భద్రాచలాన్ని విభజిస్తే తడాఖా చూపిస్తా: రేణుకా చౌదరి | Bhadrachalam Is Integral Part Of Telangana region, says Renuka Chowdary | Sakshi

భద్రాచలాన్ని విభజిస్తే తడాఖా చూపిస్తా: రేణుకా చౌదరి

Nov 27 2013 1:38 PM | Updated on Sep 2 2017 1:02 AM

భద్రాచలాన్ని విభజిస్తే తడాఖా చూపిస్తా: రేణుకా చౌదరి

భద్రాచలాన్ని విభజిస్తే తడాఖా చూపిస్తా: రేణుకా చౌదరి

భద్రచలం తెలంగాణాలోనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి స్పష్టం చేశారు.

భద్రచలం తెలంగాణాలోనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి స్పష్టం చేశారు. అలాకాదని తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలాన్నివిడతీస్తే నా తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. బుధవారం రేణుకాచౌదరి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.

 

సీఎం కిరణ్ తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె పేర్కొన్నారు. 'మా అమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెను దగ్గరండి చూసుకోవాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించలేనని' కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేశానని రేణుకాచౌదరి వెల్లడించారు. అందువల్లే తను ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించిందని ఆమె చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement