ఇన్‌చార్జ్‌గా దిగ్విజయ్ ఔట్
కాంగ్రెస్ పార్టీలో మార్పులు చేర్పులు
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో మార్పులు చేర్పులకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శనివారం శ్రీకారం చుట్టారు. కర్ణాటక, గోవా రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జ్‌గా వ్యహరిస్తున్న సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. మొన్నటి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటులో దిగ్విజయ్ అలసత్వం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న దిగ్విజయ్... ప్రభుత్వ ఏర్పాటుకు చిన్న పార్టీలతో చర్చలు జరపడంలో విఫలమయ్యారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇన్‌చార్జ్‌గా మాత్రం దిగ్విజయ్ కొనసాగుతారు. ఇక కర్ణాటక ఇన్‌చార్జ్‌గా కేసీ వేణుగోపాల్‌ను గోవాకు చెల్లా కుమార్‌ను సోనియా నియమించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. మధుసూదన్ మిస్త్రీని ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించి పార్టీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ (సీఈఏ)సభ్యుడిగా నియమించారు. సీఈఏ చైర్మన్‌గా ముల్లాపల్లి రామచంద్రన్ వ్యవరిస్తారని, భువనేశ్వర్ కలిత, మధుసూదన్ మిస్త్రీలు సభ్యులుగా ఉంటారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సీఈఏ సలహా కమిటీని ఏర్పాటు చేసిన సోనియా.. సభ్యులుగా రాజ్యసభ ఎంపీ షంషేర్ సింగ్ డుల్లో, ఎంపీ బీరెన్ సింగ్, మాజీ ఎంపీ అష్క్ అలీ తక్‌లను నియమించారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్‌లో కూడా త్వరలో మార్పులు చేయనున్నట్లు ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి.