సీనియర్ల వైఫల్యం వల్లే కాంగ్రెస్ ఓటమి: రేణుక | Renuka chowdary takes on telangana congress senior leaders | Sakshi
Sakshi News home page

సీనియర్ల వైఫల్యం వల్లే కాంగ్రెస్ ఓటమి: రేణుక

May 19 2014 12:55 PM | Updated on Mar 18 2019 9:02 PM

సీనియర్ల వైఫల్యం వల్లే కాంగ్రెస్ ఓటమి: రేణుక - Sakshi

సీనియర్ల వైఫల్యం వల్లే కాంగ్రెస్ ఓటమి: రేణుక

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సీనియర్ల వైఫల్యమే కారణమని ఆపార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు.

హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి సీనియర్ల వైఫల్యమే కారణమని ఆపార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయామని ఆమె సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. వారికి క్షమాపణలు చెప్పుకుంటున్నామని రేణుకా చౌదరి అన్నారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహులే గాంధీలే దిక్కన్నారు. కాంగ్రెస్కు 25 శాతం ఓటు బ్యాంక్ మిగిలిందని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందనే అంచనాతో సీనియర్లు పదవులపై పగటి కలలు కంటూ క్షేత్రస్థాయిలో పనిచేయలేదని రేణుకా చౌదరి విమర్శించారు. నేతల గ్రూపు రాజకీయాలు దెబ్బతీశాయని అన్నారు. కాంగ్రెస్కు పై అంతస్తు బీటలు వారినా పునాదులు గట్టిగానే ఉన్నాయని రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా నేతలు సమిష్టిగా పని చేయాలని ఆమె కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement