నేడే తెలంగాణ, సీమాంధ్ర పీసీసీలు | telangana and seemandhra pccs to be announced today, says digvijay singh | Sakshi
Sakshi News home page

నేడే తెలంగాణ, సీమాంధ్ర పీసీసీలు

Published Tue, Mar 11 2014 12:18 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

నేడే తెలంగాణ, సీమాంధ్ర పీసీసీలు - Sakshi

నేడే తెలంగాణ, సీమాంధ్ర పీసీసీలు

తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల పీసీసీలను మంగళవారమే ప్రకటిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే స్వేచ్ఛ అందరికీ ఉందని, సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నాయకులు బయటకు వెళ్తుంటే.. తెలంగాణలో మాత్రం పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సొంత పార్టీ పెట్టనని చెప్పి, ఆ తర్వాత మాట తప్పారని ఆయన అన్నారు. ఇక పార్టీ అధినేత్రి సోనియాగాంధీ హోలీ పండుగ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఈనెల 13, 14, 15 తేదీలలో తాను హైదరాబాద్లో ఉండి.. ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు కసరత్తు చేయనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement