
మన్మోహన్ అమాయకుడు : రేణుకా చౌదరి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అమాయకుడని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకాచౌదరి తెలిపారు.
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అమాయకుడని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో రేణుకాచౌదరి మాట్లాడుతూ... బొగ్గు కుంభకోణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రమేయం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. బొగ్గు కుంభకోణం కేసులో హిందాల్కో కేటాయింపుల్లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాగ్మూలం నమోదు చేయాలని ప్రత్యేక న్యాయస్థానం సీబీఐను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో రేణుకాచౌదరిపై విధంగా స్పందించారు. ఈ కేసులో పారిశ్రామికవేత్త కుమార మంగళం బిల్లాతోపాటు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి పరేఖ్ పాత్రపై దర్యాప్తు కొనసాగించాలని సూచించింది. జనవరి 27 నాటికి దర్యాప్తు పురోగతిపై నివేదిక అందజేయాలని ప్రత్యేక కోర్టు సీబీఐను ఆదేశించింది.