రేణుకా చౌదరీ ధర్నా, రాస్తారోకో!
రేణుకా చౌదరీ ధర్నా, రాస్తారోకో!
Published Thu, Sep 4 2014 2:59 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
ఖమ్మం: రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ ఖమ్మం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భధ్రాచలం మండలంలోని మూడు గ్రామ పంచాయితీలను తెలంగాణలోనే ఉంచాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేణుకా చౌదరీ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ఏడు మండలాలను విలీనం చేసుకునే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రకారం ఈ ఏడాది జూన్ 2 నుంచి ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిం చిన విషయం విదితమే.
Advertisement