సమైక్యం కోసం పదవిని వదులుకుంటా: సీఎం కిరణ్
ముఖ్యమంత్రిగా తన పదవి శాశ్వతం కాదని, కాంగ్రెస్ జనరల్ పదవి దిగ్విజయ్ సింగ్ కు శాశ్వతం కాదని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడం కోసం పదవిని త్యాగం చేయడానికైనా సిద్దమని అన్నారు. పదవి కోసం తాను చంద్రబాబు నాయుడిలా ప్రవర్తించడం లేదు అని అన్నారు. గత 60 రోజుల నుంచి రాష్ట్ర విభజనపై చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు.
పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడుతారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. మహా అయితే మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని.. కాని తెలుగు ప్రజల భవిష్యతే ముఖ్యం అని అన్నారు. బతికినంత కాలం తాను మాజీ ముఖ్యమంత్రిగా ఉంటానని.. కాంగ్రెస్ పార్టీ దయ వల్ల, సోనియా తోనే ముఖ్యమంత్రి పదవి లభించిందన్నారు. ప్రజలకు మేలు జరుగాలనేదే తన ఉద్దేశం అని అన్నారు. పదవిని వదిలిపెడుతానని అంటే పార్టీ పెడుతారా అని ఎందుకు ప్రశ్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబులా గడ్డి తినే వ్యక్తిని కాను విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని వదులుకోనని ఆయన అన్నారు.