సాక్షి, విజయవాడ: రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఈ మేరకు విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 'ఎనిమిదేళ్లుగా జగన్‌ను, వైఎస్సార్‌సీపీ నేతలను తిట్టడమే పవన్ పనిగా పెట్టుకున్నాడు. చంద్రబాబు పల్లకీ మోయడానికే పవన్ భజన చేస్తున్నాడు. జనసేన ఆవిర్భావ సభ అమ్ముడుపోవడానికి పెట్టిన సభే. 2024 ఎన్నికలకు చంద్రబాబుతో కలిసుంటాడని ఈ ఆవిర్భావ సభ సారాంశం. బీజేపీ రూట్ మ్యాప్ ఇస్తే.. చంద్రబాబును సీఎం చేస్తాడట. పవన్ కళ్యాణ్ వంటి బ్రోకర్ ఏపీకి అవసరం లేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్‌ను నమ్ముకోవద్దని జనసేన కార్యకర్తలకు సూచిస్తున్నా.
పవన్ కళ్యాణ్ సినిమాలో గబ్బర్ సింగ్‌వే కానీ.. నిజ జీవితంలో రబ్బర్ సింగ్‌వే. ఏదో పీకేస్తానని డబ్బా డైలాగులు చెబుతున్నావ్.. నీకంత దమ్ముందా. నువ్వు భీమ్లానాయక్ అని బెదిరిస్తే.. భయపడేవాడెవడూ లేడు. దమ్ముంటే ఏపీలో సరిగ్గా రెండు రాత్రులు నిద్ర చెయ్యి. ఫామ్ హౌస్‌లో పడుకుంటే కానీ నిద్రరాని నువ్వా మమ్మల్ని విమర్శించేది. చంద్రబాబు హయాంలో 45 దేవాలయాలు కూల్చేస్తే పందులు కాశావా. పుష్కరాల్లో 30 మంది చనిపోతే చంద్రబాబును ప్రశ్నించకుండా గాడిదలు కాశావా.
చదవండి: (టీడీపీ బాగుండాలనే పవన్ కోరుకుంటున్నాడు: పేర్ని నాని)
పవన్ కళ్యాణ్ నువ్వా మమ్మల్ని బెదిరించేది. నీ బెదిరింపులకు ఎవడూ భయపడడు . ఎక్కడికి వస్తావో రా చూసుకుందాం. వికేంద్రీకరణే మా లక్ష్యమని సీఎం జగన్ ఎన్నికలకు వెళ్లారు. 151 సీట్లు సాధించారు. జీవిత కాలం ఫామ్ హౌస్‌లో కూర్చుని పుస్తకాలు చదవడం తప్ప ప్రజల జీవితాలను చదవడం నీకు తెలియదు. అమరావతిలో రైతులు పెట్టిన పెరుగన్నం తిని ధర్నా చేశావ్. ఫ్లైట్ ఎక్కి ప్యాకేజ్ తీసుకుని రూట్ మార్చేశావ్. చంద్రబాబుకు అమ్ముడుపోయిన వ్యక్తివి నువ్వు. నీ అవసరం ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు లేదు.
ఐపీఎల్ తరహాలో ప్యాకేజ్ రేటు పెంచుకోవడానికే జనసేన సభ. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యం. త్రివిక్రమ్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప పవన్‌కు ఏమీ రాదు. మేం వ్యక్తిగత విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ పదినిమిషాలు కూడా తట్టుకోలేడు. చంద్రబాబు కంటే ఎక్కువ ఏడుస్తాడు. మమ్మల్ని, మా నాయకులను తూలనాడితే ఖబడ్ధార్ పవన్ కళ్యాణ్. సినిమాల్లో పేమెంట్లు తీసుకుని ఎంజాయ్ చేయడం తప్ప.. ప్రజల గురించి నీకు ఏం తెలుసు అంటూ తీవ్ర స్థాయిలో పవన్ కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment