అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు | Official recognition of Bathukamma in America | Sakshi
Sakshi News home page

అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు

Published Mon, Oct 7 2024 4:55 AM | Last Updated on Mon, Oct 7 2024 4:55 AM

Official recognition of Bathukamma in America

అధికారికంగా గుర్తించిన జార్జియా, వర్జీనియా రాష్ట్రాలు, ఉత్తర కరోలినా రాష్ట్రంలోని రెండు నగరాలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుక­మ్మ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. బతుకమ్మ సంబుర ప్రాశస్త్యాన్ని, పండగలోని పరమా­ర్థాన్ని అమెరికాలో పలు రాష్ట్రాలు గుర్తించాయి. జార్జియా, వర్జీనియా రాష్ట్రాల­తో­పాటు ఉత్తర కరోలినా రాష్ట్రంలోని చార్లెట్, రాలేహ్‌ నగరాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మేరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండుగ, తెలంగాణ హెరిటేజ్‌ వీక్‌గా ప్రకటించారు. 

బతుకమ్మ ఎంతో ప్రత్యేకమైన, ప్రాముఖ్య­తగల పండుగల్లో ఒకటని.. ఈ ఉత్సవాన్ని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలే కాకుండా అమె­రి­కాలో స్థిరపడ్డ 12 లక్షల మంది ఎన్నారైలు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని జార్జియా, వర్జీనియా రాష్ట్రాల గవర్నర్లతో­పాటు ఉత్తర కరోలినా­లోని చార్లెట్, రాలేహ్‌ మేయర్లలు అభివర్ణించారు. దీంతో వారికి గ్లోబల్‌ తెలంగాణ అసోసి­యేషన్‌ ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. 

అలాగే తెలంగాణ ఆడపడుచులకు అభినందనలు తెలియజే­శారు. కొంతకాలంగా తెలంగాణ బతుకమ్మకు ఖండాంతరాల్లో గుర్తింపు తెచ్చేందుకు గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్, ఇతర సంఘాలు, ప్రవాస తెలంగాణవాసులు చేస్తున్న కృషికి ఈ గుర్తింపుతో ఫలితం దక్కిన­ట్టయింది. గతంలోనూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు బతుకమ్మను గుర్తించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement