విశాఖపట్నం : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సింహగిరిపై రూ. 25 - 30 కోట్ల రూపాయల వరకూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే ప్రతి భక్తుడికి వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పంచగ్రామాల భూసమస్యల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక కమిటీ వేసి బాధితులకు న్యాయం జరిగిలే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.
ఇక మీదట దేవాలయంలో ఇటువంటి అవినీతి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. దైవ భక్తి, ఆలయ అభివృద్ధికోసం పాటు పడే వారిని ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment