Renuka Chowdary
-
ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు
-
కాంగ్రెస్ ఎంపీ టికెట్ రేసు.. ఆశావహుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ స్థానాలకు టికెట్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు. ఈరోజు సాయంత్రం వరకు ఆశావహుల నుండి హస్తం పార్టీ అప్లికేషన్లను స్వీకరించనుంది. ఇప్పటి వరకు 17 స్థానాలకు గాను 140 మంది అప్లికేషన్స్ దాఖలు చేసుకున్నారు. ఇక, అప్లికేషన్స్ ఇవ్వడానికి నేడు చివరిరోజు కావడంతో నిన్న(శుక్రవారం) భారీగా దరఖాస్తులు అందాయి. ఆశావహులు వందకుపైగా అప్లికేషన్స్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎంపీ టికెట్ల కోసం ప్రొఫెసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు పోటీ పడుతున్నారు. దరఖాస్తులకు చివరి రోజు కావడంతో నేడు పెద్ద సంఖ్యలో అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. ఖమ్మం కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలో చోటుచేసుకుంటున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది. మాజీ సీనియర్లు, కీలక నేతల కుటుంబ సభ్యులు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగేందర్, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి టికెట్ రేసులో ఉన్నారు. కాగా, ఈరోజు ఖమ్మంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ ఆఫీస్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మల్లు నందిని వెళ్లనున్నారు. మల్లు నందినికే టికెట్ ఇవ్వాలని విక్రమార్క్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఖమ్మం ఎంపీ స్థానంలో సోనియా గాంధీ పోటీ చేయకపోతే.. అక్కడ తాను పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ప్రకటించారు. దీంతో, ఖమ్మం అభ్యర్థి ఎవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. -
టీకాంగ్రెస్‌లో పాలి‘ట్రిక్స్’.. కమ్మ కులంతో కొత్త రాజకీయం!
తెలంగాణలో కమ్మ సామాజికవర్గం ప్రతినిధిగా తనను తాను ఫోకస్ చేసుకోవడానికి కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం వద్దకు కమ్మ జేఏసీ నేతలను కొందరిని తీసుకువెళ్లారు. అక్కడ వచ్చే శాసనసభ ఎన్నికలలో కమ్మ వర్గానికి పన్నెండు సీట్లను కాంగ్రెస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఏపీలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పాలి. 1983కి ముందు కమ్మ వర్గం కూడా కాంగ్రెస్‌తోనే ఉందని గణాంకాలు చెబుతాయి. తదుపరి తెలుగుదేశం పార్టీ కమ్మ సామాజికవర్గం ఆధిపత్యంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్నట్లు లెక్కలు వెల్లడిస్తాయి. ఆయా ఎన్నికలలో ఇతర సామాజికవర్గాలను ఎవరు ఆకర్షించగలిగితే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆంధ్ర, తెలంగాణలో రెండు చోట్ల ప్రాముఖ్యత కలిగి ఉంది. కమ్మ వర్గం ప్రధానంగా ఆంధ్రకే పరిమితమైందని చెప్పాలి. రెడ్డి వర్గం ప్రతీ ఎన్నికలోనూ రెండు ప్రాంతాలలో కలిపి సుమారు ఎనభై నుంచి తొంభై మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తుంటే, కమ్మ వర్గం అత్యధికంగా ఆంధ్రలోనే గెలుస్తోంది. రెండు ప్రాంతాలలో కలిపి వీరు అత్యధికంగా 1994లో 53మంది, అత్యల్పంగా 2018లో తెలంగాణలో ఐదుగురు, 2019లో ఏపీలో పదిహేడు మంది అంటే రెండు రాష్ట్రాలలో కలిపి ఇరవై రెండు మంది గెలిచారు. 2014లో రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 38 మంది, ఉమ్మడి ఏపీలో 2009లో 27, 2004లో 35, 1999లో 43, 1994లో 53, 1989లో 36, 1985లో 52, 1983లో 51, 1978లో 41, 1972లో 35, 1967లో 41, 1962లో 39 మంది గెలిచారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కమ్మ వర్గం 1985లో అత్యధికంగా ఎనిమిది మంది నెగ్గారు. మిగిలిన ఎన్నికలలో రెండు నుంచి ఏడుగురు వరకు మాత్రమే గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కూడా టీడీపీ ఉనికిని నిలబెట్టడానికి ఈ వర్గం యత్నించింది. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసుతో మొత్తం పార్టీ ఇక్కడ కకావికలం అయింది. దాంతో కమ్మ వర్గం వారు ఏ పార్టీకి అధికారం వస్తే అటువైపు మొగ్గు చూపడానికి అధికంగా ఇష్టపడుతన్నట్లు అనిపిస్తుంది. గత రెండు ఎన్నికలలో టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్ ) పాలన పగ్గాలు చేపట్టగా, కమ్మ వర్గం ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినా అంతా టీఆర్ఎస్లో చేరిపోయారు. రెడ్డి వర్గం ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి కొందరు టీఆర్ఎస్లో చేరినా, పూర్తిగా ఆ పార్టీకి దూరం కాలేదు. 2018 ఎన్నికలలో టీడీపీ, కాంగ్రెస్‌లు పొత్తు పెట్టుకోవడంతో కమ్మవర్గం నేతలు కూడా ఆ బాట పట్టారు. కానీ, పెద్దగా ఫలితం సాధించలేకపోయారు. టీఆర్ఎస్ పక్షాన పోటీచేసిన ఐదుగురు కమ్మ అభ్యర్దులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. టీడీపీ లేదా కాంగ్రెస్ నుంచి ఒక్కరు కూడా గెలవలేదు. చివరికి దివంగత టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనుమరాలు, మాజీ మంత్రి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్పల్లి నుంచి పోటీచేసి ఘోర పరాజయం చెందారు. ఏ వర్గం వారైనా కేవలం కులం ఆధారంగానే గెలవరని ఈ ఎన్నికలు రుజువు చేశాయి. టీడీపీ సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలవడాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు విభజిత ఆంధ్రలో అప్పటికే చంద్రబాబుపై ఏర్పడిన విపరీతమైన వ్యతిరేకత కూడా చాలా ప్రభావం చూపింది. 2014లో టీఆర్ఎస్ నుంచి ఒక్క కమ్మ అభ్యర్ధి గెలుపొందలేదు. ఇద్దరు టీడీపీ నుంచి, ఇద్దరు కాంగ్రెస్ నుంచి, ఒకరు బీఎస్పీ నుంచి విజయం సాధించారు. తదుపరి కాలంలో వీరంతా టీఆర్ఎస్లోకి జంప్ చేశారు. ఆ తర్వాత ఒక ఉప ఎన్నిక ద్వారా మరో కమ్మ నేత టీఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. ఉమ్మడి ఏపీలో ఎన్నికలు జరిగినప్పుడు పరిశీలిస్తే 2009లో తెలంగాణలో ముగ్గురు గెలవగా వారిలో ఇద్దరు టీడీపీ, ఒకరు లోక్‌సత్తాకు చెందినవారు. 2004లో కూడా ఈ వర్గం వారు ముగ్గురే గెలిచారు. ఒకరు కాంగ్రెస్ నుంచి, ఇద్దరు ఇతరులు కావడం విశేషం. టీడీపీ నుంచి ఎవరూ గెలవలేదు. 1999లో టీడీపీ పక్షాన ముగ్గురు విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి ఎవరూ గెలవలేదు. 1994లో ఆరుగురు విజయం సాధించగా, టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ ఒకరు, ఇతరులు ఒకరు గెలిచారు. 1989లో ముగ్గురు గెలిస్తే టీడీపీ నుంచి ఒకరు, ఇద్దరు ఇతర పార్టీలవారు. 1985లో మొత్తం ఎనిమిది మందికి గాను, ఆరుగురు టీడీపీ, ఇద్దరు టీడీపీ కూటమిలోని ఇతర పార్టీలవారు. తెలంగాణ చరిత్రలో ఈ ఎన్నికలోనే కమ్మ వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అవడం విశేషం. 1983లో గెలిచిన ఏడుగురు కమ్మ ఎమ్మెల్యేలు టీడీపీవారే. ఎన్టీరామారావు ప్రభంజనం వీయడంతో వీరు విజయం సాధించారు. అంతకుముందు 1978 ఎన్నికలలో కమ్మ వర్గం వారు ఐదుగురు, 1972, 1967లలో నలుగురు 1962లో ఇద్దరు గెలుపొందారు. స్థూలంగా చూస్తే తెలంగాణ ప్రాంతంలో కమ్మ సామాజికవర్గం ఎప్పుడూ పెద్ద బలంగా లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ వర్గం ఓన్ చేసుకోవడానికి యత్నించింది. అది కొంతకాలం బాగానే సాగినా, ఆ తర్వాత అది నెగిటివ్ గా మారుతోంది. ప్రత్యేకించి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కమ్మ సామాజికవర్గం వారు ఎక్కువ శాతం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న భావనతో ఇతర వర్గాలవారు ఆ పార్టీకి దూరమయ్యారు. తాజా పరిణామాలలో కమ్మ ఓటర్లను పోలరైజ్ చేయడానికి రేణుకా చౌదరి వంటివారు యత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ వర్గం సంఖ్య కాస్త ఎక్కువగా ఉండటమే కారణం. నిజంగానే కమ్మ వర్గానికి అంత బలం ఉంటే చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇవ్వవచ్చు కదా! అలా చేయడం లేదంటే కారణం అర్ధం చేసుకోవచ్చు. అయినా రేణుక వంటివారు కమ్మ వర్గాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీలో అవినీతి కేసు నమోదై, ఆయన జైలుకు వెళితే దానిని కమ్మ సామాజికవర్గంపై దాడిగా ఆమె ప్రచారం చేసింది. ఎందుకైనా మంచిదని ఇతర పార్టీలవారు కూడా అదే బాటలో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడిపోయిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఆ వర్గం వారిని కాంగ్రెస్‌కు అంటగట్టడానికి యత్నిస్తున్నాయి. నిజానికి ఆ వర్గం కానీ, ఆయా సెటిలర్ వర్గాలుగానీ కొంత కాలం క్రితం వరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారన్న అభిప్రాయం ఉంది. కానీ, చంద్రబాబు అరెస్టు ఉదంతం తర్వాత కమ్మ వర్గాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించడానికి వ్యూహాలు పన్నుతున్నారు. నిజానికి ఏ కులం వారైనా తమ ఇష్టం వచ్చిన పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు. కానీ, ఒక భావజాలాన్ని వ్యాప్తిలోకి తెచ్చి కమ్మవారు ఫలానా పార్టీకి అనుకూలం అనుకోవాలనేది కొందరి వ్యూహం. రేణుకా చౌదరి ఖమ్మం జిల్లాలో తనకు, అనుయాయులకు టిక్కెట్లు ఇప్పించుకోవడానికి కులం కార్డు ఉపయోగిస్తున్నారు. నలభై నియోజకవర్గాలలో కమ్మ వర్గం గణనీయంగా ఉందని, ముప్పై చోట్ల గెలుపు, ఓటములు నిర్ణయించే దశలో ఉందని, పది చోట్ల విజయావకాశాలు కలిగి ఉందని కమ్మ ఐక్యవేదిక కాంగ్రెస్ అధినాయకత్వానికి వివరించింది. వీటిలో ఎక్కువ భాగం హైదరాబాద్ పరిసరాలలోనివి కాగా, కొన్ని నిజామాబాద్, నల్గొండ జిల్లాలలోనివి. జూబ్లిహిల్స్, శేరీలింగంపల్లి, కూకట్పల్లి, కుత్చుల్లాపూర్, మేడ్చల్, ఖమ్మం, మల్కాజిగిరి, కొత్తగూడెం, కోదాడ, పాలేరు మొదలైన చోట్ల టిక్కెట్లను ఆశిస్తున్నట్లు ఈ వేదిక తెలిపింది. ఒకరకంగా ఇది కులం పేరు చెప్పుకుని కొందరు ఆయా పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏ సామాజికవర్గం వారికైనా వారి సత్తాను బట్టి పార్టీలు టిక్కెట్లు ఇస్తాయి. కాకపోతే కమ్మ వర్గం కొంత ఆర్ధిక బలం కూడా కలిగి ఉంటుందన్న అభిప్రాయం ఉంది. టీఆర్ఎస్ కమ్మ వర్గానికి చెందిన ఐదుగురికి టిక్కెట్లు కేటాయించింది. కాంగ్రెస్ అంతకు మించి ఇస్తుందా అన్నది సందేహమే. ఈ వర్గం నేతల హడావుడి కారణంగా, కాంగ్రెస్ హై కమాండ్ బీసీ వర్గం నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదట. అది ఆ పార్టీకి తలనొప్పి అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదేదో కమ్మ వర్గం వారికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకపోతే నష్టం అనుకుంటే అది పెద్ద పొరపాటు అవుతుంది. పైగా ఇతర వర్గాలలో అపోహలు పెరిగే అవకాశం ఉండవచ్చు. అసలే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పటికీ చంద్రబాబుకు సన్నిహితుడన్న ప్రచారం ఉండగా, ఆయనను రేణుకా చౌదరి వంటివారు ఇలాంటి వివాదాలలోకి తీసుకు వెళ్లకుండా ఉంటేనే పార్టీకి ప్రయోజనం అని చెప్పాలి. ఏది ఏమైనా గత అరవైఐదేళ్ల తెలంగాణ ఎన్నికల చరిత్రను చూస్తే కమ్మ సామాజికవర్గం అంత ప్రభావశీలిగా లేదనే చెప్పాలి. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేయడంలో భాగంగా ఏ పార్టీ అయినా ఇతర కులాలతో పాటు కమ్మవారు కొందరికి కూడా టిక్కెట్లు ఇస్తాయి. కానీ, అదే సమయంలో ప్రత్యేకించి రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒక గ్రూపు తయారై అనవసరంగా రాజకీయాలు చేస్తూ ఆ వర్గం వారికి అప్రతిష్ట తేకుండా ఉంటే అదే పదివేలు అని చెప్పాలి. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్. -
Babu : కేవలం ఆ కులానికే నాయకుడా?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంలో అరెస్టు చేయడంపై తెలంగాణలోని వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్న తీరు కొంత ఆశ్చర్యంగాను, మరికొంత ఆసక్తికరంగాను ఉంది. వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వీరు మాట్లాడుతున్నట్లుగా తెలిసిపోతుంది. చివరికి వీరంతా కలిసి చంద్రబాబును ఒక కుల నాయకుడుగా పరిమితం చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ వంటి పార్టీల నేతలు కొంచెం గట్టిగా స్పందించారు. నిజానికి ఏపీ పరిణామాలతో వీరెవ్వరికి సంబంధం లేదు. వీరేదో ప్రజాస్వామ్యం కోసమో, లేక చట్టం, రాజ్యాంగం కోసమో మాట్లాడలేదు. అవినీతికి వ్యతిరేకంగా స్పందించలేదు. చంద్రబాబు వీటన్నింటికి అతీతుడు అన్న ధోరణితో వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టును కమ్మ సామాజికవర్గంపై దాడిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చెప్పడం విడ్డూరంగానే ఉంటుంది. ఒక రకంగా కమ్మ కులానికి ఈ కేసుకు లింకు పెట్టి ఆ కులం పరువు తీస్తున్నారు. ✍️చంద్రబాబుకు వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వదలిస్తే , అవినీతిని సమర్ధించదలిస్తే ఆమె సొంతంగా చేసుకోవచ్చు. కానీ, ఆ మొత్తాన్ని కమ్మ కులానికి అంటించడం నీచంగా అనిపిస్తుంది. గతంలో ఆమె టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆమెతో సహా కాంగ్రెస్ నేతలు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయలేదా?. అప్పుడు కమ్మ కులంపై దాడిగా పరిగణించరా?. గతంలో సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మక్కై ఆనాడు ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టించడాన్ని రెడ్డి సామాజికవర్గంపై దాడి అని ఆమె ఎన్నడైనా చెప్పారా?. ప్రస్తుతం రేణుకా చౌదరి.. సీఎం జగన్‌పై కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి కారణం ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజికవర్గం అధిక సంఖ్యలో ఉండడంతో వారి మద్దతు కూడగట్టుకునే కృషిలో భాగంగా ఆమె ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఆ వర్గం వారిలో అలాంటి అపోహలు సృష్టించడమే ఆమె ఉద్దేశం. అదీ కాకుండా ఇటీవలి కాలంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రభావం పార్టీలో పెరగడం కూడా ఆమెకు ఇష్టం ఉండకపోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పాలేరు సీటును ఆశిస్తున్నారు. అక్కడ నుంచి పోటీచేస్తానని గతంలో ఆమె ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేసే ఆలోచన సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు రేణుకకు నచ్చడం లేదు. అందుకే షర్మిల గురించి కూడా అనవసర వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు అరెస్టుపై షర్మిల ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. ఆమె మాటల్లో కాంగ్రెస్ వాదం కన్నా, కుల భావనే అధికంగా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికలలో ఆ ప్లాంక్‌పై గెలవాలన్నది ఆమె లక్ష్యం కావచ్చు. పోనీ నిజంగానే ఆమెకు చంద్రబాబుపై రాజకీయంగా, లేదా కుల పరంగా అంత అభిమానం ఉందా అంటే అవునని చెప్పలేం. ✍️1994లో ఆమె టీడీపీకి దూరమై సొంతంగా లాంతరు గుర్తు మీద పార్టీ పెట్టుకున్నారు. ఆ తర్వాత టీడీపీలో జరిగిన పరిణామాలతో తిరిగి పార్టీలో ప్రవేశించారు. కేంద్రంలో ఐకె గుజ్రాల్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ఆ సమయంలో ఆమె తాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నా పవర్ఫుల్ అన్నట్లు వ్యవహరించడంతో ఆయన ఈమెను దూరం పెట్టారని చెబుతారు. అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం నుంచి ఎంపీగా గెలుపొందారు. కానీ, ఇప్పుడు ఆమె సడన్‌గా చంద్రబాబు మద్దతుదారు అయిపోయారు. దానికి కారణం ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజికవర్గ ప్రభావం అధికంగా ఉండడం, వారిలో ఎక్కువ మంది టీడీపీకి అనుకూలంగా ఉండడం, వారిని ఆకర్షించే పనిలో ఉన్న ఆమె అదేదో కులానికి జరిగిన నష్టంగా చూపించి తను లబ్ది పొందాలన్న తాపత్రయం తెలుస్తూనే ఉంది. అంతే తప్ప చంద్రబాబు పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉంటుందని అనుకోజాలం. అదే సమయంలో ఆమె తన రాజకీయస్వార్దం కోసం పార్టీలోని కొన్ని వర్గాలను దూరం చేయడానికి కూడా వెనుకాడటం లేదనిపిస్తుంది. సీఎం జగన్, షర్మిలపై పరుష వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణలోని రెడ్డి వర్గాన్ని, వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వివిధ వర్గాలను కాంగ్రెస్ దరికి చేరకుండా అడ్డుపడినట్లు కూడా అవుతుందన్న భావన ఉంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈమె కన్నా చంద్రబాబుకు చాలా సన్నిహితుడు. అయినా ఆయన ఇంతవరకు స్పందించకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ, రేణుకా చౌదరి తెలుగుదేశం నేతలకన్నా ఎక్కువగా రెచ్చిపోయి మాట్లాడడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. కాకపోతే ఆయన కొంతకాలం చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేశారు కనుక ఆ భావన ఉండవచ్చు. అదే టైమ్‌లో ఖమ్మం రాజకీయాలు కూడా ప్రభావితం చేసి ఉండవచ్చు. ✍️ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కావాలని చంద్రబాబుకు అనుకూలమైన ప్రకటనలు చేస్తూ బీజేపీ పరువును తీస్తున్నారు. ఎవరైనా సాధారణ స్థాయి నేతలు మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు. కానీ, జాతీయ హోదాకు వెళ్లిన ఆయన ఇలా చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్ షాను అవమానిస్తున్నట్లుగా ఉంది. మోదీనే ఏపీకి గత ఎన్నికల సమయంలో వచ్చి చంద్రబాబు అవినీతి చేశారని ప్రసంగించి వెళ్లారు. మోదీని చంద్రబాబు నానా విధాలుగా దూషించారు. ఈ మధ్యనే కేంద్ర ఆదాయశాఖ చంద్రబాబుకు 118 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముకు లెక్కలు చెప్పాలని నోటీసులు ఇచ్చింది. వాటిని పట్టించుకోకుండా సంజయ్ మాట్లాడటం కూడా కుల రాజకీయమే అని చెప్పాలి. బీజేపీకి హైదరాబాద్‌లోనే కాస్త పట్టు ఉందన్న భావన ఉంది. అక్కడ వివిధ నియోజకవర్గాలలో కమ్మ సామాజికవర్గ ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఆ ఓట్లను దృష్టిలో ఉంచుకుని సంజయ్ ఈ ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు వైఎస్సార్సీపీకి మైనస్ అని కూడా చెప్పారని టీడీపీ మీడియా ఊదరగొడుతోంది. కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలుత అటూ, ఇటూ కాకుండా స్పందించారు. ఆ తర్వాత ఆయన కూడా చంద్రబాబు అరెస్టును తప్పుపడుతూ మాట్లాడారు. అంటే, బండి కంటే వెనుకబడకూడదన్న తాపత్రయం, ఆయన సికింద్రాబాద్ ఎంపీ కావడమే దీనికి కారణం. మరో నేత కె.లక్ష్మణ్ కూడా చంద్రబాబు పట్ల సానుకూలంగా మాట్లాడే యత్నం చేశారు. వీరంతా తెలంగాణ ఎన్నికల కోసమే ఇలా మాట్లాడుతున్నారన్న సంగతి అర్ధం అయిపోతుంది. ✍️ మరి ఇదే పార్టీ వారు గతంలో చంద్రబాబుపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేశారో గుర్తు చేసుకోవాలి. తెలంగాణ బీజేపీ నేతలు గత నాలుగైదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆఆర్‌ను, ఆయన కుమార్తె కవితను ఎన్నిసార్లు జైలుకు పంపుతామని హెచ్చరించారు. కవితను పలుమార్లు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఇంటరాగేషన్‌కు పిలిచింది. తాజాగా కూడా ఈడీ మళ్లీ నోటీసు ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు ఇది రాజకీయ కక్ష అని అంటున్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు అంగీకరిస్తారా?. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిని ఎలా పీకేసింది అంతా చెబుతుంటారు. దానిని కూడా కక్షగానే వీరు ఒప్పుకోవాలి. కేంద్రం రాజకీయ కక్ష కోసం సీబీఐని వాడుతోందని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ ఆప్ మంత్రులు కొందరిని బీజేపీ ఎలా అరెస్టు చేయించింది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత శశికళ ఎలా అరెస్టు అయింది మొదలైన వాటి గురించి ప్రస్తావిస్తే వీరి అసలు రంగు తెలుస్తుంది. మరోవైపు కొందరు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. మంత్రి హరీష్ రావు కాస్త జాగ్రత్తగానే మాట్లాడారు కానీ.. రాజకీయ లక్ష్యాన్ని వదలిపెట్టలేదని అర్దం అవుతుంది. ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య పోరాటంగా ఆయన చిత్రీకరించారు. అదే సమయంలో చట్టం తన పని చేసుకుపోతుందని అన్నారు. తద్వారా కమ్మ, రెడ్డి వర్గాలు దూరం కాకుండా చూసుకునే యత్నం చేశారనిపిస్తుంది. మరో మంత్రి పువ్వాడ అజయ్ మాత్రం కాంగ్రెస్ నేత రేణుకా చౌదరితో పోటీ పడి చంద్రబాబును సమర్ధించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వంటివారు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారు. దీని వెనుక బీజేపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ✍️కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబును ఉద్దేశించి డర్టియస్ట్ పాలిటీషియన్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు స్వరం మార్చి బీఆర్ఎస్ నేతలు కొందరు ఎందుకు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారో ఊహించడం కష్టం కాదు. ఓటు కు నోటు కేసు సమయంలో చంద్రబాబుపై కేసీఆర్‌తో సహా, బీఆర్ఎస్ మంత్రులు, ఇతర నేతలు ఏ రకంగా విమర్శలు చేశారో అందరికీ తెలుసు. వివిధ పార్టీలకు చెందిన వీరంతా కలిసి చివరికి చంద్రబాబును కేవలం ఒక కులానికి సంబంధించిన నాయకుడు మాదిరి ప్రొజెక్టు చేయడం విశేషమే అని చెప్పాలి. ఈ వ్యాఖ్యలు చేసిన నేతలు ఎవరూ స్కిల్ స్కామ్ గురించి ప్రస్తావించకుండా అలా అరెస్టు చేస్తారా? ఇలా చేస్తారా? అని ఏవో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబే హెలికాప్టర్లో రానని, తన వాహనంలో రోడ్డు మార్గాన ప్రయాణం చేసిన సంగతి తెలియనట్లు తెలంగాణ పార్టీల నేతలు నటిస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల రాజకీయం కోసమే. రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమనడానికి ఇవన్నీ ఉదాహరణలే. కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ ఇది కూడా చదవండి: అమావాస్యనాడు పవన్ తొందరపాటు! ఫలితం.. ఢిల్లీకి ఉరుకులు -
బీజేపీ, బీఆర్ఎస్కు షాక్ తప్పదా?.. రేణుకా చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సాక్షి, ఖమ్మం: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ మీటింగ్ తర్వాత బీఆర్ఎస్, బీజేపీ నేతలు భయపడుతున్నారు. ఈ రెండు పార్టీల నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా, రేణుకా చౌదరి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసే జిమ్మిక్కులు ప్రజలకు తెలుసు. కర్ణాటక నుంచి కమలాన్ని తరిమేసాం. బీఆర్ఎస్, బీజేపీ నేతలకు త్వరలోనే షాక్ తగలబోతుందంటూ జోస్యం చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి.. అది మీరందరూ చూస్తూనే ఉన్నారు. కాంగ్రెస్‌కు భయపడే బీజేపీ.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను మార్చారు. ఇదే సమయంలో కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కిషన్‌రెడ్డి తీసుకువచ్చారని అన్నారు. వీటన్నింటిలో కేసీఆర్ మంతనాలు ఉన్నాయని ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ గంగా నది లాంటిదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ.. బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ -
ఆమే రేణుకా చౌదరి కాదు రాక్షస చౌదరి: కొత్తపల్లి రజనీ
-
రేణుకా చౌదరి.. ఒక రాక్షస చౌదరి: రజనీ చౌదరి
తాడేపల్లి: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై వైఎస్సార్సీపీ మహిళా నేత రజనీ చౌదరి ధ్వజమెత్తారు. రేణుకా చౌదరి ఒక రాక్షస చౌదరి అని మండిపడ్డారు. రేణుకా చౌదరి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆమె నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని రజనీ చౌదరి హెచ్చరించారు. ఇకనైనా రేణుకా చౌదరి తీరు మార్చుకోవాలన్నారు. ఒకవైపు విశాఖలో పెట్టబడుల సదస్సు జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని, ఆ సదస్సును పక్కదారి పట్టించడానికే రేణుకా చౌదరిని చంద్రబాబు తెరపైకి తెచ్చాడని రజనీ చౌదరి విమర్శించారు. సీఎంను నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని, ఏనుగు వెళ్తుంటే రేణుకా చౌదరి వంటి కుక్కలు మొరుగుతూనే ఉంటాయని కౌంటర్ ఇచ్చారు . చంద్రబాబుకు ఫిమేల్ వెర్షన్ రేణుకా చౌదరి అని విమర్శించారు. తాము కూడా నోటికొచ్చినట్లు మాట్లాడగలమని విషయం రేణుకా చౌదరి తెలుసుకుంటే మంచిదన్నారు రజనీ చౌదరి. -
సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు
సంస్థాన్ నారాయణపురం, చండూరు: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మార్చిన కేసీఆర్‌కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వనున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం మహ్మదాబాద్, నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలంలోని శేరిగూడెం గ్రామాల్లో శనివారం రేణుకాచౌదరి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ’’కేసీఆర్.. నీకు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకో.. పిచ్చి వేషాలు మా దగ్గర కాదు.. నీ పప్పులు ఉడకవు’’ అంటూ హెచ్చరించారు. పాల్వాయి స్రవంతి చేతికి ఉన్నవి గాజులు కావని విష్ణు చక్రాలని అన్నారు. మునుగోడు నియోజకవర్గం తమ్ముడి కోసం అంట.. అన్నదమ్ములిద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్‌ని ఉద్దేశించి విమర్శించారు. చదవండి: సుప్రీం జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలి -
ఖమ్మం నుంచే కేసీఆర్‌పై దండయాత్ర
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎం కేసీఆర్‌పై ఖమ్మం జిల్లా నుంచే దండయాత్ర ప్రారంభిస్తామని కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధిష్టానం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది పార్టీ స్వార్థం కోసం కాదని, రాష్ట్ర ప్రజల కోసమని పేర్కొన్నారు. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా నియుక్తుడైన రేవంత్‌రెడ్డి శుక్రవారం రేణుకాచౌదరిని ఆమె నివాసానికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మళ్లీ వస్తామని అంటున్నారని, తమకు ఫోన్లు కూడా వస్తున్నాయని చెప్పారు. గొప్ప గొప్ప మాటలు చెప్పే ప్రధాని మోదీ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్‌ను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి: రేవంత్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. పక్క రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటుంటే తెలంగాణలో అసెంబ్లీ స్పీకర్ పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఇకపై కాంగ్రెస్ టికెట్‌తో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళితే రాళ్లతో కొట్టాలని, ఈ విషయంలో తానే ముందుంటానని పేర్కొన్నారు. చదవండి: ఏపీకి ఏకపక్ష ధోరణి సరి కాదు: మంత్రి నిరంజన్ రెడ్డి -
కేసీఆర్‌పై మండిపడ్డ రేణుకా చౌదరి
-
అందుకే కాంగ్రెస్-టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి
సాక్షి, ఖమ్మం : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్- టీడీపీ కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత కోనేరు చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు ఇవ్వటం బహుమతి కాదని, బాధ్యతని చెప్పుకొచ్చారు. టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. కేంద్రంతో పోరాడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా.. ఎన్టీ రామారావా?.. కేసీఆర్‌కు అధికార బలం ఉంటే! నాకు కార్యకర్తల బలం ఉంది అని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఖమ్మంలో తనకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నేతలని రేణుకా చౌదరి కోరారు. -
రేణుక ఆత్మీయ ‘అసమ్మతి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌదరి అనూహ్యంగా అసమ్మతిగళంతో తెరపైకి వచ్చారు. టీపీసీసీ నాయకత్వం తీరుపై ఆమె విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పేరుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ చెప్పింది ఒకటయితే, రాష్ట్రంలో జరుగుతోంది మరొకటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాకే చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కపై పరోక్ష విమర్శలు చేశారు. పదవులు... కిరీటాలు కావు... కార్యకర్తలనుద్దేశించి రేణుక మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. భవిష్యత్తు ఆందోళనగా ఉందని, పదవులు కొత్తగా వచ్చినవాళ్లు చాలా పెద్దగా ఊహించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో తామే గెలిపించామని కొందరు నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ గెలిచింది మాత్రం కార్యకర్తల పట్టుదల వల్లేనని అన్నారు. తాను సహకరించలేదని ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారని, తాను తలచుకుంటే ఆ ముగ్గురు గెలిచేవారా అని రేణుక ప్రశ్నించారు. కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకుంటేనే పార్టీ బాగుపడుతుందని, పదవులు వచ్చినంత మాత్రాన కిరీటాలు రావనే విషయాన్ని గుర్తెరగాలని ఆమె భట్టిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. తమ బినామీలను కాపాడుకుంటూ వారికి మాత్రమే పదవులు ఇప్పించుకుంటున్నారని, చదువురాని వాళ్లకు బాధ్యతలు ఇస్తే పార్టీ నాశనం కాదా అని ఆమె ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ఒక్క ఎస్సీ, ఎస్టీ నేతకు కూడా అవకాశం ఇవ్వకుండా తన వాళ్లకే పదవులు ఇప్పించుకున్నారని విమర్శించారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తా... రానున్న ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు రేణుక వెల్లడించారు. అయితే, పార్టీకి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారని, ఎవరికి దరఖాస్తు చేసుకుంటే టికెట్ ఇప్పించే బాధ్యత ఎవరు తీసుకుంటారని ఆమె ప్రశ్నించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత ఎవరు తీసుకున్నారని ఆమె నిలదీశారు. అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా తాను సహకరిస్తానని, అయితే ఖమ్మం జిల్లానేతలు కాకుండా ఇతరులకు అవకాశం ఇస్తే కార్యకర్తలు మాత్రం ఊరుకునే పరిస్థితిలో లేరని ఆమె అన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ కోసం ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ చేపట్టిన దీక్షకు మద్దతు తెలుపుతున్నానని వెల్లడించారు. పార్టీలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతానని, అయితే ఎన్నాళ్లయినా పార్టీలో ఉండే పోరాటం చేస్తాను తప్ప కాంగ్రెస్ పార్టీని వీడేదిలేదని రేణుక స్పష్టం చేశారు. ఏంటీ ‘రాజ’రికం? ముఖ్యంగా సీఎల్పీనేత భట్టి విక్రమార్క జిల్లాలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఏఐసీసీ నాయకుడు కొప్పుల రాజు సహకారంతోనే ఆయన ముందుకెళుతున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. త్వరలోనే కొప్పుల రాజు వ్యవహారశైలిపై రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహిస్తానని మాజీమంత్రి దామోదర్‌రెడ్డి చెప్పినట్టు తెలిసింది. ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను రేణుకాచౌదరికి ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి మానవతారాయ్, ఖమ్మం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, ఖమ్మం నగర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగెండ్ల దీపక్ చౌదరి, డీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు వి.వి.అప్పారావు, ఓబీసీ సెల్ చైర్మన్ బుక్కా కృష్ణవేణి, మాజీ జడ్పీటీసీ పగడాల మంజుల, ఐఎన్టీయూసీ నేత జలీల్‌ఖాన్, మైనార్టీ నాయకుడు చోటేబాబా తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌కు రేణుకా చౌదరి ఝలక్!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మాజీమంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ఆమె ప్రకటన చేశారు. గురువారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో రేణుకా చౌదరి ప్రకటన చేశారు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇతరులకు ఇస్తారంటూ లీకులు రావడంతో మనస్తాపం చెందిన ఆమె ఈసారి టికెట్ తనకు కేటాయించకుంటే పార్టీలో ఉండి కూడా దండగనే అభిప్రాయంలో ఉన్నారు. మరోవైపు ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ టికెట్ ఇవ్వకుంటే తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలని కార్యకర్తలు కూడా రేణుకా చౌదరిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరి ఇటీవలి డీసీసీ అధ్యక్షులు నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్‌లోని రేణుకాచౌదరి నివాసంలో జరిగిన సమావేశానికి ఖమ్మం కార్యకర్తలతో పాటు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ తదితరులు హాజరయ్యారు. కాగా ఇటీవలి జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో సానుకూల ఫలితాలు లభించడంతో ఖమ్మం లోక్‌సభ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. దాంతో ఖమ్మం పార్లమెంట్ సీటుపై పార్టీ అధిష్టానం ఆచితూచి స్పందిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లోని అనేక మంది ముఖ్య నేతలు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక రేణుకా చౌదరి తాజా ప్రకటన...కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేసినట్లు అయింది. -
రేణుక మోసం చేశారని గాంధీభవన్ ఎదుట ధర్నా
ఖమ్మంసహకారనగర్ : కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తన భర్త రాంజీకి గత సాధారణ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని కోటీ 20లక్షలు తీసుకున్నారని, టికెట్ రాలేదని తన భర్త మరణించారని, ఆ డబ్బును వెనక్కి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ రాంజీ భార్య కళావతి శుక్రవారం హైదరాబాద్ గాంధీభవన్ ఎదుట ధర్నా చేశారు. గిరిజన సంఘం నాయకులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కళావతి, గిరిజన సంఘం నాయకుడు రవిచంద్ర చౌహాన్లు మాట్లాడుతూ..2014లో వైరా టిక్కెట్ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని..టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రాంజీ చనిపోతే కనీసం చూడ్డానికి కూడా రాలేదని, తీరా ఇంటికి వెళ్తే కేసులు పెట్టించారని ఆరోపించారు. నాలుగేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగట్లేదని, ఈ నెల 14వ తేదీన రాహుల్ గాంధీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శికి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఇన్ని సంవత్సరాలుగా వివిధ దశల్లో పోరాడామని, అయినా స్పందించకపోవడం రేణుకకు తగదని, తమ డబ్బును వెనక్కిప్పించాలని కోరారు. -
రాహుల్ ఇంటి ముందు దీక్ష చేస్తా
హైదరాబాద్ : తన భర్తకు వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానని చెప్పి నమ్మించి, రూ.కోటి 20 లక్షలు తీసుకుని టిక్కెట్ ఇప్పించకపోగా తీవ్ర మానసిక వేదనతో చనిపోయేలా చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఖమ్మం జిల్లాకు చెందిన కళావతి డిమాండ్ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో బంజారా, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోళోత్ రవిచంద్ర చౌహాన్‌తో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. తన భర్త డాక్టర్ భూక్యా రాంజీ, ఖమ్మంలో శ్రీ హర్షిణి నర్సింగ్‌హోం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహిస్తూ పేదలకు, గిరిజనులకు ఎంతో సేవ చేశారని చెప్పారు. ప్రజల్లో మంచి పేరున్న తన భర్తకు 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పిస్తానని నమ్మబలికి కోటీ 20 లక్షలను రేణుకాచౌదరి తీసుకున్నారని, వివిధ సమావేశాల నిర్వహణకు మరో కోటి వరకు అదనంగా ఖర్చు చేయించారని చెప్పారు. టిక్కెట్ ఇప్పించకపోగా, ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే కులం పేరుతో దూషించారని, గన్‌మెన్‌తో బయటకు వెళ్లగొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మనో వేదనతోనే తన భర్త మృతిచెందారని చెప్పారు. ఆ తరువాత పలు మార్లు గిరిజన సంఘాల నాయకులతో, స్థానికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేసినట్టు చెప్పారు. పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని, రాజకీయ ఒత్తిడితో దానిని నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు చెప్పారు. కేసును రీఓపెన్ చేసి విచారించాలని గత నెల 6న కోర్టు ఆదేశించిందన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఎన్నోసార్లు కాంగ్రెస్ పెద్దలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టు విక్రమార్క, కుంతియాకు వివరించినట్టు చెప్పారు. వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేణుకాచౌదరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి, తాము మోసపోయిన నగదును వెంటనే ఇప్పించాలని కోరారు. ప్రస్తుతం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన పిల్లలని సాదుకుంటున్నానని అన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా, హైదరాబాద్ గాంధీభవన్ ఎదురుగా ధర్నా చేస్తానన్నారు. అప్పటికీ స్పందించకపోతే, ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ఎదురుగా దీక్ష చేస్తానని హెచ్చరించారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీ ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. బంజారా లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కేళోత్ రవిచంద్ర చౌహాన్ మాట్లాడుతూ .. గిరిజనులు, లంబాడీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని చెప్పారు. కేవలం రేణుకాచౌదరి కారణంగా గిరిజనులను కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోవడం సరికాదన్నారు. రేణుకాచౌదరిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేసి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనట్టయితే, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని, తండాల్లోకి ఆ పార్టీ నాయకులను రానివ్వబోమని, అన్ని గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఔను క్యాస్టింగ్ కౌచ్ ఉంది: నటుడు
ముంబై : సినీ పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తామంటూ మహిళలను లైంగికంగా దోపిడీ చేస్తుండటంపై తీవ్ర దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్‌కు పలువురు వ్యతిరేకంగా గళమెత్తుతున్న నేపథ్యంలో బాలీవుడ్‌కు చెందిన సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ భిన్నంగా స్పందించారు. క్యాస్టింగ్ కౌచ్ తప్పేమీ కాదని, అది మహిళలకు జీవనోపాధి కల్పిస్తోందని ఆమె సమర్థించారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమకే పరిమితం కాదని, పార్లమెంటులోనే ఇదే పరిస్థితి నెలకొందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ప్రకటించి సంచలనం రేపారు. ఈ నేపథ్యంలో నటుడు, రాజకీయ నటుడు శత్రుఘ్న సిన్హా స్పందించారు. రాజకీయ, వినోద రంగాల్లో లైంగిక లబ్ధులు ఇచ్చిపుచ్చుకోవడం, డిమాండ్ చేయడం సాధారణమేనని అన్నారు. ‘సరోజ్ ఖాన్ కానీ, రేణుకా చౌదరికానీ తప్పు కాదు. లైంగిక లబ్ధులు డిమాండ్ చేయడం, ఇవ్వడం వినోద, రాజకీయ రంగాల్లో ఉన్నదే. ఇది పాత విధానం. కాలపరీక్ష నిలబడిన విధానం. జీవితంలో ముందుకు వెళ్లాలంటే తప్పదు. నువ్వు నన్ను.. నేను నిన్ను సంతృప్తి పరచే విధానం. చాలాకాలం నుంచి ఇది జరుగుతూ వస్తున్నదే. ఇందులో అంత బాధపడాల్సింది ఏముంది’ అని ఆయన అన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. కొరియోగ్రఫీ రంగంలో ఆమె చేసిన సేవలు నిరూపమానమైనవని, రేఖ, మాధూరీ దీక్షిత్, దివంగత శ్రీదేవి కెరీర్లోను మలచడంలో ఆమె పాత్ర మరువలేనిదని, తన రంగంలో ఆమె లెజెండ్ అని శత్రుఘ్న పేర్కొన్నారు. క్యాస్టింగ్ కౌచ్ ఉనికి లేదని తాను అనడం లేదని ఆయన పేర్కొన్నారు. ‘సరోజ్, రేణుకా వ్యాఖ్యలతో నేనూ పూర్తిగా ఏకీభవిస్తాను. సినిమాల్లో అవకాశాల కోసం అమ్మాయిలు ఎలా రాజీపడతారో నాకు తెలుసు. సరోజ్ కూడా తన జీవితంలో ఇలాంటి అవమానాలు, వేదనలు ఎదుర్కొని ఉంటారు. ఇక రాజకీయాల్లో ఉన్నదానిని క్యాస్టింగ్ వోట్ కౌచ్ అనాలేమో.. ఎదగాలనుకుంటున్న యువతులు.. సీనియర్ నేతలకు లైంగిక లబ్ధులను ఆఫర్ చేస్తూ ఉండొచ్చు. వారి అంగీకరిస్తూ ఉండొచ్చు’ అని ఆయన చెప్పుకొచ్చారు. ‘అయితే ఈ సంస్కృతి సరైనదని నేను అనడం లేదు. అలాంటి రాజీ పడే పనులు నేను ఎన్నడూ చేయలేదు. కానీ చుట్టూ జరుగుతున్న దానిని చూడకుండా ఉండలేదం కదా. నిజాన్ని మాట్లాడినందుకు సరోజ్‌ను ఖండించకండి’ అని శత్రుఘ్న పేర్కొన్నారు. -
అంతకుముందు మోదీ, మొన్న వెంకయ్య...
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తనదైన శైలిలో వ్యవహరిస్తున్నారు. సభా కార్యక్రమాలు పూర్తిగా స్తంభించకపోకుండా సభ్యుల మధ్య వాగ్వావాదాలను సర్దుబాటు చేయడంలో విజయం సాధిస్తున్నారని కూడా చెప్పవచ్చు. వ్యంగ్యంగా మాట్లాడడం, పదాలను ఫన్ చేయడం ఆయనకు మొదటి నుంచి అలవాటు. ఎదుటి వారిని అవమానించనంత వరకు, కించ పర్చనంత వరకు వ్యంగ్యోక్తులనైనా చలోక్తులుగానే ఎవరైనా తీసుకుంటారు. ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. భారత ఉప రాష్ట్రపతి అయిన వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్ హోదాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి గురించి, అందులో ఆమె వీడ్కోలు సమావేశంలో అంతమాట అనేస్తారా? అంటూ మహిళా సంఘాల నేతలు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. మొన్నటికి మొన్న సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇదే రేణుకా చౌదరిని ‘శూర్పణఖ’గా వర్ణించడం కూడా మగ దురహంకారం నుంచి వచ్చిందేనన వారు ఆరోపిస్తున్నారు. చమత్కారానికి, వెటకారానికి ఉన్న తేడాని గుర్తించాలని వారు అంటున్నారు. రాజ్యసభలో బుధవారం నాడు రేణుకా చౌదరిని ఉద్దేశించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ‘మీకు నాదో చిన్న సలహా! మీరు బరువు తగ్గించుకోండి, మీ పార్టీ బరువు పెంచేందుకు కృషి చేయండి’ అని వ్యంగ్యోక్తి విసిరిన విషయం తెల్సిందే. ‘రాజ్యసభ చైర్మన్‌గా మీకున్న బరువును ఉపయోగించి మీ చుట్టున్న వారికి నచ్చ చెప్పండి’ అని రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు స్పందనగా వెంకయ్య ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బరువన్న పదాన్ని రేణుకా చౌదరి అధికారానికి చిహ్నంగా వాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే రాజ్యసభలో మాట్లాడుతున్నప్పుడు రేణుకా చౌదరి గట్టిగా నవ్యుతూ కనిపించారు. ‘ఏంటి శూర్పణఖలా ఆ నవ్వు!’ అని మోదీ చలోక్తి విసిరారు. మహిళావాది ‘శూర్పణఖ’తో పోల్చినందుకు ‘థ్యాంక్స్’ అంటూ రేణుకా చౌదరి సర్దుకున్నారు. పార్లమెంట్లో మహిళలకు 38 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడంలో తాత్సారం చేసే మగ దురహంకారుల మాటలు ఇలాగే ఉంటాయని కొంత మంది మహిళావాదులు విమర్శిస్తున్నారు. వెంకయ్య నాయుడు తన చమత్కారంలో భాగంగానే ఇటీవల కాంగ్రెస్‌ను ఉద్దేశించి ‘డైనాస్టీ ఇన్ డెమోక్రసీ ఈజ్ నాస్టీ, టేస్టీ టూ సమ్ పీపుల్’ అన్నారు. భారత ఉపరాష్ట్రపతి అంటే రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, ఇంకా బీజేపీ నాయకుడిగా మాట్లాడితే ఎలా? ఆయన వ్యాఖ్యలపై కొంతమంది కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. జార్ఖండ్ గురించి ‘స్టేట్ ఈజ్ బ్యూటిఫుల్, పీపుల్ ఆర్ డ్యూటీఫుల్, రిసోర్సెస్ ఆర్ ఫ్లెంటీఫుల్’ అంటూ గతంలో వ్యాఖ్యానించిన వెంకయ్య, దేశంలో మోదీ పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడు ‘టేక్ టెంపరరీ పెయిన్, ఫర్ లాంగ్ టెర్మ్ గెయిన్’ అని చమత్కరించారు. ఆయన సుదీర్ఘకాలంగా బీజేపీలో ఉండడం వల్ల ఆ బంధాన్ని మరచిపోలేక పోతున్నారు. నేటికి కూడా బీజేపీ నినాదమైన ‘న్యూ ఇండియా’ అనే ఆయన మాట్లాడుతున్నారు. -
‘రేణుకా జీ.. మీరు బరువు తగ్గితే మంచిది’
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో బుధవారం ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఎంపీ రేణుకా చౌదరిలు ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకున్నారు. ఈ క్రమంలో రేణుకను కాస్త తగ్గాలంటూ వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విషయం ఏంటంటే... రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యత్వం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో జరిగిన వీడ్కోలు ప్రసంగం సందర్భంగా రేణుక మాట్లాడుతూ... ‘అప్పట్లో నేను చాలా బరువుగా ఉండేదాన్ని. అప్పటి నుంచే ఆయనకు(వెంకయ్యను ఉద్దేశించి) నేను తెలుసు. చాలా మంది నా బరువు గురించి బాధపడుతుంటారు. కానీ సార్, మీరు చైర్మన్ పదవిలో ఉన్నారు. కాబట్టి.. మీ బరువును అందరి మీద రుద్దండి(సక్రమంగా అధికారాన్ని వినియోగించండి అన్న అర్థం వచ్చేలా) అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనికి వెంటనే స్పందించిన వెంకయ్య రేణుకకు కౌంటర్ ఇచ్చారు. ‘మీకు నాదో చిన్న సలహా. ముందు మీ బరువు తగ్గించుకోండి. ఆపై మీ పార్టీ బరువు పెరిగేలా కృషి చెయ్యండి’ అంటూ పేర్కొన్నారు. దానికి బదులుగా రేణుకా... ‘కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంది’ అని అన్నారు. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఈ వాదన సరదాగానే ఉండటంతో సభలో నవ్వులు వెల్లివిరిశాయి. గత నెల ప్రధాని నరేంద్ర మోదీ రేణుక చౌదరి నవ్వును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇక వీడ్కోలు ఉపన్యాసంలో ఆమె.. పెద్దల సభతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అంశాన్ని కూడా గుర్తు చేశారు. ఇది కూడా చదవండి... అన్నంత పని చేసిన ఫైర్ బ్రాండ్ -
శూర్పణఖ నవ్వు.. ఓ లక్ష్మణరేఖ
సందర్భం ఆడపిల్ల గట్టిగా నవ్వితే ఆక్షేపించే పితృస్వామ్య సమాజం మనది. ఈ వివక్ష పుట్టక ముందే భ్రూణహత్యల రూపంలో మొదలవుతుంది. అప్పటినుంచీ ప్రతిచోటా లక్ష్మణరేఖలు గీస్తారు. ‘నేను శూర్పణఖను’.. అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు సామాజిక మాధ్య మాల్లో ప్రతిధ్వని స్తోంది. ప్రధాని మోది పార్లమెంట్లో ఒక మహిళా ఎంపీ నవ్వును రామాయణం సీరియల్లోని శూర్పణఖ వికటాట్టహాసంతో పోల్చడంతో ఈ అంశం పెద్ద చర్చకు తెరలేపింది. ఆడపిల్ల గట్టిగా నవ్వితే ఆక్షేపించే పితృస్వామ్య సమాజం మనది. ఈ వివక్ష పుట్టకముందే భ్రూణహత్యల రూపంలో మొదలవుతుంది. పుట్టాక–చదువు, ఆరోగ్యం, ఆహారం, ఉద్యోగం, పదోన్నతి, నైతికత వంటి విషయాల్లో అడుగడుగునా ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రతిచోటా లక్ష్మణరేఖలు గీస్తారు. ఆంక్షలు విధిస్తారు. వాటిని ధిక్కరిస్తే ప్రతీకార అత్యాచారాలు, పరువు పేరిట హత్యల వంటివి జరుగుతాయి. దక్షిణాసియాలో వందలాది రామాయణాలున్నప్పటికీ శూర్పణఖను దుష్టురాలిగా చిత్రించే కావ్యగాథ మాత్రమే దూరదర్శన్‌లో ప్రసారమైంది. రోమిలా థాపర్ వంటి ప్రముఖ చరిత్రకారులు దీనిపై అభ్యంతరపెట్టారు. భిన్న ప్రాంతాలు, సమాజాలు, భాషలు, సంస్కృతులకు దర్పణం పట్టేలా మనకు బౌద్ధ, జైన, వాల్మీక, కంబ, తులసీ రామాయణాలున్నాయి. ఇండోనేసియా, థాయ్‌లాండ్ వంటి దేశాల్లోనూ వైవిధ్య గాథలున్నాయి. ఈ భిన్నత్వాన్ని చిదిమి, ఏకరూప ఆధిపత్య సంస్కృతిని దూరదర్శన్ ద్వారా ప్రజలపై రుద్దడం సరికాదని రోమిలా థాపర్ విమర్శించారు. అనేక రామాయణగాథల అద్భుత వైవిధ్యాన్ని ఈ చర్య దెబ్బ తీసిందని తప్పుపట్టారు. వాలివధ, సీత అగ్నిపరీక్ష, శంభూకుని హత్య, శూర్పణఖ పరాభవం వంటి అనేక అంశాలు ప్రస్తావిస్తూ రాముడు మర్యాదా పురుషోత్తముడెలా అవుతాడని రామాయణంపై విస్తృత పరిశోధనలు జరిపిన అంబేడ్కర్, పెరియార్ రామస్వామి ప్రశ్నించారు. ద్రవిడులకు రావణుడు నాయకుడు. రాముడు ప్రతినాయకుడు. బౌద్ధ రామాయణం ప్రకా రం రాముడికి సీత సోదరి. అలాగే శూర్పణఖపై కూడా అనేక గాథలున్నాయి. తన భర్తను చంపిన సోదరుడిపై ప్రతీకారంతోనే శూర్పణఖ ఒక వ్యూహం ప్రకారం రాముణ్ణి రావణుడిపై గురిపెట్టిందని భారతీయ దేవతలపై పరిశోధనలు జరిపిన ప్రొఫెసర్ కేథలీన్ ‘మెనీ రామాయణాస్’ గ్రంథంలో వివరిస్తారు. ఇలా పురాణగాథలకు సంబంధించి భిన్న కథనాలు మన చరిత్రలో అంతర్భాగమయ్యాయి. మహిషాసురుణ్ణి కొలిచే సముదాయాలు నేటికీ ఉత్తర భారతదేశంలో ఉండటం ఇందుకొక ఉదాహరణ. మొత్తం మీద, ఆధిపత్య గాథల్ని మాత్రమే ప్రచారంలో పెట్టడం, వాటిలోని పాత్రల్ని నమూనాలుగా చూపడం, ధిక్కరించిన వారిపై రకరకాలుగా విరుచుకుపడటం వంటి ధోరణులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని అత్యధిక పార్టీలు చెబుతాయి. అయినా ఇప్పటికీ ఇది చట్టరూపం తీసుకోలేదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయావతిపై ప్రతిపక్ష మహిళా నాయకురాలే స్వయంగా ‘రేప్’ పదం ప్రయోగించారు. ద్రౌపది నవ్వే మహాభారత యుద్ధానికి కారణమని నిందిస్తారు. సానియా మీర్జా వస్త్రధారణను మత పెద్దలు ప్రశ్నిస్తారు. ప్రధాని పక్కన కాలు మీద కాలేసుకుని పొట్టి దుస్తులు ధరించి అలా కూర్చోవడమేమిటని ప్రియాంకా చోప్రాను మందలిస్తారు. ఆధిపత్య సంస్కృతిని ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతను నానా విధాలుగా నిందిస్తారు. నేలపై కూర్చొని ఆవకాయ పెట్టిన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఆదర్శ గృహిణీత్వాన్ని ప్రశంసిస్తారు. అన్ని రంగాల్లో దూసుకెళుతూ, అవకాశాల కోసం పోరుతూ ఉన్న మహిళలకు పగ్గాలేసేందుకు ఆధునిక మనువులు చేస్తున్న నిరంతర యత్నాలకు ఇవి కొన్ని ఉదాహరణలు. నేటి మహిళలు ఇలాంటి ధోరణులపై తిరుగుబాటు చేస్తున్నారు. అమెరికాలో మొదలై ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లైంగిక వేధింపుల వ్యతిరేక ఉద్యమం (మీటూ) దగ్గర నుంచీ ‘ఐ యామ్ శూర్పణఖ’ ప్రచారం వరకూ ఇందులో భాగాలే. ఇది ఇంతటితో ఆగకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పితృస్వామ్య వివక్షా రూపాలన్నింటినీ మూలం నుంచి ప్రశ్నించాలి. సమానత్వ సాధన దిశగా ఒక నిరంతర యుద్ధం కొనసాగించాలి. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ బి. భాస్కర్ మొబైల్ : 99896 92001 -
కడిగిపారేసిన ఫైర్ బ్రాండ్!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం ఆమె రాజ్యసభలో మాట్లాడుతూ... ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇదే సభలో హామీలిచ్చాం, అమలు చేయాల్సిన బాధ్యత లేదా? ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏంట’ని సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడమే మానేసిందని కడిగిపారేశారు. కేంద్ర బడ్జెట్లో రైతుల సంక్షేమానికి నిధులు కేటాయించలేదని, రుణమాఫీకి నిధులు ఇవ్వడం లేదని అన్నారు. ఎన్నికలు వస్తున్నందునే రైతులు గుర్తుకొచ్చారా? రైతుల కష్టాలు ఈ ప్రభుత్వానికి ఏం తెలుసని నిలదీశారు. కౌలు రైతులకు పైసా కేటాయించలేదని వెల్లడించారు. పార్లమెంట్లో మహిళలకు మోదీ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో చూస్తున్నామని, ఇక మహిళా రైతుల గురించి ఏం మాట్లాడతామని నిర్వేదం వ్యక్తం చేశారు. రేణుకను బీజేపీ నాయకులు ‘శూర్పణక’తో పోల్చిన సంగతి తెలిసిందే. అర్థం చేసుకోండి: కేకే ఆంధ్రప్రదేశ్ ఆందోళన అర్థం చేసుకోవాలని మోదీ సర్కారును టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు కోరారు. విభజన హామీల అమలు బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. -
అన్నంత పని చేసేసిన రేణుకా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నంత పని చేసేశారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ‘శూర్పణక’ పోస్టుకు ఆమె నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం రాజ్యసభలో ఆమె హక్కుల తీర్మానం కూడా ప్రవేశపెట్టారు. పార్లమెంటులో ప్రధాని మోదీ.. రేణుకా చౌదరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తదనంతర కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిరెన్ రిజిజు వివాదాస్పద పోస్టు ఫేస్బుక్లో పెట్టిన సంగతి తెలిసిందే. రామాయణం సీరియల్లోని శూర్పణక పాత్ర నవ్వుతున్న వీడియోకి.. మోదీ మాట్లాడిన సమయంలో రేణుకా చౌదరి నవ్వుతున్న దృశ్యాలను ఆయన జత చేశారు. దీనిపై రేణుకా చౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలో తన నవ్వుపై మోదీ వ్యాఖ్యలను జతచేస్తూ.. రిజిజు వీడియో పోస్టుపై హక్కుల తీర్మానం ఆమె ప్రవేశపెట్టారు. ‘‘ఇది ఓ మహిళను అవమానించడమే కాదు, తీవ్ర అభ్యంతరకరం కూడా... దీనిపై నేను హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాను..’’ అని రేణుకా చౌదరి పేర్కొన్నారు. కాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రేణుక నవ్వడంపై ప్రధాని మాట్లాడుతూ.... ‘‘రామాయణం సీరియల్ తర్వాత ఇంత నవ్వు వినే భాగ్యం నాకు దక్కింది..’’ అన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇక తాను ఎందుకలా నవ్వాల్సి వచ్చిందో ఆమె కూడా వివరణ ఇచ్చుకున్నారు. ‘గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారు. అలాంటాయన ఆధార్‌ను పుట్టించిందే తామేనని చెప్తే నవ్వు రాకుండా వుంటుందా’ అంటూ రేణుకా చౌదరి వివరించారు. -
తెలంగాణలో వలసల పర్వం..
సాక్షి, ఖమ్మం : తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలు మరో సంవత్సరంలో రానుండటం, ఈ లోపు ముందస్తుగా జమిలి ఎన్నికలు రానున్నాయనే ప్రచారంతో...తెలంగాణలో వలసలు ఊపందుకున్నాయి. ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం మొదలైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన పోట్ల నాగేశ్వరరావు సోమవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నవిషయం తెలిసిందే. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం తొలిసారి ఖమ్మంకు వచ్చిన ఆయన కాంగ్రెస్ శ్రేణులు, పోట్ల అనుచరులు, అభిమానులు కోలాహలం మధ్య ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ...టీఆర్ఎస్ పార్టీలో ఇమడలేకే రాజీనామా చేశానని, అధికార పార్టీలో కుటుంబ నియంతృత్వ పాలన కొనసాగుతుందన్నారు. టీఆర్ఎస్ కలగూర గంపగా మారిన నేపథ్యంలో విసుగు చెంది,కాంగ్రెస్‌లోకి వచ్చానన్నారు. ఫిబ్రవరిలో జిల్లా రాజకీయాలలో ఆశ్చర్యకరమైన పరిణామాలు సంభవిస్తాయని, ఇంకా అనేక మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్, టీడీపీ పార్టీల నుండి కాంగ్రెస్‌లోకి వస్తారని జోస్యం చెప్పారు. వారంతా ఇప్పటికే తనతో సంప్రదింపులు జరిపినారని, ఈ విషయమై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు పోట్ల నాగేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఆశీసులతోనే తాను కాంగ్రెస్‌లో చేరానని, పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. తనతోపాటు కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు ,కార్యకర్తలకు, అభిమానులకు పోట్ల ధన్యవాదాలు తెలిపారు. 2019 ఎన్నికలో పార్టీ గెలుపే థేయ్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు ముందుకు వెళతానని హామీ ఇచ్చారు. -
‘మాటల గారడీ తప్ప చేసిందేమీ లేదు’
పాల్వంచ: కేసీఆర్ మాటల గారడీ తప్ప రైతులకు చేసింది ఏమీలేదని కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర టీఆర్ఎస్దేనన్నారు. రైతులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. -
రేణుకా చౌదరికి మాతృ వియోగం
హైదరాబాద్ : కేంద్ర మాజీమంత్రి, రాజ్యసబ సభ్యురాలు రేణుకా చౌదరికి మాతృ వియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకా చౌదరి తల్లి వసుంధర (84) బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జైల్ భరో నిర్వహిస్తాం: రేణుకా చౌదరి
ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండలో కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి మంగళవారం పర్యటించారు. ఖమ్మం మిర్చి మార్కెట్‌పై దాడి ఘటనలో అరెస్టు అయిన చిరుమర్రికి చెందిన రైతు ఆనందరావు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దమ్ముంటే తన చేతికి బేడీలు వేయాలని సవాల్ విసిరారు. రైతులపై కండిషన్ బెయిల్ ఎత్తివేయకపోతే జైల్ భరోకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కాగా, రైతు ఆనందరావును కలిసి రేణుకాచౌదరి రూ.15 వేల సహాయం అందజేశారు. -
కోర్టు అభిప్రాయాన్ని స్వాగతిస్తాం
-
రేణుకా చౌదరి రాయని డైరీ
- మాధవ్ శింగరాజు అమ్మవారి కిరీటం బాగుంది. ధగధగా మెరుస్తూ ఉంది. పచ్చబంగారంలో పింక్ కలిపినట్లుగా ఉంది. బంగారంలో రాగి కలుపుతారు. రాగి పింక్ కలర్లో ఉండదు. మరి కిరీటానికి ఈ పింక్ కలర్ ఎలా వచ్చింది?! కిరీటాన్ని మళ్లీ ఒకసారి చూశాను. పచ్చటి బంగారం! పింక్ అస్సలు లేదు. కళ్లు నులుము కున్నాను. అంతా కేసీఆర్ మాయ. తెలంగాణలో ఉన్నవాళ్లందరికీ పింక్ కామెర్లు తెప్పించేస్తున్నాడు! పింక్ పొలాలు, పింక్ జలాలు, పింక్ జిల్లాలు... ఎవ్రీథింగ్ పింకిష్. కేసీఆర్ వేసే పిల్లి మొగ్గలు కూడా పింక్ మొగ్గలే. దసరా షాపింగ్ పూర్తి కాలేదు. కేసీఆర్ కటౌట్లను తప్పించుకుని తిరగడం కష్టమౌతోంది రోజురోజుకీ సిటీలో. ట్రాఫిక్ జామ్ కన్నా, కటౌట్ల జామ్ ఎక్కువగా ఉంది. సిగ్నళ్లే లేని హైదరాబాద్‌ను నిర్మిస్తానంటున్నాడు! ఎల్లో, రెడ్, గ్రీన్ తీయించి, పింక్ ఒక్కటే పెట్టిస్తాడేమో. ‘అవునవును. పింక్ అయితే బాగుంటుంది. పార్టీ ఆఫీసుకు త్వరగా చేరుకోవచ్చు’ అని మా పార్టీ నేతలు కూడా సరదా పడుతున్నారు. వాళ్లు ఉంటున్న పార్టీ ఆఫీసు ‘గాంధీభవన్’. వాళ్లు అంటున్న పార్టీ ఆఫీసు ‘తెలంగాణ భవన్’. ఆమాత్రం కనిపెట్టలేనా? ‘రెండేళ్లయింది రాష్ర్టంలో కాంగ్రెస్ లేక’ అన్న బాధ లేదు మావాళ్లకు. ‘రెండేళ్లయింది టీఆర్ఎస్లో చేరక’ అన్న బాధ కనిపిస్తోంది వాళ్ల కళ్లలో. గాంధీభవన్‌కి వచ్చి నీరసంగా దివాలా తీసినట్టు కూర్చుంటున్నారు. దివాలా తీయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపం ఏమీ కాదు. దివాలా తీసినట్టు కనిపించడమే పార్టీకి అసలైన ద్రోహం. బాధ ఎవరికి లేదు? టీడీపీకి లేదా? బీజేపీకి లేదా? తెలంగాణ ప్రజలకు లేదా? వాళ్లంతా ముఖాలు వే లాడేసుకునే కూర్చుంటున్నారా? ఉదయాన్నే లేచి ఎవరి పనులకు వాళ్లు వెళ్లిపోవడం లేదా? మనల్ని ఒకళ్లు కొట్టారంటే, తిరిగి వాళ్లను కొట్టేవరకు.. ఐదేళ్లయినా, పదేళ్లయినా.. పంచె బిగించే ఉండాలి. పంచ్ విసరబోతున్నట్లు పిక్చర్ ఇస్తూనే ఉండాలి. ఆ తెలివి లేదు. అదేమంటే రివర్స్‌లో నా మీదకు వచ్చేస్తారు! పార్టీకి దూరంగా ఉంటున్నాననీ, మీటింగులకు రావట్లేదనీ! ఆ భగవంతుడి దయ, శ్రీమతి సోనియాగాంధీ గారి దయ ఉండబట్టి గానీ, లేకుంటే కేసీఆర్‌తో కలిసి రోజూ నేను టీ తాగుతున్నానని ఢిల్లీకి లెటర్లు రాసినా రాసుండేవాళ్లు. కేసీఆర్ కాంగ్రెస్‌కు చేసిన ద్రోహాన్ని వీళ్లంతా మర్చిపోయారేమో, నేను మర్చిపోను. మొక్కు తీర్చుకోడానికి కేసీఆర్... అమ్మవారికి మూడున్నర కోట్లు పెట్టి కిరీటం చేయించాడు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు తనను సీయెంను చేసిన సోనియా అమ్మవారికి చెల్లించవలసిన మొక్కు గురించి మాత్రం మర్చిపోయాడు! సోనియాకు కిరీటం చేయించనవసరం లేదు. తన తలపై ఉన్న కిరీటాన్ని చేయించింది సోనియా మేడమ్ అని కేసీఆర్ గుర్తుంచుకుంటే చాలు. -
'ఆయన మాటలతో మాయ చేస్తున్నారు'
జడ్చర్ల : మాయ మాటలతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరీ ఆరోపించారు. ఆదివా రం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మాజీ ఎంపీ మల్లురవితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు కాటకాలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం తాగునీరు దొరకని దుస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పే ర్కొన్నారు. నీటిచుక్క కరువైన ప్రస్తుత పరిస్థితులలో మిషన్‌కాకతీయ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నా రు. ఖరీఫ్ సాగుపై సమగ్ర ప్రణాళికలు రూపొందించలేక, ఎండాకాలంలో పం టల సాగుపై రైతులకు అవగాహన కల్పించలేదని తెలిపారు. తమ నిధులనుంచి కమ్యూనిటీ భవనాలకు రూ.5లక్షలు కేటాయిస్తే ఒకే గది నిర్మిం చే పరిస్థితి ఉండగా అవే రూ. 5లక్షలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిం చడం ఎలా సాధ్యమో వివరించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో ఏపీలోకి వెళ్లిన ఏడు గ్రామాలపై చర్చిస్తామన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని, 2019లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో నాయకులు దిలీప్, శ్రీరాంసాగర్, విజయ్‌కుమార్, చరణ్, మల్లు ప్రతిభ, నిత్యానందం, మినాజ్, హబీబ్, తదితరులు పాల్గొన్నారు. -
సెటిలర్ల వల్లే హైదరాబాద్ అభివృద్ధి: ఎంపీ రేణుకా
హైదరాబాద్: సెటిలర్ల వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. గతంలో సెటిలర్లను దూషించినందకుగానూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లో రేణుకా మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేస్తున్న తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ముందుగా రాజీనామా చేసి తర్వాత ఎన్నికల ప్రచారం చేయాలని అన్నారు. రామోజీఫిల్మ్ సిటీని నాగళ్లు, ట్రాక్టర్లతో దున్నిస్తానంటూ.. అయ్యప్పసిటీ భవానాలను కూల్చడం వల్లే సెటిలర్లకు అభద్రతా భావం పెరిగిపోయిందని విమర్శించారు. సెటిలర్లకు అండగా నిలిచేది కాంగ్రెస్సే అని అందరూ గమనిస్తున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంటు, 104, 108 వైద్య సేవల్లో కేసీఆర్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యలు, మహిళలపై దాడులలో కూడా కేసీఆర్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు. వివిధ రాష్ట్రాల స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఆ టెండ్రు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొనసాగుతుందని రేణుకా చౌదరి తెలిపారు. -
రేణుకాచౌదరి భూముల్లో ఎర్రజెండాలు
పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచలోని బీసీఎం రోడ్ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉన్న ఎంపీ రేణుకా చౌదరి భూములతోపాటు, చెరువుబంజర్, మేడికుంట చెరువు భూముల్లో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో పేదలు ఎర్రజెండాలు పాతారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసాని ఐలయ్య మాట్లాడుతూ రేణుకాచౌదరి మూడు దశాబ్దాల క్రితం ఆక్సికో కర్మాగారం నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం నుంచి 43 ఎకరాలు తీసుకున్నారని, నేటికీ కర్మాగారం నెలకొల్పకపోగా.. మామిడితోట సాగు చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ఆక్రమణలను అడ్డుకున్నారు. కోడ్ అమలులో ఉన్నందున ఆక్రమణలకు దిగవద్దని సూచించారు. తహసీల్దార్ విషయాన్ని సబ్ కలెక్టర్ కాళీచరణ్ ఎస్.కర్టేడ్ దృష్టికి తీసుకెళ్లగా భూములు సర్వే చేసి కబ్జాదారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. -
'రేణుకా హటావో కాంగ్రెస్ బచావో'
ఖమ్మం: కాంగ్రెస్‌కు మంచిరోజులు రావాలంటే రేణుకా చౌదరి లాంటి వాళ్లను పార్టీ నుంచి తొలగించాలని గిరిజన సంఘాలు ఆరోపించాయి. ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర నాయకులు మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్‌అలీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ కుంతియతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. 'సాధారణ ఎన్నికల్లో వైరా ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని నమ్మించి తన భర్త నుంచి కోటి 20 లక్షలు తీసుకున్నారని.. అయినా టికె ట్ ఇప్పించలేదని.. తిరిగి డబ్బులివ్వమంటే ఇవ్వకుంటా మనోవేదనకు గురిచేయడంతో.. మనస్థాపానికి గురై నా భర్త మృతిచెందాడని' డాక్టర్ రాంజీ భార్య అన్నారు. గతంలో పలు మార్లు రేణుకా చౌదరిని సంప్రదించిన ఎలాంటి ఫలితం రాలేదని ఆమె వాపోయారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కుంతియ ముఖ్య అతిధిగా వస్తున్నారని తెలుసుకున్న రాంజీ భార్య, బంధువులతోపాటు గిరిజన నాయకులు పార్టీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా హటావో కాంగ్రెస్ బచావో అనే ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాగా పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాంజీ భార్య కుంతియాకు వినతి పత్రం అందించారు. -
మన్మోహన్ అమాయకుడు : రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అమాయకుడని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో రేణుకాచౌదరి మాట్లాడుతూ... బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమేయం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో కేటాయింపుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాగ్మూలం నమోదు చేయాలని ప్రత్యేక న్యాయస్థానం సీబీఐను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రేణుకాచౌదరిపై విధంగా స్పందించారు. ఈ కేసులో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిల్లాతోపాటు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ పాత్రపై దర్యాప్తు కొనసాగించాలని సూచించింది. జనవరి 27 నాటికి దర్యాప్తు పురోగతిపై నివేదిక అందజేయాలని ప్రత్యేక కోర్టు సీబీఐను ఆదేశించింది. -
రేణుక, పొంగులేటి.. ఢిల్లీ మే సవాల్
న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. కాంగ్రెస్ నాయకుల వర్గ పోరు ఏకంగా ఢిల్లీకి చేరుకుంది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పెద్దలను కలసి పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. రేణుకా చౌదరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవగా, సుధాకర్ రెడ్డి రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. రేణుక, పొంగులేటి ఒకరి గురించి మరొకరు కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు సమసిపోయేలా కనిపించడం లేదు. -
కేసీఆర్ సర్కారును బతుకమ్మ క్షమిస్తుందా?
హైదరాబాద్: వందరోజుల్లో సీఎం కేసీఆర్ వెయ్యి అబద్ధాలు ఆడారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. రైతు రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టతలేదని విమర్శించారు. 178 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులను ఆదుకోని ఈ ప్రభుత్వాన్ని బతుకమ్మ తల్లి క్షమిస్తుందా అని ప్రశ్నించారు. జలవిహార్‌లో జరిగిన హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎంఐఎంతో సంబంధం లేకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సొంతంగానే ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. -
రేణుకా చౌదరీ ధర్నా, రాస్తారోకో!
ఖమ్మం: రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరీ ఖమ్మం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. భధ్రాచలం మండలంలోని మూడు గ్రామ పంచాయితీలను తెలంగాణలోనే ఉంచాలంటూ డిమాండ్ చేశారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేణుకా చౌదరీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ఏడు మండలాలను విలీనం చేసుకునే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రకారం ఈ ఏడాది జూన్ 2 నుంచి ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిం చిన విషయం విదితమే. -
రాజధానిలో రగడ
ఖమ్మం: జిల్లా కాంగ్రెస్ ఇంటిపోరు రాజధానికి చేరింది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై సోమవారం హైదరాబాద్ గాంధీభవన్‌లో ఏఐసీసీ నాయకులతో జిల్లా నాయకులు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లుభట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి, జిల్లాలోని సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఇప్పటికే అటు రేణుకా చౌదరి వర్గీయులకు, ఇతర వర్గీయులకు సమావేశానికి హాజరు కావాలని ఏఐసీసీ నాయకులు సమాచారం అందించడంతో వారి వారి అనుచరులను సమావేశానికి రప్పించుకుని తమ బల నిరూపణ కోసం ఇరు వర్గాల నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. గత వారం రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ మేథోమధన కార్యక్రమానికి జిల్లా నాయకులు హాజరై వారి అభిప్రాయాలను వెల్లడించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించాలని ఏఐసీసీ, టీపీసీసీ నాయకులు జిల్లా నేతలకు సూచించారు. అయితే ఈ సమావేశానికి ముందే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని ఇటీవల జరిగిన మేథోమధన సదస్సుకు ఆహ్వానించడం, వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై రేణుకా చౌదరి వ్యతిరేక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని గమనించిన ఏఐసీసీ నాయకులు పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు కుంతియాను జిల్లాకు పంపించి ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదుర్చాలని భావించారు. అయితే కుంతియా రాకముందే జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా సోమవారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించేందుకు ఏఐసీసీ ముహూర్తం నిర్ణయించింది. పార్టీ పరిస్థితిపై చర్చించేనా..? జిల్లాలో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకే ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారా.. అనేది జిల్లాలో చర్చనీయాంశమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనే ఆరోపణలతో రేణుకా చౌదరి వర్గానికి చెందిన 14 మందిని సస్పెండ్ చేసినా, వారిని సైతం మేథోమధన సదస్సుకు ఆహ్వానిం చారు. ఈ పరిస్థితిపై ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తోపాటు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇది జరిగిన వారం రోజులకే ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ పరిస్థితులను గమనించిన ఏఐసీసీ నాయకులు దిగ్విజయ్‌సింగ్, కుంతియా సోమవారం హైదరాబాద్‌కు చేరుకుని జిల్లా కాంగ్రెస్ నాయకులతో భేటీకి సిద్ధమయ్యారు. కోరం కనకయ్యతో ప్రారంభమైన వలసల పరంపరకు చెక్ పెట్టడంతోపాటు జిల్లా కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపై నడిపించేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ వర్గీయులు చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిన రేణుకా చౌదరి, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు కలిసి పనిచేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకుంటారనే చర్చ కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు సోమవారం జరిగే సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశంలోనే జిల్లా కాంగ్రెస్‌ను ఏకతాటిపై నడిపించే నాయకుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. -
సీఎల్పీ భేటీ నుంచి కోమటిరెడ్డి వాకౌట్
* పొన్నాల రాజీనామా చేయాలని డిమాండ్ * రేణుకా చౌదరిపై రాంరెడ్డి మండిపాటు * టీఆర్ఎస్కు అనుకూలమనే ప్రచారం సరికాదన్న డీఎస్, జానా సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్షం తొలి సమావేశం బుధవారం హాట్‌హాట్‌గా జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో, బయటా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సమావేశమైన నేతలు ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతోపాటు పరోక్షంగా చురకలంటించుకున్నారు. సీఎల్పీ భేటీ ప్రారంభమైన వెంటనే మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చారు. ‘‘ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం పొన్నాల లక్ష్మయ్యే. ఆయన కూడా 30వేల పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. అలాంటి వ్యక్తి రాజీనామా చేయకుండా ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి అధ్యక్షత వహించే ఈ సమావేశంలో నేనెందుకు ఉండాలి? నిరసన తెలిపి బయటకు వచ్చేశా’’అని మీడియాకు వివరించారు. ఆ తరువాత మరో మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి సైతం రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తీరును సమావేశంలో తప్పుపట్టినట్లు తెలిసింది. ‘‘ఎన్నికల్లో కష్టపడి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులను గెలిపించుకునేది మేము. పార్టీలో మాత్రం ఆమె మాటే చెల్లుబాటవుతోంది. ఇదేం పద్ధతి? ఇలాంటి నిర్ణయాలవల్లే పార్టీకి ఈ దుస్థితి వచ్చింది’’అని రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డిసహా ఖమ్మం నేతలు రాంరెడ్డికి మద్దతుగా మాట్లాడారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మాట్లాడుతూ ‘‘ఎన్నికల్లో ఓడిపోయినా మన నాయకుల మైండ్ సెట్ మారలేదు. ఇంకా అధికారంలో ఉన్నామని, బుగ్గకార్లలో తిరుగుతున్నామనే భావనలోనే ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇకనైనా వాస్తవంలోకి రావాలి. కలసికట్టుగా పనిచేస్తూ పార్టీని బతికించుకోవాలి’’అని సూచించారు. వైదొలగుదామనుకున్నా.. జానారెడ్డి మొన్నటి ఎన్నికల తర్వాత రాజకీయాలనుంచి తప్పుకుందామని అనుకున్నానని, అయితే పార్టీ పరిస్థితి చూశాక నిర్ణయం మార్చుకున్నానని జానారెడ్డి సమావేశంలో తెలిపారు. పార్టీని బలోపేతం చేసి ఒకటిరెండేళ్లలో రిటైర్ అవుతానని జానా చెప్పగా డీఎస్ జోక్యం చేసుకుని అవన్నీ ఇప్పుడెందుకని వారించినట్లు తెలిసింది. ఇదెక్కడి వివుర్శ? డీఎస్, జానారెడ్డి సైతం తాము టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్నామని సొంత పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీలో తెలంగాణకు భాగసామ్యం కల్పించకూడదని, విద్యుత్‌లో వాటా ఇవ్వొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని, దీనిపై తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉందని సమావేశంలో పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో మృతి చెందిన తెలుగు విద్యార్థుల కుటుంబాలకు సానుభూతి తెలపడంతోపాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంతాపం చెబుతూ తీర్మానం చేశారు. -
సీనియర్ల వైఫల్యం వల్లే కాంగ్రెస్ ఓటమి: రేణుక
-
సీనియర్ల వైఫల్యం వల్లే కాంగ్రెస్ ఓటమి: రేణుక
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సీనియర్ల వైఫల్యమే కారణమని ఆపార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామని ఆమె సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నామని రేణుకా చౌదరి అన్నారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహులే గాంధీలే దిక్కన్నారు. కాంగ్రెస్‌కు 25 శాతం ఓటు బ్యాంక్ మిగిలిందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాతో సీనియర్లు పదవులపై పగటి కలలు కంటూ క్షేత్రస్థాయిలో పనిచేయలేదని రేణుకా చౌదరి విమర్శించారు. నేతల గ్రూపు రాజకీయాలు దెబ్బతీశాయని అన్నారు. కాంగ్రెస్‌కు పై అంతస్తు బీటలు వారినా పునాదులు గట్టిగానే ఉన్నాయని రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా నేతలు సమిష్టిగా పని చేయాలని ఆమె కోరారు. -
సీపీఐ విజయానికి కృషి చేస్తా: రేణుకా చౌదరి
పాల్వంచ: బీజేపీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నరేంద్రమోడీ ప్రభావం దేశంలో ఏమీలేదని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శిరసా వహించి సీపీఐ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కూటముల అభ్యర్థులు అధిక సీట్లు గెలుచుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. రేణుక వెంట కాంగ్రెస్ నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాం యాదవ్, సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, నాయకులున్నారు. -
'మిస్' ఫైర్!
ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరికి ఈ మధ్య కాలం కలిసి రావటం లేదు. అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా పరాభవమే ఎదురవుతోంది. అటు హస్తిన నుంచి ఖమ్మం గల్లీ వరకూ ఇదే పరిస్థితి. కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్ధానాన్ని ప్రారంభించి ఆ తర్వాత అంచెలంచలుగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన రేణుకా చౌదరి వ్యూహాలన్నీ ఇటివలీ కాలంలో మిస్ ఫైర్ అవుతున్నాయి. మళ్లీ ఖమ్మం నుంచి బరిలో దిగుతానని ముందు నుంచే ఫీలర్లు వదిలినా ఆమెను పార్టీ అధిష్టానం పట్టించుకోనట్లు కనిపిస్తోంది. ఆమెకు ఖమ్మం సీటుపై హామీ మాత్రం దొరకలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో సీపీఐ...హస్తంతో పొత్తు పెట్టుకోవటంతో ఖమ్మం ఎంపీ సీటును ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు కేటాయించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాతో రేణుకా చౌదరి పేరు లేకపోవటం విశేషం. అయితే ఆవిషయాన్ని డైరెక్ట్‌గా ప్రస్తావించని రేణుకా... మరోవిధంగా తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో మహిళలు ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవటం శోచనీయమని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మహిళా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత కూడా వారికి ఎక్కడా గుర్తింపు లభించటం లేదని చెప్పుకొచ్చారు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని మైకుల ముందు మాట్లాడేవాళ్లు అమలు విషయానికి వచ్చేసరికి సొంత స్థానాన్ని కాపాడుకునేందుకు భార్య, బిడ్డలను పోటీకి దింపుతున్నారని విమర్శలు చేశారు. ఇక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాకు అమావాస్యకో పౌర్ణమికో వెళ్లి హంగామా సృష్టించి ఫోటోలకు ఫోజులు ఇచ్చేవారని రేణుకా చౌదరిపై విమర్శలు ఉన్నాయి. దాంతో తమ పట్ల ఇంత ఉదాసీనంగా వ్యవహరించిన రేణుకకు 2009 ఎన్నికల్లో ఖమ్మం ఓటర్లు తగిన రీతిలో సమాధానం చెప్పారు. అంతే కాకుండా ఆమెకు పార్టీలో అంతర్గత పోరు కూడా ఎక్కువ కావటం..రేణుక ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిస్తామని సొంతపార్టీ వాళ్లే చెప్పటం విశేషం. మరోవైపు అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించి హైకమాండ్ ఆమెకు పెద్ద షాక్ ఇచ్చింది. ఈ పరిణామాన్ని రేణుకా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఖమ్మం ఆడపడుచును అని చెప్పుకునే రేణుకకు... కాంగ్రెస్ అధిష్టానం సీటు కేటాయిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. -
రేణుకా చౌదరిని తొలగించాలని లేఖ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణ ప్రాంత ఎంపీలు లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నుంచి రేణుకా చౌదరిని తొలగించాలని వారు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని కించపరిచేలా రేణుకా చౌదరి మాట్లాడారని టీ.ఎంపీలో పేర్కొన్నారు. మరోవైపు రేణుకా చౌదరిని ఎన్నికల కమిటీ సభ్యురాలిగా నియమించడం పట్ల ఎంపీలు మండిపడుతున్నారు. రేణుక తెలంగాణ ద్రోహి అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరుస్తూ మాట్లాడిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాంటి ఆమెను ఎన్నికల కమిటీలో సభ్యురాలిగా ఎలా నియమిస్తారని కమిటీని ప్రశ్నించారు. గత కొంతకాలంగా రేణుకా చౌదరి వ్యవహార శైలిపై తెలంగాణ ప్రాంత ఎంపీలు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలో తెలంగాణ పీసీసీ ఎన్నికల సమావేశంలోనే ఈ విషయంపై తెలంగాణ ప్రాంత ఎంపీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
'పొలిటికల్ గెస్ట్హౌజ్గా ఖమ్మం ఎంపీ సీటు'
ఖమ్మం : కాంగ్రెస్‌లో ఖమ్మం లోక్‌సభ సీటు పొలిటికల్ గెస్ట్హౌజ్గా మారిందని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖమ్మం నుంచి ఇన్నాళ్లు ఇతర జిల్లాల నేతలే ఎంపీగా గెలిచారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు. అధిష్టానం ఆదేశిస్తూ ఖమ్మం నుంచి పోటీ చేస్తానని ఆయన తెలిపారు. పెద్ద మనసుతో టీఆర్ఎస్ను కలుపుకుని పోయేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పొంగులేటి అన్నారు. ప్రజలను గందరగోళపరిచేందుకే చంద్రబాబు నాయుడు తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి బీసీలకే అంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీలపై తీపీ ఉంటే సీమాంధ్ర సీఎం పదవి బీసీకి ఇవ్వాలని పొంగులేటి ఈ సందర్భంగా బాబుకు సూచించారు. మరోవైపు ఖమ్మం జిల్లా సీనియర్ నేత రేణుకా చౌదరి కూడా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఎన్నికల నేపథ్యంలో ఆమె డిగ్గీ రాజాను కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఖమ్మం ఎంపీ టిక్కెట్ కోసం రేణుకా ముమ్మర ప్రయత్నాలు చేసున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. -
'ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతా'
న్యూఢిల్లీ : టీఆర్ఎస్ విలీనం, పొత్తు ఉండవని తేలిపోయిందని... ఇక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. నిన్న ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'అంతా మన మంచికే. టీఆర్ఎస్ వాళ్లు మాతో వచ్చినా రాకపోయినా ఇబ్బందేమీ లేదు. మేం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది' అని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించడంతో పాటు కేసీఆర్‌కి ధీటైన సమాధానం చెప్పే నాయకుడినే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని రేణుక అభిప్రాయపడ్డారు. ఈసారి తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతానని పేర్కొన్నారు. -
టీఆర్ఎస్తో పొత్తు లేకపోవడమే మంచిది: రేణుకాచౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ విలీనం, పొత్తు ఉండవని తేలిపోయిందని.. ఇక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అంతా మన మంచికే. టీఆర్ఎస్ వాళ్లు మాతో వచ్చినా రాకపోయినా ఇబ్బందేమీ లేదు. మేం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలుస్తుంది’’ అని అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించడంతో పాటు కేసీఆర్‌కి దీటైన సమాధానం చెప్పే నాయకుడినే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని రేణుక అభిప్రాయపడ్డారు. ఈ సారి తాను ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగుతానని పేర్కొన్నారు. -
కలిసి మెలిసి అభివృద్ధి చెందుదాం: రేణుక
న్యూఢిల్లీ: తెలుగువారందరం కలిసి మెలిసి అభివృద్ధి చెందుదామని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. అమరవీరుల వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, వారి కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని అన్నారు. ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అమరవీరులకు విశాలమైన పార్కులో స్థూపం ఏర్పాటు చేయాలని సూచించారు. విలక్షణ నాయకురాలిగా పేరు గాంచిన రేణుకా చౌదరి నిన్న రాజ్యసభలో ప్యానల్ చైర్మన్‌గా వ్యవహరించిన అందరి దృష్టిని ఆకర్షించారు. ప్యానల్ చైర్మన్ హోదాలో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
అనూహ్యంగా తెరపైకి వచ్చిన రేణుకా చౌదరి
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సభలో అనూహ్యంగా తెరపైకి వచ్చారు. హొం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)ను రాజ్యసభలో ప్రవేశపెట్టే సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్యానల్ చైర్మన్ హొదాలో అనూహ్యంగా రేణుకా చౌదరి సభ నిర్వహించారు. లోక్‌సభలో బిల్లును పెట్టిన రీతిలోనే కాంగ్రెస్ పథక రచన చేసింది. రాజ్యసభలో షిండేకు రక్షణగా మార్షల్స్తోపాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా నిలబడ్డారు. బిల్లును అడ్డుకునేందుకు శివసేన, సీపీఎం, జేడీయూ, తృణమూల్, సీపీఎం ఎంపీల ప్రయత్నిస్తున్నారు. బిల్లును వ్యతిరేకిస్తున్న ఎంపీలపై కాంగ్రెస్ సభ్యులు తోపులాటకు దిగారు. -
రేణుకది మొసలి కన్నీరు: పొన్నం
కరీంనగర్: గతంలో నరేంద్ర మోడీని విమర్శించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు పొత్తుల కోసం మోడీ వద్ద మోకరిల్లుతున్నారని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. చంద్రబాబు సంప్రదింపులతోనే తెలంగాణపై బీజేపీ వైఖరిలో మార్పు వచ్చిందని ఆయన అన్నారు. చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు నిలువరించటం లేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై రేణుకా చౌదరి లాంటి వాళ్లు మొసలి కన్నీరు కారుస్తున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలో ఏపీభవన్‌లో రేణుకా చౌదరిని నిన్న తెలంగాణ జేఏసీ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆమె.. తన రాజకీయ చరిత్రలో ఇలాంటివి ఎన్నో చూశానన్న రేణుక జేఏసీ నేతల వైపు వేలు చూపిస్తూ, ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. -
ఏపీ భవన్ లో రేణుకా చౌదరికి రామయ్య సెగ
న్యూఢిల్లీ : ఏపీభవన్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీమాంధ్రలో భద్రాచలం ముంపు గ్రామాలను కలవ వద్దంటూ తెలంగాణ విద్యార్థి జేఏసీ శనివారం ఏపీభవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగింది. అయితే ఈ ధర్నాకు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరిని ఆహ్వానించడంపై జేఏసీలోని కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో ఉద్రిక్తత ఏర్పడింది. రేణుకా గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తింది. దాంతో ఉద్యోగ సంఘాలు, విద్యార్థుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా విద్యార్థి జేఏసీ ధర్నాకు రౌణుకా చౌదరి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో భద్రాచలానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవటం తమ లక్ష్యమన్నారు. రామాలయ ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చానని రేణుక తెలిపారు. -
‘ఆడబిడ్డ’కు చెక్!
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రాజుకుంది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని టార్గెట్ చేసుకొని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఎన్నికల నాటికి ఆమెను జిల్లా రాజకీయాల నుంచి తప్పించడమే వారు ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... ‘అధికార పదవి అందుకే ఊడింది’ అని తాజాగా లీకులు ఇస్తూ జిల్లాలోని ఆమె క్యాడర్‌ను నిస్తేజంలోకి నెడుతున్నారు. జిల్లాలో మంత్రితో నువ్వా..నేనా..? అనే స్థాయిలో రేణుక అమీతుమీకి సిద్ధమైన సమయంలోనే ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆమెను పక్కనపెట్టారు. దీంతో ఆమె క్యాడర్ అయోమయంలో పడింది. మళ్లీ జిల్లా పర్యటన చేసి కొంతమేర ఆమె అనుచరుల్లో ఉత్సాహం నింపినా ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సమయానికి ఏమి జరుగుతుందోనన్న ఆందోళన ఆమె వర్గీయుల్లో ఇంకా నెలకొంది. ఆమెనే నమ్ముకుని అసెంబ్లీ టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా ఇప్పుడు డైలామాలో పడ్డారు. ఇదిలావుంటే... బుధవారంనాడు మంత్రి రాంరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను హైదరాబాద్‌లో కలిసి డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును పక్కన పెట్టి, తమ అనుచరులకు ఆపదవి కట్టబెట్టాలని కోరిన విషయం విదితమే. అంతేకాకుండా తమ వ్యూహంలో భాగంగా ‘రేణుక పదవి ఎందుకు ఊడిందంటే’...అంటూ అక్కడ మీడియాకు కూడా లీకులిచ్చారు. రే ణుక తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి వసుంధరరాజే (రాజస్థాన్ ముఖ్యమంత్రి)తో స్నేహంగా మెలిగేవారని, ఆమె ముఖ్యమంత్రి కావడంతో.. కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో ఓడిపోయినప్పటికీ రేణుక పార్టీ చేసుకున్నారని, ఈ విషయాన్ని ఆంగ్ల పత్రికలు ప్రచురించాయని, ఈ విషయం అధినేత్రి సోనియాగాంధీకి తెలిసి పదవిని ఊడగొట్టారని లీకులు ఇచ్చారు. ఈ లీకులతో పాటు రేణుక ప్రధాన అనుచరుడయిన డీసీసీ అధ్యక్షుడు వనమాను పక్కనపెట్టాలనే ప్రతిపాదనలు తేవడం ద్వారా ఆమె వర్గాన్ని ఊపిరిసలపకుండా ఉంచాలన్న వ్యూహంతో వారు ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. టికెట్ల హామీలపై గుర్రు.. జిల్లాలో అసెంబ్లీ టికెట్లు ఇప్పిస్తానని చాలా మందికి రేణుక హామీ ఇవ్వడంపై కూడా మంత్రి రాంరెడ్డి, పొంగులేటి గుర్రుగా ఉన్నారు. ఖమ్మం పార్లమెంటు సీటుకు సంబంధించి తనకు లేదా తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోతే, తన వర్గీయుడైన ఓ నేతకు టికెట్ ఇప్పిస్తానని, అదీ కుదరకపోతే మరో ప్రముఖ వ్యాపారికైనా టికెట్ ఓకే చేయిస్తానని ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే వైరా నియోజకవర్గానికి సంబంధించి వచ్చిన వారికల్లా టికెట్ నీదేనని హామీ ఇవ్వడంతో ఎవరికివారు అప్పుడే ప్రచారం మొదలు పెట్టారు. ఇదే పరిస్థితి మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా నెలకొంది. ఈ పరిస్థితుల్లో తమ ప్రయత్నాలకు అడ్డు తగలకుండా ఉండ డంతో పాటు... తమ అనుచరుల టికెట్లకు అడ్డంకులు రాకుండా ఉండేందుకు గాను రేణుకకు ఎసరుపెట్టక తప్పదని రాంరెడ్డి, పొంగులేటి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహంతోనే వారు పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధం.. గతంలో రాహుల్‌గాంధీ ‘ప్లేస్ ఆఫ్ బర్త్’ విషయాన్ని రేణుక అనుచరులు నేరుగా ప్రశ్నించడాన్నే ఇరువురు నేతలు తమకు అనుకూల అస్త్రంగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో ఈ అంశం పీసీసీ వరకు వెళ్లగా రేణుక అనుచరులను మందలించారు. అయితే ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఏకంగా రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేసేందుకు మంత్రి, పొంగులేటి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇలా చేస్తే జిల్లా రాజకీయాల నుంచి రేణుకకు శాశ్వతంగా చెక్ పెట్టవచ్చని, ఇక జిల్లాలో తమదే ఆధిపత్యం కొనసాగుతుందని వారు భావిస్తున్నట్లు పార్టీ క్యాడర్ చర్చించుకుంటోంది. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకూ మౌనంగా ఉన్న రేణుక ఘాటుగానే స్పందిస్తారని, హస్తినలో ఆమె కూడా ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు ఆమె అనుచరులు పేర్కొంటున్నారు. మొత్తంగా ఆడబిడ్డను సాగనంపుతారా....లేక ఫైర్‌బ్రాండ్ ఎత్తులకు ఇద్దరు నేతలు చిత్తవుతారా తేలాల్సి ఉందనే చర్చ ఇప్పుడు జిల్లా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. -
సోనియాతో రేణుక, డీఎస్‌ల భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ సోమవారం విడివిడిగా భేటీ అయ్యారు. తొలుత డీఎస్ పది నిమిషాల పాటు సోనియాతో మాట్లాడారు. ఆయన బయటకు వచ్చిన వెంటనే రేణుక ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళా సర్పంచ్‌ను వెంట తీసుకొని సోనియాను కలిసేందుకు లోపలికి వెళ్లారు. ఈ భేటీల్లో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలే చర్చకు వచ్చినట్లుగా తెలిసింది. రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన తదనంతర పరిణామాలను సోనియా అడిగి తెలుసుకున్నారని సమాచారం. విభజన బిల్లుపై వెనక్కెళ్లేది లేదని, ఫిబ్రవరిలో జరిగే సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమని, సాధారణ ఎన్నికలకు ముందే రెండు రాష్ట్రాల ఏర్పాటు జరుగుతుందని సోనియా సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. భేటీ అనంతరం డీఎస్ మీడియాతో మాట్లాడుతూ, ‘‘2014 లోపు రెండు రాష్ట్రాల ఏర్పాటు ఖాయం. సాధారణ ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని కచ్చితంగా చెప్పగలను’’ అని అన్నారు. ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ‘‘నేను కాంగ్రెస్ కార్యకర్తను, వారు ఏ బాధ్యతను కట్టబెడితే దాన్ని స్వీకరిస్తా’’ అని బదులిచ్చారు. తర్వాత రేణుక మాట్లాడుతూ, తెలంగాణపై ఇప్పటికే ఎవరి పని వారు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చ జరగాలని అందరూ కోరుకుంటున్నారని, తాను అదే ఆశిస్తున్నానని అన్నారు. -
బిల్లుపై చర్చ జరిగి..రాష్ట్రపతికి చేరాలనుకుంటున్నాం'
ఢిల్లీ: రాష్ట్ర విభజనపై బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాతే రాష్ట్రతికి అందితేనే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుపై అసెంబ్లీ చర్చ జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. సర్పంచ్ గా గెలిచిన మహిళను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పరిచయం చేసేందుకే కలిశానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆమెతో ఏ ఇతర రాజకీయ అంశాలను మాట్లాడలేదన్నారు. -
సోనియాకు సర్పంచ్‌ని పరిచయం చేశా, అంతే!
ఢిల్లీ: సర్పంచ్‌గా గెలిచిన మహిళను పరిచయం చేసేందుకే తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశాననని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి చెప్పారు. ఈరోజు ఆమె సోనియాతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహిళా సర్పంచ్‌ను పరిచయం చేశానని, మరే ఇతర అంశాలను సోనియాతో మాట్లాడలేదని చెప్పారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగి, రాష్ట్రపతి వద్దకు రావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా ఈ రోజు సోనియా గాంధీని కలిశారు. -
కాంగ్రెస్‌లో ముదిరిన వర్గపోరు
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు తారస్థాయికి చేరాయి. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి రెండురోజుల జిల్లా పర్యటన గ్రూపుల మధ్య చిచ్చును మరింత రాజేసింది. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయులు ఆమె పర్యటనకు అడ్డంకులు కలిగించడం.. అదే స్థాయిలో రేణుకతో పాటు ఆమె వర్గీయులు మంత్రి అనుచరులుపై మండిపడడంతో కాంగ్రెస్ పరువు బజారున పడింది. తాజా పరిణామాలతో సై అంటే సై అంటూ ఎక్కడికక్కడ వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు కాలుదువ్వుతున్నారు. వరుస ఎదురుదెబ్బలు తగులుతుండడంతో...జిల్లాలో తన ప్రాబల్యం చాటుకునేందుకు రేణుకాచౌదరి భద్రాచలం జైత్రయాత్ర పేరుతో పర్యటించగా...పార్టీ కేడర్ నుంచి స్పందన అంతంతమాత్రంగా వచ్చింది. ఆమె పర్యటనకు జిల్లాలో ఆపార్టీ ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు వెళ్లకుండా మంత్రి ఎత్తులు వేశారని.. దీంతో ఆమె యాత్ర వెలవెలబోయిందనే చర్చ పార్టీ శ్రేణులలో నడుస్తోంది. భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచాలన్న డిమాండ్‌తో యాత్ర చేపడితే పార్టీ నేతలెవ్వరూ రాకపోవడంపై రేణుక ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి ఆదేశాలతో పోలీసులు కూడా ఆమె పర్యటనకు కావాలనే అడ్డంకులు కలిగించారని రేణుక అనుచరులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పాలేరులో తన అనుచరులతో రేణుక మాట్లాడుతూ ఇలానే చేస్తే రెండు మూడు రోజుల్లో వాతలు పెట్టిస్తానని ఆగ్రహంగా మంత్రి, ఆయన అనుచరులని ఉద్దేశించి హెచ్చరించిన దానిపై కూడా తీవ్ర చర్చ నడుస్తోంది. మంత్రి ఇలాకాలో రేణుక కుంపటి.. పర్యటనలో భాగంగా రేణుకాచౌదరి చివరగా... తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో పాలేరులో రూ. 15 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిరా్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక సర్పంచ్‌ను తన వర్గం నాయకురాలిగా మార్చుకోవడం, అక్కడ మంత్రికి సమాచారం లేకుండా పనులకు శంకుస్థాపన చేయడంతో..ఇటు మంత్రితో పాటు ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జిల్లాలో తన ఆధిపత్యానికి మంత్రి అడ్డంకిగా మారడంతో.. కావాలనే రాంరెడ్డి నియోజకవర్గం పాలేరులో ఆమె అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారనే చర్చ జరుగుతోంది. మంత్రి ఇలాకాలోనే స్థానిక సర్పంచ్‌ను మచ్చిక చేసుకొని కుంపటి పెట్టడంతో ఆయనకు తలనొప్పిగా మారింది. అంతేకాకుండా పాలేరు ప్రజలు ఏ సహాయం కావాలన్నా తనను ఎప్పుడైనా అడగవచ్చని ఆమె హామీలు ఇవ్వడంపై మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పాలేరు నియోజకవర్గంలో మంత్రికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది నేతలను తనవైపుకు తిప్పుకునే వ్యూహంలో కూడా రేణుక ఉన్నట్లు తెలిసింది. సై అంటే సై అంటున్న నేతలు.. రేణుక పర్యటనపై మరోవైపు మంత్రి వర్గీయులు భగ్గుమన్నారు. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, నేతలు శీలంశెట్టి వీరభద్రం, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి సోమవారం ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేణుకపై నిప్పులు చెరిగారు. పార్టీలో సభ్యత్వం లేని నాయకులను వెంట తిప్పుకొని టికెట్ ఇప్పిస్తానని రేణుక చెబుతున్నారని, భద్రాచలంపై షో చేస్తే జిల్లా ప్రజలు ఆమెను తరిమికొడతారని హెచ్చరించారు. ఇదిలా ఉంటే రేణుక పర్యటనతో జిల్లాలో జరిగిన రసాభాస విషయమై మంత్రి ఇప్పటికే తెలంగాణ మంత్రులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ర్టం వస్తే మావోయిస్టులు పెరుగుతారని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించడం కూడా ఆయన వారి దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. సమైక్యవాదం వినిపిస్తున్న సీఎంను రేణుక సమర్థిస్తున్నారని మంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. అలాగే తనపర్యటనకు మంత్రి కావాలనే అడ్డంకులు కలిగించారని.. రేణుకాచౌదరి కూడా ఆయనతో అమీతుమీ తెల్చుకునేందుకు ఈవ్యవహారం ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. ఇలా ఇరువురు నేతల పంచాయితీ తారస్థాయికి చేరడం, వారి అనుచర గణం కూడా సై అంటే సై అనడంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. -
జైత్రయాత్ర రసాభాస
టేకులపల్లిలో రేణుక, మంత్రి రాంరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ కారేపల్లిలో వాహనంపై గుడ్లు విసిరిన తెలంగాణవాదులు సాక్షి, కొత్తగూడెం: ఖమ్మం జిల్లాలో ఎంపీ రేణుకాచౌదరి చేపట్టిన భద్రాచలం జైత్రయాత్ర ఆదివారం రసాభాసగా మారింది. రేణుక గోబ్యాక్ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఆమె వర్గీయులు, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనుచరులు పరస్పరం దాడులకు దిగారు. తోపులాట, నినాదాలతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. రేణుక అనుచరులిద్దరు తీవ్రంగా గాయపడ్డారు. టేకులపల్లి సభలో రేణుక మాట్లాడుతూ.. ‘మూతి మీద మీసం ఉంటే మగాడు కాదు.. మహిళలను ఆదరించి ముందుకు నడిపేవాడే మగాడు అవుతాడు. నాతో పనులు చేయించుకున్నప్పుడు ఎక్కడి ఆడబిడ్డనో గుర్తుకు రాలేదా..?’ అంటూ మంత్రి రాంరెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు. తన వర్గీయులపై దాడి జరిగిందని సమాచారం అందుకున్న ఆమె మళ్లీ టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయడంతో 50మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే రేణుక సర్పంచ్‌ను కులంపేరుతో దూషించారని.. ఆమెపై కేసు నమోదు చేయాలని మంత్రి వర్గీయులు టేకులపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. కాగా, కారేపల్లిలోనూ రేణుకకు అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయి. మంత్రి అనుచరులతో సహా టీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యకర్తలు ఆమె పర్యటనను అడ్డుకున్నారు. ‘తెలంగాణద్రోహి.. రేణుకా గ్యోబాక్’ అంటూ నినదించారు. ‘భద్రాచలం మాది.. పెద్దాపురం మీది’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇక్కడ సభలో కూడా పరోక్షంగా మంత్రిపై ఆమె నిప్పులు చెరిగారు. సభ ముగించుకొని ఖమ్మం వైపు వెళ్తున్న ఆమె వాహనంపై బస్టాండ్ సెంటర్లో కోడిగుడ్లు విసిరారు. అక్కడ ఉన్న రేణుకాచౌదరి ఫ్లెక్సీలను కూడా చించారు. -
కాంగ్రెస్‌లో ‘యుద్ధ’ కాండ
సాక్షి, కొత్తగూడెం/కారేపల్లి, న్యూస్‌లైన్ కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు వీధికెక్కాయి. ఇప్పటి వరకు మాటలతోనే సరిపెట్టుకున్న ఎంపీ రే ణుకాచౌదరి, మంత్రి రాంరెడ్డి వర్గీయులు ప్రత్యక్షంగా ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. టేకులపల్లి, కారేపల్లి మండలాల్లో రేణుక పర్యటన రచ్చరచ్చగా మారింది. మంత్రి వర్గీయులకు తోడు తెలంగాణవాదులు కూడా ఆమె పర్యటనపై నిరసన తెలిపారు. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదరడంతో భద్రాచలం జైత్రయాత్ర పేరుతో ఆమె చేసిన పర్యటన ఆదివారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసి యుద్ధకాండను తలపించింది. టేకులపల్లిలో ఏర్పాటు చేసిన రేణుక సభకు తరలివస్తున్న ఆమె వర్గీయులు, మంత్రి అనుచరులకు ముందుగా ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు వద్ద ఘర్షణ జరిగింది. కొత్తగూడెం నుంచి రతన్‌నాయక్, భూక్యా నాగేందర్‌తో పాటు మరికొందరు రేణుకను కలిసేందుకు టేకులపల్లి వస్తున్నారు. వీరిపై మంత్రి వర్గీయులు ముత్యాలంపాడు వద్ద దాడి చేశారు. ఇలా పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడిలో రేణుక అనుచరులు ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం మంత్రి అనుచరులు వీరిని టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి.. తమపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. కాగా, టేకులపల్లిలో ఏర్పాటు చేసిన సభలో రేణుక మాట్లాడుతూ ‘మూతి మీద మీసం ఉంటే మగాడు కాదు.. మహిళలను ఆదరించి ముందుకు నడిపేవాడే మగాడు అవుతాడు. నాతో పనులు చేయించుకున్నప్పుడు ఎక్కడి ఆడబిడ్డనో గుర్తుకు రాలేదా..?’ అంటూ మంత్రి రాంరెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. ఇలా ఆమె ప్రసంగమంతా మంత్రిపై పరోక్ష విమర్శలతోనే కొనసాగింది. సభ అనంతరం ఆమె కారేపల్లి పయనం కాగా, వైఎస్సార్ సెంటర్లో ఆమె వాహనాన్ని అడ్డుకోవడానికి మంత్రి వర్గీయులు యత్నించారు. తెలంగాణ ద్రోహి అని నినాదాలు చేశారు. పోలీసులు వారిని తొలగించడంతో ఆమె వాహనం వెళ్లిపోయింది. ఇల్లెందు వరకు వెళ్లిన తర్వాత తన వర్గీయులపై దాడి జరగిందని రేణుకకు సమాచారం అందింది. వెంటనే ఆమె మళ్లీ టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. తమపై దాడి జరిగిన తీరును గాయపడిన వారు వివరిస్తూ ఆమె కాళ్లపై పడి ఏడ్చారు. దీంతో ఆమె కూడా కొంత ఉద్వేగానికి లోనయ్యారు. రేణుక సూచన, బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. మంత్రి వర్గీయుడు కోయగూడెం సర్పంచ్ పూనెం సురేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే రేణుక సర్పంచ్‌ను కులం పేరుతో దూషించారని.. ఆమెపై కేసు నమోదు చేయాలని, సర్పంచ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి వర్గీయులు టేకులపల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేశారు. టేకులపల్లి నుంచి రేణుక ఇల్లెందు మీదుగా ఆమె కారేపల్లి వెళ్లాల్సి ఉండగా అక్కడ టీఆర్ఎస్, టీఆర్ఎస్వీ శ్రేణులు కాన్వాయ్‌ను అడ్డకోవడానికి సమాయత్తం కావడంతో ఇల్లెందు రాకుండానే విద్యుత్ కార్యాలయం రోడ్డు నుంచి కారేపల్లి వెళ్లారు. కారేపల్లిలోనూ రచ్చరచ్చ.. సమైక్యవాది అంటూ ఇటు మంత్రి వర్గీయులు, అటు టీఆర్ఎస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ శ్రేణులు కారేపల్లిలో ఆమె పర్యటనను అడ్డుకున్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన రేణుకకు సినిమాహాల్ సెంటర్ వద్ద అనుచరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. బస్టాండ్ సెంటర్లో రేణుక పర్యటనను నిరసిస్తూ ఒకరోజు దీక్ష చేస్తున్న మంత్రి అనుచరుడు కొనకండ్ల సత్యనారాయణ రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో రేణుక, మంత్రి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అతనికి తోడుగా టీఆర్ఎస్, ఎన్డీ కార్యకర్తలు ‘తెలంగాణ ద్రోహి రేణుక గ్యోబాక్’ అంటూ నినదించారు. ‘భద్రాచలం మాది.. పెద్దాపురం మీది’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇలా రేణుక కాన్వాయ్‌పై దూసుకొస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనే ఆమె పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ ‘ నిద్రపోతున్న పులిని లేపారు.. నా చేతికి ఉన్నవి గాజులు కాదు.. విష్ణుచక్రాలు, రౌడీ వేషాలు వేస్తే ఆ విష్ణుచక్రాలు లేచి మీ తలలను నరికేస్తాయి’ అని ఆమె మంత్రి అనుచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ముగించుకొని ఖమ్మం వైపు వెళ్తున్న ఆమె వాహనంపై బస్టాండ్ సెంటర్లో మంత్రి వర్గీయులు, టీఆర్ఎస్, ఎన్డీ, సీపీఐ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. అక్కడున్న రేణుకాచౌదరి ఫ్లెక్సీలను కూడా చించారు. అయితే పోలీసులే దగ్గర ఉండి ఆందోళనకారులతో గుడ్లు వేయించారని రేణుక వర్గీయులు ఆరోపించారు. విభేదాలు బహిర్గతం.. ఇన్నాళ్లూ అంతర్గతంగా రగులుతున్న వార్ రేణుక పర్యటనతో ప్రత్యక్షంగా బయటపడింది. మంత్రి, రేణుక వర్గీయులు ఒకరిపై ఒకరు ప్రత్యక్షంగా టేకులపల్లి, కారేపల్లిలో దాడులకు దిగడంతో కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు ముదిరాయి. ఓవైపు మంత్రి వర్గీయుల నిరసనలు, మరోవైపు తెలంగాణవాదుల ఆందోళనలతో భద్రాచలం జైత్రయాత్ర రసాభాసగా ముగిసింది. రేణుక పర్యటన తన అనుచరుల్లో కొంత ఉత్సాహాన్ని నింపినా, యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇక ప్రత్యక్ష వార్ మొదలైందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పాలేరులో కూడా రేణుక తన ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు వ్యూహాత్మకంగానే శంకుస్థాపన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి ఇలాకాలో ఆయనకు తొలనొప్పి పుట్టేంచేలా రేణుక ఇక ప్రత్యక్షంగా ఎత్తులు వేస్తున్నారని ఆమె వర్గీయులు చర్చించు కుంటున్నారు. -
తెలంగాణ రాష్ట్రంతో తీవ్రవాదం నిజమే
సీఎం వ్యాఖ్యలకు రేణుకాచౌదరి సమర్ధన ఖమ్మం, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నక్సల్స్ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సమర్ధించారు. ఖమ్మంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో అక్కడి ప్రజలు తీవ్రవాదంతో పడుతున్న ఇబ్బందులను వివరించారని చెప్పారు. తాను తెలంగాణ ఏర్పాటును సమర్ధిస్తున్నానని కానీ, రాయల తెలంగాణను అంగీకరించేది లేదన్నారు. -
బతికుండగా భద్రాచలం విలీనం కానివ్వను: రేణుక
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రేణుకా చౌదరి బుధవా రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి జాబితా నుంచి తొలగించిన తరువాత ఆమె తొలిసారిగా దిగ్విజయ్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘భద్రాచలంను సీమాంధ్రలో విలీనం చేసే ప్రసక్తే లేదు. కచ్చితంగా అడ్డుకుంటా. సీమాంధ్రలో విలీనం చేయాలంటే నేను బతికుండగా అది జరగదు. కాదూ కూడదంటే నా శవంపై తీసుకెళ్లాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు. -
భద్రాచలాన్ని విభజిస్తే తడాఖా చూపిస్తా: రేణుకా చౌదరి
భద్రచలం తెలంగాణాలోనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి స్పష్టం చేశారు. అలాకాదని తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలాన్నివిడతీస్తే నా తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. బుధవారం రేణుకాచౌదరి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె పేర్కొన్నారు. 'మా అమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెను దగ్గరండి చూసుకోవాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించలేనని' కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేశానని రేణుకాచౌదరి వెల్లడించారు. అందువల్లే తను ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించిందని ఆమె చెప్పారు. -
డోలాయమానంలో రేణుక కేడర్
సాక్షి, కొత్తగూడెం: ఇన్నాళ్లూ తమకు జిల్లాలో అండదండగా ఉన్న రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని ఏఐసీసీ దూరం పెట్టడంతో ఆమె అనుచరులు డోలాయమానంలో పడ్డారు. ఆమె చలువతో పార్టీ పదవులు, ప్రత్యక్ష ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయని భావించిన నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒక్కొక్కరు ఆమె వర్గం ముద్ర నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. అసలు రేణుక వ్యవహారంపై తమకేమీ తెలియదన్నట్లు వారు గప్‌చుప్‌గా ఉండడంపై కాంగ్రెస్‌లో చర్చ కొనసాగుతోంది. జిల్లాలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, పార్టీలో ప్రత్యర్థులపై విమర్శలు చేయించిన రేణుకాచౌదరిని ఏఐసీసీ పక్కన పెట్టడంతో ఆమె ప్రధాన అనుచరులు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాక మల్లగుల్లాలు పడుతున్నారు. ఆమెను నమ్ముకొని ఏకంగా మంత్రులను, రాహుల్‌గాంధీ ప్లేస్ ఆఫ్ బర్త్ను కూడా ప్రశ్నించడంతో అసలు పార్టీలో తమకు భవిష్యత్ ఉండదని ఆందోళన చెందుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడే కొంతమంది నేతలు ఆమె వర్గం ముద్ర నుంచి బయటపడాలని, లేకపోతే పార్టీలో తమ భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతుందనే ఆలోచనలో ఉన్నారు. గతంలో ఖమ్మం నగర కమిటీ, భద్రాచలం పట్టణ కమిటీలో ఆమె తల దూర్చడం.. చివరకు ఆ కమిటీలను రద్దు చేస్తూ పీసీసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఇటు రాష్ట్రం, అటు హస్తినలో ఆమె మాట చెల్లుబాటు కావడం లేదని భావిస్తున్నారు. ఇంత జరిగినా కొంతకాలంగా ఆమె జిల్లాకు రాకపోవడంతో ఆమె వర్గంగా ఉన్న క్యాడర్లో నిస్తేజం నెలకొందని పార్టీలో చర్చించుకుంటున్నారు. సమైక్య వాదానికి మొగ్గుచూపిన రేణుకాచౌదరి వర్గంగా ముద్ర పడడంతో రానున్న రోజుల్లో తమకు ఇబ్బంది కానుందని ఆయా నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఆమె పదవి వ్యవహారంపై జిల్లాలోని ఒకరిద్దరు నాయకులు నేరుగా ఆమెతోనే చర్చించి ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. రేణుకకు మళ్లీ ఏఐసీసీలో స్థానం దక్కితే జిల్లాలో ఆమె అనుచరులుగా చక్రం తిప్పుతామన్న యోచనలో వారు ఉన్నట్లు సమాచారం. పదవులు దక్కవని నిరాశ.. ఇంతకాలం రేణుక వర్గంగా ముద్రపడిన నేతలకు ఆమె ఎలాగో పార్టీ పరంగా, నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడంలో తనదే పైచేయిగా నిరూపించుకున్నారు. కొంతకాలం నుంచి జిల్లాలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఆమె వ్యవహార ధోరణిని వ్యతిరేకించడంతో పదవుల పంపకాల్లో రేణుక ముద్రకు బ్రేక్ పడింది. ఏఐసీసీ చర్యలు, దరిమిలా అధిష్టానం ముందు ఆమె ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్ర విభజన జరిగినా, ఉమ్మడిగానే ఉన్నా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమ వర్గం నేతలకు కనీసం కార్పొరేటర్ టికెట్లు వస్తాయో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఆమెకు మద్దతిస్తూ జిల్లాలోని పార్టీ నేతల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇంకెన్ని కష్టాలు వస్తాయోనని భయపడుతున్నారు. ఆమె ఆహ్వానం మేరకు ఇటీవల పార్టీలో చేరిన ఓ నేత ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నట్లు సమాచారం. ఆమెనే నమ్ముకుని.. ఖమ్మం టికెట్‌పై కన్నేయడంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన కంగుతిన్నట్లు తెలిసింది. తన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారడంతో ఖమ్మం టికెట్‌పై సదరు నేత ఆశ వదులుకున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. తన రాజకీయ భవిష్యత్‌కు అనూహ్యంగా అడ్డంకులు ఎదురుకావడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఇటీవల కొంతకాలం క్రితం వరకు రేణుక అనుచరులు, మంత్రి రాంరెడ్డి అనుచరులు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలతో డీసీసీ కార్యాలయం మార్మోగిపోయింది. రాహుల్‌గాంధీపై రేణుక అనుచరులు చేసిన వ్యాఖ్యల అనంతరం ఈ కార్యాలయంలో విమర్శలకు తెరపడింది. ఈ విషయంలో ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేయడం, దీన్ని మంత్రి తనకు అనుకువగా మలుచుకోవడంతో.. ఇక డీసీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం పెట్టాలంటేనే రేణుక అనుచరులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటి వరకు డీసీసీ కార్యాలయం అంటేనే రేణుక కార్యాలయంగా ఉంది. అధిష్టానం ఆమెకు ప్రాధాన్యత తగ్గించడంతో ప్రస్తుతం కార్యాలయ నిర్వహణ నేతలు కూడా మిన్నకుండా ఉన్నారు. ఇదిలా ఉంటే రేణుక అనుచరులు కొందరు ఇప్పటికే జిల్లాలోని ఆమె ప్రత్యర్థి వర్గం నేతలు, ప్రజాప్రతినిధులతో చను వుగా ఉండేలా ప్లాన్ చేసుకున్నారని తెలి సింది. రెండుమూడు రోజులుగా ఆయా ప్రజాప్రతినిధులు పాల్గొన్న కార్యక్రమాలకు కూడా సదరు నేతలు హాజరుకావడం గమనార్హం. -
రేణుకాచౌదరిపై వేటు?
కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించిన హైకమాండ్! ఆ స్థానంలో హర్యానా మంత్రి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా నియామకం సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి పదవి నుంచి రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరిని ఆ పార్టీ హైకమాండ్ తప్పించినట్లు తెలుస్తోంది. రేణుకపై వేటు వేస్తూ పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు ఆమెకు కూడా వర్తమానం పంపిందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధికార ప్రతినిధిగా రేణుక పనితీరుపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం రెండు నెలల పాటు (నవంబర్, డిసెంబర్) ఏఐసీసీ తరఫున మీడియా సమావేశాల్లో మాట్లాడరాదని ఆదేశించినట్లు ఆ వర్గాల కథనం. అంతేకాదు.. టీవీ చర్చలకు పార్టీ తరఫున పాల్గొనే నాయకుల జాబితా నుంచి సైతం ఆమె పేరును తొలగించారని సమాచారం. అయితే.. కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారికంగా ఈ మేరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ.. ఏఐసీసీలోని ముఖ్యులు మాత్రం దీన్ని అనధికారికంగా ధ్రువీకరిస్తున్నారు. రేణుక కొంత కాలంగా ఏఐసీసీ మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. గత మే 5న ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో అధికార ప్రతినిధిగా పదవి దక్కిన రేణుక చివరిసారి అక్టోబర్ 18వ తేదీన ఏఐసీసీ మీడియా సమావేశంలో మాట్లాడారు. అదే సమయంలో హర్యానా మంత్రి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా ఏఐసీసీ మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నారు. రేణుక స్థానంలో ఆయనను అధికార ప్రతినిధిగా తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి సన్నిహితంగా మెలిగే రేణుకాచౌదరిని ఉన్నపళంగా పదవి నుంచి తప్పించటం ఢిల్లీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
రేణుకా చౌదరికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్!
ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరికి కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అనుకోని షాక్ ఇచ్చింది. ఆమెను కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించింది. ఇక మీదట టీవీ చానళ్లలో వచ్చే చర్చా కార్యక్రమాలలో పాల్గొనవద్దని ఆదేశించింది. కాంగ్రెస్ విధానాలను సరైన పద్ధతిలో రేణుకా చౌదరి తీసుకెళ్లడంలేదని భావిస్తున్న అధిష్ఠానం ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అంశం గురించి జోరుగా చర్చలు జరుగుతుండగా, మరోవైపు హైదరాబాద్ నగరంతో పాటు భద్రాచలం అంశంపైనా పలు వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఖమ్మం జిల్లా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరిని కాంగ్రెస్ పార్టీ ఇలా అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. రేణుక తెలంగాణ ఆడపడుచు ఎలా అవుతుందంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు వాదిస్తుండగానే ఆమెను పదవి నుంచి తప్పించడం కూడా చర్చకు వస్తోంది. -
రాంరెడ్డి, రేణుక వర్గీయులకు ఎస్పీ హెచ్చరిక
ఇల్లెందు: గ్రూపు రాజకీయాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయులను ఎస్పీ ఎ.వి.రంగనాథ్ హెచ్చరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఫారెస్టు గ్రౌండ్లో ఏర్పా టు చేసిన సభలో రేణుకను ఉద్దేశించి రాంరెడ్డి వర్గీయులు మడత వెంకట్‌గౌడ్, కొక్కు నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె వర్గీయులు గోచికొండ సత్యనారాయణ, సురేష్‌లాహోటీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎస్పీ ఆదివారం ఇల్లెందుకు వచ్చారు. ఇరు వర్గాలకు చెందిన నాయకులను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి వేర్వేరుగా విచారణ చేశారు. ఉత్సవాల్లో రాంరెడ్డి వర్గీయులు చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. తమపై ప్రజలు దాడికి పాల్పడే విధంగా రాంరెడ్డి వర్గీయులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ సురేష్లాహోటి, గోచికొండ సత్యనారయణ, పద్మావతి తదితరులు ఎస్పీకి వివరించారు. రేణుక వర్గీయుల వైఖరి గురించి మడత వెంకట్‌గౌడ్ కూడా ఎస్పీ క్షుణ్ణంగా వివరించారు. ఇరువర్గాల వాదోపవాదనలను విన్న ఎస్పీ శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పలు సూచనలు చేసినట్లు చెప్పా రు. ప్రజల స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించినా సహిం చేది లేదన్నారు. అల్లర్లను సష్టిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు. -
దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం?
సాక్షి, కొత్తగూడెం: జిల్లా కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరుతోంది. తనపై ఘాటుగా వ్యాఖ్యలు చేసిన రాష్టమ్రంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి తీరుపై రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి మండిపడుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా తెలంగాణ ప్రాంత అధినాయకులు మంత్రి వెనకాల ఉండి వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాను తాను ఎంతో అభివృద్ధి చేశానని, ఇదేమి చూడకుండా విమర్శిస్తారా..అంటూ ఈపరిణామాలపై హస్తినలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర విభజనపై పీకల్లోతు సమస్యల్లో ఉన్న దిగ్విజయ్‌సింగ్ ఆమె ఫిర్యాదును పట్టించుకోరని, ఈ వ్యవహారం అంతా తెలంగాణ మంత్రులు చూసుకుంటారని, మంత్రి మాత్రం 21వ తేదీన జరిగే సభ విజయవంతంపైనే దృష్టి పెట్టారని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు. కాగా, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఖమ్మం జిల్లా ఆడబిడ్డనంటూ ఇప్పటి వరకూ రేణుక ఎన్ని రాజకీయాలు నడిపినా మౌనంగా ఉన్న మంత్రి హఠాత్తుగా దాడి చేయడం వెనక పెద్ద వ్యూహమే ఉందని పార్టీశ్రేణులు చర్చించుకుంటున్నాయి. తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు వెన్నుదన్నుగా నిలవడం వల్లే తీవ్రస్థాయిలో ఆమెపై మంత్రి విరుచుకుపడ్డారని సమాచారం. తాజా పరిణామాలపై సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, ఇతర తెలంగాణ మంత్రులు సైతం ఏమీ భయపడవద్దని మంత్రికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఈనెల 21వ తేదీన ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన తెలంగాణ కృతజ్ఞత సభకు ఎట్టి పరిస్థితుల్లోనూ రేణుకను ఆహ్వానించరాదన్న ఉద్దేశంతోనే మంత్రి ఆమెపై వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ఇలా ఉండగా...మంత్రి వ్యాఖ్యలను జిల్లాలో రేణుకాచౌదరి వర్గీయులు కొందరు ఖం డించారు. అయితే గతంలో ఆమె అనుంగులుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ మంత్రి వ్యాఖ్యలను ఖం డించకపోగా ఆయనకు లోపాయికారిగా మద్దతు పలికినట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన ఈ వ్యవహారంలో మంత్రికే మద్దతిచ్చారు. హుకుం జారీ చేసినా... మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఖండించాలని రేణుక జిల్లాలోని తన ముఖ్య అనుచరులకు హుకుం జారీ చేసినట్లు తెలిసింది. అయితే వారిలో కొందరు మాత్రమే ఇందుకు స్పందించారు. మిగిలిన వారు ముందుకు రాకపోవడం గమనార్హం. కాగా రాజధానిలోనే ఉన్న డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును కూడా ఆమె ఈమేరకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఆయన హైదారబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. రేణుక ఇచ్చిన స్క్రిప్టతోనే ఇటు వనమా, అటు కొందరు అనుచరులు మంత్రి చేసిన విమర్శలపై స్పందించినట్లు రాంరెడ్డి క్యాడర్ చర్చించుకుంటోంది. మొత్తంగా అదును చూసి దెబ్బతీసిన ప్రత్యర్థివర్గంపై రేణుక ప్రతీకారం తీర్చుకుంటారని, ఇందుకు ఎలాంటి వ్యూహం పన్నుతారో అనే చర్చ కూడా నడుస్తోంది. -
సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు: సోనియా గాంధీ
తెలంగాణ ప్రాంత నేతలకు సోనియా సూచన సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్లు శుక్రవారం తెలిపారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని సోనియా హామీ ఇచ్చారని చెప్పారు. ఇలాఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కాంగ్రెస్ వెనకడుగు వేయబోదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ స్పష్టం చేశారు. 8 పార్టీలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ఆ తర్వాత తమ వైఖరులను మార్చుకున్నాయని విమర్శించారు. -
రేణుక రాకపై రగడ!
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఎంపీ రేణుకా చౌదరి కలకలం రేపారు. ఆదివారం మధ్యాహ్నం మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ నేతల సమావేశానికి ఎంపీ రేణుకాచౌదరి రావడం చర్చనీయాంశమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రేణుకాచౌదరి రాకపట్ల సమావేశం ఆరంభంలోనే మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పదేపదే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆమెను సమావేశానికి ఎందుకు పిలిచారని నిర్వాహకులను నిలదీశారు. ‘కనీసం ఆత్మ గౌరవం లేకుంటే ఎలా? పిలిస్తే మాత్రం ఎందుకు వచ్చినట్లు? తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చారు? సిగ్గూ, జ్ఞానం ఉన్నవారెవరూ రారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకుండా సమావేశానికి రావడం అవివేకం’ అని మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఒక దశలో వారిద్దరూ సమావేశం నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమవ్వగా జానారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి సర్దిచెప్పారు. ఇంత జరుగుతున్నా రేణుకా చౌదరి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉండిపోయారని సమాచారం. కాగా, సమావేశం జరుగుతుండగానే ఉస్మానియా జేఏసీ విద్యార్థులు అక్కడికి వచ్చారు. వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని నినాదాలు చేశారు. -
తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో గందరగోళం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో గందరగోళం ఏర్పడింది. మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రులతోపాటు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏఐసిసి అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి కూడా సమావేశానికి హాజరయ్యారు. రాంరెడ్డి దామోదరరెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రేణుకాచౌదరి కొందరు విద్యార్థులను వెంటేసుకొచ్చారు. వారు తమ నేతను సమావేశానికి ఎందుకు రానివ్వరని అడిగారు. ఆమెకు అనుకూలంగా విద్యార్థులు నినాదాలు చేశారు. -
'హైదరాబాద్ పై ఎలాంటి సలహాలు ఇవ్వలేను'
హైదరాబాద్:ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకుందామని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఆంటోని కమిటీతో భేటీ నేపథ్యంలో ఇక్కడికి వచ్చారా?అని ఓ విలేకరి ప్రశ్నించగా..'నేను ఆంటోని కమిటీ మీటింగ్ కోసం ఇక్కడ రాలేదు. అలాగే హైదరాబాద్ పై ఎలాంటి సలహాలు ఇవ్వలేను' అని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతెలుగువారు అందరూ నిన్న మొన్నటి వరకూ కలిసే ఉన్నాం కదా. రాష్ట్ర ఏర్పాటుపై చోటు చేసుకుంటున్న సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుటుందన్నారు. భద్రాద్రిపై ఏమైనా సలహాలు ఇచ్చారా అని ప్రశ్నించగా.. తమ జిల్లా నేతల కోరిక మేరకే అధిష్టానానికి సలహా ఇచ్చానని ఆమె తెలిపారు. -
రేణుకా.. మజాకా
ఖమ్మం, సాక్షి ప్రతినిధి: పేదలు నిర్మించుకునే ఇందిరమ్మ ఇంటికి ప్రభుత్వం ఇచ్చే సొమ్ము అక్షరాలా రూ.75 వేలు! అయితే పేదల కోసం పెద్దపెద్ద ఉపన్యాసాలు ఇచ్చే నేతల కార్యాలయాల కోసం అధికార పార్టీ ఖర్చు చేసేది మాత్రం లక్షల్లో!! ఆశ్చర్యంగా ఉందా? అయితే ఇదిగో ఈ ఉదాహరణ చూడండి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరికి ఖమ్మంలో కేటాయించిన క్యాంపు కార్యాలయానికి మరమ్మతులు, అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వం అక్షరాలా రూ.31 లక్షలు కేటాయించింది. ఈ నెల 17న ఈ మేరకు జీవో నెంబర్ 784 జారీచేసింది. కానీ ఆరోజు జీవో కాపీ తన వెబ్సైట్లో కనిపించకుండా సర్కారు జాగ్రత్తలు తీసుకుని రెండుమూడ్రోజుల తర్వాత దాన్ని బయటపెట్టింది. ప్రభుత్వం ఇంత భారీ మొత్తాన్ని కేటాయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యాలయానికి అదనపు హంగులకు నిధులు కేటాయించాలని జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారులు ఇంతకుముందు పంపిన ప్రతిపాదనలను ఆ శాఖ ఉన్నతాధికారులు తిరస్కరించారు. సుమారు 12 ఏళ్ల క్రితం రూ.20 లక్షలతో నిర్మించిన ఆ భవనం బాగానే ఉందని, ఎలాంటి అదనపు హంగులు అవసరం లేదని స్పష్టం చేశారు. కానీ రేణుకా చౌదరి అడగ్గానే.. ప్రభుత్వ ఆర్థికశాఖ ఏకంగా రూ.31 లక్షలు కేటాయించడం గమనార్హం. జలగం నుంచి స్వాధీనం.. రేణుకకు కేటాయింపు! ఖమ్మం ఖానాపురం హవేలీ వీడీవోస్ కాలనీలో ఆర్‌అండ్‌బీకి చెందిన భవనాల్లో ఈ భవనాన్ని కొన్ని నెలల వరకు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకున్నారు. దాన్ని ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం రేణుకా చౌదరికి కేటాయించింది. అయితే ఇప్పటివరకు ఆమె ఆ భవనంలోకి మారలేదు. భవనానికి అవసరమైన మరమ్మతులు చేయించాలని అప్పుడే అందులోకి చేరతానని ఆమె అనడంతో అధికారులు ఆగమేఘాల మీద ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. వాస్తవానికి ప్రజాప్రతినిధులకు జిల్లాల్లో ప్రభుత్వ భవనాల కేటాయింపు ఉండదు. కానీ ఖమ్మంలో మాత్రం ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ భవనాల కేటాయింపు జరుగుతోంది. అత్యంత తక్కువ అద్దెకు విశాలమైన భవనాలను కేటాయిస్తున్నారు. రేణుకకు కేటాయించిన భవనానికి పెద్దగా మరమ్మతులు అవసరం లేదు. కానీ భవన మరమ్మతుల రూ.8 లక్షలు, అదనపు గదులు, సౌకర్యాల కోసం మరో రూ.23 లక్షలు కేటాయిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఇక్కడి ఆర్అండ్బీ అధికారులు మాత్రం వచ్చిన సొమ్ముతో ఒక గది నిర్మిస్తామని... పైకప్పుకు మరమ్మతులు చేయిస్తామని అంటున్నారు. ఇంత సొమ్ము అవసరమా అని ప్రశ్నించగా.. ఈ భవనాలు ప్రభుత్వానివి కాబట్టి ఎప్పటికైనా ఉపయోగమేనని చెబుతున్నారు. అద్దె ఎంత నిర్ణయించారని అడగ్గా.. ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. రేణుకకు స్వాధీనం చేసి నెలలు దాటినా ఎందుకు అద్దె నిర్ణయించలేదనగా.. ‘‘ఆమె ఇంకా భవనంలోకి మారలేదు. అన్ని హంగులు ఏర్పాటు చేశాక అద్దె నిర్ణయిస్తాం’’ అని పేర్కొన్నారు. -
ఉత్తరాంధ్రతో గ్రేటర్ తెలంగాణ: రేణుకాచౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ జిల్లాలను తెలంగాణతో కలిపి రాష్ట్రాన్ని విభజించాలనే ప్రతిపాదనలను అడ్డుకునే లక్ష్యంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి సరికొత్త ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు. విభజన అనంతరం తెలంగాణ ప్రాంత అభివృద్ధి మందగించకుండా జాగ్రత్త పడటం కోసం తెలంగాణలోని పది జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను కూడా కలిపి గ్రేటర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తూ ఆమె ఆంటోనీ కమిటీకి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. సోమవారం ఆంటోనీ కమిటీతో విడిగా సమావేశమైన శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ ప్రతిపాదనతో ఏకీభవిస్తున్నట్లు సమాచారం. -
సోనియాతో విజయశాంతి భేటీ
ఎంపీ రేణుకతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి నివాసానికి ఉత్తరాంధ్ర జిల్లాలను తెలంగాణలో కలపాలి: రేణుక సాక్షి, న్యూఢిల్లీ: మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖరారైంది. అధికారికంగా కాంగ్రెస్‌లో ఎప్పుడు చేరేది కచ్చితంగా తెలియకున్నా.. ఈ పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఆమె అధిష్టానం పెద్దల చేతుల మీదుగా ఇక్కడి కాంగ్రెస్ కార్యాలయంలోనే పార్టీ సభ్యత్వం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావే శాలకు హాజరయ్యేందుకు బుధవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన విజయశాంతి గురువారం సాయంత్రం రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి నేతృత్వంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆమె నివాసంలో కలుసుకున్నారు. పార్టీలో చేరే విషయమై ఆమెతో పది నిమిషాల పాటు మంతనాలు జరిపారు. విజయశాంతిని సోనియాకు పరిచయం చేసిన రేణుక.. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పోటీ చేసిన మెదక్ నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సినీ పరిశ్రమలో రాణించి రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నారని, విజయశాంతి చేరికతో పార్టీ తెలంగాణలో మరింత బలోపేతం అవుతుందని రేణుక వివరించినట్లుగా తెలిసింది. తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు విజయశాంతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సానుకూల నిర్ణయంతో కాంగ్రెస్‌కు తెలంగాణలో మైలేజీ పెరిగిందని, టీఆర్ఎస్ నేత లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని విజయశాంతి తెలిపినట్లుగా సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడలేదు. కాగా, ఈ భేటీపై రేణుకాచౌదరి స్పందిస్తూ ‘తెలంగాణపై సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు సోనియాకు విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో ఎప్పుడు చేరేది ఆమెనే అడగండి’ అని అన్నారు. తాను తెలంగాణ ఆడబిడ్డనేనని, దీనిలో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదని రేణుక చెప్పారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే తీరప్రాంతం ఉండాలని, ఈ దృష్ట్యా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను తెలంగాణలో కలపాలని ఆమె డిమాండ్ చేశారు. భద్రాచలాన్ని తెలంగాణ నుంచి విడదీస్తే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో అనేక సమస్యలొస్తాయని ముఖ్యమంత్రి చెప్పడంలో ఎలాంటి తప్పు లేదని ఆమె అన్నారు. -
తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలను కలపాలి:రేణుక
ఢిల్లీ: తెలంగాణలో ఉత్తరాంధ్ర జిల్లాలను కలపాలనేది తన ఆలోచన అని ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చెప్పారు. తెలంగాణ ప్రకటించినందుకు మెదక్ ఎంపి విజయశాంతి సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారన్నారు. విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరతారని విలేకరులు ప్రశ్నించగా, ఎప్పుడు చేరతారో ఆమెనే అడగాలన్నారు. తాను తెలంగాణ ఆడబిడ్డనని రేణుకా చౌదరి చెప్పారు. తెలంగాణపై సీఎంకు ఒక అభిప్రాయమంటూ ఏమీ ఉండదన్నారు. సీడబ్ల్యూసీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.