించి, హిందూ ధర్మం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అమరేశ్వరం ఆలయానికి చెందిన భూములను భూబకాసురుల నుంచి కాపాడింది అప్పటి ప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారే. దేవాలయ భూములు పరిరక్షణ విషయంతో మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దేవుడిని, హిందూ ధర్మాన్ని ఓట్ల రాజకీయం కోసం వాడుకునే మీకు దేవుడు తగిన శిక్ష వేస్తాడు’ అని మంత్రి వెల్లంపల్లి ట్వీట్ చేశారు. -
'కరోనాను ఆయనే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు'
సాక్షి, అమరావతి: ఎన్నికలంటే ఎందుకు పారిపోతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విపక్షాలను ప్రశ్నించారు. చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్..ఈ ముగ్గురు ఒక్కటే అని, వీరికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో వీరు ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదని తప్పుపట్టారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ఆటంకం కలిగించడానికి మొదటి నుంచి కూడా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. అటు న్యాయస్థానాలు, ఇటు ఎన్నికల కమిషన్ నెపంతో ఎన్నికలను ఎదుర్కొలేకపోతున్నారు. ప్రభుత్వాలు సహజంగా ఎన్నికలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తాయి. కానీ ఇక్కడ విచిత్రంగా ప్రభుత్వమే ఎన్నికలు పెడతామని ముందుకు వస్తోంది. ప్రజలకు మంచి చేస్తే మాకు మంచి జరుగుతుందని మా ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వచ్చింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని, డబ్బులు, మద్యం పంపిణీ చేయకూడదని చట్టం చేశాం. చంద్రబాబు మొదలు ఆయన మౌత్‌పీస్‌లు అయిన పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ, వామపక్షాలు అందరూ కూడా వైఎస్ జగన్‌పై ఈ 9 నెలల్లో అనేక ఆరోపణలు చేశారు. సింగిల్‌గా వైఎస్ జగన్ ఎన్నికలకు వెళ్తుంటే ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారు. మీరు రాయించిన స్క్రిప్ట్‌నే ఎన్నికల కమిషనర్ చదివారు. టీడీపీ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్ పని చేస్తున్నారు. సీఎస్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తుంటే ఎన్నికల కమిషనర్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ జగన్‌పై మీరు చేసిన అపవాదులు నిజమయితే ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తారు కదా? ఎందుకు ఎన్నికలు వాయిదా వేయించారు. రాష్ట్రంలో ఒక్కకేసు మాత్రమే పాజిటివ్‌గా నమోదు అయింది. మోదీ మొదలు సీఎం వైఎస్ జగన్ వరకు అందరూ శుభ్రత గురించి చెప్పారు. చంద్రబాబు మాత్రం కరోనాను ఆయనే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజలకు మనోధైర్యం కలిగించాలి. రాష్ట్రంలో లేని కరోనాను ఉన్నట్లుగా చెప్పడం దారుణం. చంద్రబాబు అండ్‌కో ఇదే పని చేస్తూ రాష్ట్ర బ్రాండ్‌ను దెబ్బతీస్తున్నారు. ఎన్నికలు పూర్తి అయితే సుమారు రూ.5 వేల కోట్లు వస్తాయి. వైఎస్ జగన్‌పై వీరంతా పందుల్లా దాడి చేస్తున్నారు. రాష్ట్రానికి మంచి చేయాలని సీఎం వైఎస్ జగన్ తపన పడుతుంటే కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్మీట్లు పెట్టి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఐదు వేల కోట్లును పవన్, కన్నా రాష్ట్రానికి తేలాగరా..? అంటూ విమర్శించారు. చదవండి: 'చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరు' చంద్రబాబు, కన్నా, పవన్..ఈ ముగ్గురిది ఒకే మాట. వేరే వేరే వేదికలు ఉన్నాయి అంతే. పవన్ మాట్లాడితే చాలు ఢిల్లీలో ఫిర్యాదు చేస్తా అంటున్నారు. ఈ 9 నెలల్లో పవన్ నీవేం చేశావ్. గతంలో పాచిపోయిన లడ్డూ అన్నావు. ఈ రోజు ఒక్క లడ్డైనా తీసుకురాగలిగావా?. ఇప్పుడేమో ఎన్నికలు రద్దు చేయాలంటున్నావు. నీవేవో షూటింగ్‌లు చేసుకోవచ్చు. అందుకోసం ఇక్కడ ఎన్నికలు ఆపేయాలా? ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి బీజేపీని అడగలేకపోతున్నారు. కన్నాను, పవన్‌ను, చంద్రబాబు కొడుకును ప్రజలు చిత్తుగా ఓడించారు కాబట్టి ఈ రాష్ట్రానికి మంచి జరుగకూడదని వీరి ఉద్దేశ్యమంటూ ధ్వజమెత్తారు. చదవండి: ‘అసెంబ్లీ తీర్మానం చెత్తబుట్టకే పరిమితం’ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల కంటే క్షుణ్ణంగా పని చేస్తున్నారు. చంద్రబాబు మాదిరిగా ప్రకృతిని మార్చలేరు కానీ, ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మేం తప్పకుండా తీసుకుంటాం. సుప్రీం కోర్టు తలుపు తట్టాం. తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయంటే కారణం టీడీపీ, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడే. ప్రజలు తిరస్కరించిన వ్యక్తి ఈ యనమల. కాగా రాష్ట్రంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నా చంద్రబాబు మెప్పుకోసమే ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్ మనసు మార్చుకొని ఎన్నికలు యధాతధంగా నిర్వహించాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోరారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా భయపడం
-
సామాన్యుడి సొంతింటి కల ఆయన ధ్యేయం
సాక్షి, విజయవాడ : ఉగాది నాడు ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామని, విజయవాడ నగరంలో 50 వేల మంది ఇళ్లు లేనివారిని గుర్తించామని చెప్పారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 26వ డివిజన్లో 91 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. ( అప్పుడు ‘కన్నా’ ఏమైపోయారు: వెల్లంపల్లి ) వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపుకు పెద్ద పీఠ వేశారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వందలాది కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు శరావేగంగా సాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేసి విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. -
అప్పుడు ‘కన్నా’ ఏమైపోయారు: వెల్లంపల్లి
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేసిన ఆరోపణలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఖండించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందు మతాన్ని కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. ఎక్కడో చిన్న ఘటనలు జరిగితే వాటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారని మండిపడ్డారు. కాగా నెల్లూరు జిల్లా రథం కాల్చివేసిన ఘటనపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. దేవాలయాలు ఎవరూ కూలదోసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చారించారు. ఏపీ గవర్నర్‌ను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాగా.. గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల్లో వేల కోట్ల రూపాయలను దోచుకున్నప్పుడు, విజయవాడలో దేవాలయాలను కూల్చివేసినప్పుడు.. కన్నా ఏమైపోయారని మంత్రి ధ్వజమెత్తారు. బీజేపీని కన్నా తెలుగుదేశం జనతా పార్టీగా మార్చివేశారని.. దానికి అధ్యక్షుడిగా సుజనా చౌదరి పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, సుజనా చౌదరిల డైరెక్షన్లో ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో సదావర్తి భూములను దోచుకుంటే ఆయన ఎందుకు ప్రశ్నించ లేదన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో అమరావతి భూములను వెనక్కి తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు ఆ మేనిఫెస్టో కన్నాకు కనిపించడం లేదా అని విమర్శించారు. -
'40 ఇయర్స్ ఇండస్ట్రీ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం'
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 25 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీయే లక్ష్యంగా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. పేదలకు ఇళ్ళ స్ధలాల కేటాయింపులపై విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'జిల్లా వ్యాప్తంగా 4 వేల ఎకరాల భూములు సేకరించాం. విజయవాడలోని పేదలకు రాజధానిలో సెంటు భూమి ఇవ్వాలని నిర్ణయించాం. ఎస్సీల స్థలాలు లాక్కుంటున్నామని చంద్రబాబు అవాకులు చవాకులు పేలుస్తున్నారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొనే నువ్వు ప్రోత్సహించకపోయినా పర్లేదు కానీ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం. టీడీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. మీ ప్రభుత్వంలో గజం భూమి ఇవ్వలేని మీరు.. మేము సెంటు భూమి ఇస్తే మాపై విమర్శలా..? చదవండి: ‘ఆ ఖర్చుతో రాష్ణ ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు’ జక్కంపూడిలో ఇళ్లు ఇస్తామంటూ విజయవాడలోని పేదల వద్ద టీడీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారు. 5 వేల ఇళ్లుంటే 9 వేలకు పైగా ఇళ్లంటూ స్లిప్పులిచ్చి మోసం చేయడానికి సిగ్గులేదా..? పేదల రక్తంతో ఇల్లు కట్టి వారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. మా ప్రభుత్వంలొ పేదలకు ఇల్లిస్తే విమర్శలు చేస్తారా..? ఇళ్ల కోసం గత ప్రభుత్వానికి డబ్బులు కట్టిన వారికి మేం అన్యాయం చేయం. వారికి కూడా అన్ని విధాలుగా న్యాయం చేస్తాం. ఉగాది నాటికి 25 లక్షల మంది పేదలకు ఇల్లు ఇవ్వాలని జగన్ సంకల్పించారు. ప్రతిపక్షం ఎన్ని కుయుక్తులు పన్నినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని' మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో జక్కంపూడిలో 17వేల ఇళ్లు ఇస్తే జగన్ సీఎం అయ్యాక విజయవాడలో 80 వేల మందికి ఇళ్లు ఇవ్వడం శుభపరిణామం. టీడీపీ నేతలు విమర్శలు చేస్తుంటే మేము సహించం. పేదలకు ఇళ్లిస్తున్న ఘనత జగన్‌దే. ఓట్ల కోసమే గత ప్రభుత్వం ఇళ్ల పేరుతో నాటకాలాడి దోచుకుంది. మా ప్రభుత్వంలో వారికి న్యాయం చేస్తాం. అర్హులైన ప్రతిఒక్కరికి ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చదవండి: చంద్రబాబు ఇక నీ ఆటలు...మాటలు సాగవు -
‘టీడీపీ అలా కూడా విఫలం అయ్యింది!’
సాక్షి, విజయవాడ: తమ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించిన మంత్రి కోటీ నలభైలక్షల రూపాయతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో మూడు నియోజకవర్గాలలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చూట్టామని తెలిపారు. నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు నిధులను ఉదారంగా కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక టీడీపీ అయిదేళ్ల పాలనలో విజయవాడ నిర్లక్ష్యానికి గురైందని ఆయన మండిపడ్డారు. క్యాపిటల్ పేరుతో విజవాడకు వచ్చిన నగదును సైతం గత పాలకులు మళ్లించారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. అమరావతి అమరావతి.. అంటూ విజయవాడ అభివృద్ధిని ఆపేశారని, నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దకపోగా కేంద్రం ప్రకటించిన స్మార్ట్ నగరాల జాబితాలో సైతం చోటు కల్పించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 7 నెలలోనే నగరంలోని ప్రజల మౌళిక వపతులపై దృష్టి సారించామన్నారు. విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేస్తున్నామని, నగరంలోని మూడు నియోజకవర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు. -
ఎల్లో మీడియాకు ప్రభుత్వ పథకాలు కనిపించడం లేదు
-
రాష్ట్రంలో వైభవంగా రథసప్తమి వేడుకలు
తన కిరణాలతో లోకాలను తట్టిలేపే ప్రత్యక్ష దైవానికి పుట్టిన రోజు ఉత్సవం ఘనంగా మొదలైంది. శుక్రవారం అర్ధరాత్రి సప్తమి ఘడియల్లో కర్మసాక్షి అయిన శ్రీసూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్టుకు వేదమంత్రాల నడుమ అర్చక బృందం ఆధ్వర్యంలో పంచామృతాలతో అభిషేక స్నానాలు చేయించారు. ముల్లోకాలను వెలుగులతో నింపిన ఆదిత్యుడు నిశిరాత్రి వేళ తెల్లని పాలపొంగుల్లో దర్శనమిచ్చాడు. నల్లటి అరుణశిల కాస్తా.. శ్వేతవర్ణంలో మారిపోయి భక్తులకు కనువిందు చేశాడు. సాక్షి, అరసవల్లి: శ్రీకాకుళం అరసవిల్లి సూర్యదేవాలయం భక్తులు తో కిటకిటలాడుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన భక్తులు సూర్యజయంతి సందర్భంగా స్వామివారి నిజరూప దర్శనం చేసుకొని తరిస్తున్నారు. ఇంద్రపుష్కరణి వద్ద పాయసం వండి నైవేద్యాలు పెట్టి మొక్కుబడులు చెల్లిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవాలయ అధికార్లు పోలీస్, రెవిన్యూ, ఫైర్ సిబ్బంది సహకారం తీసుకున్నారు. అరసవల్లి సూర్యక్షేత్రం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. సూర్యజయంతి (రథసప్తమి) సందర్భంగా ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లిలో శ్రీసూర్యనారాయణస్వామి వారి జయంత్యుత్సవం... ఒకరోజు బ్రహ్మోత్సవంగా బ్రహ్మండమైన రీతిలో జరిగింది. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ ప్రాంగణమంతా ఆదిత్యుని నామస్మరణతో మార్మోగింది. శుక్రవారం అర్ధరాత్రి 12.15 గంటలకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆర్అండ్బి మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఉత్సవ అధికారి ఎన్.సుజాత, జిల్లా సహాయ కమిషనర్ వై.భద్రాజీ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు, ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్ తదితరులు స్వామి వారికి సంప్రదాయం ప్రకారం పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం స్థానిక అనివేటి మండపంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వ ర్యంలో మహా సంకల్పం జరిగింది. అనంతరం 12.30 గంటలకు తొలి అభిషేకాన్ని విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వా త్మానందేంద్ర సరస్వతి స్వామిజీ చేతుల మీదుగా జరిపించారు. గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టుపై పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం 12.45 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతిచ్చారు. అభిషేక సేవ శనివారం ఉదయం 8 గంటల వరకు జరిగింది. అనంతరం స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతా రాం సతీసమేతంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు. అలాగే శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్ జె.నివాస్ స్వామిని దర్శించుకున్నారు. పోటెత్తిన భక్తజనం రథసప్తమిని పురస్కరించుకుని సుదూర ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు శుక్రవారం రాత్రి సరికే అరసవల్లి చేరుకున్నారు. ఆలయ పరిసరాల్లో, ప్రధాన రోడ్డుపైన భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులు వచ్చి స్వామి క్షీరాభిõÙకం, నిజరూపాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు క్షీరాభిషేకం ప్రారంభమై.. శనివారం ఉదయం 8 గంటలకు ముగిసింది. తర్వాత నిజరూపంలో స్వామి దర్శనమిచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు, జిల్లా ఉన్నతాధికారులు, దాతల కుటుంబాలతోపాటు క్షీరాభిõÙక దర్శనం (రూ.500), ప్రత్యేక దర్శనం (రూ.100) క్యూలైన్లవారికి కూడా ఆలయ సింహద్వా రం (ఆర్చిగేట్) నుంచి ప్రవేశం కలి్పంచారు. అర్ధరాత్రి నుంచి పోలీసులు పూర్తి స్థాయి భద్రతావ్యవస్థను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలావుంటే స్థానిక డీసీఎంఎస్ గొడౌన్ నుంచి రూ.500, రూ.100 దర్శనాల క్యూలైన్లు ప్రారంభమయ్యాయి. అలాగే సా ధారణ దర్శనాల మార్గం కూడా ఇలాగే ప్రారంభమయ్యింది. అయితే ఈ లైన్ అసిరితల్లి అమ్మవారి ఆలయం పక్క నుంచి సాగింది. వాస్తవానికి శుక్రవారం రాత్రి నాటికే ఆలయ పరిసరాలకు చేరుకున్న గ్రామీణ ప్రాంత భక్తులు క్యూలైన్లలోనే ఉండి పోయారు. తొలి దర్శనాలకు వీలు కోసం అక్కడే అర్ధరాత్రి వరకు కాలం గడిపారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఈసారి సామాన్యుల దర్శనాలకు ప్రాధాన్యమిస్తూ జిల్లా కలెక్ట ర్ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయించా రు. దేవదాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల సంయుక్త పర్యవేక్షణ లో వీఐపీల దర్శనాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ప్రకా రం శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ పోలీసుల వలయంగా సింహద్వారం కని్పంచింది. దాతల కుటుంబసభ్యుల వాహనాలను అటు 80 ఫీట్ రోడ్డులోనే (అనుమతి పాస్ లేనివి) నిలిపివేయడంతో సుమారు కిలోమీటరు దూరం నుంచి నడిచి రావలసివచ్చింది. అలాగే సాధారణ దర్శనాలకు వెళ్లే వారు కూడా ఎక్కువ దూరమే నడిచేలాఏర్పాట్లున్నాయని జిల్లాకలెక్టర్ నివా స్ ఆదేశాల మేరకు ఆల య మండపాల్లో జిగ్‌జాగ్ లైన్లు కాకుండా నేరుగా ఒకే లైన్లో దర్శనాలకు అనుమతిచ్చారు. మినీ బ్రహ్మోత్సవం.. చూతము రారండి తిరుమల : వేంకటాదివాసుడు ఏడాది పొడవు నా 450కి పైగా ఉత్సవాలు, సేవల్లో పూజలందుకుంటూ భక్తులను కటాక్షిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఆయా మాసాల్లో నిరి్ధష్టంగా ఆచరిస్తున్న సేవలు, ఉత్సవాలూ నిర్విఘ్నంగా కొ నసాగుతున్నాయి. అర్ధంతరంగా ఆగిపోయిన కొన్ని సేవల్ని పునరుద్ధరించడం, మరికొన్నింటిని మార్పులు, చేర్పులు చేసి, టీటీడీ తిరుమలేశుని వైభవ ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటుతోంది. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే ఒక్కొక్క ఉత్సవంలో దివ్యతేజోమూర్తి వైభవం ఒక్కోలా గోచరిస్తుంది. ప్రతి ఉత్సవంలోనూ స్వామివారు నిత్యనూతనంగా భక్తకోటికి దర్శనమిస్తూ కటాక్షిస్తూ భక్తుల మది నిండా భక్తిపారవశ్యాన్ని నింపుతారు. విశేషమైన సేవలు, ఉత్సవాల్లో వేంకటేశుని దర్శిస్తూ భక్తులు దివ్యమైన అనుభూతిని పొందుతారు. ఇందులో రథసప్తమి కూడా అతిముఖ్యమైన ఉత్సవంగా చెప్పవచ్చు. దీన్నే మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తారు. శనివారం ఉదయం 5.30 గంటలకు వాహన సేవలు ప్రారంభమై రాత్రి 9 వరకు సేవలు జరుగుతాయి. ఏడువాహనాలపై మలయప్పస్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమివ్వనున్నారు. ఈ ఉత్సవానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. -
'ఉదయం షూటింగ్‌లు.. సాయంత్రం బాబుతో మీటింగ్‌లు'
సాక్షి, విజయవాడ : పవన్ కల్యాణ్ రాజకీయ స్థిరత్వం లేని వ్యక్తి అని, అతను మాట మీద నిలబడేవాడు కాదని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు.వెల్లంపల్లి శ్రీనివాస్ మున్సిపల్ అధికారులతో కలిసి బుధవారం విజయవాడలోని భవానీపురం 28వ డివిజన్లో పర్యటించారు.నగర అభివృద్ధే ద్యేయంగా రూ. కోటి 40 లక్షల రూపాయలతో బైపాస్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. వీలైనంత తొందరగా రోడ్డు,డ్రైనేజీలు పనులు పూర్తి చేస్తామని తెలిపారు.(టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం) ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ.. పవన్ వాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, అది నోరా లేక తాటిమట్టా అని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లోనూ ప్రజలు ఆయనను ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఉదయం సినిమా షూటింగ్లో పాల్గొని సాయంత్రం చంద్రబాబుతో మీటింగ్‌లు చేస్తున్నారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. బాబు డైరక్షన్లో బీజేపీ ముసుగులో పవన్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపాలని చూస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. అభివృద్ధిని ఆపాలని చూస్తే ఏపీలో ఎక్కడా తిరగలేవని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రజలే అతనికి సరైన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. (బాబుకు చిల్లర రాజకీయాలు అలవాటే: నాని) -
‘అమ్మ ఒడి చారిత్రాత్మక కార్యక్రమం’
సాక్షి, విజయవాడ : అమ్మఒడి పథకం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మానసపుత్రిక అని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో గురువారం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన 7 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. నాడు నేడు కార్యక్రమంతో అన్ని పాఠశాలలను అన్ని వసతులతో ఏడాది కాలంలో ఆధునీకరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని, నమోదు చేసుకున్న వారందరికీ పథకాన్ని వర్తించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదువుతో ఉన్నత స్థానాలకు చేరుకుని మంచి జీవితాన్ని జీవించవచ్చని అన్నారు. ఉగాది నాటికి అందరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని, అమ్మఒడి కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అమరావతి తప్ప ప్రజల సంక్షేమం పట్టదని మంత్రి విమర్శించారు. (జిల్లాలో ‘అమ్మ ఒడి’ ప్రారంభించిన మంత్రి) అమ్మఒడి పథకం అనేది జగనన్న నవరత్నాల్లో మొదటి రత్నమని మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థుల వరకు 15 వేల రూపాయలు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందని తెలిపారు. అర్భన్‌లో లక్ష 60 వేల మంది లబ్ది దారులున్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 95 కోట్ల నిధులు వారి ఖాతాల్లో వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలో ఈ తరహాలో ఇదే మొదటి కార్యక్రమని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 3 లక్షల 45 వేల మంది లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మఒడి పథకం సహా ఆరోగ్యశ్రీ వంటి మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారని ప్రశంసించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఈ పధకాలను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని కోరుతున్నామన్నారు. -
స్వాత్మానందేంద్ర స్వామి వారిని కలిసిన మంత్రి వెల్లంపల్లి
-
‘ఓ రోజు ప్రీపెయిడ్‌లా.. మరో రోజు పోస్ట్ పెయిడ్‌లా’
సాక్షి, అమరావతి : సినిమాల్లో కంటే రాజకీయాల్లో నటిస్తేనే ఎక్కువ డబ్బు వస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినట్టు కనిపిస్తోందని అనకాపల్లి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అమరావతిలో పవన్ కల్యాణ్ పర్యటన విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ అమరావతి పర్యటనపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడా అమరావతి నుంచి రాజధాని మారుస్తానని చెప్పలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని.. వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ను కూడా మేలు చేయాలనే సీఎం జగన్ ప్రతిపాదనలు చేశారని తెలిపారు. అమరావతి లో రైతులకు న్యాయం చేసే దిశలో చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్ చెప్పారని అన్నారు. ఓ రోజు ప్రీపెయిడ్‌లా.. మరో రోజు పోస్ట్ పెయిడ్ లా... ప్రశ్నిస్తామని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అంతకుముందు నూజివీడు గుంటూరులో రాజధాని పెడతానని చంద్రబాబునాయుడు చెప్పినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పెయిడ్ ఆర్టిస్టులు అని ఎవరు మాట్లాడలేదని, శేఖర్ చౌదరి అనే ఆర్టిస్ట్ తలపాగా పెట్టుకొని మాట్లాడటం వల్లే ఈ మాట వచ్చిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఒక రోజు ప్రీపెయిడ్.. మరోరోజు పోస్ట్ పెయిడ్ ఆర్టిస్టులా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అసలు ఈ రాజకీయాల్లో పవన్ ఎందుకు నటిస్తున్నారని ప్రశ్నించారు. అమరావతి రైతులను చంద్రబాబు నాయుడు అనవసరంగా రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ప్రాంతానికి నాయకుడా లేదా అన్ని ప్రాంతాలకు నాయకుడా సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. (‘చంద్రబాబు తీరు ఆచరిస్తే రాష్ట్ర ప్రగతి అధోగతి’) ఆయన గురించి మాట్లాడుకోవటం దండగా నిన్నటిదాకా సింగపూర్ లో షూటింగ్ చేసి.. ఇప్పుడు మంగళగిరిలో షూటింగ్ చేస్తున్నాడని పవన్ కల్యాణ్‌పై మంత్రి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు అయిదేళ్లు రైతులకు అన్యాయం జరిగితే పట్టించుకోని పవన్.. ఇప్పుడు సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి మాట్లాడుకోవటం దండగా అని ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వస్తుంటే.. తిక్కలొడి గురించి ఎందుకని ఎద్దేవా చేశారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కేవలం అమరావతి కూడా అభివృద్ధి చెందలేదని.. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
‘ఆ విషయం సీఎం జగన్ ముందే చెప్పారు’
సాక్షి, విజయవాడ : ఐదేళ్లు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క పర్మినెంట్ భవనం కట్టకుండా కాలయాపన చేసిన టీడీపీకి రాజధాని గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాజధాని పేరుతో గతంలో వేల కోట్ల ఈ టెండర్లు పిలిచి ఇప్పుడు లొల్లి చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రైతులను మోసం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారని, ఏ ప్రాంతానికి అన్యాయం చేయరని భరోసా ఇచ్చారు. దూరదృష్టితో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని సీఎం ప్రయత్నిస్తున్నారని మంత్రి తెలిపారు. 13 జిల్లాలతో కూడిన రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని వివరించారు. గురువారం విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘రాజధాని తీసుకుపోతారంటూ కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. అన్ని అద్దె భవనాలే ఇక్కడికి నుంచి ఏం తీసుకువెళతారు? పవన్ కల్యాణ్ కర్నూలు రాజధాని కావాలన్న మాటలు వాస్తవం కాదా?. బలవంతంగా రైతులు వద్ద లాక్కున్న భూముల ఇచ్చేస్తామని జగన్మోహన్రెడ్డి ఎన్నికల ముందే చెప్పారు. టీడీపీ నేతలు రైతుల ముసుగులో రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎదురు కోలేక బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అమరావతి అసలు రూపం సీఎం జగన్ ఆచరణలో చేసి చూపిస్తారు. కన్నా లక్ష్మీ నారాయణ మౌన దీక్ష చేస్తే బరువును తగ్గుతాడు అంతే అంతకు మించి ప్రయోజనం ఉండదు. ప్రత్యేక హోదా, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కన్నా దీక్షలు చేయాలి. గతంలో మోదీ తాట తీస్తానన్న చంద్రబాబు ఇప్పుడు కాళ్ళు పట్టుకునే స్థితికి వచ్చాడు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాము’ అని అన్నారు. -
‘భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దు’
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రికి ఈ ఏడాది సుమారు ఏడు లక్షలకుపైగా భవానీలు అమ్మవారి దర్శనార్థం వస్తారని అంచనా వేస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేశామని దేవాదయశాఖ మంత్రి వెల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఇంద్రకీలాద్రిపై భవనీదీక్షా విరమణల ఏర్పాట్లను ఆయన బుధవారం పర్యవేక్షించారు. అదేవిధంగా భవానీ భక్తుల ఏర్పాట్లపై రాజీపడొద్దని మంత్రి వెల్లపల్లి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. క్యూలైన్లతో పాటు గిరి ప్రదక్షణకు భవానీలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. గిరి ప్రదక్షణ సమయంలో భవానీలు ట్రాఫిక్‌లో ఇబ్బంది పడకుండా చూడాలిని ఆయన అధికారులను ఆదేశించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు వేగవంతంగా జరుగుతున్నందున వచ్చే ఏడాదికి ఆ సమస్య తీరుతుందని మంత్రి వెల్లపల్లి తెలిపారు. ప్రతి భవానీ భక్తుడు అమ్మవారిని దర్శించుకొని మాల విరమణ చేసే వరకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని మంత్రి వెల్లపల్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా హోమగుండాలు, గిరి ప్రదక్షణ ఏర్పాట్లు ఉన్నాయని భవానీ భక్తులను అడిగి తెలుసుకున్నారు. -
లోకేష్‌కు వెల్లంపల్లి సవాల్
-
లోకేష్‌కు వెల్లంపల్లి సవాల్
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తో రాజకీయం చేయడం టీడీపీకి అంత మంచిది కాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల కొండపైన శిలువ ఉందని టీడీపీ తప్పుడు ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరిగిందనేది అవాస్తవమని ఆయన తేల్చి చెప్పారు. తెలుగుదేశం, ఆ పార్టీ సోషల్ మీడియా నారా లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. కొండపై శిలువ ఉందని నిరూపిస్తే తను రాజీనామా చేస్తానని, లేనిపక్షంలో లోకేష్ రాజీనామా చేస్తారా అని సవాలు విసిరారు. తిరుమల వెంకటేశ్వరస్వామితో రాజకీయాలు చేయొద్దని టీడీపీకి హితవు పలికారు. ఇప్పటికే నాశనమయ్యారు.. తిరుమల వెంకన్న జోలికి వస్తే ఇంకా నాశనమైపోతారని వెల్లంపల్లి శ్రీనివాసరావు టీడీపీని దుయ్యబట్టారు. ‘తెలుగుదేశం హయాంలో కొండపై దళారీ వ్యవస్థ బలపడింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 70 మంది దళారీలు అరెస్ట్ అయ్యారు. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్‌పై ప్రశ్నలు అడిగి అన్యమతం గురించి సభలో ఎలా మాట్లాడతారు? శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేసిందే టీడీపీ. ఈ ట్రస్ట్ ద్వారా రూ.10 వేలు విరాళం ఇచ్చిన భక్తుడికి ఏడాదిలో ఒకసారి స్వామివారి దర్శనం కలుగజేస్తున్నాం. సాధారణ రోజుల్లో ప్రతిదినం 200 మందికి ఈ అవకాశం కల్పిస్తున్నాం. టీటీడీలో ఉన్న తొమ్మిది ట్రస్ట్‌ల్లో శ్రీవాణి ట్రస్టు ఒకటి. దీనికి వచ్చే విరాళాలతో ధర్మప్రచారం, ఆలయాల పునరుద్ధరణ, ధూపదీప నైవేద్యాలు, హిందూ ఆలయ పరిరక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం’ అని వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
-
సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
సాక్షి, విజయవాడ: మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ విజయవాడ 31వ డివిజన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనివిధంగా మహిళల భద్రత కోసం సీఎం వైఎస్ జగన్ దిశ యాక్ట్ తీసుకువచ్చారని, మహిళలకు అండగా నిలవాలన్న కృతనిశ్చయంతో ఆయన ఈ చట్టం తెచ్చారని కొనియాడారు. మహిళలపై వ్యక్తిగత దూషణలకు దిగినా, కించపరిచినా ఈ కఠిన చట్టం వర్తిస్తుందని తెలిపారు. దిశ తరహా ఘటనలు మన రాష్ట్రంలో జరగకుండా సీఎం వైఎస్ జగన్ ఈ చట్టం తీసుకువచ్చారని, దిశ ఘటన జరిగిన రాష్ట్రంలో సైతం ఈ చట్టం చేయడానికి ధైర్యం చేయలేదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ చట్టం తీసుకురావాలని ప్రధాన మత్రి నరేంద్రమోదీకి మహిళలు లేఖ రాశారని గుర్తుచేశారు. సీఎం జగన్ ముందుచూపుతో ఈ చట్టం తెచ్చారని, అర్ధరాత్రి సైతం మహిళలు రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉండేందుకు ఈ చట్టం ఉపకరిస్తుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు జగన్నకు జేజేలు కొడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఈ చట్టాన్ని స్వాగతించిన పరిస్థితి కనబడలేదని, సహకరిస్తానని చెప్తూనే ఆయన అనేక వంకలు పెట్టారని విమర్శించారు. తెలుగుదేశం నాయకులకు మహిళలు అంటే గౌరవం లేదన్నారు. కారు షెడ్డులో ఉండాలి మహిళలు వంటింట్లో ఉండాలి అన్న నాయకులు ఆ పార్టీ వారని గుర్తు చేశారు. టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్ సైతం గతంలో మహిళలు వేసుకునే దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఆడపిల్ల కనబడితే ముద్దు అయినా పెట్టాలి, లేదా కడుపు అయినా చేయాలి అన్న అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోని మహిళలందరూ జగన్న వైపు చూస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్య పోస్టులు పెట్టెవారికి సైతం కళ్లెం వేసేలా ఈ చట్టం తీసుకొచ్చామని, స్పెషల్ కోర్టుల ద్వారా 21 రోజుల్లో కేసు విచారణ పూర్తి చేసి దోషులను శిక్ష పడేలా ఈ చట్టం రూపుదిద్దుకోవడం శుభపరిణామం అని అన్నారు. అంతకుముందు విజయవాడ 31వ డివిజన్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. డివిజన్లో ప్రజా సమస్యలను అడిగితెలుసుకున్నారు. రెండున్నర కోట్ల రూపాయలతో 31వ డివిజన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. -
‘అసంఘటిత కార్మికులకు మంచి పథకం’
సాక్షి, విజయవాడ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికి మంచి చేయాలని భావిస్తాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆటోనగర్‌లోని ఆటో టెక్నిషియన్ అసోసియేషన్ హాలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కార్మిక శాఖ అధ్వర్యంలో నిర్వహించిన పింఛను వారోత్సవాల్లో మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు. ఆయన ప్రధానమంత్రి శ్రమ్ యోగిమాన్ ధన్, వర్తకులకు నూతన పింఛను పథకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి పెన్షన్ పథకంలోని అర్హులైన, నమోదు చేసుకున్న లబ్దిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు ఇది మంచి పథకమని తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వారు ఇందుకు అర్హులని చెప్పారు. నెలకు రూ. 55 నుంచి రూ. 250 వరకు వయసును బట్టి చెల్లిస్తామని వివరించారు. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3 వేలు పింఛను రూపంలో అందిస్తామని తెలిపారు. ప్రతి నెల ఇది కడితే కార్మికులకు భరోసా లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యువతను ప్రోత్సహించాలని 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం చేశారని వెల్లంపల్లి శ్రీనివాసరావు గుర్తు చేశారు. అసంఘటిత కార్మికులకు ఈ పింఛను పథకం ఓ వరమని కార్మికశాఖ కమిషనర్ రేఖారాణి పేర్కొన్నారు. చాలామంది ప్రభుత్వ పించనుపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. ప్రధానమంత్రి శ్రమ్ యోగిమాన్ ధన్ పింఛను పథకంలో కార్మికులు చేరటం అందరికీ మంచి సౌలభ్యమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కార్మికశాఖ కమిషనర్ రేఖారాణి, అధికారులు పాల్గొన్నారు. -
త్వరలోనే వైశ్య కార్పొరేషన్‌ను ప్రవేశ పెడతాం: మంత్రి
సాక్షి, పశ్చిమ గోదావరి: ద్వారకా తిరుమల ఆర్య వైశ్య కళ్యాణ మండపం ట్రస్ట్ వాసవి మాతకు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ పవర్ జనరేషన్ ప్లాంటును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే వైశ్య కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టనున్నారని ఆయన వెల్లడించారు. రాజధానిని గొప్పగా నిర్మించామని చెప్పుకునే చంద్రబాబు.. అక్కడి సచివాలయం, హైకోర్టులలో వర్షాలు పడితే నీరు వచ్చే పరిస్థితి ఉందని మంత్రి విమర్శించారు. అలాగే రాష్ట్ర విభజన అనంతరం అయిదేళ్లుగా గత ప్రభుత్వం పోట్టి శ్రీరాములు జయంతిని నిర్విర్యం చేశారని మంత్రి ధ్వజమెత్తారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం ద్వారా క్రిష్టియానిటి వస్తుందంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, తిరుపతి కొండపై శిలువ ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఇంటిలో పని చేసే పిల్లలను సైతం ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియానని సీఎం జగన్ ప్రవేశపెడుతున్నారని తెలిపారు. కులం, పార్టీ, మతాలకు అతీతంగా పాలన చేయాలంటూ సీఎం జగన్ ఎమ్మెల్యేలకు, అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇక ఆర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు అమలు అవుతాయని మంత్రి పేర్కొన్నారు. -
బాబూ.. రాజధానిలో ఏం చూడటానికొస్తావ్?
సాక్షి ప్రతినిధి విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజధానిలో ఏం చూడటానికి వస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విజయనగరంలో మంగళవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి బొత్స మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో చంద్రబాబు వల్ల ఏర్పడ్డ లోటును మరో ఇరవై ఏళ్లలో కూడా తీర్చలేమని అన్నారు. ఏ రకంగా దోచుకుందామనే రీతిలో ఆయన పాలన సాగించారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చేశారని మండిపడ్డారు. రాజధానిని పవిత్ర దేవాలయం అంటున్న ఆయన ఐదేళ్లలో ఏం చేశారని నిలదీశారు. రాజధానిని నిర్మించుకోవాలనే ధ్యాస లేదా అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాజధానిలో ఏ సంపద సృష్టించారో చెప్పాలన్నారు. సింగపూర్ కన్సార్టియంతో తాను అనేకసార్లు చర్చలు జరిపానని, దానితో జరిగిన ఒప్పందమే లోపభూయిష్టమని చెప్పారు. ఇరువురి అంగీకారం మేరకే సింగపూర్ కన్సార్టియం తప్పుకుందని వివరించారు. గత ప్రభుత్వంలా ప్రజాధనాన్ని దుబారా చేయొద్దని సీఎం వైఎస్ జగన్ సూచించారన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్నారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల్లో ఉన్నామనిపించుకోవడానికే లోకేశ్ ట్విట్టర్లో ఏదో ఒకటి పెడుతున్నారనీ, అవి చూస్తే నవ్వొస్తోందన్నారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి సీఎం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. -
‘ఆయనకు అభివృద్ధి మింగుడు పడటం లేదు’
సాక్షి, విజయవాడ : అవినీతి రాజకీయాలు మానాలని ప్రజలు బుద్ధిచెప్పినా చంద్రబాబుకు జ్ఞానోదయం కాలేదని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఐదేళ్ళ పాలనలో అరచేతిలో వైకుంఠం చూపించిన బాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. సోమవారం విజయవాడ 33వ డివిజన్లో ఇంటింటికీ పర్యటించిన మంత్రి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారని తెలిపారు. అలాగే అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడ సిటీని మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు వైఎస్ జగన్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నగరంలో డ్రైనేజీ, రోడ్డు మార్గాలు అస్తవ్యస్తంగా మారాయని.. రోజుల వ్యవధిలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని పేర్కొన్నారు. వార్డు వాలంటీర్ల ద్వారా రేషన్, ఫించన్లు, ఇళ్ల పట్టాలు వంటి పథకాలు సక్రమంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నీతిలేని రాజకీయాలు చేసే చంద్రబాబుకు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం మింగుడు పడటం లేదని విమర్శించారు. ప్రజల్లో సీఎం జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి ఓర్వలేక బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. -
మీరు 40 ఏళ్లలో ఇలాంటి పనులు చేశారా?
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇతర రాష్ట్రాలలో సైతం ఆరోగ్యశ్రీని అమలు చేసేలా చర్యలు చేపట్టారని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 51 మంది లబ్ధిదారులకు ఈ చెక్కులు అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీని ప్రవేశ పెట్టారని ప్రస్తావించారు. గత పాలనలో చంద్రబాబు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి అందులో కొన్ని వ్యాధులను తొలగించారని విమర్శించారు. సీఎం జగన్.. తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తాము పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మద్యపానం నుంచి ఆదాయం పోతున్నా.. ముఖ్యమంత్రి దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వైఎస్ జగన్ పాలన చేపట్టి అయిదు నెలలు కాకముందే ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ అర్థం లేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల చరిత్రలో చంద్రబాబు చేయలేని పనిని సీఎం జగన్మోహన్రెడ్డి నాలుగు నెలల్లో చేసి చూపారని, చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పథకాలు ప్రవేశ పెట్టరా అని ప్రశ్నించారు. సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడమే కాకుండా లబ్ధిదారులకు అందేలా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా చర్యలు చేపట్టామని వివరించారు. రానున్న ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు అందిస్తామని, జనవరి నుంచి అమ్మఒడి పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. -
‘కంచే చేను మేసిందన్నట్లుగా వ్యవహరించారు’
సాక్షి, కృష్ణా : అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో గత టీడీపీ ప్రభుత్వం కంచే చేను మేసిన విధంగా వ్యవహరించిందని రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని దుయ్యబట్టారు. జడ్పీ కన్వెన్షన్ సెంటర్లో మంత్రి నాని గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. కష్టపడి సంపాధించుకున్న జీతాన్ని అగ్రిగోల్డ్‌లో దాచుకుంటే సదరు సంస్థ డిపాజిట్‌దారుల నుంచి కచ్చుటోపి పెట్టిందని, బాధితుల పక్షాన నిలబడి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించిందని మంత్రి మండిపడ్డారు. నాడు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు వెళ్లారని, నేడు ఇచ్చిన మాట ప్రకారం రూ. 10,000లు చొప్పున డిపాజిట్ చేసిన ప్రతి ఒక్క బాధితుడికి పరిహారం అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు కూడా గడవకమందే ఇచ్చిన మాట ప్రకారం డిపాజిట్ మొత్తాలను అందజేస్తున్నామని మంత్రి పేర్నినాని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత ఎస్పీ రవీంద్రనాథ్ బాబు పాల్గొన్నారు. -
‘ఇక్కడికి రావడం చాలా గర్వంగా ఉంది’
సాక్షి, కృష్ణా: విజయవాడలోని కేబీఎన్ (కాకరపర్తి భావనారాయణ) కళాశాల 50వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలకు రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. కేబీఎన్ కళాశాల ఎంతో మంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుతోందని పేర్కొన్నారు. ‘ఉన్నతమైన మౌలిక సదుపాయాల ద్వారా మంచి విద్యను అందిస్తోంది. రానున్న రోజుల్లో మన దేశం విద్యకు కేంద్ర బిందువుగా మారనుంది. ఇండియా ఇతర దేశాలకు మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తులను అందిస్తోంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సిద్ధంచేయడం అవసరం’ అని అన్నారు. ఇంకా వారు మాట్లాడుతూ జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య విజయవాడ వాస్తవ్యులు కావడం గర్వకారణమన్నారు. జాతిపిత గాంధీజీ ఐదుసార్లు విజయవాడను సందర్శించారని తెలిపారు. అదేవిధంగా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని విఙ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాలుష్యం కారణంగా.. ఎంతో మంది దేశ రాజధాని ఢిల్లీని వదిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి’
సాక్షి, తిరువనంతపురం : అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సూచించారు. శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేరళ సీఎం ఆహ్వానం మేరకు ఈ రోజు(మంగళవారం) ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవదాయశాఖ మంత్రులతో జరిగే ఈ సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతినిధిగా వెళ్లారు. ఈ సమావేశంలో కేరళ సీఎం, దేవాదాయ మంత్రికి ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రి వెల్లంపల్లి కొన్ని అంశాలు ప్రతిపాదించారు. అవి.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాముల కోసం కేరళ ప్రభుత్వాన్ని శబరిమలైలో కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి స్థలం కేటాయించమని కోరినట్లు ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర పోలీసులు, అధికారులతో కలిసి నీలకంఠ, పంబ బేస్ క్యాంపు వద్ద శబరిమల సమాచార వ్యవస్థతోపాటు తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కోరారు. పంబ మార్గంలో ప్రయాణించే బస్సు బోర్డులను తెలుగు భాషలో ఏర్పాటు చేయాలని సూచించారు. అయ్యప్ప భక్తులకు నీలకంఠ, పంబ సన్నిధి వద్ద తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, అల్పాహార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలని కోరారు. వీటిపై కేరళ సీఎం స్పందిస్తూ ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట ప్రభుత్వాల హెల్ప్ డెస్క్‌లకు అనుసంధానిస్తూ కేరళలో సెంట్రల్ హెల్ప్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి ఐదు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని కోరినట్లు తెలిపారు. స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల ప్రతినిధులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కనకదుర్గ అమ్మవారి ప్రసాదము అందజేసి వారిని సన్మానించారు. అనంతరం పద్మనాభ స్వామిని మంత్రి దర్శించుకొని ఆశీర్వాదములు తీసుకున్నారు. -
‘బాబు కూల్చివేసిన దేవాలయాలను నిర్మిస్తాం’
సాక్షి, విజయవాడ : దేవాలయాల దీప దూపా నైవేద్యాల కోసం నిధులు కేటాయిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. శుక్రవారం దేవాదాయ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ, దేవావలయాల అభివృద్ధిపై చర్చించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. దేవాదాయశాఖలో ఖాళీలు అన్ని భర్తీ చేస్తామని, అర్చకులకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అదే విధంగా ప్రతి భక్తుడికి దేవాలయాలు అందుబాటులో ఉండేలా చేస్తామని, సూరయ్యపాలెంలో సుమారు 10 ఎకరాల భూమిని టీడీపీ ఇష్టం వచ్చిన వారికి దరాదత్తం చేశారని మండిపడ్డారు. ఆ భూములపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారని, వాటిపై విచారణ జరిపిస్తామని అన్నారు. చంద్రబాబు హయాంలో తన బినామీలకు ఇష్టానుసారంగా భూములు కేటాయించారని, ప్రస్తతం ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబుకు దేవుళ్లంటే భయం లేదని, బాబు కూల్చి వేసిన దేవాలయాలను త్వరలోనే నిర్మిస్తామని పేర్కొన్నారు. -
కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం..
సాక్షి, విజయవాడ : పోలీసులు సమాజాన్ని కాపాడుతూ.. శాంతి భద్రతలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. రక్తదాన శిబిరంలో సీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల సంక్షేమం కోసం తొలిసారిగా వారాంతపు సెలవును ప్రకటించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన నక్సల్స్ దాడుల్లో అనేకమంది పోలీసు వీరులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 600 మది అధికారులు, పోలీసులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం శుభపరిణామమన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వారోత్సవాల కార్యక్రమాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు చక్కగా ప్రణాళికా చేసుకుంటూ నిర్వహిస్తున్నారని అభినందించారు. దసరా ఉత్సవాలు విజయవంతం కావడంలో పోలీసు శాఖ ముఖ్యపాత్ర పోషించిందని, వారి కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే శాఖ పోలీసు శాఖ అని గుర్తు చేశారు. నగర సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. ఆక్టోబర్ 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసు శాఖ ఉపయోగించే ఆయుధాల గురించి తెలియజేసినట్లు, పోలీసుశాఖపై ఉన్న అపోహలను పొగొట్టాలన్నదే తమ లక్ష్యని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా కళాళాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. -
సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి శిక్షణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు సోమవారం శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఎటువంటి సిఫారసులు లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం వైసీపీకి మాత్రమే సాధ్యమయ్యిందన్నారు. నైపుణ్యం ఉన్న వాళ్లే సచివాలయ వ్యవస్థకు అవసరం అని నమ్మి పరీక్షల ద్వారా ఉద్యోగులను నియమించామని తెలిపారు. కష్టపడి చదువుకున్న వాళ్ళే ఎదుటి వారి కష్టాలు తీర్చగలరన్నారు. వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎంతో ఓర్పు ఉండాలని సూచించారు. వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగాలన్నారు. ప్రస్తుతం తాత్కాలికమే అయినా, రెండు సంవత్సరాలకు సచివాలయాల ఉద్యోగాలు పర్మినెంటు అవుతాయని తెలిపారు. ఇకపై జనాలు రాష్ట్ర సెక్రటేరియట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఐదు బ్యాచ్‌లుగా ట్రైనింగ్: మల్లాది విష్ణు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఐదు బ్యాచ్‌లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. బ్యాచ్‌కు రెండు వందల నుంచి నాలుగు వందల మంది ఉంటారన్నారు. వివిధ శాఖల నుంచి రిటైర్డ్ కమిషనర్లను, మెప్మా పీడీలను ట్రైనర్లుగా నియమించామని తెలిపారు. కార్పొరేషన్ల జోనల్ కమిషనర్లను పీడీలుగా ఏర్పాటు చేశామన్నారు. సచివాలయ బాధ్యతలను వార్డు సెక్రెటరీలు అందరూ తెలుసుకోవాలన్నారు. సచివాలయ వ్యవస్థను గ్రామాలకు, పట్టణాలలోని వార్డులకు తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో నిర్ణయించారన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన సచివాలయాలలో సెక్రెటరీలుగా అందరూ బాధ్యతగా పని చేయాలని కోరారు. -
‘చంద్రబాబు నికృష్ట చర్యలు మానుకోవాలి’
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయాన్ని ఆటో డ్రైవర్లు సద్వివినియోగం చేసుకోవాలని మంత్రి కురసాల కన్నబాబు సూచించారు. ప్రమాదాల వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడుతున్నాయని... రహదారి ప్రమాదాలను తగ్గించాల్సిన బాధ్యత ఆటోవాలాలపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సాయం చేస్తున్నందున ఆటోవాలాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటోవాలాలకు రూ. 10వేల చొప్పున మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, సామినేని ఉదయభాను, మల్లాది విష్ణు, అనిల్ కుమార్, జగన్మోహన్రావు.. కలెక్టర్ ఇంతియాజ్ ఆహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంతి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ మాట తప్పకుండా మడిమ తిప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే త్వరలోనే అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. పిల్లల్ని బడికి పంపితే వారి తల్లికి రూ. 15వేలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. నాలుగు నెలల్లో సంక్షేమ పథకాలను అమలు చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అన్నారు. రజకులకు, నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు ఏటా రూ. 10వేలు ఆర్థికసాయం త్వరలో అందిస్తామని పేర్కొన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 4 నెలలోనే సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రారంభించారని, ప్రతి ఇంటా చిరునవ్వులు ఉండాలన్న ఆకాంక్షతో వైఎస్సార్ వాహనమిత్ర ప్రారంభించామని అన్నారు. అలాగే ఆటోడ్రైవర్లంతా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదు ఆటో కార్మికులు ప్రమాదాల శాతం తగ్గించి.. చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. కులం, మతం రంగు చూడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. లక్ష ముఫ్పై వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎందే అన్నారు. దీనిపై టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న నికృష్ట చర్యలు మానుకోవాలని ఆయన అన్నారు. ఇక ఎమ్మెల్యే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. తండ్రి ఆశయాల సాధన కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందే అన్ని వర్గాల కష్టాన్ని చూశారని, పది సంవత్సరాల పోరాటం ఈరోజు కోసమే అన్నారు. సీఎం పాదయాత్రలో అన్ని వర్గాల జీవన విధానాన్ని తెలుసుకున్నారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నతీరు చూసి టీడీపీ నేతలు ఓర్వలేక ముఠా నాయకులుగా మారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్మికులు, రైతుల కష్టాలు తెలుసుకున్న నేత సీఎం జగన్ అని.. కృష్ణాజిల్లాలో 20 వేల కుటుంబాలలో ఆయన ఆనందం నింపారన్నారు. ఈ మాసం అంతా కార్మిక మాసం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1 లక్ష 75 వేల కార్మికుల కుటుంబాలలో సీఎం వెలుగులు నింపారని, అక్టోబర్ మాసం అంతా కార్మిక మాసంగా మార్చారని అన్నారు. రైతులకు మేలు చేకూర్చే రైతు భరోసా సైతం అక్టోబర్‌లోనే అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు పేద ప్రజలను పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ నవరత్నాల ద్వారా కార్మికులకు, మహిళలకు, యువకులకు పెద్ద పీట వేశారన్నారు. తెలంగాణ వైపు వెళ్లే వాహనదారుల నుంచి ట్యాక్స్ రూ. 2 వేలు వసూలు చేస్తున్నారని దానిపై చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. సీఎం లబ్దిదారుల కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని అక్టోబర్ నెలాఖరు వరకు పొడగించారని.. ఆటో, టాక్సీ కార్మికులందరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సామినేని ఉదయ్‌భాను మాట్లాడుతూ.. నేడు వాహన మిత్ర కార్యక్రమానికి నాంది పలకడంతో రాష్ట్ర చరిత్రలో ఓ సువర్ణ ఆధ్యాయం ప్రారంభమైదని అన్నారు. ఆటో కార్మికుల కష్టాలను సీఎం జగన్ పాదయాత్రలో తెలుసుకుని ఇచ్చిన హామీలను నిలుపుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 4 నెలలోనే 4 లక్షల ఉద్యోగాల కల్పన చరిత్రలో నిలుస్తుందని పేర్కొన్నారు. -
టీడీపీ గెలిచిన స్థానాల్లోనూ అభివృద్ధి: మంత్రి
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన 151 స్థానాల్లోనే గాకుండా.. టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కాకముందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకర్గంలోని 11వ డివిజన్లోని వార్డు సచివాలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 285 సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెక్రటేరియట్‌కు ఎన్నికైన అభ్యర్థులపై గురుతర బాధ్యతను ఉంచారని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు వారి పార్టీ అధికారంలో లేని ఎమ్మెల్యే నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని.. జలు పచ్చ చొక్కా వేస్తేనే అభివృద్ధి.. అన్నట్లుగా ఆయన పనిచేశారని విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలో కష్టపడుతుంది బొప్పన భవకుమార్ అయితే... కొబ్బరికాయ కొట్టేది మాత్రం టీడీపీకి చెందిన గద్దె రామ్మెహన్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి బొప్పన భవకుమార్, నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గాంధీజీ 150వ జయంతి స్పూర్తితో ముఖ్యమంత్రి సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సీఎం జగన్ పాలనలో సచివాలయ వ్యవస్థ ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. గతంలో జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేనే పని జరిగేదని విమర్శించారు. అవినీతి, లంచాలు లేకుండా ప్రజలకు సచివాలయాలు సేవలందిస్తాయని తెలిపారు. నాలుగు వేల మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయగా ఇవి ప్రజలకు జవాబుదారీగా ఉంటాయన్నారు. ఇక బొప్పన భవకుమార్ మాట్లాడుతూ పాదయాత్రలో జగన్మోహన్రెడ్డి ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రీయింబర్స్మెంట్ ఇచ్చి చదువు చెప్పించారని, ప్రస్తుతం ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి ఉపాధి కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. -
జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి
సాక్షి, సూర్యారావుపేట: సామాజిక మార్పు కోసం ఎంతో కృషి చేసిన మహాకవి జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మహాకవి గుర్రం జాషువా 124వ జయంతిని పురస్కరించుకుని బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతి వేదిక, తెలుగు షార్ట్‌ఫిలిం అసోసియేషన్,సుమదుర కళానికేతన్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజలు పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి షార్ట్ ఫిలింపోటీల విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్స్‌కు జాషువా సాంస్కృతిక వేదిక మంచి అవకాశం కల్పి స్తుందన్నారు. సినీ దర్శకుడు రేలంగి నరసిం హారావు మాట్లాడుతూ షార్ట్ ఫిలిమ్ తీస్తున్న యువత అభ్యుదయ భావాలతో ఎంతో ముం దున్నారని తెలిపారు. తెలుగు వారి మేధస్సును అమెరికా లాంటి విదేశాలు ఎక్కువగా విని యోగించుకుంటున్నాయని పేర్కొన్నారు. అమరావతి బాలోత్సవం కమిటీ గౌరవాధ్యక్షుడు చలవాది మల్లిఖార్జునరావు, సుమదుర కళానికేతన్ కార్యదర్శి పి.విజయకుమార్ శర్మ, షార్ట్ ఫిలిమ్ అసోషియేషన్ కార్యదర్శి డి.వి. రాజు తదితరుల ప్రసంగించారు. అనంతరం ఉత్తమ చిత్రాలకు మంత్రి చేతుల మీదుగా నగదు బహుమతి,మెమోంటో, ప్రశం సా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గుండు నారాయణరావు,ప్రసాద్,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ చిత్రాలు మొదటి ఉత్తమ చిత్రంగా పద్మాలయ ప్రొడక్షన్ వారి ఆడపిల్ల నిలిచింది. 2వ ఉత్తమ చిత్రం మాతృదేవో భవ, 3వ ఉత్తమ చిత్రం కోయిలమ్మ పిల్లలు నిలిచాయి. వీరికి నగదు నగదు బహుమతితో పాటు జాపిక, సర్టిఫికేట్లను అందజేశారు. పోటీలో పాల్గొన్న ఫిలిమ్ మేకర్స్‌కు జ్ఞాపిక,ప్రశంసాపత్రం అందించారు. ఆదర్శనీయం.. జాషువా జీవితం గాంధీనగర్: నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా జీవితం నుంచి నేటి యువత ఎంతో నేర్చుకోవాల్సి ఉందని సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు తానేటి వనిత అన్నారు. శుక్రవారం హోటల్ ఐలాపురంలో డ్రీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ, సామాజిక సాధికారత కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గుర్రం జాషువా 125వ జయంతి వేడుకలు జరిగాయి. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఆధునిక కవులలో గుర్రం జాషువాను మించిన వారులేరన్నారు. విజయవాడ రూరల్ ఎంఈవో ఆదూరి వెంకటరత్నం జాషువా రచించిన పద్యాలను ఆలపించారు. డ్రీమ్ స్వచ్చంద సేవా సంస్థ చైర్మన్ మేదర సురేష్‌కుమార్ అధ్యక్షతన జరిగిన వేడుకల్లో సినీ రాజకీయ విమర్శకుడు కత్తి మహేష్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ కొలకలూరి ఇనాక్, వైఎస్సార్సీపీ నాయకులు కాలే పుల్లారావు, సిరిపురపు గ్రిటన్, జాషువా మునిమనువడు పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు దసరా నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం
సాక్షి, తాడేపల్లి: ఇంద్రకీలాద్రిపై ఎంతో వైభవంగా నిర్వహించే దసరా నవరాత్రుల ఉత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇటీవల వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆహ్వాన పత్రిక ఆవిష్కరిచిన సంగతి విధితమే. -
29 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
వన్‌టౌన్ (విజయవాడ పశి్చమ): బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి దసరా మహోత్సవాలు ఈ నెల 29 నుంచి అక్టోబర్ 8 వరకూ ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే దసరా ఉత్సవాల ఆహ్వానపత్రికను మంత్రి విజయవాడలోని తన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అమ్మవారు 29న శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా, 30న శ్రీ బాలత్రిపురసుందరీదేవి, అక్టోబర్ 1న శ్రీగాయిత్రీదేవి, 2న శ్రీఅన్నపూర్ణాదేవి, 3న శ్రీలలితాత్రిపురసుందరీదేవి, 4న శ్రీమహాలక్ష్మీదేవి, 5న శ్రీసరస్వతీదేవి, 6న శ్రీ దుర్గాదేవి, 7న శ్రీ మహిషాసురమరి్ధనీదేవి, ఎనిమిదిన శ్రీరాజరాజేశ్వరీదేవిగా దర్శనమివ్వనున్నట్లు చెప్పారు. 8న అమ్మవారికి కృష్ణానదిలో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. ఐదో తేదీన మూలన్రక్షతం రోజున అమ్మవారికి సీఎం వైఎస్ జగన్ పట్టు వ్రస్తాలు సమరి్పస్తారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. భక్తులకు త్వరగా దర్శనమయ్యేలా చక్కని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఎంవీ సురేశ్‌బాబు, ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమేశ్, ఆలయ ప్రధాన అర్చకులు లింగం¿ొట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు రంఘవఝుల శ్రీనివాసశాస్త్రి పాల్గొన్నారు. -
సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సాక్షి, విజయవాడ: జిల్లాలో పశ్చిమ నియోజకవర్గంలోని వన్‌టౌన్ ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా ప్రారంభించారు. సోమవారం నాటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, వివిధ డివిజన్ల కార్పొరేటర్ ఆర్ఆర్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాన్వెంట్ రోడ్డులోని సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వెల్లంపల్లి నియోజకవర్గంలో కోటి పైచిలుకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం సంతోషదాయకమని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పనులను ప్రక్షాళన చేస్తామని వ్యాఖ్యానించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని వెల్లడించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన వందరోజుల్లోనే నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని సంతోషం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఇంటి పక్కన సైతం రోడ్డు వేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో డ్రైనేజీ, తాగునీరు సమస్యలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విషయంలో గత ప్రభుత్వం ఎజెండా వేరని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే పనిచేసిందని ఎమ్మెల్యే ఇక్బాల్ విమర్శించారు. గణాంకాలలో లేని అభివృద్ధిని చూపించారని, ఒక వర్గానికి మాత్రమే పెద్దపీట వేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలను విస్మరించారు కాబట్టే ఎన్నికల్లో ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని అభిప్రాయపడ్డారు. -
పవన్‌పై మంత్రి అవంతి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, విశాఖ : జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడవద్దని హితవు పలికారు. మంత్రి అవంతి శ్రీనివాస్ శనివారమిక్కడ మాట్లాడుతూ.. ‘పవన్ మీరంటే గౌరవం ఉంది. దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దు. మీరు టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదవి వినిపించారు. మీరు నవరత్నాలకు అనుకూలమో, వ్యతిరేకమో ముందు స్పష్టం చేయాలి. అమరావతి, పోలవరంలో అవినీతి జరిగిందని చెప్పాం. మీరు దానికి అనుకూలమా, వ్యతిరేకమో చెప్పాలి. అయిదేళ్లలో మద్యపాన నిషేధాన్ని తప్పనిసరిగా అమలు చేస్తాం. గతంలో మీరు మంగళగిరిలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ను ఏమని విమర్శించారో మరిచిపోయారా?. గతంలో ఎన్నడూ లేనివిధంగా దళితులు, ఎస్టీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం వైఫల్యమా?. మూడు నెలల్లోనే మేము ఇచ్చిన నాలుగు లక్షల ఉద్యోగాలకు మీరు వ్యతిరేకమా?. కొత్తగా పెట్టబోయే పరిశ్రమలలో 75 శాతం స్థానికులకు ఇవ్వాలని మా నిర్ణయంపై మీ జనసేన అనుకులమా, వ్యతిరేకమా?. టీడీపీ ట్రాప్‌లో పడొద్దు. మీకు ఓటేసిన గాజువాక ప్రజలని ఎన్నికల తర్వాత వచ్చి ఒక్కసారి అయినా కలిశారా?. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేరుస్తున్నాం. వందకోట్లకు పైబడిన ప్రతి కాంట్రాక్ట్ జ్యుడిషియరీ పర్యవేక్షణ ఉండాలన్న మా ప్రతిపాదనకు మీరు అనుకులమా, వ్యతిరేకమా?. మూస ధోరణి రాజకీయ నాయకులులాగా మీరు మాట్లాడితే మీకే విలువ తగ్గుతుంది.’ అని హితవు పలికారు. పవన్‌కి పిచ్చి పీక్స్‌కు చేరినట్టుంది.. పవన్ కల్యాణ్‌పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. పవన్ పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరిందంటూ మండిపడ్డారు. వైసీపీ వంద రోజుల పాలన చూస్తుంటే పారదర్శకత, దార్శనికత లోపించినట్లు కనిపిస్తోందని పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శనివారం మంత్రి వెలంపల్లి విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘ చంద్రబాబు మాటలు పవన్ కల్యాన్ నోట్లో నుంచి వస్తున్నాయి. జననేతగా ఎదుగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై బురద చల్లడం ఆకాశంపై ఉమ్మేయటమే అవుతుంది. టీడీపీతో లోపాయికారీ ఒప్పందం గుర్తించిన జనం పవన్‌ని రెండుచోట్ల ఓడించారు. ఎన్నికల్లో జనం తిరస్కరించినా బుద్ధి రాలేదు. వందరోజుల్లో ఎనభై శాతం పథకాలు అమలు చేయడం తప్పా?. వెనుకబడిన వర్గాలని ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు యాభైశాతం రిజర్వేషన్ కల్పించడం తప్పా?. ఉగాదికి ఇరవై అయిదు లక్షల మంది పేదలకు గూడు కల్పించాలనుకోవడం సీఎం జగన్ చేసిన తప్పా?. పవన్ కల్యాణ్ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’ అంటూ సూచించారు. చదవండి: ‘రియల్ హీరోను చూసి..సినీ హీరో ఓర్వలేకపోతున్నారు’ -
వెల్లంపల్లి కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ
-
చంద్రబాబు భజనలో ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, తిరుమల: తిరుమలలో బస్ టిక్కెట్లపై అన్యమత ప్రచార ఉదంతంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రెస్ నోట్ వెలువరించారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ వస్తోన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించామని తెలిపారు. టిక్కెట్ల టెండర్ టీడీపీ హయాంలోనే ఖరారైనట్లు తెలిసిందన్నారు. చంద్రబాబు పేరుతో పథకాలను ప్రచారం చేసేందుకు ఈ కాంట్రాక్టు ఇచ్చారని తెలిపారు. 2018 లోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 60 వేల టిమ్ పేపర్లపై మైనారిటీ సంక్షేమ శాఖ ప్రకటనలు వేయాలని మార్వెన్ క్రియేటివ్ సర్వీసెస్‌కు కాంట్రాక్టు ఇచ్చిందని వెల్లంపల్లి తెలిపారు. టిమ్ పేపర్లపై చంద్రబాబు పేరుతో పథకాల ప్రచారం చేశారని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు పూర్తవుతున్నా ఏపీఎస్ ఆర్టీసీ చంద్రబాబు భజన మానలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక నెల్లూరు డిపోలో ఉండాల్సిన టికెట్లు నిబంధనలకు విరుద్ధంగా తిరుమల డిపోకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారని తెలిపారు. ఇందుకు బాధ్యులైన అధికారులు, సంస్థలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆపాదిస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని టీవీ ఛానెళ్లు కూడా ఈ వ్యవహారాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తూ.. శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపరిచి.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర పన్నుతున్నాయని మండి పడ్డారు. సదరు వ్యక్తులు, మీడియా సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 40 దేవాలయాలను కూలగొట్టించినది, సదావర్తి భూములు కాజేసినది, కనకదుర్గమ్మ గుడిలో, కాళహస్తిలో క్షుద్ర పూజలు చేయించినది.. అమ్మవారి భూముల్ని తన వారికి లీజులు ఇచ్చినది తెలుగు దేశం ప్రభుత్వమే అన్నారు. హిందుత్వం మీద చంద్రబాబు చేయని అరాచకాలున్నాయా అని వెల్లంపల్లి ప్రశ్నించారు. తిరుపతిలో కిరీటాల దొంగతనం మొదలు.. శ్రీవారి బంగారాన్ని లారీల్లో తరలించడం వరకు అన్ని దుర్మార్గాలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబేనని ఆరోపించారు. కాబట్టే బాబు ఆ దేవదేవుడి ఆగ్రహానికి గురయ్యారని విమర్శించారు. ఇంతా జరిగినా చంద్రబాబుకు బుద్ధి, జ్ఞానం రాలేదని అర్థమవుతోందంటూ ఎద్దేవా చేశారు. మతాలన్నీ అక్కున చేర్చుకున్నందువల్లే జగన్ సీఎం అయ్యారు.. మతాలన్ని ఛీకొట్టబట్టే చంద్రబాబు అందరికి దూరమయ్యారని స్పష్టం చేశారు. -
‘శ్రీశైలం దేవస్థానం దుకాణాల వేలం రద్దు’
సాక్షి, అమరావతి : శ్రీశైలం దేవస్థానం ముందు దుకాణాల వేలం రద్దు చేయాలని దేవదాయ కమీషనర్ కు ఆదేశాలు జారీ చేశామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఇటీవల లలితాంబిక వాణిజ్య సముదాయంలోని దుకాణాలకు వేలం జరగగా ఈ వేలంలో దుకాణాదారులు, పాటదారులకు మధ్య వివాదం తలెత్తింది. కాగా ఈ అంశంపై మంత్రి మాట్లాడుతూ దీనిపై నిర్ణయం తీసుకున్నామని పూర్తి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని, అవినీతిని ఉపేక్షించే ప్రశ్నేలేదని మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం దేవస్థానం పరిరక్షణ కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. దీనిపై సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై పూర్తి వివరాలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. శ్రీశైలం దేవస్థానం పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వెల్లడించారు. దేవాలయాల్లో రాజకీయాలకు తావులేదని చెప్పారు శ్రీశైలం ఈవో బదిలీ.. ఇదిలా ఉండగా శ్రీశైలం ఆలయ ఈవోను బదిలీ చేస్తూ తక్షణం బాధ్యతల నుంచి రిలీవ్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతన ఈవోగా కెఎస్ రామారావు నియమితులయ్యారు. ఈవో శ్రీరామచంద్ర మూర్తి ని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని పేర్కొంది. -
‘ముప్పు ఉంటుందని సీఎం జగన్ ముందే చెప్పారు’
సాక్షి, విజయవాడ : పులిచింతల నుంచి వరద కొనసాగుతుండటంతో ప్రకాశం బ్యారేజీవైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. 4.47 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రులు కురసాల కన్నబాబు ,వెల్లంపల్లి శ్రీనివాస్ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ ,జేసీ మాధవీ లత వరద పరిస్థితుల్ని వారికి వివరించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళతో ఉన్నాయని కన్నబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘కృష్ణా, గోదావరినదులు ఉప్పొంగడంతో వరదలు పోటెత్తుతున్నాయి. 4.47లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజి నుంచి కిందకు విడుదల చేస్తున్నారు. నాగాయలంక, కంచికచర్ల, భవానీపురం ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించాం. నిబంధనల పేరుతో కాలయాపన చేయకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మునిగిపోయిన తర్వాత సహాయక కార్యక్రమాలు చేసే ప్రభుత్వం కాదిది. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, ఇతర సదుపాయాలు కల్పించాం. దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు స్నానానికి నదిలో దిగొద్దు. ముందస్తుగా గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం’అన్నారు. మంచి చెప్పినా రాజకీయమన్నారు.. ప్రకాశం బ్యారేజీ 70గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పదేళ్ల తర్వాత అన్ని డ్యామ్‌లు నిండుకుండలా మారాయని ఆనందం వ్యక్తం చేశారు. వరద బాధితులకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘మాజీ సీఎం చంద్రబాబు నది ఒడ్డున నివసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటికి నీటి వరద వచ్చింది. చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారు. వరద వస్తే నదీ పరివాహక ప్రాంతంలో ముప్పు వస్తుందని సీఎం జగన్ ముందే చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి చెప్పినా రాజకీయ కోణంలోనే చూశారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజకీయ జోక్యం, లాబీయింగులు ఉండవు : మంత్రి
సాక్షి, విజయవాడ : తన రాజకీయ జీవితంలో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు చూడలేదని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా 4 లక్షల 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం లో వార్డు వలంటీర్ల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బొత్స మాట్లాడుతూ... తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వారి కష్టాలను దూరం చేసేందుకు వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతోనే గ్రామ సచివాలయాలు, వలంటీర్లు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్లేందుకు గ్రామ వలంటీర్లు వ్యవస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాలల్లో ఎలాంటి రాజకీయ జోక్యం, లాబీయింగులు ఉండవని స్పష్టం చేశారు. పరీక్ష నిర్వహించి ప్రతిభావంతుల్ని ఆ పోస్టుల్లో భర్తీ చేస్తున్నామన్నారు. పరిపాలనా విధానంలో భాగంగానే ఈ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. గ్రామ వలంటీర్లు చిత్త శుద్ధితో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చారిత్రాత్మక నిర్ణయాలతో.. రాష్ట్రం ప్రగతి పథంలో..
సాక్షి, ఒంగోలు మెట్రో: దేవదాయ, ధర్మాదాయ శాఖ ప్రతిష్టను పెంచుతామని, అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఒంగోలు వచ్చిన మంత్రి పలు ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ క్రమంలో సాయంత్రం ఏడు గంటలకు ఒంగోలు కొండ మీద శ్రీ ప్రసన్న చెన్నకేశవాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవాలయాల్లో పవిత్రతను కాపాడుతామని అన్నారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన చేయటానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి కోరిన విధంగా దేవుడు సహకరించాలని విన్నవించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 100 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించామన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో రూ.230 కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ఆస్తులు పరిరక్షించటానికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతామన్నారు. ప్రగతి పథంలో రాష్ట్రం.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దశల వారీగా చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో పయనింపజేస్తున్నారని మంత్రి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేయటం ఈ ప్రభుత్వ గొప్పతనం అని మంత్రి పేర్కొన్నారు. మరో పది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్చక సంక్షేమ సంఘ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని, అర్చకుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా చర్యలు చేపడుతామన్నారు. అదేవిధంగా ఆలయాలలో నిత్య ధూప దీప నైవేధ్యాలకు నిధులు మంజూరు చేశామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అర్చకులకు సొంత గృహాల కల నెరవేర్చేందుకు కృషి చేయటం పట్ల రాష్ట్రవ్యాప్తంగా అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అనంతరం ఆయన త్రోవగుంటలోని శివాలయం, వైష్ణవాలను సందర్శించారు. ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు పరాంకుశం రామనాథాచార్యులు, ఆలయ అధికారులు మంత్రిని సత్కరించి ఆశీర్వచనాలు చేశారు. కాగా మంత్రి వెంట ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆర్య వైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, సూపర్‌బజార్ మాజీ తాతా ప్రసాద్‌లతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు ఉన్నారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ చంద్రశేఖరరెడ్డి, సహాయ కమిషనర్ డి.సుబ్బారావు, ఇవో కట్టా ప్రసాద్, ఒంగోలు ఆర్డీవో పి.కిషోర్, తహసీల్దార్ చిరంజీవి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. మంత్రిని కలిసిన అర్చక సంక్షేమ సంఘం ప్రతినిధులు.. ఒంగోలు శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి దర్శనం సందర్భంగా దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావును జిల్లా అర్చక సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి పలు సమస్యలు విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా ధార్మిక పరిషత్తును పునః ప్రారంభించాలని ఈ సందర్భంగా వారు విన్నవించారు. అదేవిధంగా దేవదాయ శాఖ చట్టం 144 ప్రకారం ప్రతి ఆలయానికి వొనగూరవలసిన ప్రయోజనాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని, జీవో నెంబర్ 76 ఫైనల్ నోటిఫికేషన్ వెలువరించాలని వారు విన్నవించారు. మంత్రిని కలిసిన వారిలో అర్చక సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సోమరాజుపల్లి నాగేశ్వరరావు, ఎంవీ శేషాచార్యులు తదితరులు ఉన్నారు. మంత్రి వెలంపల్లి పర్యటన ఇలా.. ఒంగోలు సిటీ: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం కూడా జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఒంగోలులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నగర శివారు త్రోవగుంటకు వెళ్లారు. రాత్రికి అక్కడే బస చేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు లాయరుపేటలోని సాయిబాబా మందిరం సందర్శిస్తారు. బాబా పూజలో పాల్గొంటారు. 8.30 గంటలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ రంగుతోటలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొంటారు. 9.30 గంటలకు చీమకుర్తి వెళ్తారు. 10.30 గంటలకు చీమకుర్తి రీచ్ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య ప్రముఖుల ఆధ్వర్యంలో జరిగే పౌర సన్మానంలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు చీమకుర్తి నుంచి బయల్దేరి ఒంగోలు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుపతి వెళ్తారు. రాత్రికి తిరుపతిలో బస చేస్తారు. -
‘సదావర్తి’పై విజిలెన్స్ విచారణ
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో సదావర్తి భూముల భూబాగోతంపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మంగళవారం అసెంబ్లీలో ప్రకటించారు. ఒక సీనియర్ అధికారితో విచారణ జరిపించి ఈ బండారం బట్టబయలు చేస్తామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. విచారణ నివేదికను 3 నెలల్లో సభలో ఉంచుతామన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తేలేదన్నారు. అంతకుముందు.. ఆర్కే మాట్లాడుతూ, సదావర్తి భూముల వేలం వ్యవహారంలో గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాలను వివరించారు. పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం 1885లో రాజా వెంకటాద్రినాయుడు చెన్నైలో 471 ఎకరాల భూమిని కేటాయించారని, అప్పటి నుంచి ఆదాయం వస్తోందన్నారు. కాలక్రమంలో చెన్నైలోని ఆ భూమి అన్యాక్రాంతమై చివరికి 83.11 ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు. ఈ మొత్తం భూమిని తన అనుయాయులకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుయుక్తులు పన్నిందని వివరించారు. ఎవరికీ తెలీకుండా ఉండేందుకు చెన్నైలోని రెండు పత్రికలలో కనీకనబడనట్టుగా ఈ–టెండర్ల ప్రకటన ఇస్తే అందులో చంద్రబాబు మనుషులు వెళ్లి వేలంలో పాల్గొన్నారన్నారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. అలాగే, 83.11 ఎకరాల సదావర్తి భూములను రూ.22 కోట్లకు కట్టబెట్టడాన్ని తాము కోర్టులో సవాల్ చేస్తే మరో 5 కోట్లు ఎక్కువ ఇచ్చి తమనే తీసుకోమన్నారన్నారు. కాగా, తాను రూ.27.5 కోట్లు కడితే తనపై ఐటీ దాడులు చేయిస్తామని చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ బెదిరించారన్నారు. ఈ నేపథ్యంలో సదావర్తి సత్రం భూముల వేలం వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి అంగీకరించారు. ఆ భూమిని ఎలా వేలం వేయాలనుకున్నారు? చంద్రబాబు మాట్లాడుతూ.. విచారణను స్వాగతిస్తున్నామంటూనే ఆర్కే తదితరుల తీరువల్ల ప్రభుత్వానికి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం పోయిందన్నారు. ఆ భూములకు టైటిల్ డీడ్, పట్టాలులేవని, తమిళనాడు ప్రభుత్వం కూడా ఆ భూమి తమదే అంటున్నదని చంద్రబాబు చెప్పినప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి జోక్యం చేసుకుని అటువంటి భూమిని (టైటిల్ డీడ్స్, పట్టాలు లేని) వేలంవేసి ఒక ప్రభుత్వం మోసం చేయవచ్చా? అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, చంద్రబాబు మధ్య సరదా సంభాషణ నడిచింది. డాక్టర్ వైఎస్సార్‌కు ఇచ్చిన హామీవల్లే కియా మోటార్స్ వచ్చిందని బుగ్గన చెప్పిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. దీన్ని బుగ్గన దీటుగా తిప్పికొట్టారు. కాగా, సదావర్తి సత్రం భూములపై అసెంబ్లీలో చర్చ జరిగిన తీరును చూస్తే ప్రభుత్వం ఆక్రమణలో ఉన్న ఆలయాల భూములను కాపాడుతుందన్న విశ్వాసం పెరుగుతోందని ఓ ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య పేర్కొంది. -
ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి పండుగ శోభను తరించుకుంది. జగతిని కాచే తల్లి మహోత్సవానికి వేళయింది. ఆదివారం నుంచి శాకంబరి ఉత్సవాలు ప్రారంభం కావడంతో దుర్గగుడి కళకళలాడుతోంది. కూరగాయలు.. ఆకుకూరలు.. ఫలాలతో దుర్గమ్మ సర్వాంగసుందరంగా అలలారుతోంది. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పవిత్ర సారెను సమర్పించేందుకు తెలంగాణతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు పోటెత్తారు. ప్రతి ఏడాదిలాగానే తెలంగాణ నుంచి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు సుమారు 200మందితో వివిధ రకాల విన్యాసాలు చేస్తూ దుర్గమ్మకు బోనం సమర్పించేందుకు వచ్చినవారికి దేవాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్ స్వాగతం పలికారు. అంతకు ముందు బ్రాహ్మణవీధిలోని జమ్మిచెట్టు నుంచి బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. మేళతాళాలు, మంగలవాద్యాల నడుమ ఊరేగింపు అమ్మవారి ఆలయానికి చేరింది. మూడు రోజుల పాటు జరిగే శాకంబరి ఉత్సవాల్లో తొలిరోజు అమ్మవారి అలంకరణకు ఆకుకూరలు వినియోగించారు. రెండోరోజు పండ్లు, కాయలు, ఫలాలతో అలంకరిస్తారు. మూడోరోజు అయిన మంగళవారం బాదం. జీడిపప్పు, కిస్మిస్, లవంగాలు, యాలకులు, ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలకరించనున్నారు. ఆదివారం ఉదయం ప్రారంభం అయిన ఈ ఉత్సవాలు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తాయి. కాగా మంగళవారం చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి దర్శానాన్ని నిలిపివేస్తారు. కాయగూరలతో కదంబం ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఇక మూడురోజులు కూడా భక్తులు అమ్మవారికి కొబ్బరికాయ, పూలకు బదులుగా కూరగాయలు, ఆకుకూరలను దండగలుగా కూర్చి అమ్మకు కానుకగా సమర్పిస్తారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
దేవాలయాల్లో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు
విశాఖపట్నం : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సింహగిరిపై రూ. 25 - 30 కోట్ల రూపాయల వరకూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి భక్తుడికి వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పంచగ్రామాల భూసమస్యల కోసం ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రత్యేక కమిటీ వేసి బాధితులకు న్యాయం జరిగిలే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇక మీదట దేవాలయంలో ఇటువంటి అవినీతి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. దైవ భక్తి, ఆలయ అభివృద్ధికోసం పాటు పడే వారిని ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిపారు. -
త్వరలోనే వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తాం
సాక్షి, విజయవాడ : విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం రామలింగేశ్వర నగర్ స్క్రూబ్రిడ్జి వద్ద వంగవీటి మోహనరంగా ఉద్యానవనాన్ని, విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం పార్కును తొలగించే ప్రయత్నం చేసిందన్నారు. ఇప్పుడు మరలా పార్కును ప్రారంభించి.. మోహన రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేద ప్రజల కోసం రంగా చేసిన పోరాటాలు తమకు స్ఫూర్తిగా నిలిచాయన్నారు. ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పించిన వంగవీటి మోహనరంగా అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో టీడీపీ ప్రభుత్వం తొలగించిన వైఎస్సార్ విగ్రహాన్ని తర్వలోనే పునః ప్రతిష్ట చేస్తామని తెలిపారు. విజయవాడ నగరానికి తలమానికంగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ఆయన పేర్కొన్నారు. -
వీఎంసీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా వెల్లంపల్లి, మల్లాది విష్ణు
సాక్షి,విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థకు రావాల్సిన నిధుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా రోడ్లపై పూడికలు అలాగే వదిలేయడంతో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. వెంటనే వీఎంసీ అధికారులు డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించారు. వచ్చే ఉగాది వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టి అర్హులైన వారికి పట్టాలు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. -
ఇక రాజన్న రాజ్యం
-
టీడీపీ నాయకుల వీరంగం
సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థానిక క్రాంబ్వే రోడ్‌లోని సర్ ఆర్థర్ కాటన్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేశారు. అందులో ఏర్పాటు చేసిన బూత్‌లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్ సరళిని బట్టి వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ నాయకులు రీపోలింగ్ చేయించేందుకు కుట్రపన్నారు. అందులో భాగంగా పశ్చిమ టీడీపీ అభ్యర్థిని షబానా ఖాతూన్‌ను వారు సాయంత్రం అక్కడికి పిలిపించారు. అయితే ఆమె వచ్చేసరికి 6 గంటలు దాటటంతో గేటు వేసేశారు. దీంతో ఆమెను లోపలికి పంపించాలని టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. సమయం మించిపోయింది.. పై అధికారులు అనుమతిస్తే పంపిస్తామని పోలీసులు చెప్పారు. కొందరు చోటా నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షబానాతోపాటు పెద్ద ఎత్తున వచ్చిన స్థానిక నాయకులను చూసి వైఎస్సార్ సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ పశ్చిమ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న వెలంపల్లి సమన్వయం పాటించాలని అక్కడున్న పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో వారు అక్కడే ఉన్నారు. షబానాను లోపలికి అనుమతిస్తే తమ అభ్యర్థి వెలంపల్లిని కూడా అనుమతించాలని పోలీసులను కోరారు. ఈ విషయమై పోలీసులు పై అధికారులపై సంప్రదింపులు జరుపుతున్నారు. పట్టాభి రాకతో పెరిగిన ఉద్రిక్తత ఈ క్రమంలో టీడీపీ అర్బన్ ప్రధాన కార్యదర్శి పట్టాభి అక్కడికి చేరుకుని పోలింగ్ స్టేషన్లో ఉన్న పీఓలతో గొడవకు దిగారు. 26వ నంబర్ బూత్‌లో 10 వరకు అవకాశం ఇచ్చినప్పుడు అభ్యర్థిని లోపలకు ఎందుకు అనుమతించరంటూ పీఓలతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు మొత్తం గేటు దగ్గరకు చేరుకుని హడావుడి చేశారు. దీంతో మండిపడ్డ వైఎస్సార్ సీపీ నాయకులు నినాదాలు చేయటంతో పోలీసులు వారు ముందుకు రాకుండా రోప్‌ను అడ్డంగా పెట్టారు. టీడీపీ నాయకులను గేటు దగ్గర నుంచి బయటకు పంపి వారిని కూడా రోప్‌తో అడ్డగించాలని నినాదాలు చేశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ 27వ డివిజన్ అధ్యక్షుడు చిన సుబ్బయ్య వెలంపల్లిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగాడు. వైఎస్సార్ సీపీ నాయకులు చిన సుబ్బయ్యపై ధ్వజమెత్తుతూ రోప్‌ను తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీలు ఝుళించి అందరినీ చెల్లాచెదురు చేశారు. తరువాత షబానా తరుఫున ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన అన్పారీ అభ్యర్థులిద్దరినీ లోపలికి అనుమతిస్తే ఏ గొడవ ఉండదని చెప్పటంతో పోలీసులు వెలంపల్లిని పిలిచారు. చివరికి ఇరు పార్టీల తరుపున ఒకొక్కరిని గేటు బయట ఉండి 26వ నంబర్ బూత్‌లో ఓటేసేందుకు వచ్చినవారని లోపలకు పంపించేందుకు ఏర్పాటు చేయటంతో గొడవ సద్దుమణిగింది. -
వాణిజ్య వర్గాల ఖిల్లా ..విజయవాడ పశ్చిమ
సాక్షి, విజయవాడ పశ్చిమ : విజయవాడ పశ్చిమ నియోజకరవర్గం వ్యాపార, వాణిజ్య రాజధాని. ఉమ్మడి రాష్ట్రంలో తొలినాటి నుంచి వ్యాపార రాజధానిగా పేరుగాంచిన విజయవాడ నగరంలో అత్యధిక వ్యాపారం ఈ నియోజక వర్గంలోనే జరుగుతుంది. అంతేకాదు రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఈ నియోజకవర్గంలోనే కొలువై ఉంది. అలాగే కృష్ణానది నుంచి తూర్పుకృష్ణకు వెళ్లే సాగునీరు ఈ నియోజకవర్గం నుంచి కదులుతుంది. ప్రకాశం బ్యారేజీ కృష్ణాజిల్లా పరిధిలోకి వచ్చే ప్రాంతం ఈ నియోజకవర్గంలోనే ఉంది. పర్యాటక విషయంలోనూ.. పర్యాటకానికి వస్తే కృష్ణానది మధ్యలో విస్తరించి ఉన్న భవానీ ద్వీపానికి ఈ నియోజకవర్గం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. అలాగే దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చిన మహాత్మాగాంధీ స్మారకార్ధం ఏర్పాటు చేసిన గాంధీహిల్ ఈ నియోజకవర్గంలో దర్శనమిస్తుంది. దేశంలోనే పెద్ద రైల్వేస్టేషన్లలో ఒకటిగా పిలిచే విజయవాడ రైల్వేస్టేషన్ కూడా ఈ నియోజకవర్గంలోనే కనిపిస్తుంది. మూడోవంతు డివిజన్లు... విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలోని మూడో వంతు డివిజన్లు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నగరపాలకసంస్థ పరిధిలోని 25 నుంచి 41వ డివిజన్ వరకూ, అలాగే 48 నుంచి 50వ డివిజన్ వరకూ మొత్తం 20 డివిజన్లు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. తూర్పు రైల్వేలైన్, సెంట్రల్ నియోజకవర్గం, దక్షిణం కృష్ణానది, పడమర, ఉత్తర దిక్కుల్లో మైలవరం నియోజకవర్గం హద్దులుగా ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారులు ఇక్కడి నుంచే వెళ్తాయి. నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు 1953లో మొదటి సారిగి తమ్మిన పోతరాజు కాంగ్రెస్ అభ్యర్ధి మరుపిళ్ల చిట్టిపై గెలుపొందారు. 1958లో మరుపిళ్ల చిట్టి సీపీఐ అభ్యర్ధి తమ్మిన పోతరాజుపై గెలుపొందారు. 1962లో తమ్మిన పోతరాజు మరుపిళ్ల చిట్టిపై గెలిచారు. 1967లో మరుపిళ్ల చిట్టి తమ్మిన పోతరాజుపై గెలుపొందారు. 1972 కాంగ్రెస్ నేత ఆసిఫ్‌పాషా తమ్మిన పోతరాజుపై గెలిచారు. 1978లో పోతిన చిన్నా జెఎన్‌పీ అభ్యర్ధి ఇంతియాజుద్దీన్పై గెలిచారు. 1983 టీడీపీ అభ్యర్ధి బీఎస్ జయరాజు స్థానిక సీపీఐ అభ్యర్ధి ఉప్పలపాటి రామచంద్రరాజుపై గెలిపొందారు. 1985లో ఉప్పలపాటి రామచంద్రరాజు కాంగ్రెస్ అభ్యర్థ్ధి ఎంకేబేగ్పై గెలిచారు. 1989లో ఎంకేబేగ్ సీపీఐ అభ్యర్ధి కే.చంద్రశేఖరరావుపై గెలిచారు. 1994లో సీపీఐ అభ్యర్ధి కే.సుబ్బరాజు ఎంకే బేగ్‌పై గెలిచారు. 1999లో కాంగ్రెస్ అభ్యర్ధి జలీల్‌ఖాన్ టీడీపీ అభ్యర్ధి నాగుల్‌మీరాపై గెలిచారు. 2004లో సీపీఐ అభ్యర్ధి షేక్ నాసర్‌వలీ టీడీపీ అభ్యర్ధి ఎంకేబేగ్పై గెలిచారు. 2009లో వెలంపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ అభ్యర్ధిని మల్లికాబేగంపై గెలిచారు. 2014లో వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా జలీల్‌ఖాన్ బీజేపీ పక్షాన పోటీ చేసిన వెలంపల్లి శ్రీనివాసరావుపై గెలుపొందారు. ఆధ్యాత్మికంగానూ... ఈ నియోజకవర్గం ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. ఒకవైపు కొండపైన కొలువై ఉన్న కనకదుర్గమ్మతో పాటుగా కొండ దిగువన ధర్మరాజు ప్రతిష్టితమైన మల్లేశ్వరస్వామి (పాతశివాలయం), అర్జునుడు ప్రతిష్ట చేసిన విజయేశ్వరస్వామి దేవస్థానాలు ఉన్నాయి. అలాగే 1200 సంవత్సరాల క్రితం కొలువైన వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం కూడా పాతబస్తీలో కొలువై ఉంది. వాటితో పాటుగా స్వాతంత్య్రం రాక ముందే బ్రిటీష్ పాలకుల కాలంలో ఏర్పడిన ఆర్సీఎం, సీఎస్ఐ, తెలుగు బాప్టిస్ట్ సెంటినరీ చర్చిలు ఉన్నాయి. 500 సంవత్సరాల క్రితం ఏర్పడిన మసీదులు,120 ఏళ్ల క్రితమే ఇక్కడ జైన ఆలయం కొలువై ఉన్నాయి. మినీ భారత్ పశ్చిమ నియోజకవర్గం మినీ భారతదేశంగా పలువురు పిలుస్తారు. ఈ నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం మనకు దర్శనమిస్తారు. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్నాటక, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన ప్రజానీకం అధిక సంఖ్యలో ఇక్కడ కొన్ని దశాబ్దాల క్రితమే నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా స్థానిక ప్రజలతో మమేకమై జీవిస్తున్నారు. అన్ని మతాలకు చెందిన ఆలయాలు ఈ ఒక్క నియోజకవర్గంలోనే మనకు దర్శనమిస్తాయి. టీడీపీ గెలిచింది ఒక్కసారే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ గెలిచింది ఒకసారి మాత్రమే. అది కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో ఆయన గాలిలో జరిగిన తొలి ఎన్నికల్లో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ కాంగ్రెస్, సీపీఐల మధ్యనే ఎక్కువ పోటీ కొనసాగింది. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆరు సార్లు, సీపీఐ ఐదుసార్లు గెలిచింది. అదేవిధంగా వైఎస్సార్సీపీ టీడీపీ, పీఆర్పీ, ఒక్కొక్కసారి గెలిచారు. పశ్చిమ నియోజకవర్గం జనాభా : 4,25,002 మొత్తం ఓటర్లు : 2,16,711 పురుషులు : 1,07,563 మహిళలు : 1,09,129 ఇతరులు : 19 -
‘యాత్ర’ చంద్రబాబుకు చూపించాలి’
-
చంద్రబాబుకు ‘యాత్ర’ చూపించాలి
సాక్షి, విజయవాడ : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైఎస్సార్ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు చక్కగా చూపించారని చెప్పారు. యువరాజ్ థియేటర్లో సినిమా చూసిన అనంతరం మాల్లాది విష్ణుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజశేఖరరెడ్డి పాదయాత్ర విశేషాలను ప్రత్యేకంగా చూపించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలుగు ప్రజలంతా తప్పక చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే చంద్రబాబుకు ఈ సినిమా చూపించాలని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని.. అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కారం కోసం అనుదినం పనిచేసిన మహానేత వైఎస్సార్ మార్గంలో మేమంతా పనిచేస్తాం’ అని మల్లాది విష్ణు అన్నారు. -
‘హామీల అమలులో బాబు విఫలం’
విజయవాడ: గత ఎన్నికల సమయంలో ప్రజలకు 600 హామీలిచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్ల కాలంలో వాటిని అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు తీవ్రంగా విమర్శించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో వెల్లంపల్లి, మల్లాది విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా 15 ఏళ్లు కావాలని అడిగి దానిని మళ్లీ నీరుగార్చారని బాబుపై మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు నిజాయతీగా ఉద్యమించింది వైఎస్ జగన్ మాత్రమేనని అభిప్రాయపడ్డారు. యూటర్న్ బాబు అంటే చంద్రబాబేనని ఎద్దేవా చేశారు. రుణాలు మాఫీ చేస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు మోసగించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చి వైఎస్ హయాంలో కట్టిన ఇళ్లనే చూపిస్తూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ జరగలేదని తెలిపారు. జన్మభూమి కార్యక్రమం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు అడిగే హక్కే లేదని తీవ్రంగా మండిపడ్డారు. -
‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే పవన్ లక్ష్యం’
విజయవాడ: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వెల్లంపల్లి విలేకరులతో మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ అధికార పార్టీపై పోరాటం చేయాలి కానీ ప్రతిపక్షంపై కాదని హితవు పలికారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. మీ(పవన్) అన్న చిరంజీవి పీఆర్పీని వదిలేస్తే మీరు ఎందుకు నడపలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. పవన్ మీ లాలూచీ అందరికీ అర్ధమవుతోందని అన్నారు. కేజీ బేసిన్ గురించి విజయమ్మ వేసిన పిటిషన్లో ప్రస్తావించారని, కానీ ఆ విషయం పవన్‌కి ఇప్పటికి తెలియడం వింతగా ఉందన్నారు. కేజీ బేసిన్ విషయమై వైఎస్ జగన్ అనేకసార్లు పోరాటం చేశారని గుర్తు చేశారు. కేజీ బేసిన్ గురించి చంద్రబాబుతో పవన్ కలిసున్నంత కాలం ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో జగన్ సమైక్యాంధ్ర సభ పెట్టినపుడు పవన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. పవన్ నిజాలు మాట్లాడటం కంటే రాజకీయాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పుడూ పారిపోయే వ్యక్తి కాదని, పోరాడేతత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. పవన్ ఒక్కసారైనా ఎమ్మెల్యేల కొనుగోలు తప్పు అని మాట్లాడారా అని సూటిగా అడిగారు. పవన్ మీది ప్రశ్నించే పార్టీ అంటారు..మరి నాలుగేళ్లు సైలెంట్‌గా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు మాట, పవన్ నోట అన్న విధంగా పరిస్థితి తయారైందని మండిపడ్డారు. -
స్వరాజ్య మైదానం ప్రజల ఆస్తి
-
టీడీపీ అక్రమాలపై జగన్ పోరాటం అద్భుతం
13న వైఎస్సార్సీపీలో చేరుతున్నా: వెల్లంపల్లి విజయవాడ(వన్‌టౌన్): రాష్ట్రంలో బీజేపీని తెలుగుదేశం పార్టీ శాసిస్తోందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. బీజేపీ నేతగా కొనసాగుతున్న వెల్లంపల్లి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 13న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ప్రతిపక్షనేతగా జగన్ టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలపై అద్భుతమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలో తాను ముందుకు సాగుతానని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ అవినీతి పాలనపై స్పందిస్తే బీజేపీ అధిష్టానం వారికి సస్పెండ్ చేస్తోందని.. మరోవైపు ప్రధాని మోదీని టీడీపీ నేతలు బొండా ఉమా తుగ్లక్ అన్నా, నన్నపనేని రాజకుమారి, ముద్దుకృష్ణమనాయుడు, రాయపాటి వంటి నేతలు ఎంత దారుణంగా విమర్శించినా బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పందించటం లేదన్నారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన జలీల్ఖాన్ను చంద్రబాబు అనైతికంగా పార్టీలోకి చేర్చుకున్నారన్నారు. జలీల్‌కు దమ్ముంటే రాజీనామా చేసి పోటీ చేయాలన్నారు. -
జిల్లాల్లో చిరం‘జీవం’ ఎక్కడ?
సొంత వర్గం కనుమరుగు నమ్ముకున్నవారు నష్టపోయారు నమ్మినవారు వదిలిపెట్టారు సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ అయిన చిరంజీవికి జిల్లాలో సొంత వర్గం లేకుండా పోయింది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ నుంచి యలమంచిలి రవి, వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనంతో యలమంచలి రవికి మంత్రిపదవి వస్తుందన్న ప్రచారం సాగింది. అయితే ఆయనకు ఆ పదివి దక్కకపోగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూతో కష్టాలు తప్పలేదు. ప్రతి విషయంలోనూ పార్టీలో నెహ్రూ మాట చెల్లబడి అయ్యింది. ఆఖరికి డివిజన్ అధ్యక్షుల ఎంపిక, మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ రవికి మొండిచెయ్యి దక్కింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. విజయవాడ పశ్చిమం నుంచి ఎన్నికైన వెల్లంపల్లిది భిన్నమైన కధ. ఆయన ఏం చేసినా చిరంజీవి చూసీ చూడనట్లు వదిలేశారు. దుర్గగుడిపై పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులొచ్చినా పల్లెత్తు మాట అనలేదు. పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతున్నా సీటు ఇప్పించారు. తీరా సీటు వచ్చిన 24 గంటల్లోపే వెల్లంపల్లి తనదారి చూసుకున్నారు. తిరువూరులో కాంగ్రెస్ సీటు ఆశించి అది దక్కకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన నంబూరి శ్రీనివాసరావు చిరంజీవిపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనకు సీటు ఇప్పిస్తానని చెప్పి రెండున్నర ఎకరాల పొలాన్ని బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, 2014లో కూడా సీటు ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆరోపించారు. వంగవీటి రాధాకృష్ణ ప్రజారాజ్యాన్ని పార్టీని కాంగ్రెస్‌లో కలిపివేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఆయన కాంగ్రెస్‌లో కలవకుండా ఉండిపోయారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరారు. మచిలీపట్నం నుంచి పోటీ చేసిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా వైఎస్సార్ సీపీలో, 2009లో గుడివాడ నుంచి పోటీ చేసిన రావి వెంకటేశ్వరరావు తెలుగుదేశంలో చేరిపోగా, కైకలూరులో కామినేని శ్రీనివాస్ బీజెపీ తీర్థం పుచ్చుకుని అభ్యర్థిగా బరిలోకి దిగారు. జిల్లాలో ఏ నాయకుడు కూడా చిరంజీవిని నమ్ముకునే సాహ సం చేయకపోవడం తగ్గిపోయిన ఆయన ప్రాభవానికి అద్దం పడుతోంది. -
నాలుగైదుసార్లు అడిగే టికెటిచ్చాం: రఘువీరా
వెల్లంపల్లి స్థానంలో మరొకరిని ఎంపికచేస్తాం: రఘువీరా సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అని నాలుగైదుసార్లు అడిగిన తర్వాతే వెల్లంపల్లి శ్రీనివాసరావు (విజయవాడ-వెస్ట్)తో పాటు ఇతర అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. టికెట్లు ప్రకటించాక వెల్లంపల్లి శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లాలని భావించడం సరైన పద్ధతికాదన్నారు. సోమవారం ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడిన రఘువీరా..‘‘వెల్లంపల్లితో నేనే స్వయంగా మాట్లాడాను. పోటీచేస్తానని టికెట్ కావాలని ఆయన అడిగారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారందరికీ టికెట్లు ఇచ్చింది. చివరి క్షణం వరకు పార్టీలు మారుతూ అవకాశవాద రాజకీయాలు చేయడం సరైనది కాదు. ఆ స్థానంలో వేరే వారిని ఎంపిక చేస్తాం’’ అని చెప్పారు. 28 తర్వాత సోనియా, రాహుల్ ప్రచారం: సీమాంధ్రలో ఈనెల 28 తర్వాత పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్ ప్రచారం చేస్తారని రఘువీరా తెలిపారు. విశాఖ, గుంటూరు, అనంతపురంలో సభలుంటాయన్నారు. అభ్యర్థులకు పార్టీ నుంచి ఆర్థిక సహాయం ఏదీ ఉండదని, కేవలం జెండాలు, ఇతర సామగ్రి పంపిస్తామని చెప్పారు.