toddy shops
-
ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్: తెరుచుకోనున్న కల్లు దుకాణాలు
తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం పలు షరతులతో కూడిన లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో అనేక రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. కానీ తొలి కేసు నమోదైన కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు మద్యం అమ్మకాలకు అక్కడి ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయితే తాజాగా అక్కడి ప్రభుత్వం కూడా కొన్ని లాక్డౌన్ సడలింపులకు ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా కల్లు విక్రయాలకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కల్లు దుకాణాలు తెరవడానికి అనమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా కల్లు దుకాణాల సంఖ్యపై ఎలాంటి పరిమితులు విధించలేదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న అన్ని కల్లు దుకాణాలు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే దుకాణాల వద్ద భౌతిక దూరం, మాస్స్‌లు ధరించడం తప్పనిసరి అని తేల్చిచెప్పింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గీత కార్మికులు, మద్యం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పట్లో వైన్స్ షాప్స్‌కు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. చదవండి: ఆంధ్రప్రదేశ్: యాక్టివ్ కేసులు తగ్గుముఖం జూన్‌లో రైళ్ల కూత.. బస్సులపై అస్పష్టత -
కల్లుపై ‘సుప్రీం’లో ఆసక్తికర వాదనలు
సాక్షి, న్యూఢిల్లీ : కల్లుపై సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. అదొక పోషక విలువలు కలిగిన విటమిన్ పానీయమంటూ కేరళ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించింది. సాధికారిక కమిటీ ఆదేశాలతో జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు మద్యం అమ్మకాలను నిషేధించాలంటూ గతంలో సుప్రీం కోర్టు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో కేరళ వ్యాప్తంగా 520 కల్లు దుకాణాలు మూతపడగా.. 3వేల మందికి పైగా కల్లుగీత కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అఫిట్‌విట్ సమర్పించాలని కోర్టు ప్రభుత్వానికి సూచించింది. దీనికి స్పందించిన కేరళ ప్రభుత్వం గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. అఫిడవిట్లో అంశాలు.. ’’కేరళ ఔషద గుణాలున్న పానీయం. అంతేగానీ అది మద్యం కిందకు కాదు. కేరళ సాంప్రదాయక భోజనాల్లో కల్లుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కల్లు ఓ యాంటి-బయోటిక్ అన్న విషయం శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. కేన్సర్ వ్యాధికి మూలమైన ఓబీఎస్-2(OBs-2) కణాలను నిర్మూలించే గుణం కల్లులోని చఖరోమైసెస్ అనే సూక్ష్మజీవికి ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా కల్లు కీలకపాత్ర వహిస్తుంది’’ అని పేర్కొంది. కేరళలో కార్మికుల శాతం అధికమన్న ప్రభుత్వం.. వారికి కల్లు ద్వారానే ఆరోగ్యమని తెలిపింది. ఇక మద్యపాన నిషేధం విధించబడిన సమయంలో కూడా.. కల్లుపై నిషేధం విధించని విషయాన్ని అఫిడవిట్లో ప్రస్తావించింది. దీనిద్వారా హని జరుగుతుందన్న వాదనలో ఎలాంటి వాస్తవం లేదని.. అయితే కల్తీ కల్లు విషయంలోనే ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది అని కేరళ ప్రభుత్వం పేర్కొంది. అయితే ‘కల్లు మద్యం కేటగిరీలోకి రాదని చెబుతున్నప్పుడు.. కేరళ అబ్కారీ యాక్ట్‌లో దానిని ఎందుకు పొందుపరిచారు’’ అంటూ... చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదే అంశంపై కేరళ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా పరిశీలనలు జరుపుతున్న విషయాన్ని కేరళ తరపు న్యాయవాది తెలపటంతో.. కోర్టు తదుపరి వాదనను ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది. -
కేసీఆర్ సర్కారును బతుకమ్మ క్షమిస్తుందా?
హైదరాబాద్: వందరోజుల్లో సీఎం కేసీఆర్ వెయ్యి అబద్ధాలు ఆడారని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఆరోపించారు. రైతు రుణమాఫీపై ఇప్పటికీ స్పష్టతలేదని విమర్శించారు. 178 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతులను ఆదుకోని ఈ ప్రభుత్వాన్ని బతుకమ్మ తల్లి క్షమిస్తుందా అని ప్రశ్నించారు. జలవిహార్‌లో జరిగిన హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎంఐఎంతో సంబంధం లేకుండా గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ సొంతంగానే ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో కల్లు దుకాణాల ఏర్పాటుకు వ్యతిరేకంగా హైదరాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడాలని రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. -
మళ్లీ కల్లు దుకాణాలు
-
దసరా నుంచి జంటనగరాల్లో కల్లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలో పదేళ్ల కిందట మూతపడిన కల్లు దుకాణాలను పునరుద్ధరిస్తూ టీ సర్కార్ గురువారం జీవో జారీ చేసింది. ‘చెట్లకు 50 కి.మీ. పరిధిలోనే కల్లు దుకాణం’ అనే నిబంధనను రద్దు చేసింది. గతంలో ఉన్న 103 కల్లు దుకాణాలు తెరవడానికి అనుమతిస్తూ జీవో నంబర్ 24ను వెలువరించింది. ఈ మేరకు ‘ఏపీ కల్లు అమ్మకపు లెసైన్స్ విధానం-2007’ను అనుసరించి స్వల్ప మార్పులతో తెలంగాణకు కొత్త విధానాన్ని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ జీవో ప్రకారం ఉమ్మడిరాష్ట్రంలో ఉన్న కల్లు అమ్మకం, కల్లు లెసైన్స్ విధానం తెలంగాణ రాష్ట్రంలో యథాతథంగానే అమలవుతుంది. అయితే ‘చెట్లకు 50 కిలోమీటర్ల పరిధి’ నిబంధన తొలగించినట్టు, దసరా నుంచి కల్లు అమ్మకాలు సాగించనున్నట్టు మంత్రి తెలిపారు. హామీ నెరవేర్చిన కేసీఆర్ నగరంలో కల్లు అమ్మకాలపై ఆధారపడిన 50 వేల కుటుంబాలకు న్యాయం చేసేందుకే కల్లు దుకాణాలను తెరిపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పద్మారావు చెప్పారు. గత ఏడాది టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నాడు కల్లు గీత కుటుంబాల అభ్యర్థన మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం నెరవేర్చారన్నారు. కల్లుగీత వృత్తిపై ఆధారపడిన వారితోనే దుకాణాలు నడిపిస్తామని, 2004లో మూతపడిన సొసైటీలే కొనసాగుతాయన్నారు. నగరంలో తాటి, ఈత చెట్లు లేకపోయినా ఇతర జిల్లాల నుంచి రేషన్ పద్ధతిలో కల్లు దిగుమతి చేసుకొని అమ్మకాలు సాగించనున్నట్టు మంత్రి వివరిం చారు. హరితవనం పథకంలో జిల్లాల్లో తాటి, ఈత చెట్ల పెంపకాన్ని పరిశీలిస్తామన్నారు. నగర సొసైటీలకు శివారు జిల్లాల్లో 5 ఎకరాల స్థలం కేటాయించి చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సీఎంతో మాట్లాడి 200 ఎకరాల్లో తాటి, ఈత వనాలు పెంచుతామన్నారు. కల్లు దుకాణాల వల్ల శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కావని, రంగారెడ్డి జిల్లా పరిధిలోని గ్రేటర్లో ఇప్పటికీ కల్లు దుకాణాలు కొనసాగుతున్నాయన్నారు. స్వచ్ఛమైన కల్లు విక్రయాలు సాగేలా ఎక్సైజ్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎక్సైజ్ నిబంధనలన్నీ కల్లు దుకాణాలకు వర్తిస్తాయని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బి.ఆర్. మీనా వివరించారు. హర్షణీయం: ‘గీత’ సంఘం ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర గీత పనివారల సంఘం హర్షించింది. తాటి,ఈతవనాల పెంపకానికి పదెకరాల భూమి కల్లుగీత సహకార సంఘాలకు కేటాయించాలని విడుదల చేసిన జీవో 560ను అమలు చేయాలని సంఘం అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్ డిమాండ్ చేశారు. గీత కార్మికులకు పెన్షన్, ఎక్స్‌గ్రేషియా పెంచాలని కోరారు. -
కల్లు దుకాణాలు తెరిపించేందుకు కమిటీ
హైదరాబాద్: కల్లు దుకాణాలు హైదరాబాద్‌లో ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఓ కమిటీని నియమించింది. ఎక్సైజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి చైర్మన్‌గా, ఎక్సైజ్‌శాఖ కమిషనర్ సభ్యుడిగా కమిటీ ఏర్పాటు చేసింది. మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ సర్కారు కోరింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలో 2004లో మూతపడ్డ కల్లు దుకాణాలను తిరిగి తెరిపించేందుకు తెలంగాణ కేబినెట్ ఇటీవల ఆమోదముద్ర వేసింది. దసరాకు కల్లు దుకాణాలు తెరుచుకునే అవకాశముంది. నగరంలో ఈ దుకాణాలు మూతపడేనాటికి 2004లో 103 ఉండేవి. నలభై రెండు సొసైటీల ద్వారా ఈ దుకాణాల్లో అమ్మకాలు సాగేవి. ఒక్కో సొసైటీలో 300 నుంచి 1000 మంది వరకు సభ్యులు ఉండేవారు. అయితే 50 కిలోమీటర్ల పరిధిలో చెట్లులేని పట్టణాలు, నగరాల్లో కల్లు విక్రయాలు సాగించకూడదని అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దుకాణాలు మూతపడ్డాయి. -
దసరాకి కల్లు దుకాణాలు
విధి విధానాలు రూపొందిస్తున్న ఎక్సైజ్ శాఖ నెలాఖరులోగా తుదిరూపం ఇచ్చే అవకాశం కల్లు అమ్మకాలపై ఎన్నికల హామీ అమలుకే మొగ్గు చూపిన కేసీఆర్ 2004లో నగరంలో 103 షాపులు, 42 సొసైటీలు 23వ తేదీ లోగా రాజకీయ పార్టీల సూచనలు కోరిన అధికారులు సాక్షి, హైదరాబాద్: నగరంలో కల్లు దుకాణాలు తెరుచుకోబోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలో 2004లో మూతపడ్డ కల్లు దుకాణాలను తిరిగి తెరిపించేందుకే సీఎం కేసీఆర్ మొగ్గు చూపడంతో బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో, లోగడ మూసివేతకు గురైన దుకాణాలను వచ్చే దసరా పండుగలోగా తెరిపిస్తామని కేసీఆరే ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల నగరంలోని కల్లు గీత కార్మిక కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం నిర్ణయానికి అనుగుణంగా నగరంలో కల్లు దుకాణాల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాల రూపకల్పనలో ఎక్సైజ్ శాఖ తలమునకలైంది. ఈ నెలాఖరులోగా ఏరీతిన ఈ దుకాణాలను తెరిపించి, నడిపించాలన్న అంశానికి తుదిరూపం ఇచ్చి, కార్యాచరణలో పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి డీసీలకు బాధ్యత అప్పగింత నగరంలో ఈ దుకాణాలు మూతపడేనాటికి 2004లో 103 ఉండేవి. నలభై రెండు సొసైటీల ద్వారా ఈ దుకాణాల్లో అమ్మకాలు సాగేవి. ఒక్కో సొసైటీలో 300 నుంచి 1000 మంది వరకు సభ్యులు ఉండేవారు. అయితే 50 కిలోమీటర్ల పరిధిలో చెట్లులేని పట్టణాలు, నగరాల్లో కల్లు విక్రయాలు సాగించకూడదని అప్పట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే దుకాణాలు మూతపడ్డాయి. కానీ గ్రేటర్ పరిధిలో ఉన్న రంగారెడ్డి జిల్లా, మెదక్ ప్రాంతాల్లో ఇప్పటికీ యథాతథంగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కల్లు అమ్మకాలపై ఆధారపడ్డ కుటుంబాలు కేసీఆర్‌ను పలుమార్లు కలసి దుకాణాలు తెరిపించాలని కోరగా, ఆయన అంగీకరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లు దుకాణాలు నిర్వహించిన సొసైటీల సభ్యులు కేసీఆర్‌ను, మంత్రి పద్మారావు గౌడ్‌ను, ఎక్సైజ్ కమిషనర్ నదీం అహ్మద్‌ను కలసి దుకాణాలు తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కమిషనర్ నదీం అహ్మద్ నగరంలో పదేళ్ల క్రితం ఉన్న పరిస్థితి... ఇప్పుడు దుకాణాలు తెరిస్తే ఎలా నిర్వహించాలన్న అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. వారిచ్చిన నివేదిక మేరకే సీఎం కేబినెట్ సమావేశంలో నిర్ణయాన్ని స్పష్టం చేశారు. కాగా పదేళ్లలో పెరిగిన జనాభాకు అనుగుణంగా దుకాణాల సంఖ్యను కూడా పెంచి కల్లు విక్రయాలు సాగించాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తోంది. తద్వారా సొసైటీల సంఖ్య కూడా పెరిగి గీత కార్మిక కుటుంబాలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఈ అంశంపై తమ అభిప్రాయాలను ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయాల్సిందిగా కోరుతూ అధికారులు అన్ని రాజకీయ పక్షాలవారికి లేఖలు పంపారు. స్వచ్ఛమైన కల్లు విక్రయాలకే ప్రభుత్వం మొగ్గు ఏభై కిలోమీటర్ల పరిధిలో చెట్లు లేనిచోట కల్లు విక్రయాలు జరపడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని, కల్లులో ప్రమాదకరమైన రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలోనే 2004లో హైదరాబాద్ జిల్లా పరిధిలో మూసేశారు. ఈ పరిస్థితి మరోసారి రాకుండా ఎలాంటి విధానాన్ని అవలంబించాలో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖను కోరింది. కల్తీ లేని స్వచ్ఛమైన కల్లును విక్రయించేలా చూడడమే తమ ప్రభుత్వ విధానమని ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు గౌడ్ ‘సాక్షి’కి తెలిపారు. కల్లు కాంపౌండ్లను తిరిగి తెరిపించడం ద్వారా గీత కుటుంబాలకు మేలు చేయడం ఎంత ముఖ్యమో... ప్రజల ఆరోగ్యం చెడిపోకుండా చూడడం అంతే అవసరమని ఆయన స్పష్టం చేశారు. నగరంలో అందరూ మెచ్చేలా కల్లు దుకాణాలు నిర్వహిస్తామని ఆయనీ సందర్భంగా తెలిపారు.