కేసీఆర్ సర్కారును బతుకమ్మ క్షమిస్తుందా? | Bathukamma not Pardon TRS Govt, says Renuka Chowdary | Sakshi
Sakshi News home page

కేసీఆర్ సర్కారును బతుకమ్మ క్షమిస్తుందా?

Published Mon, Sep 15 2014 1:56 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

కేసీఆర్ సర్కారును బతుకమ్మ క్షమిస్తుందా?

కేసీఆర్ సర్కారును బతుకమ్మ క్షమిస్తుందా?

హైదరాబాద్: వందరోజుల్లో సీఎం కేసీఆర్ వెయ్యి అబద్ధాలు ఆడారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. రైతు రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టతలేదని విమర్శించారు. 178 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులను ఆదుకోని ఈ ప్రభుత్వాన్ని బతుకమ్మ తల్లి క్షమిస్తుందా అని ప్రశ్నించారు.

జలవిహార్‌లో జరిగిన హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎంఐఎంతో సంబంధం లేకుండా గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సొంతంగానే ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement