అబుదాబిలో బతుకమ్మ సంబరాలు | Bathukamma Celebrations At Abu Dhabi | Sakshi
Sakshi News home page

అబుదాబిలో బతుకమ్మ సంబరాలు

Published Sun, Oct 13 2024 7:50 AM | Last Updated on Sun, Oct 13 2024 9:28 AM

Bathukamma Celebrations At Abu Dhabi

అబుదాబి, సాక్షి : తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉంటున్న తెలంగాణీయులందరు దేశ రాజధాని అయిన అబుదాబి లో జత చేరి అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.  అబుదాబి లోని తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో గత నెల రోజులు గా ఈ ఉత్సవాల కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు  చేశారు.  ఈ అద్భుత కార్యక్రమానికి అబుదాబిలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ వేదిక అయ్యింది

యుఏఈ లో ఉన్న వందలాది తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు గత నెల రోజులు గా అవిశ్రాంతంగా వివిధ తెలంగాణ నృత్యాల ప్రదర్శనల తయారీ చేశారు.  ఎడారి ప్రాంతం కావడం కారణంగా పూలు దొరకడం చాలా కష్టం తోను మరియు చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవహారం కావడం తో సంఘ నాయకత్వం ఎక్కువ మోతాదు లో తెలంగాణ నుండి వందలాది కిలోల వివిధ పూలను తెప్పించి అబూ దాబి ని పూల వనంగా మార్చారు. ఇండియా నుండి తెచ్చిన తీరొక్క పూలతో ఘనంగా సామూహిక బతుకమ్మ తయారీ కార్యక్రమాన్ని నిర్వాహకులు పల్లె వాతావరణాన్ని పరిమళించే లా చేశారు.  ఈ కార్యక్రమానికి వందలాది తెలంగాణ మహిళలు విచ్చేసి బతుకమ్మ తయారీ ప్రాంగణాన్ని బతుకమ్మ పాట ల తో మార్మోగించారు.  



శుక్రవారం సాయంత్రం కార్యక్రమ వేదిక అయిన ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ కి రెండు వేల మంది మహిళలు కార్యక్రమ ఆరంభ సమయానికి ముందే చేరుకొని సందడి చేశారు. ఈ తెలంగాణ సంబరాలకు వన్నె తెచ్చేందుకు అందరిని అలరించడానికి మరియు తెలంగాణ వాతావరణానికి మరింత కల తెచ్చేందుకు ప్రముఖ కవి గాయకుడు  శ్రీ అష్ట గంగాధర్  మరియు తెలంగాణ వర్ధమాన గాయని శ్రీమతి తేజు ప్రియ ప్రత్యేకంగా ఇండియా నుండి విచ్చేసారు. కార్యక్రమాన్ని తెలంగాణ సంప్రదాయానికి ప్రతిభింబించే లా డప్పు వాయిద్యం మరియు కోలాటాల సందడి మధ్యలో అన్ని బతుకమ్మలను బతుకమ్మ ప్రాంగణానికి తోడ్కొని వెళ్లారు

ఆ తరువాత తెలంగాణ మహిళలు మరియు చిన్నారులు తెలంగాణ సాంప్రదాయo ఉట్టి పడుతూ చేసిన నృత్య ప్రదర్శనలు సందర్శకులకు కనువిందు చేశాయి. తెలంగాణ నుండి వచ్చిన ఇద్దరు కళాకారులు వివిధ రకాల తెలంగాణ ఆట పాటలతో ప్రేక్షకులను అలరించారు   కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ గా జంటల (Couples) నృత్య ప్రదర్శన నిలిచింది. ప్రత్యేకంగా ఇండియా నుండి తెప్పించి అందరికి పంచిన తెలంగాణ పిండి వంటలు కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ వారినందరిని విశేషంగా ఆకర్షించాయి.

ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా యుఏఈ భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ అఫ్ మిషన్ శ్రీ అమర్నాథ్ అశోకన్ ముఖ్య అతిధి గా మరియు కాన్సులర్ డా: ఆర్. బాలాజీ మరియు కుటుంబ సభ్యులు గౌరవ అతిధులు గా హాజరు అయ్యారు.  వారు కూడా తెలంగాణ మహిళ ల తో బతుకమ్మ ఆడి పాడారు.  తదనంతరం కార్య నిర్వాహకులు 10 అందమైన బతుకమ్మలకు, ప్రాంగణానికి మొదటగా వచ్చిన 3 బతుకమ్మలకు, అందంగా ముస్తాబైన చిన్నారులకు, చక్కగా బతుకమ్మ నాట్యం చేసిన మహిళలకు మరియు జంటలకు బహుమతి ప్రధానం చేశారు.  ఈ కార్యక్రమ ముఖ్య దాతలు టైటిల్ స్పాన్సర్ గా సంపంగి గ్రూప్ మరియు కో స్పాన్సర్ గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఏ ఎక్స్ ప్రాపర్టీస్, బ్యూటీ డెంటా కేర్ వారిని నిర్వాహుకులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా అబుదాబి బాప్స్ హిందూ మందిర్ డైరెక్టర్ శ్రీ ప్రణవ్ దేశాయ్ మరియు వారి కుటుంబ సభ్యులు హాజరు అయి తెలంగాణ మహిళలందరితో బతుకమ్మ ఆడారు.  చివరగా గౌరీ పూజ చేసి బతుకమ్మ నిమజ్జనం కృతిమ కొలను లో చేసి ప్రసాదాలు పంచి, విందు భోజనం ఆరగించారు ఈ కార్యక్రమాన్ని రాజశ్రీనివాస రావు, గోపాల్,  వంశీ,  శ్రీనివాస్, సాగర్, గంగన్న, సంతోష్, జగదీష్,  అశోక్ ,  శ్రీనివాస్ రెడ్డి,  పావని, అర్చన, పద్మజ,  లక్ష్మి, నిధి తదితరులు దగ్గర ఉండి నడిపించారు. బతుకమ్మ ఉత్సవాలు విదేశాలలో కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కార్య నిర్వాహకులు రాజశ్రీనివాస రావు  తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement