అరకొర రుణమాఫీ.. ఆపై దుర్భాషలా | BRS Leader Niranjan Reddy Comments On Revanth Reddy | Sakshi
Sakshi News home page

అరకొర రుణమాఫీ.. ఆపై దుర్భాషలా

Published Sat, Aug 17 2024 4:33 AM | Last Updated on Sat, Aug 17 2024 4:33 AM

BRS Leader Niranjan Reddy Comments On Revanth Reddy

రూ.17వేల కోట్లతో పూర్తి రుణమాఫీ ఎలా సాధ్యం: నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని ప్రక టించిన రేవంత్‌రెడ్డి ప్రభు త్వం అరకొరగా అమలు చేసిందని ఇదే విషయాన్ని ప్రశ్నించిన బీఆర్‌ఎస్‌ నేతలపై సీఎం నోరు పారేసుకుని దుర్భాషలాడతారా అని బీఆర్‌ఎస్‌ మాజీమంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి తీవ్రంగా విమ ర్శించారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, పార్టీ నేత ఇంతియాజ్‌ ఇషాక్‌తో కలసి నిరంజన్‌రెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

రుణమాఫీ తోపా టు ఆరు గ్యారంటీలను రేవంత్‌ చెప్పిన గడువు లోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తాన ని హరీశ్‌ అన్నారని అయితే రేవంత్‌ మాత్రం రుణమాఫీ అమలు పూర్తయిందని దబాయిస్తు న్నారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రైతు లందరికీ రూ.31వేల కోట్ల రుణమాఫీ జరుగు తుందని చెప్పి, ప్రస్తుతం రూ.17వేల కోట్లకే ఎందుకు పరిమితం చేశారని నిలదీశారు. రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన  హరీశ్‌రావును రాజీనామా చేయాలని డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రుణమాఫీపై బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన కాల్‌ సెంటర్‌కు ఇప్పటివరకు 1,11,027 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement