సీపీఐ విజయానికి కృషి చేస్తా: రేణుకా చౌదరి | Renuka Chowdary campaign for CPI in Khammam | Sakshi
Sakshi News home page

సీపీఐ విజయానికి కృషి చేస్తా: రేణుకా చౌదరి

Published Tue, Apr 22 2014 10:03 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

సీపీఐ విజయానికి కృషి చేస్తా: రేణుకా చౌదరి - Sakshi

సీపీఐ విజయానికి కృషి చేస్తా: రేణుకా చౌదరి

పాల్వంచ: బీజేపీ తమ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన నరేంద్రమోడీ ప్రభావం దేశంలో ఏమీలేదని రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి రావడం తథ్యమని జోస్యం చెప్పారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఆమె విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శిరసా వహించి సీపీఐ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని సూచించారు.  రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కూటముల అభ్యర్థులు అధిక సీట్లు గెలుచుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. రేణుక వెంట కాంగ్రెస్ నియోజకవర్గ పరిశీలకులు శ్రీరాం యాదవ్, సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, నాయకులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement