state secretariat
-
రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వ్రస్తాలను సచివాలయంలోని ఆప్కో విక్రయశాల ద్వారా ఈ నెలాఖరు వరకు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత ప్రకటించారు. సోమవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వ్రస్తాలను తప్పనిసరిగా ధరించాలనే విధానాన్ని అమలు పరిచారని గుర్తు చేశారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇకపై ప్రతి శుక్రవారం ఉద్యోగులు అంతా చేనేత వ్రస్తాలను ధరించాలని ఆమె పిలుపునిచ్చారు. రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. చేనేత వ్రస్తాలు ధరించేందుకు ఉద్యోగులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చేనేత వ్రస్తాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సరళ, కనకదుర్గ, సునీత, ఇమామ్ వలీ, మోహనరావు, ప్రసాద్‌కు బహుమతులను అందజేశారు. నేతన్నలను ఆదుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని.. ప్రధానంగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ఊతమిచ్చారని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత స్పష్టం చేశారు. చేనేత జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ స్టెల్లా కాలేజీ ఆడిటోరియంలో చేనేత వారోత్సవాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సునీత మాట్లాడుతూ.. సేంద్రియ పద్ధతుల్లో తయారైన చేనేత వస్త్రాలకు విదేశాల్లో సైతం మంచి ఆదరణ ఉండటంతో ఆ దిశగా పత్తి రైతులు, చేనేత కార్మికులను సన్నద్ధం చేస్తున్నామన్నారు. ప్రపంచంలో వినియోగిస్తున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశంలోనే తయారైనవేనని, చేనేతలో దేశంలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు జీఎస్టీ మినహాయించేలా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న చేనేత ప్రదర్శన, సబ్సిడీపై విక్రయాలను ప్రజలు ఉపయోగించుకోవాలని సునీత కోరారు. 1.75 లక్షల మందికి ఉపాధి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాట్లాడుతూ..రాష్ట్రంలో చేనేత రంగం 1.75 లక్షల మందికి ఉపాధి చూపుతోందన్నారు. ఈ రంగాన్ని ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలిచ్చాయన్నారు. చేనేత, జౌళి శాఖ కమిషనర్ ఎంఎం నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతకు ఎంతో మద్దతునిస్తూ ప్రతి జిల్లాలో ఒక ముఖ్యమైన ఉత్పత్తిని గుర్తిస్తూ వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్ట్ అనే కార్యక్రమాన్ని చేపట్టాయన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్లు గంజి చిరంజీవి, చిల్లపల్లి మోహనరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆప్కో జీఎం తనూజారాణి మాట్లాడారు. -
డిజిటల్ సచివాలయం
ఈ-ఆఫీసు విధానం అమలుకు అధికారుల కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం ఇక ‘డిజిటల్’ కానుంది.. ఫైళ్ల నిర్వహణకు ప్రస్తుతమున్న టప్పాల్ విధానానికి స్వస్తి చెప్పి.. పూర్తిగా కాగిత రహితమైన డిజిటల్ ఈ-ఫైళ్ల విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు సచివాలయంలో ఈ-ఆఫీసు విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఐటీ విభాగం సచివాలయంలో ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జల మండలిలో ఈ-ఫైళ్ల విధానం అమల్లో ఉంది. అదే తరహాలో సచివాలయంలోనూ ఫైళ్ల కదలికకు ఎలక్ట్రానిక్, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెక్షన్ల నుంచి సీఎం పేషీ వరకు ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేలా ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) ఏర్పాట్లు చేస్తోంది. అంతా ఆన్లైన్లోనే.. ప్రస్తుతం అర్జీలు, పిటిషన్లన్నీ ఇన్వార్డ్ సెక్షన్లో చేరగానే దానికో నంబర్ వేసి సెక్షన్ ఆఫీసర్ ఫైలును సిద్ధం చేస్తారు. ఆ ఫైలు సంబంధిత అధికారులు, విభాగాలకు మధ్య సర్క్యులేట్ అవుతుంది. ఏ ఫైలు ఎప్పుడు ఎక్కడ ఉందో, ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం కష్టం. ఓ అధికారి నుంచి మరో అధికారికి వెళ్లడానికి సమయం పడుతుంది. అదే కొత్త విధానంలో సెక్షన్ ఆఫీసర్ ఈ-ఆఫీస్‌లో డిజిటల్ ఫైలును రూపొందిస్తారు. అక్కడి నుంచి సంబంధిత అధికారులు, సంబంధిత విభాగాలన్నింటికీ ఆన్లైన్లోనే వేగంగా ఫైలు సర్క్యులేట్ అవుతుంది. ఎక్కడెక్కడ ఎవరి ఆమోదం అవసరమైనా.. వారు ఆన్లైన్లోనే అనుమతిస్తారు. సంబంధిత అధికారులు తమ డిజిటల్ సంతకాలను ఈ-ఫైలుపైనే పొందుపరుస్తారు. ఈ డిజిటల్ ఫైల్‌కు అవసరమైనన్ని అటాచ్మెంట్లు, తమ కామెంట్లను, కొర్రీలను జత చేసేందుకూ వీలుంటుంది. అంతేగాకుండా సెక్షన్ నుంచి ఉన్నతాధికారుల వరకు ఆ ఫైల్ ఎక్కడుందనే విషయాన్ని ట్రాకింగ్ పద్ధతిలో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయంలో కొన్ని విభాగాల్లో ఏపీటీఎస్ తెలంగాణ యూనిట్ రూపొందించిన కే-మాటమ్ (నాలెడ్జ్ మానిటరింగ్ ఆటోమేషన్ ఆఫీస్ మేనేజ్మెంట్) సాఫ్ట్వేర్ ద్వారా ఫైళ్లు నిర్వహిస్తున్నారు. దీన్ని అన్ని విభాగాలకు విస్తరించాలా, ఎన్ఐసీ రూపొందించిన ఈ-ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌ను వాడాలా అనేది ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. ఐటీ విభాగం ఈ రెండింటిలో ఉన్న ప్రయోజనాలు, లోపాలను పోలుస్తూ తయారు చేసిన నివేదికను ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు పంపించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే డిజిటల్ ఫైళ్ల విధానం అమల్లోకి రానుందని అధికార వర్గాలు వెల్లడించాయి. సర్క్యులర్లు, మెమోలకు కొత్త వెబ్సైట్ ప్రస్తుతం ప్రభుత్వ ఉత్తర్వుల కోసం వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లుగానే శాఖాపరమైన సర్క్యులర్లు, మెమోలకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ శాఖ సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమైంది కూడా. వాస్తవానికి పాత సర్క్యులర్లు, మెమోలు సరిగా అందుబాటులో ఉండని పరిస్థితి. ఒక్కోసారి కొన్ని సెక్షన్లలో గంటల తరబడిగా వెతకాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని నివారించేందుకు వెబ్సైట్లో పొందుపరచటం సరైన మార్గమని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఆర్థిక శాఖ జారీ చేస్తున్న బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్వో)లను సైతం కొత్త వెబ్సైట్లో ఉంచాలని నిర్ణయించారు. -
‘సీఎంవో’ నుంచి మీడియా ఔట్!
- బయటకు పంపిన భద్రతా సిబ్బంది - సమాచార కమిషనర్ ఆదేశాలతోనే.. - నిరసన తెలిపిన జర్నలిస్టులు - ఎవరూ ఆదేశాలు జారీ చేయలేదన్న సీఎంవో వర్గాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలోని సమతా బ్లాక్‌లో ఉన్న ముఖ్యమంత్రి ప్రధాన పౌరసంబంధాల అధికారి కార్యాలయం(సీపీఆర్వో) నుంచి మీడియా ప్రతినిధులను భద్రతా సిబ్బంది సోమవారం బయటకు పంపడం వివాదాస్పదమైంది. ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తంచేశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం కేసీఆర్ సచివాలయంలోని ఆయన కార్యాలయానికి చేరుకున్న సమయంలో అక్కడే ఉన్న సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్.. సీపీఆర్వో కార్యాలయంలో ఉన్న విలేకరులను బయటకు పంపించాలని భద్రతా సిబ్బం దిని ఆదేశించారు. దీంతో వారు 4 చానళ్ల ప్రతి నిధులను బయటకు వెళ్లాల్సిందిగా సూచించారు. తామెందుకు వెళ్లాలని విలేకరులు ప్రశ్నించగా.. సమాచార కమిషనర్ ఆదేశాలనే తాము పాటిస్తున్నామని భద్రతా సిబ్బంది చెప్పారు. ఆ వెంటనే విలేకరులు బయటకు వెళ్లి సీపీఆర్వో కార్యాలయంలోకి మీడియా ప్రతినిధులను అనుమతిం చడం లేదని సహచరులకు చెప్పారు. దీనిని నిరసిస్తూ జర్నలిస్టులు కొద్దిసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం సమాచార కమిషనర్ జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. సిబ్లాక్లో సీఎంను కలసి బయటకు వచ్చి జర్నలిస్టుల సంక్షేమనిధి వివరాలు వెల్లడించేందుకు సిద్ధమైన ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఎదుట కూడా నిరసన తెలిపారు. దీనిపై నారాయణ స్పందిస్తూ ‘సమాచార కమిషనర్ ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కానీ సచివాలయంలో మీడియాపై ఆంక్షలు లేవు’ అని ఆయన పేర్కొన్నారు. అయితే జర్నలిస్టులను బయటకు పంపాలన్న ఆదేశాలు ఎవరూ జారీ చేయలేదని సీఎం కార్యాలయం వర్గాలు వివరణ ఇచ్చాయి. ఒక వర్గం మీడియా కావాలనే జర్నలిస్టులను రెచ్చగొడుతోందన్నారు. దోచుకోవడానికే మీడియా కట్టడి: కాంగ్రెస్ కాంట్రాక్టర్లకు, పైరవీకారులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండటానికే టీఆర్ఎస్ సర్కార్ సచివాలయంలో మీడియాను కట్టడి చేయాలని చూస్తున్నదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొనగల మహేశ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. మీడియాను కట్టడి చేయాలనే ఆలోచనే అప్రజాస్వామికమన్నారు. గతంలో ఏ సీఎంకూ లేని ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి మీడియా అడ్డువస్తున్నదనే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చారని మహేశ్ ఆరోపించారు. జర్నలిస్టులకు రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ - తొలి విడతగా రూ.10 కోట్లు విడుదల చేస్తూ సీఎం సంతకం - వచ్చే బడ్జెట్లో మరో రూ. పది కోట్లు - ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం వెల్లడి సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా 2014-15 బడ్జెట్లో కేటాయించిన రూ.10 కోట్లు విడుదల చేస్తూ సీఎం ఫైలుపై సంతకం చేశారని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015-16 బడ్జెట్లోనూ మరో రూ.10 కోట్లు కేటాయించాలని నిర్ణయించారని, ఈ మొత్తాన్ని ప్రెస్‌అకాడమీ ఖాతాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని జర్నలిస్టుల సంక్షేమానికి వినియోగించనున్నట్లు తెలిపారు. మొదటి సంవత్సరమే వడ్డీ ద్వారా రూ.7.50 లక్షలు అకాడమీకి అందుతాయన్నారు. ఇలా ఏటా రూ.10 కోట్లు జమచేస్తూ రూ.100 కోట్లతో కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులపై మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ వారంలో నివేదిక ఇస్తుందన్నారు. పత్రికలు, చానళ్లకు ప్రకటనలపై వచ్చే ఆదాయంలో 0.5 శాతం గానీ, ఒక శాతం గానీ జర్నలిస్టుల సంక్షేమనిధికి జమచేసే అవకాశం ఉందన్నారు. సీఎంవోలో సహేతుక క్రమబద్ధీకరణ సచివాలయంలో జర్నలిస్టులకు ఆంక్షల గురించి ఇప్పటి వరకు ఎలాంటి జీవో రాలేదని అల్లం పేర్కొన్నారు. అయితే సీఎం బ్లాక్ వరకు సహేతుక క్రమబద్ధీకరణలు ఉంటాయని స్పష్టం చేశారు. అంతేగానీ సచివాలయంలోకి మీడియాను అనుమతించకపోవడం వంటివేవీ ఉండవన్నారు. సీఎం కార్యాలయం దగ్గర మీడియాను ఉంచి బ్రేకింగ్ న్యూస్ పేరుతో ఇచ్చే వార్తల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని భావించడం వల్లే రెగ్యులేషన్స్ పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పా రు. కాగా, అల్లం వ్యాఖ్యలపై జర్నలిస్టులు ఆందోళన వ్యక్తంచేశారు. -
మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వంలోకి మార్చండి
హైదరాబాద్: తమను సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వంలో తెలంగాణకు చెందిన సచివాలయ నాలుగోవ తరగతి ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎస్ రాజీవ్ శర్మలకు తమను వెంటనే తెలంగాణ ప్రభుత్వంలోకి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించిన విజాపన పత్రాన్ని వారికి అందజేశారు. -
లోకల్ లొల్లి
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్ర సచివాలయంలో రేగిన ‘స్థానికత చిచ్చు’ జిల్లాకు పాకింది. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేందుకు వీలులేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు జిల్లాలో ఎంతమంది స్థానికేతర ఉద్యోగులున్నారన్న అంశంపై ఉద్యోగ సంఘాలు ఆరా తీస్తున్నాయి. జిల్లాలోని 68 ప్రభుత్వ శాఖలున్నాయి. విద్యా శాఖ మినహాయిస్తే మిగిలిన శాఖల్లో మొత్తం 36,818 మంది ఉద్యోగులు గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 స్థాయిల్లో పనిచేస్తున్నారు. వీరిలో సుమారు 8 శాతం మంది స్థానికేతర ఉద్యోగులేనని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే గుర్తించాయి. టీఎన్జీవో జిల్లా విభాగం శాఖల వారీగా స్థానికేతర ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసింది. ఈ జాబితాలకు తుది మెరుగులు ఇచ్చే పనిలో ఉద్యోగ నేతలు నిమగ్నమై ఉన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శాఖల వారీగా స్థానికేతర ఉద్యోగుల జాబితాలను వెల్లడించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈపరిణామాలు ఉద్యోగ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కలెక్టరేట్ భవన సముదాయంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 62 మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో జిల్లాస్థాయి అధికారులతో పాటు ఆఫీస్ సబార్డినేట్(అటెండర్) స్థాయి వరకు పనిచేస్తున్న వారున్నారు. విద్య, వైద్య శాఖలపై ప్రత్యేక దృష్టి జిల్లా విద్యా, వైద్య శాఖల్లో పనిచేస్తున్న స్థానికేతర ఉద్యోగులపై ఉద్యోగ సంఘాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఇతర శాఖలతో పోలిస్తే ఈ రెండు శాఖలో స్థానికేతర ఉద్యోగుల ప్రాతినిధ్యం అధిక సంఖ్యలో ఉన్నట్లు టీఎన్జీవోలు పేర్కొంటున్నారు. జిల్లా విద్యాశాఖలో 13,200 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 20 శాతానికి పైగా స్థానికేతరులున్నట్లు ఉద్యోగ సంఘాలు లెక్కలేశాయి. ఇక వైద్య శాఖలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు, ఎంపీహెచ్డబ్ల్యూఓల్లో సైతం గణనీయ సంఖ్యలో నాన్ లోకల్స్ ఉన్నారని భావిస్తున్నాయి. ఈ ఉద్యోగాల భర్తీ సమయంలో 20 శాతం ఓపెన్ కేటగిరీ కోటాకు మించి స్థానికేతర అభ్యర్థులకు అవకాశం కల్పించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల ప్రాంతీయతను గుర్తించేందుకు వారి ‘పుట్టు’ పూర్వోత్తరాలు, విద్యాభ్యాసం జరిపిన ప్రాంతాల సమాచారాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు కూపీ లాగుతున్నారు. రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్, పోచారం ప్రాంతాల్లో నివాసముంటున్న ఉద్యోగుల్లో కొందరు నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లు సమర్పించారని ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. కొందరు ఉద్యోగులు దిక్కుమొక్కు లేని పాఠశాలల్లో చదివినట్లు నకిలీ బోనఫైడ్ పత్రాలు సృష్టించారని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఆ పాఠశాలలన్నీ బోగస్ అని నిర్ధారించడానికి .. జిల్లాలో గుర్తింపు కలిగిన పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని జిల్లా విద్యాశాఖకు ఉద్యోగ సంఘాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. హెచ్ఎంఆర్ డేటా ఆధారంగా ఉద్యోగుల స్థానికతను నిర్ధారించాలని టీఎన్జీవో నేతలు జిల్లా యంత్రాంగాన్ని కోరినట్లు తెలిసింది. -
చీలుతున్న గుండెకాయ
సచివాలయుం రెండుగా విభజన.. రెండు రాష్ట్రాలకు వేర్వేరు బ్లాకుల కేటాయింపు ఇద్దరు సీఎంలకు రెండు వేర్వేరు గేట్లు... డెరైక్టరేట్లు, కమిషనరేట్లలోనూ అంతే అసెంబ్లీ భవనం ఇరు రాష్ట్రాలూ ఒకరి తర్వాత మరొకరు ఉపయోగించుకోవాలి ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం అంతే! గెజిట్ ప్రకటనతోనే విభజన కసరత్తు వేగవంతం.. ఉన్నతాధికారుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఇక రెండు రాష్ట్రాలుగా అవతరించటమే మిగిలివుంది. అయితే.. విభజన తర్వాత పదేళ్ల పాటు హైదరాబాద్ నగరాన్ని రెండు రాష్ట్రాలూ ఉమ్మడి రాజధానిగా వినియోగించుకోవాల్సి ఉంది. అంటే.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించి వేర్వేరుగా శాసనసభలు, శాసనమండళ్లు, సచివాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి. ఒకే రాజధానిలో రెండేసి అసెం బ్లీలు, కౌన్సిళ్లు, సెక్రటేరియట్లు, ఇతర ప్రధాన కార్యాల యాలు కావాలి. ఇదెలా జరుగుతుంది..? అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై వివిధ ఊహాగానాలు, అవకాశాలూ వినిపిస్తున్నప్పటికీ.. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకూ.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పరిపాలనా వ్యవహారాలన్నిటినీ ఒక చోటు నుంచే నడిపించేలా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్లు సమాచారం. పాలనకు గుండెకాయ అయిన సచివాలయాన్ని రెండుగా విభజించి.. ఆ భవనాలనే ఇరు రాష్ట్రాలూ వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు ఉన్నతాధికార వర్గాలు చెప్తున్నాయి. శాసనసభను కూడా ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం సమావేశాలకు ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ వర్గాల కథనం. విభజనకు సంబంధించి మార్గదర్శక సూత్రాలను రూపొందించేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కమలనాథన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సంయుక్త కార్యదర్శితో కమిటీని ఏర్పాటు చేయనుంది. గెజిట్ నోటిఫికేషన్ రాగానే ఈ కమిటీ విభజనకు సంబంధించి స్థూలంగా మార్గదర్శకాలను రూపొం దిస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీకి ఒక కమిటీని; ఆస్తులు, ఆదాయ వనరుల పంపిణీకి మరో కమిటీని; అఖిల భారత సర్వీసు అధికారులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయటానికి ఇంకో కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన గెజిట్ వెలువడగానే ఈ కమిటీలు విభజన పనిని ప్రారంభిస్తాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విభజన గెజిట్ జారీ చేసినప్పటి నుంచి సచివాలయుంతో పాటు రాష్ట్ర స్థారుు కార్యాలయూన్నింటిలోనూ విభజన ప్రక్రియు వేగం పుంజుకోనుంది. తెలంగాణ రాష్ట్రానికి సీవూంధ్ర రాష్ట్రానికి పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండనున్న నేపథ్యంలో.. పరిపాలనకు గుండెకాయ వంటి సచివాలయం విభజనపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. పది సంవత్సరాలు కాకపోయినా సీమాంధ్ర ప్రాంతం కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకునే వరకు ఆ రాష్ట్ర సచివాలయ కార్యకలపాలను హైదరాబాద్ నుంచే నిర్వహించాల్సి ఉంది. ఒక రాష్ట్రానికి ఒక చోట మరో రాష్ట్రానికి మరో చోట సచివాలయం ఉంటే.. విభజన సమయంలో ఫైళ్ల మార్పిడి కష్టం అవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత సచివాలయాన్ని ఒక ప్రాంతానికే పరిమితం చేసి.. మరో రాష్ట్రం సచివాలయాన్ని వేరే చోటుకు తరలిస్తే.. ప్రస్తుత సచివాలయ భవనాల్లో సగం ఖాళీగా ఉండాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది. అందుకని సచివాలయాన్ని రెండుగా చేసి.. రెండు రాష్ట్రాలకూ విడివిడిగా బ్లాకులను పంచినట్లయితే.. ఇక్కడి నుంచే ఇరు రాష్ట్రాల పాలన కొనసాగించటం సులభమవుతుందని వారు పేర్కొంటున్నారు. సచివాలయంలో ప్రస్తుతం 9 బ్లాక్‌లు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల ఆధారంగా సచివాలయంలో కొన్ని బ్లాక్‌లను తెలంగాణ రాష్ట్రానికి, మరి కొన్ని బ్లాక్‌లను ఆంధ్రా రాష్ట్రానికి కేటాయిస్తారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే సచివాలయానికి ఇప్పటికే రెండు గేట్లు ఉన్నందు ఒక గేట్ నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో గేట్ నుంచి మరో రాష్ట్ర ముఖ్యమంత్రి రాకపోకలు సాగిస్తారని చెప్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సి బ్లాక్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రికి డి బ్లాక్‌లో కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారుల్లో చర్చసాగుతోంది. ఈ బ్లాకుల కేటాయింపును కూడా కేంద్ర కమిటీయే నిర్ణయించనుంది. అలాగే రాష్ట్ర అసెంబ్లీ స్థానాల ఆధారంగా ఉద్యోగుల పంపిణీ జరుగుతుందని, ఇందుకు ప్రాతిపదికను కేంద్రం నియమించిన కమిటీ నిర్ణయిస్తుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. వివిధ శాఖల డెరైక్టరేట్లు, కమిషరేట్ల కార్యాలయాల్లోనే ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు పనిచేయాల్సి వస్తుందని, ఏ రాష్ట్రానికి ఎంత మంది ఉద్యోగులను కేటాయించాలనే దానికి కేంద్ర కమిటీ ప్రాతిపదికను రూపొందిస్తుందని, దాని ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సచివాలయంలో 5,000 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు 3,000 మంది,తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 2,000 మంది ఉన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం.. ప్రస్తుత అసెంబ్లీ భవనంలోనే.. రెండు రాష్ట్రాలూ ఒక రాష్ట్రం తరువాత మరో రాష్ట్రం సమావేశాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కొత్తగా హైదరాబాద్‌లో ఎటువంటి నిర్మాణాలను చేపట్టేది లేదని ఆ వర్గాలు చెప్తున్నాయి. ఉన్న భవనాలల్లోనే కొన్ని సంవత్సరాల పాటు ఇరు రాష్ట్రాల కార్యకలాపాలు కొనసాగుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలా కాకుండా రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌లో ఎటువంటి కొత్త నిర్మాణాలను చేపట్టినా అని నిష్ర్పయోజనంగా మారతాయని, సీమాంధ్ర రాజధాని నిర్మాణం తరువాత హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ భవనాలే సంగం ఖాళీ అవుతాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
రాతిరంతా జాతరే !
సీఎంగా కిరణ్‌కు చివరి రోజు? తెల్లవారులూ ఫైళ్ల క్లియరెన్స్!! మంత్రులు, ప్రజాప్రతినిధులు, పైరవీకారుల హడావుడి సచివాలయం, సీఎం పేషీ, క్యాంప్ ఆఫీసుల్లో ఒకటే సందడి క్యాంపు కార్యాలయానికి వందల సంఖ్యలో ఫైళ్ల తరలింపు రెండు రోజులుగా ‘కావాల్సిన ఫైళ్ల’ను క్లియర్ చేస్తున్న సీఎం సాక్షి, హైదరాబాద్: పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లును ప్రవేశపెట్టిన రోజునే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి తన సన్నిహితులతో చెప్పటంతో బుధవారం రాష్ట్ర సచివాలయం, మంత్రుల పేషీలు, ముఖ్యమంత్రి పేషీ, సీఎం క్యాంపు కార్యాలయాలు ఒక్కసారిగా కిక్కిరిసిపోయాయి. గురువారం నాడు లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్నారనే వార్తల నేపథ్యంలో.. కిరణ్ సీఎం పదవిలో ఇక ఒక్క రోజే ఉంటారని.. కాబట్టి బుధవారం తెల్లవారే లోగా ‘కీలక’ ఫైళ్లకు ఆమోదం పొందాలనే హడావిడి మొదలైంది. ఒకవైపు సీఎం తనకు ‘కావలసిన’ ఫైళ్లను ఆగమేఘాలమీద ఆమోదిస్తుండగా.. వివిధ పనుల కోసం, పైరవీల కోసం వచ్చిన వారు, ప్రజాప్రతినిధులతో జాతరను తలపించే సందడి నెలకొంది. తమకు చెందిన పనులకు సంబంధించిన ఫైళ్లను బుధవారం రాత్రి నుంచి తెల్లారేలోగా ఆమోదింపచేసుకోవాలనే హడావిడి సచివాలయానికి వచ్చిన వారిలో కనిపించింది. సీఎం కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఫైళ్లు క్యాంపు కార్యాలయానికి తరలించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖకు చెందిన భూముల కేటాయింపు ఫైళ్లపై ముఖ్యమంత్రి గత రెండు రోజులుగా ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వివిధ రకాల భూముల కోసం దరఖాస్తు చేసుకున్న బడా నేతలకు చెందిన ఫైళ్ల క్లియరెన్స్‌పైనే ఆయన దృష్టి సారించినట్లు చెప్తున్నారు. బుధవారం సాయంత్రం కొన్ని ఫైళ్లను క్యాంపు కార్యాలయానికి తరలిస్తుండగా మీడియా దృష్టిలో పడింది. దీంతో ఫైళ్ల తరలింపును తాత్కాలికంగా ఆపేశారు. మీడియా ప్రతినిధులు సచివాలయం నుంచి వెళ్లిపోయిన తరువాత రాత్రికి ఫైళ్లను క్యాంపు కార్యాలయానికి తరలించారు. రకరకాల మినహాయింపులతో పాటు ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరే ఫైళ్లకు ఒక్కసారిగా రెక్కలొస్తున్నారుు. ఇప్పటివరకు నత్తనడకన కదిలే ఫైళ్లు ఇప్పుడు జెట్ స్పీడుతో పరిగెడుతున్నాయి. మరో పక్క బదలీలు, పదోన్నతులకు చెందిన ఫైళ్లపై సంబంధిత ఉద్యోగులు హడావిడి పడుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే మొత్తం మంత్రివర్గం ఉండదని, అలాంటప్పుడు ఏ పనీ కాదనే భావనలో ప్రజాప్రతినిధులు ఉన్నారు. మంత్రులు కూడా తమకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి ఆమోదం కోసం సీఎం కార్యాలయానికి తమ కార్యాలయ అధికారులను పంపిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆమోదం పొందిన ఫైళ్లకు ఇంకా జీవోలు జారీ కాకపోవటంతో అందుకు సంబంధించిన వ్యక్తులు సచివాలయంలోని ఆయా శాఖల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే జీవోలు జారీ అవుతాయో లేదో అనే ఆందోళనలో వారు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అధికారులు సీఎం పేషీలోనే సంతకాల కోసం వేచివుండటం కనిపించింది.