
తాడేపల్లి: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరిపై వైఎస్సార్‌సీపీ మహిళా నేత రజనీ చౌదరి ధ్వజమెత్తారు. రేణుకా చౌదరి ఒక రాక్షస చౌదరి అని మండిపడ్డారు. రేణుకా చౌదరి మానసిక పరిస్థితి బాగాలేదని, ఆమె నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని రజనీ చౌదరి హెచ్చరించారు. ఇకనైనా రేణుకా చౌదరి తీరు మార్చుకోవాలన్నారు.
ఒకవైపు విశాఖలో పెట్టబడుల సదస్సు జరుగుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నాడని, ఆ సదస్సును పక్కదారి పట్టించడానికే రేణుకా చౌదరిని చంద్రబాబు తెరపైకి తెచ్చాడని రజనీ చౌదరి విమర్శించారు. సీఎంను నోటికొచ్చినట్లు మాట్లాడుతుందని, ఏనుగు వెళ్తుంటే రేణుకా చౌదరి వంటి కుక్కలు మొరుగుతూనే ఉంటాయని కౌంటర్ ఇచ్చారు . చంద్రబాబుకు ఫిమేల్ వెర్షన్ రేణుకా చౌదరి అని విమర్శించారు. తాము కూడా నోటికొచ్చినట్లు మాట్లాడగలమని విషయం రేణుకా చౌదరి తెలుసుకుంటే మంచిదన్నారు రజనీ చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment