జేసీకి షోకాజ్ నోటీసులు: దిగ్విజయ్ సింగ్ | Showcause Notice issued to J C Diwakar Reddy, says Digvijay singh | Sakshi
Sakshi News home page

జేసీకి షోకాజ్ నోటీసులు: దిగ్విజయ్ సింగ్

Published Thu, Dec 26 2013 11:30 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

జేసీకి షోకాజ్ నోటీసులు: దిగ్విజయ్ సింగ్ - Sakshi

జేసీకి షోకాజ్ నోటీసులు: దిగ్విజయ్ సింగ్

యూపీఏ అధ్యక్షురాలు సోనియగాంధీపై వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. జేసీ వివరణ ఇచ్చిన తర్వాత చర్యలు చేపడతామన్నారు. గురువారం న్యూఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించడానికి తనకేమి అభ్యంతరం లేదని తెలిపారు.

 

సాధ్యమైనంత త్వరలో సీమాంధ్రలో పర్యటిస్తానని చెప్పారు. అయితే జనవరిలో విశాఖ నగరంలో పర్యటిస్తానని వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారని విలేకర్లు దిగ్విజయ్ సింగ్ను ప్రశ్నించగా.... ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. త్వరలోనే ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్ సింగ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement