సాక్షి, ఖమ్మం జిల్లా: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. నూతనంగా పెంచిన డైట్ ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం పడుతుందన్నారు.
‘‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 2014 నాటికి 72450 కోట్ల రూపాయలు.. ప్రభుత్వంతో పాటు కొన్ని కార్పొరేట్ బ్యాంక్‌ల ద్వారా అప్పులు చేసింది. 5893 కోట్లు రాష్ట్ర విభజన జరిగే నాటికి అప్పు ఉంటే అవి 95 వేల కోట్లకు పెరిగింది. పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 23 వేల కోట్లు చేసింది. అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మేము కూడ అప్పులు చేశామని అంటున్నారు. మీరు చేసింది తినేందుకు, మేము చేసేది అప్పు కట్టేందుకు’’ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50 వేల కోట్లు.. మేము అప్పు వడ్డీ కలిపి 66 వేల 722 కోట్లు చెల్లించాం. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు 6 వేల 400 కోట్లు ఉండేది. ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి, తగుదునమ్మా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద అరుస్తా ఉన్నారు. 10 ఏళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి అన్నంలో పురుగులు వంటివి వచ్చాయి. మళ్ళీ తిరిగి రెసిడెన్షియల్ స్కూల్లో టాయిలెట్స్ సరిగా లేవని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా?’’ అంటూ భట్టి ప్రశ్నించారు.
‘‘మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 66 వేల కోట్ల రూపాయలు అప్పు కడుతూ రైతుల అప్పు కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు రైతుల అప్పు కట్టలేదు. రైతు భరోసా 7 వేల 625 కోట్లు కల్పించాం. రైతు బీమా కట్టాం. 1500 రూపాయలు రైతు బీమా ప్రభుత్వం కట్టింది. ఆయిల్ ఫోం కి 40 కోట్లు విడుదల చేశాం. 30 వేల కోట్ల రూపాయలు రైతులకు మేము బోనస్ కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుండి వాటికి నేరుగా ఖర్చు పెట్టాం’’ అని భట్టి విక్రమార్క వివరించారు.
పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుంది. భూమిలేని నిరుపేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. డిసెంబర్ 28వ తేదీన మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తుంది. రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 56 వేల మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించాం. ఇంకా 22 వేల కోట్ల బడ్జెట్‌తో 3500 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రతిపక్ష పార్టీ వాస్తవాలను అవాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది’’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment