తెలంగాణలో టీడీపీ ఖాతా తెరవదు: రఘువీరా
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఈసారి టీడీపీ ఖాతా కూడా తెరవదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. సీమాంధ్రలో ఈసారి కాంగ్రెస్ పార్టీ 70శాతం కొత్తవారికే టికెట్లు ఇస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువత, బీసీలకే ప్రాధాన్యత ఇస్తోందని రఘువీరా తెలిపారు. 175 అసెంబ్లీ స్థానాలకు 1300 దరఖాస్తులొచ్చాయని ఆయన మీడియాకు వెల్లడించారు.
10లక్షల మెగాస్టార్ అభిమానుల కాంగ్రెస్ సభ్వత్వం ఇప్పించాలని, కాంగ్రెస్ గెలుపు కోసం చిరు అభిమానులు కృషి చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్‌లోని అన్ని విభాగాల్లో వారికి ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు.