
బిల్లుపై చర్చ జరిగి..రాష్ట్రపతికి చేరాలనుకుంటున్నాం'
ఢిల్లీ: రాష్ట్ర విభజనపై బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగిన తరువాతే రాష్ట్రతికి అందితేనే బాగుంటుందని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర బిల్లుపై అసెంబ్లీ చర్చ జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. సర్పంచ్ గా గెలిచిన మహిళను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పరిచయం చేసేందుకే కలిశానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆమెతో ఏ ఇతర రాజకీయ అంశాలను మాట్లాడలేదన్నారు.