telangana region
-
శ్రీశైలం డ్యాం నీటి మట్టం 809 అడుగులు
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతుండడంతో డ్యాం నీటిమట్టం ఆదివారం సాయంత్రం సమయానికి 809.90 అడుగులకు చేరుకుంది. శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 1.895 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. ఉత్పాదన అనంతరం 4,088 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. తెలంగాణ ప్రాంతంలోని భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 2.399 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసి 5,350 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 3 జనరేటర్లు ఒక్కొక్కటి 82.3 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పాదన చేయగా, భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఒక జనరేటర్ 140 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పాదన జరిగింది. లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు రెండు పవర్‌హౌస్‌లలో పీక్‌లోడ్ అవర్స్‌లో ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయంలో 34.2438 క్యూసెక్కుల నీరు నిల్వగా ఉంది. -
తెలంగాణ పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి
వరంగల్ సిటీ : తెలంగాణ ప్రాంతంలో పండే పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరినట్లు తెలంగాణ కాటన్, మిల్లర్స్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముంబాయిలో జరిగిన మినీ టెక్స్టైల్ కాటన్ అడ్వయిజరీ బోర్డు సమావేశానికి తాను హాజరయ్యానని, సీసీఐ మేనేజింగ్ డెరైక్టర్ బొంబాయి, కోయంబత్తూర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత జరిగిన సమావేశ ం కాబట్టి బోర్డు సమావేశంలో కూడా తెలంగాణను చేర్చాలని, ఇక్కడ పండిన పత్తి నాణ్యమైనందున తగిన డిమాండ్ ఉండాలని బోర్డు సభ్యులను కోరినట్లు తెలిపారు. పత్తి నాణ్యతను తెలుపుతూ అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. -
సల్లంగ బతుకమ్మ
దేశంలో అనేక పండుగలు - పర్వాలు కొద్దిపాటి తేడాతో అనేకచోట్ల జరుగుతాయి. కాని తెలంగాణ ప్రాంత ఆత్మను ప్రకటించే పండుగ బతుకమ్మ. జనసామాన్యంలో నుండి ఏర్పడ్డ విశ్వాసంతో పుట్టిన పండుగ ఇది. ‘జీవించు-బ్రతికించు’. అన్నదే ఈ బతుకమ్మ అర్థం. అదే తెలంగాణ సంస్కృతికి ఆయువుపట్టుగా నిలిచింది. అన్యోన్య అనురాగం, ప్రేమించే తత్త్వం తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఉందంటే ఆ మూలసూత్రం బతుకమ్మలో కన్పిస్తుంది. బతుకమ్మ పండుగ... చారిత్రక ఆధారం... తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయరాజు ‘గుండన’ పొలం దున్నుతుండగా గుమ్మడి తోటలో ఓ స్త్రీ దేవతా విగ్రహం లభించింది. గుమ్మడిని సంస్కృతంలో ‘కాకతి’ అని పిలుస్తారు. గుమ్మడి తోటలో లభించినందువల్ల ‘కాకతమ్మ’ అనే పేరుతో రాజులు ఆమెను పూజించారు. కాకతి విగ్రహాన్ని రాజవంశమే కాదు ఈ ప్రాంత ప్రజలంతా పూజించడం మొదలుపెట్టారు. రాను రాను విగ్రహం కన్నా, విగ్రహం ముందు (విగ్రహం మునిగేటట్టుగా) పూలకుప్పలు పోసి ఆ కుప్పను పూజించడం మొదలుపెట్టారు. ఆ పూలకుప్పే దేవతాస్వరూపంగా మారిపోయింది. కాకతమ్మ శబ్దమే కాలక్రమంలో ‘బతుకమ్మ’గా మారి ఉండొచ్చన్నది పరిశోధకుల మాట. కాకతీయులకు శక్తి, పరాక్రమాలందించిన ఈ దేవతను మాతృస్వరూపిణిగా ఆరాధించి అటు శక్తితత్వాన్ని, ఇటు మాతృదేవతారాధనను వారు స్థిరీకరించారు. ఆమే అందరికీ బతుకనిచ్చే తల్లిగా మారడం చారిత్రక పరిణామం. ఇంకో జానపదగాథ బతుకమ్మ చుట్టూ తిరుగుతున్నది. భట్టు నరసింహకవి రచించిన పాటే ఈ బతుకమ్మ పేరుకు ఆధారంగా ఉంది. ధర్మాంగదుడనే చోళరాజు, సత్యవతి దంపతులు ఎన్నో నోములు నోచి కుమారులను కన్నారు. కాని ఏదో కారణంతో వారంతా చనిపోయారు. సత్యవతి మళ్లీ ఎన్నో పూజలు చేయగా సాక్షాత్తూ ‘లక్ష్మీదేవి’యే అనుగ్రహించి నీ కూతురుగా వస్తానన్నదట. పుట్టిన బిడ్డను ఆశీర్వదించడానికి దేవాధిదేవతలు, మహర్షులు వచ్చి ‘బ్రతుకగనె ఈ తల్లి ఉయ్యాలో బ్రతుకమ్మ అనిరంత ఉయ్యాలో’’ అని ఆమెకు ‘బతుకమ్మ’ అని నామకరణం చేశారని ధర్మాంగదుని జానపదగాథ తెల్పుతుంది. బతుకమ్మ ఏ దేవి స్వరూపం? శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ ...అనే పాట బతుకమ్మను త్రిమూర్తుల భార్యలైన సరస్వతీ, లక్ష్మీ, గౌరీ స్వరూపంగా తెలియజేస్తుంది. బతుకమ్మకు సంబంధించి ఎలాంటి పౌరాణిక ఆధారాలు, శ్లోకాలు దొరకవు కాబట్టి బతుకమ్మ పాటలే మనకు ఆధారం. మొత్తానికి బతుకమ్మ కాకతీయుల కాలం నుండే ఆవిర్భవించినట్లు ఒక నిర్ధారణకు రావచ్చు. అలాగే కాకతీయుల సేనాని అయిన జాయప సేనాని రచించిన ‘నృత్తరత్నావళి’ లోని ఒక చిందు (దరువు) ‘బతుకమ్మ ఆట’కు మూలం అని కూడా పరిశోధకుల అభిప్రాయం. బతుకమ్మ సందేశం... ప్రకృతి నుండి సేకరించిన పూలను ఉపయోగించి దేవతగా సిద్ధం చేసే బతుకమ్మ ఆరాధన విశిష్టమైంది. ఇది నిరాకార నిర్గుణ ఆరాధనగా చెప్పవచ్చు. మట్టి నుండి పుట్టిన చెట్టు, ఆ చెట్టు నుండి వచ్చే పూలు మళ్ళీ నీటిలో కలిసిపోయి మట్టిగా మారినట్లే జీవులన్నీ ఎక్కడినుండి పుడతాయో భోగాలను అనుభవించి అక్కడికే చేరతాయి అన్న అధ్యాత్మ, తాత్విక సందేశం ఈ పండుగ మనకు ఇస్తుంది. ఎన్నో రకాల పూలు ఒకటిన ఒకటి కూర్పబడి అందంగా బతుకమ్మ నిర్మాణం అవుతుంది. అలాగే ఎన్నో కులాల, వర్గాల మనుషులు కలిసిమెలిసి అందమైన సమాజంగా మారాలనే సామాజిక సందేశం ఈ పండుగలో కన్పిస్తుంది. వర్ష ఋతువు సమాప్తమై శరదృతువు ప్రారంభం అయ్యే సూచనను బతుకమ్మ ఇస్తుంది. బతుకమ్మ ఉత్సవంలో ఆటపాటలకు చాలా ప్రాధాన్యం ఉంది. ‘బతుకమ్మ ఆట’ అని ఈ నృత్యానికి పేరు. గ్రామాల్లో ఏ ఉత్సవమైనా, ఏ ఊరేగింపు అయినా ‘బతుకమ్మ ఆట’ (నృత్యం) చేస్తూ ఆ సందర్భానికి అనుగుణంగా పాడతారు. అంతగా చొచ్చుకుపోయింది ఈ ఆట - పాట. మొదటి బతుకమ్మను- ‘ఒక్కేసి పువ్వేసి చందమామ ఒక్క ఝామాయె చందమామ శివుడింక రాడాయే చందమామ శివపూజ యాల్లాయె చందమామ’ అని పాడుతూ 9వ రోజున ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని ముగిస్తారు. మధ్య మధ్యలో సందర్భానికి తగినట్లు పాటలుంటాయి. ఈ పాటలు ‘ఉయ్యాల పాటలు’గా బతుకమ్మ పాటలుగా ఎన్నో రూపాలను సంతరించుకొన్నాయి. బతుకమ్మ స్త్రీల పండుగ. బతుకమ్మ కన్నా ముందు ‘బొడ్డెమ్మ’ ఆడటం యువతులకు అలవాటు. ‘బోణి’ అంటే స్త్రీ శ్రీమూర్తిని స్త్రీమూర్తులు ఆరాధించే ఈ పండుగలో స్త్రీల కళానైపుణ్యం, సహజీవనతత్వం, ప్రకృతి తాదాత్మ్యం కనిపిస్తాయి. అందరినీ బతుకమనీ, అందరికీ బ్రతుకునివ్వమనీ కోరుకొనే తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం ‘మన బతుకమ్మ’. -డా॥పి. భాస్కరయోగి రోజుకో రూపం... రూపానికో నైవేద్యం మొదటిరోజు: ‘ఎంగిలిపూల బతుకమ్మ’ నైవేద్యం: తులసి ఆకులు, వక్కలు. రెండవరోజు: ‘అటుకుల బతుకమ్మ’ నైవేద్యం: సప్పిడిపప్పు, బెల్లం, అటుకులు మూడవరోజు: ‘ముద్దపప్పు బతుకమ్మ’ నైవేద్యం: ముద్దపప్పు, బెల్లం, పాలు నాల్గవరోజు: ‘నానబియ్యం బతుకమ్మ’ నైవేద్యం: నానేసిన బియ్యం, పాలు, బెల్లం అయిదోరోజు: ‘అట్ల బతుకమ్మ’. నైవేద్యం: అట్లు (దోసెలు) ఆరోరోజు: ‘అలిగిన బతుకమ్మ’ నైవేద్యం: ఈ రోజు బతుకమ్మ ఆడరు. ఏడోరోజు: ‘వేపకాయల బతుకమ్మ’ నైవేద్యం: సకినాల పిండిని వేపకాయల్లా చేసినూనెలో వేస్తారు. ఎనిమిదోరోజు: ‘వెన్నముద్దల బతుకమ్మ’ నైవేద్యం: నువ్వులు, వెన్న ముద్ద, బెల్లం చివరిరోజు: సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ. నైవేద్యం: పెరుగన్నం, చిత్రాన్నం, పులిహోర, కొబ్బరిపొడి, నువ్వుపొడి. -
కృష్ణా జలాల్లో మన వాటా మనకే!
* బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలపై కసరత్తు * అధికారులతో సమీక్షించిన సీఎం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల్లో మన వాటా మనకు దక్కే విధంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. నీటి విషయంలో తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగిందని కేసీఆర్ మొదటి నుంచీ చెప్తూ వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే ప్రయోజనం ఉండదనే ఉద్దేశంతో ట్రిబ్యునల్ ముందు సమర్థవంతమైన వాదనలను చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన వాదనలకు భిన్నమైన అంశాలతో వాదనలను రూపొందించాలని సూచించారు. అవసరమయితే సీనియర్ న్యాయవాదుల్ని ఎంపిక చేయాలని ఆదేశించినట్టు సమాచారం. బ్రిజేష్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ ముందు జూలైలో వాదనలు జరగనున్నాయి. దాంతో ట్రిబ్యునల్ ముందు వాదించాల్సిన అంశాలకు సంబంధించి సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు. సమావేశంలో నీటిపారుదల మంత్రి హరీష్‌రావు, ముఖ్యకార్యదర్శి అరవిందరెడ్డి ఇతర ఇంజనీర్లు పాల్గొన్నారు. డెల్టాకు నీటి విషయంలో తగ్గేది లేదు.. కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఉంది. రాష్ర్ట స్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 25 నుంచి నాగార్జునసాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని డెల్టాకు విడుదల చేయాల్సి ఉంది. గడువు దగ్గరకు వస్తున్నా.. ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నీటి విడుదల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. తాగునీరు పేరుతో ఆ నీటిని నారుమళ్లకు ఉపయోగించుకుంటారని అంచనా వేస్తోంది. అదీకాక, నాగార్జుసాగర్లో ఇప్పుడు 13 టీఎంసీల నీరు మాత్రమే వాడకానికి ఉందని, ఇందులో 10 టీఎంసీలు డెల్టాకు ఇస్తే.. హైదరాబాద్ నగరానికి తాగునీటికి ఇబ్బందులొస్తాయని భావిస్తోంది. అందువల్ల డెల్టాకు నీటి విడుదలను అడ్డుకోవాలనే భావనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. -
ఇరాక్‌లో చిక్కుకున్న 700 తెలంగాణ కుటుంబాలు
* మూడు జిల్లాల నుంచి హెల్ప్‌లైన్‌కు 20 కుటుంబాల ఫోన్లు * ఇరాక్‌కు ఐఎఫ్ఎస్ అధికారి సురేశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఇరాక్‌లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరు వందల నుంచి ఏడు వందల కుటుంబాల వరకు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న భీకరపోరు అంతర్యుద్ధంగా మారడంతో.. పని కోసం వెళ్లిన తెలంగాణ ప్రాంతం వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు సమాచారం. ఇందులో రాష్ట్రం నుంచి నేరుగా ఇరాక్ వెళ్లకుండా కువైట్ వెళ్లి అటు నుంచి ఇరాక్‌లో పనిచేయడానికి వెళ్లినవారే అధికంగా ఉన్నట్లు ప్రభుత్వానికి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇరాక్ వెళ్లడానికి భారతదేశం అనుమతించడం లేదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాక్‌లో చిక్కుకున్న వారి వివరాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో, సెల్ నంబర్లను కూడా ఇచ్చిన విషయం విదితమే. ఈ నంబర్లకు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి 20 ఫోన్‌కాల్స్ వచ్చాయని, వారిచ్చిన వివరాల ప్రకారం 20 కుటుంబాలు అక్కడ చిక్కుకున్నాయని సమాచారం ఇచ్చారు. అయితే.. మరోవైపు రాష్ట్రం నుంచి ఉపాధి కోసం సిరియా, సౌదీ అరేబియా, ఇరాన్, కువైట్ వెళ్లి అటు నుంచి అనధికారికంగా ఇరాక్‌లోకి పనికి వెళ్తున్నారని తెలిసింది. అక్కడకు నిరుద్యోగులను పంపించే ఏజెన్సీలను సంప్రదిస్తే దాదాపు 700 కుటుంబాలు ఇరాక్‌లో ఉన్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. అయితే వీరంతా.. అనధికారికంగా అక్కడకు వెళ్లిన వారే కావడం గమనార్హం. అలా వెళ్లిన వారి సమాచారం సేకరించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకుని వెళ్లింది. విదేశాంగ శాఖ కార్యదర్శి అనిల్ వాద్వాతోనూ, ‘గల్ఫ్’ వ్యవహారాలను పర్యవేక్షించే మృదుల్ కుమాన్‌కు కూడా ఈ సమాచారాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇరాక్‌లో చిక్కుకున్న కుటుంబాలను సురక్షితంగా బయటకు తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం తరఫున విజ్ఞప్తి చేశారు. కాగా, అనధికారికంగా అక్కడ ఉంటున్న వారి చిరునామా, ఫోన్ నంబర్లు తదితర సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, 1991 ఇండియన్ ఫారెన్ సర్వీసుకు చెందిన సురేశ్‌రెడ్డిని ఇరాక్ పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం సెపరేట్ ఇండియన్ మిషన్ టు ఏఎస్ఈఏఎన్ అండ్ ఈస్ట్ ఏిసియా సమ్మిట్ అధికారిగా పనిచేస్తున్నారు. కె. సురేశ్‌రెడ్డి గతంలో ఇరాక్‌లో భారత రాయబారిగా పని చేశారు. మన్మోహన్సింగ్ ప్రభుత్వం 2011లో ప్రత్యేకంగా ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు. అప్పటికి ఏడేళ్లపాటు అసలు ఇరాక్‌లో భారత రాయబారే లేకపోవటం విశేషం. 1993లో ఆయన తొలి పోస్టింగ్ కైరోలో కేటాయించారు. ఆ తర్వాత మస్కట్, అబుదాబి, ఇస్లామాబాద్‌లలో పనిచేశారు. అరబిక్ భాషలో కూడా ఆయనకు పట్టుండటంతోపాటు, ఇరాక్ భూగోళిక పరిస్థితిపై సురేశ్‌రెడ్డికి మంచి పట్టుంది. ప్రసుతం ఇరాక్ అంతర్యుద్ధం తారస్థాయికి చేరుకుని అక్కడి భారతీయులకు ప్రమాదం పొంచి ఉండటంతో సురేశ్‌రెడ్డి సేవలు తీసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. -
నాలుగింట హంగ్..
-
పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు
తెలంగాణ ప్రాంతంలోని 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలకు బుధవారం ఉదయం 7. గంటలకు ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయితే వివిధ ప్రాంతాలలోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లతో పోలింగ్‌బూత్ వద్ద క్యూ లైన్లు పెరుగుతున్నాయి. ఎన్నికల ఏర్పాట్లు విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా... ఈవీఎంలను సరిచేసేందుకు ఎన్నికల సిబ్బంది తంటాలు పడుతున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంను ఎన్నికల సిబ్బంది సరి చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలోని పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. వాటి వివరాలు. హైదరాబాద్: హబ్సీగూడ పోలింగ్ బూత్ నెం 181తోపాటు తుకారంగేటులోని బూత్ నెం. 6...కూకట్‌పల్లిలోని బూత్ నెం.46...ఎల్బీనగర్ 82/A...ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ 83 బూత్‌లలోని ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటింగ్ వేసేందుకు వచ్చిన ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చైతన్యపూరిలో కూడా ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటర్లు వెనుదిరిగారు. ఆదిలాబాద్ జిల్లా: మందమర్రి రామకృష్ణాపూర్‌లోని....68, 69 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ప్రారంభం కానీ పోలింగ్. ఖమ్మం జిల్లా: కొణిజర్ల పెద్దమునగాలలో పనిచేయని ఈవీఎంలు. భద్రాచలం నన్నపనేని హైస్కూల్లో పనిచేయని ఈవీఎం పినపాక కరకగూడెంలో పనిచేయని ఈవీఎం అశ్వరావుపేట, దమ్మపేటలో ఈవీఎంలు మొరాయింపు కొత్తగూడెం రేజర్లలో పనిచేయని ఈవీఎంలు మహబూబ్‌నగర్ జిల్లా : నాగర్‌కర్నూల్‌లో..87, 88 పోలింగ్ కేంద్రాల్లో పనిచేయని ఈవీఎంలు. వీపనగండ్లలో 148 బూత్‌లోని ఈవీఎం. పెద్దకొత్తపల్లి మండలం కల్వకొల్లులో 47బూత్‌లో..పనిచేయని ఈవీఎంలు మెదక్ జిల్లా : 104 పోలింగ్ కేంద్రంలో పనిచేయని ఈవీఎం. చినమండవ, మక్కేపల్లి గ్రామాలలో మొరాయించిన ఈవీఎంలు. మంగల్పేటలోలోని 141బూత్‌లో ఈవీఎం మొరాయింపు పెబ్బేరు మండలం శ్రీరంగపూర్లో మొరాయించిన ఈవీఎం నల్గొండ జిల్లా: నాంపల్లి 247పోలింగ్ బూత్‌లో...పనిచేయని ఈవీఎం. నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఈవీఎంలు మోరాయింపు పెన్‌పహాడ్ మండలం చీవెళ్లలో పనిచేయని ఈవీఎం మునగాల, చిలుకూరులో మొరాయించిన ఈవీఎం నకిరేకల్ బూత్నెం.1లో మొరాయించిన ఈవీఎం మిర్యాలగూడ నియోజకవర్గంలోని రాయలపెంట, గాంధీనగర్‌లో ఈవీఎంల మొరాయింపు రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ ఆలంపల్లిలో పనిచేయని ఈవీఎం. పెద్దేముల్ మండలం హనుమాపూర్లో పనిచేయని ఈవీఎంలు ధారూర్ కుక్కిందలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలలో సాంకేతికలోపం... గంటన్నర ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం వరంగల్ జిల్లా: జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పనిచేయని ఈవీఎంలు భూపాలపల్లి మండలం నాగారంలో పనిచేయని ఈవీఎంలు రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపురం గ్రామంలో ఈవీఎం మొరాయింపు కరీంనగర్ జిల్లా: సిరిసిల్ల 123 పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవిఎం మల్యాల మండల కేంద్రంలోని 4 పోలింగ్ కేంద్రాలలో మొరాయించిన ఈవిఎంలు, ప్రారంభంకాని పోలింగ్ ముస్తాబాద్ లోని 208 పోలింగ్ కేంద్రంలో నిలిచిపోయిన పోలింగ్ , ఓటర్ల ఆందోళన -
'లైన్లో ఉన్న ప్రతీఒక్కరికి ఓటేసే సౌకర్యం'
ఓటరు లిస్ట్‌లో పేరుంటే చాలు 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయొచ్చు అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. నేటి సాయంత్రం 6 గంటల వరకు లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం హైదరాబాద్ నగరంలో వివిధ పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని ఈవీఎంలలో లోపాలు ఉన్న మాట వాస్తవమే అని ఆయన అంగీకరించారు. ఈవీఎంలు ఫ్యాక్టరీ మోడ్‌లోకి వెళ్తున్నాయన్నారు. అన్ని చోట్ల అదనపు ఈవీఎంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడ సమస్య వచ్చినా అరగంటలోపు ఈవీఎంలను రీప్లేస్ చేస్తామని భన్వర్‌లాల్ వెల్లడించారు. ఈవీఎంలు మొరాయిస్తున్న నేపథ్యంలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలలో లైన్లో నిలబడిన చివరి వ్యక్తి వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. 16,512 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నగరంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని గమనించేందుకు ప్రధాన కూడళ్లలో తెరలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నేడు ఎన్నికల సందర్బంగా... అన్ని సంస్థలకూ సెలవు ప్రకటించాలని ఆదేశించినట్లు చెప్పారు. అలాగే అత్యవరసర సేవల సంస్థలకూ మాత్రం ఓ షిఫ్ట్ సెలవు ఇవ్వాలని ఆదేశించామన్నారు. ఉద్యోగులకు సెలవు ఇవ్వని యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి... ఏడాది జైలు శిక్ష విధిస్తామన్నారు. అలాంటి సంస్థలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావలని అటు ఆయా సంస్థల ఉద్యోగులకు, ఇటు మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లవద్దని ఓటర్లకు భన్వర్‌లాల్ సూచించారు. -
'లైన్లో ఉన్న ప్రతీఒక్కరికి ఓటేసే సౌకర్యం'
-
'ఓటరు లిస్ట్ లో పేరుంటే చాలు ఓటు వేయొచ్చు'
హైదరాబాద్: ఓటరు లిస్ట్‌లో పేరుంటే చాలు 11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఓకటి చూపించి ఓటు వేయొచ్చు అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రేపటి పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని భన్వర్ లాల్ తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు, భద్రత కోసం లక్ష మంది పోలీసులను నియమించామని భన్వర్ లాల్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందని.. 6 గంటలకు లైన్లో ఉన్న చివరి వ్యక్తి వరకు ఓటు వేసేందుకు అనుమతిస్తామని భన్వర్‌లాల్ తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ యాజమాన్యాలు కచ్చితంగా ఓటు కోసం సిబ్బందికి సెలవు ఇవ్వాల్సిందేనని ఆయన తెలిపారు. పోలింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో పక్షపాతానికి పాల్పడవద్దని భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఉద్యమాల సందర్భంగా మీరు ఏ వైపు ఉన్నా ఇప్పుడు మాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ రాత్రి నిఘాను రెండింతలు చేస్తామని, ఏమైనా ఫిర్యాదులుంటే 1950కి ఫోన్ చేయండి లేదా 8790499899కి ఎస్ఎమ్మెఎస్ చేయొచ్చని భన్వర్‌లాల్ తెలిపారు. -
'తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వం'
తెలంగాణలో ఆంధ్రా ఉద్యోగుల్ని ఉండనివ్వబోమని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీ ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం వరంగల్ వచ్చిన దేవీ ప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... గ్రామస్థాయి నుంచి సచివాలయం వరకు ఉద్యోగుల్ని విభజించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం సత్వరం చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. అలా కానీ పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేసిన ఉదమాలను తలదన్నే మరో ఉద్యమాన్ని ప్రారంభించవలసి వస్తుందని దేవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
తెలంగాణలో వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం
జడ్చర్ల, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టడం ఖాయమ ని మహబూబ్‌నగర్ లోక్‌సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి రహమాన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే తెలంగాణ ప్రాం తం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇంటింటికి వైఎ స్సార్ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అందించారని గుర్తు చేశారు. మహానేత సేవలను ప్రజలు మరిచిపోలేదని, తెలంగాణ ప్రాం తంలో తమ పార్టీకి ఓట్లు వేసి ఆదరణ చూపుతారని పేర్కొన్నారు. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానా ల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, తదితర జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జ డ్చర్ల అసెంబ్లీ అభ్యర్థి పాండునాయక్ పాల్గొన్నారు. -
మల్కాజిగిరి, అంబర్ పేటలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 17 లోకసభ నియోజకవర్గాల్లో 267 మంది బరిలో ఉన్నారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. అలాగే 119 నియోజకవర్గాల్లో 1682 అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లో అత్యధికంగా 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక నాగర్ కర్నూల్(ఎస్సీ) లోకసభలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గం అంబర్ పేటలో అత్యధికంగా 32 మంది అభ్యర్థులు, ఆందోల్ నియోజకర్గంలో 5 గురు మాత్రమే పోటి పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో 119 అసెంబ్లీ, 17 లోకసభ సీట్లకు ఏప్రిల్ 30 తేదిన ఎన్నికలు జరుగనున్నాయి. -
తెలంగాణలో టీడీపీ ఖాతా తెరవదు: రఘువీరా
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో ఈసారి టీడీపీ ఖాతా కూడా తెరవదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. సీమాంధ్రలో ఈసారి కాంగ్రెస్ పార్టీ 70శాతం కొత్తవారికే టికెట్లు ఇస్తోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ యువత, బీసీలకే ప్రాధాన్యత ఇస్తోందని రఘువీరా తెలిపారు. 175 అసెంబ్లీ స్థానాలకు 1300 దరఖాస్తులొచ్చాయని ఆయన మీడియాకు వెల్లడించారు. 10లక్షల మెగాస్టార్ అభిమానుల కాంగ్రెస్ సభ్వత్వం ఇప్పించాలని, కాంగ్రెస్ గెలుపు కోసం చిరు అభిమానులు కృషి చేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్‌లోని అన్ని విభాగాల్లో వారికి ప్రాధాన్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో రఘువీరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. -
33 మందితో తెలంగాణ ఆప్ రెండో జాబితా విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. తొలి జాబితాలో 31 అసెంబ్లీ, మూడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన ఆ పార్టీ మరో 33 అసెంబ్లీ, మూడు ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీ అభ్యర్థులు: బెల్లయ్యనాయక్-నల్లగొండ, సునిల్‌కుమార్-జహీరాబాద్, సుంకపాక ప్రసాద్-పెద్దపల్లి.ఎమ్మెల్యే అభ్యర్థులు: కె.రేవంత్రావు గోపాలస్వామి-అంబర్పేట్, అబ్బాస్-ముషీరాబాద్, దునియాలాల్ త్రిపాఠి నిరాల-ఖైరతాబాద్, రాంగోపాల్ యాదవ్-జూబ్లీహిల్స్, జి.ప్రభాకర్‌రెడ్డి-మేడ్చల్, కట్కం నర్సింగ్‌రావు-ఎల్బీనగర్, మీర్ మహ్మద్‌హుస్సేన్- గోషామహల్, రాజశేఖర్‌రెడ్డి అలిపురం-తాండూరు, టి.వెంకటేశ్వర్లు-వికారాబాద్, డి.శ్రీకాంత్‌యాదవ్-వరంగల్‌వెస్ట్, ఎం రాజీవ్‌కుమార్-నారాయణఖేడ్, టి.వెంకటేశ్వర్లు-హుజూర్నగర్, రుషీకేశ్వర్-మిర్యాలగూడ, కె.లక్ష్మి-కోరట్ల, వి.రమేష్-జగిత్యాల, పి.రమణారెడ్డి-నిజామాబాద్ అర్బన్, ఎం.మోహన్-నిజమాబాద్ రూరల్, బాలశౌరి బెల్లకొండ బోధన్, డి.ఆనందం-సిరిసిల్లా, ఎ.శ్రీధర్‌రెడ్డి-వేములవాడ, రొడ్డ మోహన్-చెన్నూర్, బండారి శ్రీనివాస్-బెల్లంపల్లి, పూజారి రమణ-మంచిర్యాల, నాగరాజు-ధర్మపురి, డి.విశ్వనాథ్-మంథని, టి.ఓదెలు యాదవ్-పెద్దపల్లి, ఎండీ మాజీద్ అలీ-బాన్సువాడ, అన్వర్‌పాషా-ఎల్లారెడ్డి, మాల్గ యాదయ్య-మణుగూరు, సంగిశెట్టి నర్సింహా-భువనగిరి, సంగమేశ్వర్ దానక్క- షాద్‌నగర్. -
‘పరిశ్రమ’తో నవ నిర్మాణం
నవ తెలంగాణ: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే... ముందు చూపుగల రాజకీయ నాయకత్వం, ఆర్థిక లక్ష్యాలు, భౌగోళిక పరిస్థితి అవసరం. తెలంగాణ నవ నిర్మాణం ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంది. తెలంగాణలో ప్యూడల్ వ్యవస్థ వేళ్లూనికొని పోవడంతో ఇక్కడ పాఠశాలల ఏర్పాటు జరగలేదు. గ్రామీణ జీవితమంతా భూస్వామ్య వ్యవస్థలోనే ఉండేది. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ నాయకత్వం అంతా భూస్వామ్య భావజాలం ఉన్నవారే. ఆ ఊళ్లల్లో ఉండే సమాజమే ఆ నాయకత్వ లక్ష్యం. ప్యూడల్ రాజకీయాల్లో వారసత్వం, అసమానతలు, కులవ్యవస్థ, అంటరానితనం ప్రధానంగా ఉంటాయి. పేరుకు ప్రజాస్వామ్యమే కానీ ప్యూడల్ వ్యవస్థ నిర్మాణమే ఉందిక్కడ. సంజీవరెడ్డి ముఖ్యమంత్రి ఉండగా హైదరాబాద్‌లో ఐఐటీ నెలకొల్పేందుకు జర్మనీ వాళ్లు ముందుకు వచ్చారు. సంజీవరెడ్డి ఐఐటీ తమకొద్దని జవహర్లాల్ నెహ్రూకు చెప్పొచ్చాడు. మనం తిరస్కరించిన ఐఐటీని మద్రాసుకు ఎగురేసుకుపోయారు అప్పటి రాజగోపాలాచారి. ఇలా ప్యూడల్ వ్యవస్థ పునాదుల మీద వ చ్చిన నాయకత్వం పూర్తిగా గ్రామీణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. సంపద సరైన పంపిణీ... సంపదను సృష్టించడం ప్రధానం కాదు. ఆ సంపదను పంపిణీ చేసే పద్దతి తెలియాలి. ప్రస్తుతం ఆ సంపదలో 80 శాతం ధనికుల చేతుల్లోనే ఉండిపోయింది. రియల్ ఎస్టేట్ వచ్చి పేదలకు భూమి లేకుండా చేసింది. పోలవరం ద్వారా రాబోయే సంపద ఎవరి నుంచి వచ్చింది? దానికోసం భూములిచ్చిన గిరిజనుల నుంచే వచ్చింది. మరి వారికి ఆ పోలవరం నుంచి వచ్చే సంపద ఉపయోగపడుతుందా? లేనే లేదు. మరి ఆ సంపద సృష్టి ఎవరికోసం? ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ప్రజల నాడిని గుర్తించకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రజలు సామాజిక మార్పు కోసం పోరాడారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నవ నిర్మాణంపై విస్తృతస్థాయిలో చర్చ జరగాలి. పారిశ్రామికీకరణే కీలకం తెలంగాణలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ సంఖ్యను 50 శాతానికి తగ్గించాలి. ఎందుకంటే మనకు నీటి వనరులు తక్కువ. ఎత్తు భూములు కాబట్టి ప్రాజెక్టులు నిర్మించలేం. ఎత్తిపోతలు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మన వ్యవ సాయం కేవలం 50 శాతం మందికే జీవనాన్ని ఇవ్వగలదు. మిగిలిన 30 శాతం మందిని కూడా ఇతర రంగాలకు మళ్లించాలి. వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా వ్యవసాయం నుంచి బయటకు రప్పించలేం. అలాంటి ప్రత్యామ్నాయ విధానాలను తీసుకొచ్చే ముందుచూపు నాయకత్వమే అవసరం. తెలంగాణ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. కరీంనగర్ చుట్టూ గ్రానైట్స్ గనులు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బొగ్గు గనులు విస్తారంగా ఉన్నాయి. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి పెంచవచ్చు. పరిశ్రమలకు ఇది ఎంతో అనువైన ప్రాంతం. అణుశక్తికి ఉపయోగించే యురేనియం నిల్వలు ఆదిలాబాద్‌లో లభ్యమవుతున్నాయి. దాంతో యురేనియాన్ని ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్ర యించవచ్చు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి శాస్త్ర సాంకేతికత ప్రధానమైంది. విద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. విద్యా వైద్యంపై కేంద్రీకరణ విద్యారంగంపై దృష్టి పెట్టకపోతే ఎక్కడా అభివృద్ధి జరగదు. విద్యారంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. తెలంగాణలో కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలి. అందరికే ఒకే రకమైన విద్యను అందజేయాలి. గ్రామాల్లోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలి. ఈ ప్రయోగాన్ని క్యూబా, బ్రెజిల్ వంటి దేశాల్లో అమలు చేశారు. క్యూబాలో విద్య కోసం ఖర్చు చేశారు. ప్రాథమిక, ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ఆ దేశాల్లో విస్తృతంగా అభివృద్ధి జరిగింది. క్యూబా డాక్టర్లను వివిధ దేశాలకు సరఫరా చేయగలిగే స్థితికి చేరుకుంది. స్విట్జర్లాండ్ పక్కనే ఉన్న దేశం ఫిన్లాండ్. ఆ దేశం అమెరికాతో పోటీపడి సమానంగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) సాధించింది. కానీ ఆ దేశానికి ఉన్న వనరులు చాలా తక్కువ. ఇండోనేషియా నుంచి మంచినీళ్లు, కంబోడియా నుంచి బియ్యం దిగుమతి చేసుకుంటుంది. కేవలం నౌకాయానం ద్వారా వచ్చే పన్నుల ద్వారానే ఆ దేశానికి ఆదాయం వస్తుంది. దాంతోనే ప్రాథమిక విద్యను అభివృద్ధి చేశారు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే టెక్నాలజీ పెరగాలి. టెక్నాలజీ పెరగాలంటే విద్య మీద కేంద్రీకరించాలి. ఎక్కడైతే తల్లులు పౌష్టికాహారం తింటారో అక్కడ మేధావులు పుడ్తారు. మెదడు తల్లి గర్భంలోనే పుడుతుంది. క్యూబాలో గర్భిణుల మీద దృష్టి పెట్టారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అందరికీ అందుబాటులో వైద్య సౌకర్యాలు ఉండాలి. పౌష్టికాహారం గ్యారంటీ చేయాలి. వీటిమీద అవగాహన ఉన్న నాయకత్వం తెలంగాణను పరిపాలించాలి. అసమానతలు, కులవ్యవస్థకు మూలమైన ఫ్యూడల్ వ్యవస్థ అంతరించి రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో సమూల మార్పులు రావాలని, అప్పుడే తెలంగాణ పునర్వికాసం సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అభిప్రాయపడుతున్నారు... - మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అంతరంగం -
'ఆ రెండు పార్టీల కంటే టీడీపీనే బలంగా ఉంది'
తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల కంటే తమ పార్టీకే బలమైన క్యాడర్ ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, టి.టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.... తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే అని నొక్కి వక్కాణించారు. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. తమ పార్టీని మరింత పటిష్ట పరిచే క్రమంలో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలలో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ రెండు సార్లు కేంద్రానికి అనుకూలంగా లేఖ ఇచ్చిన సంగతిని ఈ సందర్భంగా ఎర్రబెల్లి గుర్తు చేశారు. చంద్రబాబుపై పలు పార్టీలు చేస్తున్న దుష్ర్పచారాన్ని తిప్పికొడతామని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. -
నలుగురు తెలంగాణ సీఎంలు ఉన్నా .. ఏజీని ఎందుకు పెట్టుకోలేదు : కిరణ్
సాక్షి, హైదరాబాద్ : యాభై ఏళ్లల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక్క అడ్వకేట్ జనరల్‌ను కూడా నియమించలేదన్న ఈటెల వ్యాఖ్యపై ముఖ్యమంత్రి కిరణ్ స్పందించారు. ఈ యాభై ఏళ్లల్లో తెలంగాణకు చెందిన వారు నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, వారి హయాంలో తెలంగాణ వ్యక్తికి ఎందుకు ఏజీ పోస్టును ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిపై ఈటెల మాట్లాడుతూ ‘తెలంగాణ వారిని సరిగ్గా పరిపాలించే అవకాశం మీరు కల్పించారా?’ అని బదులిచ్చారు. కాగా ప్రస్తుత ఏజీ సుదర్శన్‌రెడ్డి ముఖ్యమంత్రికి క్లాస్మేట్ కావడం వల్లనే అవకాశం వచ్చిందన్న ఈటెల వ్యాఖ్యపై కూడా సీఎం స్పందిస్తూ ‘ఆయన నా క్లాస్మేట్ కాదు...నా కంటే సీనియర్ అని’ చెప్పారు. పీవీని మేమే గెలిపించాం: చంద్రబాబు తెలంగాణ వారిని రాజకీయ పదవులు అనుభవించకుండా సీమాంధ్ర వారు కుట్రలు చేశారని ఈటెల చేసిన వ్యాఖ్యపై ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా స్పందించారు. ‘పీవీ నరసింహారావు ప్రధాని అయిన తర్వాత మీ (తెలంగాణ) ప్రాంతం నుంచి కాకుండా మా ప్రాంతం నుంచి గెలిపించి ఢిల్లీకి పంపించాము’ అని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పీవీకి మద్దతుగా టీడీపీ పోటీ చేయలేదని బాబు చెప్పారు. -
భద్రాచలాన్ని విభజిస్తే తడాఖా చూపిస్తా: రేణుకా చౌదరి
భద్రచలం తెలంగాణాలోనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి స్పష్టం చేశారు. అలాకాదని తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలాన్నివిడతీస్తే నా తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. బుధవారం రేణుకాచౌదరి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె పేర్కొన్నారు. 'మా అమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెను దగ్గరండి చూసుకోవాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించలేనని' కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేశానని రేణుకాచౌదరి వెల్లడించారు. అందువల్లే తను ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించిందని ఆమె చెప్పారు. -
తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచాలి
-
తెలంగాణలోని 15 ఎంపీ స్థానాలు సాధిస్తాం: వీహెచ్
తమ పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తే ఎవరికైన కఠిన శిక్షలు తప్పవని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు హెచ్చరించారు. మంగళవారం ఆయన చెన్నైలో మాట్లాడుతూ... సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 15 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన కొన్ని పార్టీలు యూ టర్న్ తీసుకుంటున్నాయని వీహెచ్ ఆరోపించారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం దూసుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలో తాను సమైక్యవాదినని సీఎం ప్రకటించడం పట్ల వీహెచ్ మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కిరణ్ ధిక్కరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో అధిష్టానం కిరణ్‌పై చర్యలు తీసుకుంటుందని వీహెచ్ అభిప్రాయపడ్డారు. -
తెలంగాణకు ప్రత్యేక పీసీసీ: టీ కాంగ్రెస్
అధిష్టానానికి టీ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రి య పూర్తి కాకముందే తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక పీసీసీని ఏర్పాటు చేయాలని అక్కడి కాంగ్రెస్ నేతలు పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు కొద్ది నెలలలే ఉన్నందున తెలంగాణలో పార్టీపరంగా భారీ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్న విభజనకు ముందే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారంటున్నారు. తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలంతా కలిసి అధినేత్రి సోనియాగాంధీకి దీనిపై లేఖ రాయాలని తాజాగా నిర్ణయించారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పి.నర్సారెడ్డి, కె.యాదవరెడ్డి, పొన్నం ప్రభాకర్, బి.కమలాకరరావు తదితర తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం గాంధీభవన్‌లో బొత్సను కలిసి చర్చించారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదానికి ముందే టీపీసీసీని ఏర్పాటు చేసేలా అధిష్టానంపై ఒత్తిడి తేవాలని కోరారు. -
వెనుకబడిపోయాం!
భవిష్యత్తుపై టి.టీడీపీ ఆందోళన పట్టు సాధించాలని వ్యూహం... భారీ సభకు సన్నాహాలు నేడు అధినేత చంద్రబాబుతో భేటీ సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల కన్నా వెనుకబడిపోయామనే ఆవేదన ఆ ప్రాంత టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తాము లేఖ ఇచ్చినప్పటికీ ఈ విషయాన్ని అనుకున్నంత స్థాయిలో ప్రజలకు వివరించలేకపోయామని నేతలు బాహాటంగానే వెల్లడిస్తుండడం దీనికి ఉదాహరణ. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పుంజుకునేందుకుగాను తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలనే అంశంపై ఈ ప్రాంత టీడీపీ నేతలు బుధవారం సమావేశమై చర్చించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో గురువారం సమావేశమై తదుపరి కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకరరావు, దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ, ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, జీ జైపాల్‌యాదవ్, ఎనుముల రేవంత్‌రెడ్డి, హన్మంత్‌షిండే తదితరులు పాల్గొన్నారు. దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు అనివార్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఎవ్వరూ అడ్డుకోలేరని, అయితే ప్రక్రియలో కొంత జాప్యం జరగొచ్చన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ దాన్ని ప్రజల్లోకి సరిగా తీసుకెళ్లలేకపోయామని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా, తమవల్లే అధికార పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పుకోడంలో వెనుకబడి పోయామన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమైంది. ఈ నెలాఖరులో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో అదేస్థాయిలో టీడీపీ కూడా భారీసభ నిర్వహించాలని యోచించారు. తాము తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు సుముఖమని, గతంలో ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోలేదని, తీసుకోబోమని కూడా ఈ సభలో చంద్రబాబుతో చెప్పించాలని కూడా నేతలు చర్చించారు. -
తెలంగాణలోనూ వైఎస్సార్సీపీ ఉంటుంది: బాజిరెడ్డి గోవర్ధన్
బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టీకరణ చంద్రబాబు మూడుసార్లు తెలంగాణను మోసం చేశారు విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చానంటూనే సీమాంధ్రలో తెలంగాణను అడ్డుకున్నానంటున్నారు ఇరుప్రాంతాలకు న్యాయం చేయలేకపోతే సమైక్యంగా ఉంచమనే వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతోంది వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేస్తే సహించం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అనేక వైఖరులు అవలంభించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ఉండగా లేనిది తమ పార్టీ ఎందుకుండదని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే ఆలోచన చేసిన నాయకుడని చెప్పారు. ఆయన ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీతో పాటు అనేక సంక్షేమ పథకాల వల్ల తెలంగాణ ప్రాంతమే అత్యధికంగా లబ్ది పొందిందని తెలిపారు. అలాంటి నాయకుడి ఆశయాల సాధన కోసం పనిచేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో కచ్చితంగా ఉంటుందని చె ప్పారు. వైఎస్‌ను అదరించిన వ్యక్తులు, అభిమానులు ఈ ప్రాంతంలో ఎంతోమంది ఉన్నారని వెల్లడించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తమ పార్టీ పాలుపంచుకుంటుందన్నారు. వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేసినా, ఈ విషయమై రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా సహించేది లేదని బాజిరెడ్డి హెచ్చరించారు. పార్టీ నేతలు నల్లా సూర్యప్రకాశ్‌రావు, బి.జనక్‌ప్రసాద్, కె.శివకుమార్, గట్టు రామచంద్రరావులతో కలసి పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల విషయంలో తమ పార్టీ మొదటినుంచీ ఒకే వైఖరి అవలంభిస్తున్న విషయం బాజిరెడ్డి గుర్తుచేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనిపక్షంలో సమైక్యంగా ఉంచమని చెబుతోందే తప్ప ఇతర పార్టీల మాదిరిగా ప్రాంతాల వారీగా వైఖరులను అవలంభిస్తూ ప్రజలను గందరగోళ పరచడంలేదన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై పోటీ చేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించిన విషయం ఆయన గుర్తుచేశారు. న్యాయంగా వ్యవహరిస్తున్న పార్టీపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరమేంటో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీ ఉండగాలేనిది వైఎస్సార్సీపీ ఎందుకుండదు? ‘తెలంగాణ ప్రాంతాన్ని మూడుసార్లు మోసం చేసిన చంద్రబాబు ఒకపక్క విభజనకు లేఖ ఇచ్చానని చెబుతూనే.. మరోపక్క సీమాంధ్రలో యాత్ర చేస్తూ తెలంగాణను అడ్డుకున్నది తానే అని చెబుతున్నారు. అలాంటి టీడీపీ, ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ ప్రజలను మోసగించిన బీజేపీ రెండు ప్రాంతాల్లో ఉండగాలేనిది, వైఎస్సార్సీపీ ఎందుకు ఉండదు?’ అని బాజిరెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని చెబుతున్న టీఆర్ఎస్ నేతలు...సీమాంధ్రలో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరును ఎందుకు ఎండగట్టడం లేద ని ఆయన నిలదీశారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర నేతలను ఎందుకు బహిష్కరించ డంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు తమ పార్టీపై చేస్తున్న విష ప్రచారాన్ని ఆపకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల మధ్య తీరానికి అనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అవరించి ఉందని విశాఖపట్నంలోని తుపాన్ హెచ్చరికల కేంద్రం శనివారం వెల్లడించింది. అలాగే ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దాంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయిని తెలిపింది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల భారీగా వర్షాలు పడతాయని తుపాన్ హెచ్చరికల కేంద్రం చెప్పింది. -
తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు పురిటిగడ్డ
తెలంగాణ అనేది కొత్త రాష్ట్రం కాదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో వెల్లడించారు. తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు పురిటిగడ్డ అని ఆయన అభివర్ణించారు. అలాగే ఎన్నో చారిత్రక ఉద్యమాలకు తెలంగాణ ప్రాంతం పుట్టినిల్లు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం అనేది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం వ్యతిరేకం కాదని రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతోందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. 60 ఏళ్ల తెలంగాణ కల త్వరలో సాకారం కానుందని తెలిపారు. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రాంతంలో అంతర్భాగమేనని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగ, విద్యా రంగాల్లో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరిగిందని రాజనర్సింహ ఆరోపించారు. విశాలాంధ్ర కావాలని తెలంగాణ ప్రజలు ఇప్పుడు కోరుకోవడం లేదని రాజనర్సింహ పేర్కొన్నారు.