చీలుతున్న గుండెకాయ | state secretariat divided into two | Sakshi
Sakshi News home page

చీలుతున్న గుండెకాయ

Published Sun, Feb 23 2014 1:04 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

చీలుతున్న గుండెకాయ - Sakshi

చీలుతున్న గుండెకాయ

సచివాలయుం రెండుగా విభజన..
రెండు రాష్ట్రాలకు వేర్వేరు బ్లాకుల కేటాయింపు
ఇద్దరు సీఎంలకు రెండు వేర్వేరు గేట్లు... డెరైక్టరేట్లు, కమిషనరేట్లలోనూ అంతే
అసెంబ్లీ భవనం ఇరు రాష్ట్రాలూ ఒకరి తర్వాత మరొకరు ఉపయోగించుకోవాలి
ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం అంతే!
గెజిట్ ప్రకటనతోనే విభజన కసరత్తు వేగవంతం.. ఉన్నతాధికారుల వెల్లడి

సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇక రెండు రాష్ట్రాలుగా అవతరించటమే మిగిలివుంది. అయితే.. విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ నగరాన్ని రెండు రాష్ట్రాలూ ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోవాల్సి ఉంది. అంటే.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించి వేర్వేరుగా శాసనసభలు, శాసనమండళ్లు, సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఒకే రాజధానిలో రెండేసి అసెం బ్లీలు, కౌన్సిళ్లు, సెక్రటేరియట్‌లు, ఇతర ప్రధాన కార్యాల యాలు కావాలి. ఇదెలా జరుగుతుంది..? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివిధ ఊహాగానాలు, అవకాశాలూ వినిపిస్తున్నప్పటికీ.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకూ.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పరిపాలనా వ్యవహారాలన్నిటినీ ఒక చోటు నుంచే నడిపించేలా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాలనకు గుండెకాయ అయిన సచివాలయాన్ని రెండుగా విభజించి.. ఆ భవనాలనే ఇరు రాష్ట్రాలూ వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఉన్నతాధికార వర్గాలు చెప్తున్నాయి. శాసనసభను కూడా ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం సమావేశాలకు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ వర్గాల కథనం.
 
 విభజనకు సంబంధించి మార్గదర్శక సూత్రాలను రూపొందించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కమలనాథన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సంయుక్త కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేయనుంది. గెజిట్ నోటిఫికేషన్ రాగానే ఈ కమిటీ విభజనకు సంబంధించి స్థూలంగా మార్గదర్శకాలను రూపొం దిస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీకి ఒక కమిటీని; ఆస్తులు, ఆదాయ వనరుల పంపిణీకి మరో కమిటీని; అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయటానికి ఇంకో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన గెజిట్ వెలువడగానే ఈ కమిటీలు విభజన పనిని ప్రారంభిస్తాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
 
 విభజన గెజిట్ జారీ చేసినప్పటి నుంచి సచివాలయుంతో పాటు రాష్ట్ర స్థారుు కార్యాలయూన్నింటిలోనూ విభజన ప్రక్రియు వేగం పుంజుకోనుంది.  తెలంగాణ రాష్ట్రానికి సీవూంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండనున్న నేపథ్యంలో.. పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయం విభజనపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. పది సంవత్సరాలు కాకపోయినా సీమాంధ్ర ప్రాంతం కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు ఆ రాష్ట్ర సచివాలయ కార్యకలపాలను హైదరాబాద్ నుంచే నిర్వహించాల్సి ఉంది. ఒక రాష్ట్రానికి ఒక చోట మరో రాష్ట్రానికి మరో చోట సచివాలయం ఉంటే.. విభజన సమయంలో ఫైళ్ల మార్పిడి కష్టం అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత సచివాలయాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేసి.. మరో రాష్ట్రం సచివాలయాన్ని వేరే చోటుకు తరలిస్తే.. ప్రస్తుత సచివాలయ భవనాల్లో సగం ఖాళీగా ఉండాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది. అందుకని సచివాలయాన్ని రెండుగా చేసి.. రెండు రాష్ట్రాలకూ విడివిడిగా బ్లాకులను పంచినట్లయితే.. ఇక్కడి నుంచే ఇరు రాష్ట్రాల పాలన కొనసాగించటం సులభమవుతుందని వారు పేర్కొంటున్నారు.
 
 సచివాలయంలో ప్రస్తుతం 9 బ్లాక్‌లు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల ఆధారంగా సచివాలయంలో కొన్ని బ్లాక్‌లను తెలంగాణ రాష్ట్రానికి, మరి కొన్ని బ్లాక్‌లను ఆంధ్రా రాష్ట్రానికి కేటాయిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే సచివాలయానికి ఇప్పటికే రెండు గేట్లు ఉన్నందు ఒక గేట్ నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో గేట్ నుంచి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోకలు సాగిస్తారని చెప్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సి బ్లాక్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రికి డి బ్లాక్‌లో కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారుల్లో చర్చసాగుతోంది. ఈ బ్లాకుల కేటాయింపును కూడా కేంద్ర కమిటీయే నిర్ణయించనుంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీ స్థానాల ఆధారంగా ఉద్యోగుల పంపిణీ జరుగుతుందని, ఇందుకు ప్రాతిపదికను కేంద్రం నియమించిన కమిటీ నిర్ణయిస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి.
 
 వివిధ శాఖల డెరైక్టరేట్‌లు, కమిషరేట్‌ల కార్యాలయాల్లోనే ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుందని, ఏ రాష్ట్రానికి ఎంత మంది ఉద్యోగులను కేటాయించాలనే దానికి కేంద్ర కమిటీ ప్రాతిపదికను రూపొందిస్తుందని, దాని ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సచివాలయంలో 5,000 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు 3,000 మంది,తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 2,000 మంది ఉన్నారు.
 
 హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం.. ప్రస్తుత అసెంబ్లీ భవనంలోనే.. రెండు రాష్ట్రాలూ ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రం సమావేశాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొత్తగా హైదరాబాద్‌లో ఎటువంటి నిర్మాణాలను చేపట్టేది లేదని ఆ వర్గాలు చెప్తున్నాయి. ఉన్న భవనాలల్లోనే కొన్ని సంవత్సరాల పాటు ఇరు రాష్ట్రాల కార్యకలాపాలు కొనసాగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలా కాకుండా రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఎటువంటి కొత్త నిర్మాణాలను చేపట్టినా అని నిష్ర్పయోజనంగా మారతాయని, సీమాంధ్ర రాజధాని నిర్మాణం తరువాత హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ భవనాలే సంగం ఖాళీ అవుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement