వందశాతం రైతు రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తా... రుణమాఫీపై రైతుల దగ్గరకే కాదు.. అవసరమైతే కోర్టుకు కూడా వెళతాం
రేవంత్ మానసిక సంతులనం దెబ్బతింది.. ఆస్పత్రిలో చూపించాలి
మహిళలపై యథాలాపంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాను: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చీటింగ్‌కేసు నమోదు చేయాలి. కొడంగల్‌లో మీడియా సమక్షంలో వందశాతం రుణమాఫీ జరిగినట్టుగా రేవంత్ నిరూపిస్తే రాజకీయాలను వది లేస్తా. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌లు నియోజకవర్గాల్లో రుణమాఫీ అంశాన్ని పరిశీలించి రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. రూ.2లక్షల రుణమాఫీ సంపూర్ణంగా జరగకపోతే అవసరమైతే కోర్టుకు కూడా వెళతాం’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే కేపీ.వివేకానందలతో కలిసి శుక్రవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే..‘రుణమాఫీపై దగా, మోసం చేసిన రేవంత్ సెక్యూరిటీ లేకుండా ప్రజల్లోకి వెళితే చెడుగుడు ఆడటం ఖాయం. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ అతిపెద్ద మోసం చేసింది. రుణమాఫీకి తొలుత రూ.40వేల కోట్లు అవసరమని ప్రకటించడం, ఆ తర్వాత రూ.31వేల కోట్లు కావాలని కేబినెట్ తీర్మానించడం, బడ్జెట్‌లో రూ.26వేల కోట్లు ప్రతిపాదించడం, చివరకు 22లక్షల మందికి రూ.17,934 కోట్ల మేర మాత్రమే మాఫీ చేయడం రైతులను మోసగించడమే.
ప్రచార ఆర్భాటమే.: ‘రుణమాఫీలో నిబంధనల పేరిట కోతలు విధించి చిల్లర ప్రచారంతో రేవంత్ రంకెలు వేస్తూ హరీశ్‌రావు రాజీనామా చేయాలంటున్నాడు. కేవలం 46శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. రేవంత్ చేస్తున్న మోసాలకు గిన్నిస్ బుక్ నిర్వాహకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. రేవంత్ ప్రసంగం ఆయన అసహనానికి అద్దం పడుతోంది. ఇటీవలి కాలంలో ఆయన చేస్తున్న ప్రసంగాలు, వాడుతున్న భాష చూస్తే రేవంత్ మానసిక సంతులనం దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది.
రేవంత్ కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళితే మంచిది. రుణమాఫీ అయ్యిందంటూ కొంతమంది చిల్లరగాళ్లు పోస్టర్లు పెట్టారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సవాలు చేసినట్టుగా సంపూర్ణ రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు జరిగిందా. సాక్షాత్తూ సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రం దివాలా తీసిందని చెబుతుండటంతో పెట్టుబడులు తరలివెళుతున్నాయి. ఎన్నికల హామీలు నెరవేర్చని రేవంత్ ఎనిమిదినెలల కాలంలో 19 సార్లు ఢిల్లీకి వెళ్లాడు. ఇంకా ఎన్నిసార్లు వెళ్లాల్సి వస్తుందో కూడా తెలియదు.
ప్రాంతీయ పారీ్టలపై అధ్యయనం: ‘ఉద్యమ పారీ్టగా 24 ఏళ్ల క్రితం ప్రస్థానం ప్రారంభించి పదేళ్లపాటు అధికారంలో కొనసాగాం. ప్రతిపక్షపాత్ర తొలిసారి పోషిస్తున్న బీఆర్‌ఎస్ పార్టీని మరింత దృఢంగా చేసేందుకు ప్రాంతీయ పారీ్టల పనితీరుపై అధ్యయనం చేస్తాం. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, బిజూజనతాదళ్ వంటి పార్టీల నిర్మాణాన్ని పరిశీలించేందుకు సెప్టెంబర్‌లో నాతోపాటు కొందరు సీనియర్ నేతలు ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తాం. మంచి ఎక్కడ ఉన్నాసరే స్వీకరించి ఇక్కడ పార్టీ బలోపేతానికి వినియోగించుకుంటాం. ఆరీ్టసీలో మహిళల ప్రయాణంపై నేను యథాలాపంగా మాట్లాడిన మాటలకు క్షమాపణ చెప్పాను. రేవంత్‌కు అదే సంస్కారం ఉంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment