నాలుగైదుసార్లు అడిగే టికెటిచ్చాం: రఘువీరా | After five times asking and given ticket, says Raghuveera reddy | Sakshi
Sakshi News home page

నాలుగైదుసార్లు అడిగే టికెటిచ్చాం: రఘువీరా

Published Tue, Apr 15 2014 2:44 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

నాలుగైదుసార్లు అడిగే టికెటిచ్చాం: రఘువీరా - Sakshi

నాలుగైదుసార్లు అడిగే టికెటిచ్చాం: రఘువీరా

వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అని నాలుగైదుసార్లు అడిగిన తర్వాతే వెల్లంపల్లి శ్రీనివాసరావు (విజయవాడ-వెస్ట్)తో పాటు ఇతర అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు.

వెల్లంపల్లి స్థానంలో మరొకరిని ఎంపికచేస్తాం: రఘువీరా
 సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అని నాలుగైదుసార్లు అడిగిన తర్వాతే వెల్లంపల్లి శ్రీనివాసరావు (విజయవాడ-వెస్ట్)తో పాటు ఇతర అభ్యర్థులను పార్టీ ఎంపిక చేసిందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పేర్కొన్నారు. టికెట్లు ప్రకటించాక వెల్లంపల్లి శ్రీనివాసరావు బీజేపీలోకి వెళ్లాలని భావించడం సరైన పద్ధతికాదన్నారు. సోమవారం ఇందిరాభవన్లో మీడియాతో మాట్లాడిన రఘువీరా..‘‘వెల్లంపల్లితో నేనే స్వయంగా మాట్లాడాను. పోటీచేస్తానని టికెట్ కావాలని ఆయన అడిగారు. కాంగ్రెస్  సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారందరికీ టికెట్లు ఇచ్చింది. చివరి క్షణం వరకు పార్టీలు మారుతూ అవకాశవాద రాజకీయాలు చేయడం సరైనది కాదు. ఆ స్థానంలో వేరే వారిని ఎంపిక చేస్తాం’’ అని చెప్పారు.


 28 తర్వాత సోనియా, రాహుల్ ప్రచారం: సీమాంధ్రలో ఈనెల 28 తర్వాత పార్టీ అధినేత్రి సోనియా, రాహుల్ ప్రచారం చేస్తారని రఘువీరా తెలిపారు. విశాఖ, గుంటూరు, అనంతపురంలో సభలుంటాయన్నారు. అభ్యర్థులకు పార్టీ నుంచి ఆర్థిక సహాయం ఏదీ ఉండదని, కేవలం జెండాలు, ఇతర సామగ్రి పంపిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement