రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, ఉదయభాను, మేయర్ భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆకుల శ్రీనివాస్ కుమార్ తదితరులు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): పేద, అణగారిన వర్గాలకు అండగా నిలిచిన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకుంది ఎవరో అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ నేతలు అన్నారు. రంగా వెన్నులో దిగిన కత్తి, ఆయనపై విసిరిన బాంబు.. టీడీపీది కాదా.. చంద్రబాబుది కాదా.. సైకిల్‌ది కాదా అని ప్రశ్నించారు. రంగాను చంపిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి ఆయన బొమ్మ పెట్టుకునే అర్హత కూడా లేదన్నారు. సైకిల్ గుర్తుకు ఓటు వేస్తే రంగా ఆత్మ శాంతిస్తుందా ప్రశ్నించారు.
వంగవీటి మోహనరంగా 76వ జయంతి వేడుకలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నేత ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించన ఈ కార్యక్రమానికి మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గుంటూరు మేయర్ కావటి రమే‹Ùనాయుడు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.
రంగా వ్యక్తి కాదు ఒక శక్తి..
ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా పేరు పలికే అర్హత పవన్‌కళ్యాణ్‌కు లేదన్నారు. చంద్రబాబు పల్లకిని పవన్ మోస్తే.. రంగా అభిమానులు కూడా మోయాలా? అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, పవన్ కళ్యాణ్ దయచేసి రంగా పేరును వాడొద్దని అన్నారు. రంగా పేరును వాడే అర్హత వైఎస్సార్ అభిమానులమైన తమకే ఉందన్నారు. రంగా పేరును కలకాలం నిలిచేలా చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రంగా ఒక వ్యక్తి కాదని శక్తి అని పేర్కొన్నారు. ఆయన అందరి వాడన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రంగా విధానాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి అని, కాపులకు రాజకీయంగా, ఆర్థికంగా అండగా నిలిచారన్నారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ అందరిలోనూ ధైర్యం నింపగల శక్తిమంతుడు రంగా అని కొనియాడారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే వైఎస్సార్, రంగానే కారణమన్నారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు వంగవీటి రంగా ఒక ఐకాన్ అని పేర్కొన్నారు. మంచి చేస్తున్న వారికి అండగా నిలవాల్సిన అవసరం కాపులకు ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో భాగంగా రంగాతో కలిసి నడిచిన పది మందిని ఘనంగా సత్కరించారు. అనంతరం రంగా జీవిత చరిత్రలో కొన్ని అంశాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎపీఎండీసీ చైర్మన్ పుణ్యశీల, వైఎస్సార్‌సీపీ నేతలు భవకుమార్, మహమూద్, రాధారంగా మిత్రమండలి నాయకులు చెన్నుపాటి శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment