'విభజన తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసింది'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మూడోరోజు ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. గవర్నర్ ముందుగా తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా భావిస్తున్నామని గవర్నర్ తెలిపారు.
రాష్ట్ర విభజన జరిగిన తీరు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. జీవితంలో సంక్షోభాలను ఎదుర్కొవాలని, గత దశాబ్దాల కాలంలో రాష్ట్రం ఎన్నో అవకాశాలు కోల్పోయిందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించాలన్నారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసిందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60కి పెంచామన్నారు. బీసీలకు ప్రత్యే బడ్జెట్ అమలు చేస్తామని, ఎస్సీ, ఎస్టీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని తెలిపారు. కాగా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను గవర్నర్ తన ప్రసంగంలో ప్రసంగించారు.