
సాక్షి, ఖమ్మం : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపేందుకే కాంగ్రెస్- టీడీపీ కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన టీడీపీ సమన్వయ కర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత కోనేరు చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తనకు సీటు ఇవ్వటం బహుమతి కాదని, బాధ్యతని చెప్పుకొచ్చారు.
టీడీపీ-కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. కేంద్రంతో పోరాడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా.. ఎన్‌టీ రామారావా?.. కేసీఆర్‌కు అధికార బలం ఉంటే! నాకు కార్యకర్తల బలం ఉంది అని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా ఖమ్మంలో తనకు మద్దతు ఇవ్వాలని టీడీపీ నేతలని రేణుకా చౌదరి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment