
'హైదరాబాద్ పై ఎలాంటి సలహాలు ఇవ్వలేను'
హైదరాబాద్:ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకుందామని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ కు వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఆంటోని కమిటీతో భేటీ నేపథ్యంలో ఇక్కడికి వచ్చారా?అని ఓ విలేకరి ప్రశ్నించగా..'నేను ఆంటోని కమిటీ మీటింగ్ కోసం ఇక్కడ రాలేదు. అలాగే హైదరాబాద్ పై ఎలాంటి సలహాలు ఇవ్వలేను' అని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతెలుగువారు అందరూ నిన్న మొన్నటి వరకూ కలిసే ఉన్నాం కదా. రాష్ట్ర ఏర్పాటుపై చోటు చేసుకుంటున్న సమస్యలన్నీ సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుటుందన్నారు. భద్రాద్రిపై ఏమైనా సలహాలు ఇచ్చారా అని ప్రశ్నించగా.. తమ జిల్లా నేతల కోరిక మేరకే అధిష్టానానికి సలహా ఇచ్చానని ఆమె తెలిపారు.