‘చారాణ కోడికి.. బారాణ మసాలా..!’ రైతు రుణమాఫీపై కేటీఆర్‌ | KTR Slams Revanth Government Over Farmers Loan Waiver | Sakshi
Sakshi News home page

‘చారాణ కోడికి.. బారాణ మసాలా..!’ రైతు రుణమాఫీపై కేటీఆర్‌

Jul 19 2024 12:16 PM | Updated on Jul 19 2024 12:46 PM

KTR Slams Revanth Government Over Farmers Loan Waiver

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామరావు మరోసారి విరుచుకుపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో రేవంత్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. రుణమాఫీ అయిన రైతుల కన్నా.. కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ ఉన్నాయని అన్నారు. 

ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతు మాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని విమర్శలు గుప్పించారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉంటే.. ప్రభుత్వం ఎందుకీ సంబరాలు జరుపుతోందని ప్రశ్నించారు. నలభై లక్షల మందిలో.. మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? లేక ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా? అని నిలదీశౠరు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు


‘సీఎం రేవంత్ రెడ్డి గారు...

ఊరించి.. ఊరించి..
ఏడునెలలు ఏమార్చి చేసిన..

మీ రుణమాఫీ తీరు చూస్తే..
తెలంగాణ ప్రజలకు గుర్తొచ్చిన  సామెత ఒక్కటే..

“ చారాణ కోడికి..! బారాణ మసాలా...!! ”

రుణమాఫీ అయిన రైతులకన్నా..
కంటతడి పెట్టిన కుటుంబాలే ఎక్కువ

ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు..!
రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలైనై..!!

అన్నివిధాలా అర్హత ఉన్నా..
ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు...
రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడు...

అర్హులైన లబ్దిదారులు.. రుణమాఫీ కాక..
అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు ?

నలభై లక్షల మందిలో.. 
మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ?
ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా ?

రెండు సీజన్లు అయినా..
రైతుభరోసా ఇంకా షురూ చెయ్యలే

జూన్ లో వేయాల్సిన రైతుభరోసా.. 
జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే..!!

కౌలు రైతులకు.. 
ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే..!!

రైతు కూలీలకు.. 
రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే..!!

మభ్యపెట్టే మీ పాలన గురించి..
ఒక్క మాటలో చెప్పాలంటే..

ఇంతకాలం.. అటెన్షన్ డైవర్షన్..!
ఇప్పుడేమో.. ఫండ్స్ డైవర్షన్..!!

జై తెలంగాణ’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement