బతికుండగా భద్రాచలం విలీనం కానివ్వను: రేణుక
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రేణుకా చౌదరి బుధవా రం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి జాబితా నుంచి తొలగించిన తరువాత ఆమె తొలిసారిగా దిగ్విజయ్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని ధీమా వెలిబుచ్చారు. ‘‘భద్రాచలంను సీమాంధ్రలో విలీనం చేసే ప్రసక్తే లేదు. కచ్చితంగా అడ్డుకుంటా. సీమాంధ్రలో విలీనం చేయాలంటే నేను బతికుండగా అది జరగదు. కాదూ కూడదంటే నా శవంపై తీసుకెళ్లాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు.