j c diwakar reddy
-
ఓటర్లను ప్రలోభపెడుతున్న జేసీ వర్గీయులు అరెస్ట్
అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఓటర్లను టీడీపీ ప్రలోభపెడుతుంది. ఆదివారం ఓటర్లను డబ్బు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును సీజ్ చేసి, ముగ్గురు జేసీ వర్గీయులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా సదూం మండలం జోగివారిపల్లిలో తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్ల కు నగదు పంచుతున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా సంజామల మండలం రాంరెడ్డిపల్లిలో ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. -
జేసీకి షోకాజ్ నోటీసులు: దిగ్విజయ్ సింగ్
-
జేసీకి షోకాజ్ నోటీసులు: దిగ్విజయ్ సింగ్
యూపీఏ అధ్యక్షురాలు సోనియగాంధీపై వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశామని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. జేసీ వివరణ ఇచ్చిన తర్వాత చర్యలు చేపడతామన్నారు. గురువారం న్యూఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించడానికి తనకేమి అభ్యంతరం లేదని తెలిపారు. సాధ్యమైనంత త్వరలో సీమాంధ్రలో పర్యటిస్తానని చెప్పారు. అయితే జనవరిలో విశాఖ నగరంలో పర్యటిస్తానని వెల్లడించారు. రాష్ట్ర విభజన విషయంలో సీఎం కిరణ్ కాంగ్రెస్ అధిష్టానానికి వ్యతిరేకంగా స్వరం పెంచుతున్నారని విలేకర్లు దిగ్విజయ్ సింగ్‌ను ప్రశ్నించగా.... ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడు సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. త్వరలోనే ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేస్తామని దిగ్విజయ్ సింగ్ వివరించారు. -
ఆయనొద్దు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డికి టీడీపీ తీర్థం ఇవ్వాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించడం విభేదాలకు దారితీసింది. మూడు దశాబ్దాలుగా టీడీపీ వర్గీయులను వేధించిన జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ ఆ పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ పేరం నాగిరెడ్డి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళి.. ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబును నిలదీసినట్లు సమాచారం. ఆర్థిక అవసరాలను తీర్చుతానని జేసీ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇవ్వడం వల్లే పార్టీలోకి తీసుకుంటున్నామని.. సహకరించాలని పేరం, కందిగోపులను చంద్రబాబు అనునయించే యత్నం చేశారని తెలిసింది. తాడిపత్రి శాసనసభ అభ్యర్థిత్వం తనకే కేటాయించాలన్న డిమాండ్‌కు చంద్రబాబు అంగీకరించడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి పేరం అంగీకరించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. కానీ.. పేరం, చంద్రబాబు నిర్ణయాలను తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు కందిగోపుల మురళి తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. ఈ నెల 9వ తేదీన జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరాలని ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు జేసీ వర్గీయులు వెల్లడించారు. ఇది పసిగట్ట డంతోనే పేరం నాగిరెడ్డి, కందిగోపుల మురళి తమ వర్గీయులతో ఇటీవల హైదరాబాద్‌కు తరలివెళ్లారు. మూడు దశాబ్దాలుగా టీడీపీ శ్రేణులను వేధించి, హత్యా రాజకీయాలు చేసిన జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబానికి పార్టీ తీర్థం ఎలా ఇస్తారని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ల వద్ద కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. జేసీ కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుంటే టీడీపీకి సామూహికంగా రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారట. పార్టీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని.. ఆర్థిక అవసరాలు తీర్చుతానని జేసీ ప్రభాకర్‌రెడ్డి హామీ ఇవ్వడం వల్లే పార్టీలోకి చేర్చుకుంటున్నామని చంద్రబాబు, లోకేష్.. పేరం, కందిగోపులను అనుయించినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని పేరం నాగిరెడ్డి పట్టుబట్టారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించడంతో పేరం నాగిరెడ్డి సంతృప్తి చెందినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కానీ.. దీనిపై కందిగోపుల మురళి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మూడు దశాబ్దాలుగా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలను అంతమొందించిన జేసీ కుటుంబీకులను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా శ్రేణులకు ఎలాంటి సంకేతాలు పంపుతారని కందిగోపుల తీవ్ర స్థాయిలో నిలదీసినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కందిగోపులను పేరం అనునయిస్తూ.. తాడిపత్రిలో ఏర్పాటు చేసిన ఎన్టీయార్ విగ్రహాష్కరణకు రావాలని చంద్రబాబును ఆహ్వానించగా, జేసీ ప్రభాకర్‌రెడ్డిని పార్టీలోకి చేర్చుకునే అంశం తేల్చకుండా తాడిపత్రికి రాలేనని చంద్రబాబు స్పష్టీకరించినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా, తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్ పేరం నాగిరెడ్డికి ఇస్తామన్న చంద్రబాబు హామీపై జేసీ ప్రభాకర్‌రెడ్డి భగ్గుమంటున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముందస్తుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ స్థానం నుంచి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, రాయదుర్గం నుంచి దీపక్‌రెడ్డి, అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తాను టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు అంగీకరిస్తేనే పార్టీ తీర్థం పుచ్చుకుంటానని జేసీ ప్రభాకర్ రెడ్డి.. చంద్రబాబు తనయుడు లోకేష్‌కు తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఇందుకు చంద్రబాబు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో టీడీపీలో చేరే ముహూర్తాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. -
ఎంపీగా పోటీ చేయాలని ఉంది: జేసీ
అనంతపురం : వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని ఉందని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తన మనసులో మాటను మరోసారి బయటపెట్టారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పలేనని ఆయన బుధవారమిక్కడ అన్నారు. తనకు తెలుగు దేశం పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని జేసీ తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.గత కొంత కాలంగా రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉంటున్న జేసీ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌కు వెళ్లే యోచనలో ఉన్నారు. అనంతపురం జిల్లాలో ఎదురులేని నేతగా పేరుపొందిన జేసీ దివాకర్ రెడ్డి తాడిపత్రి నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి...మంత్రిగా కూడా పని చేశారు. అయితే కొంతకాలంగా జేసీకి సొంత ఇలాకాలోనే పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.మంత్రి రఘువీరారెడ్డితో ప్రచ్చన్నంగా వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ దివాకర్ రెడ్డి తెలుగు దేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా గతంలో జేసీ కుటుంబం రాకను స్వాగతించారు.మరి వచ్చే ఎన్నికల్లో జేసీ సైకిల్ ఎక్కుతారా లేదా అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. -
కాంగ్రెస్ పార్టీని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు: జేసీ
-
కాంగ్రెస్ పార్టీని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు: జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరి సీమాంధ్ర ప్రాంత వాసులను రెచ్చగొట్టేలా ఉందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఐటీ రంగానికి 2 లక్షల కోట్లు కేటాయించడం ప్రజలకు ఆగ్రహాం కలిగిస్తుందన్నారు. రాయల తెలంగాణ డిమాండ్‌ను అధిష్టానం పట్టించుకోవడం లేదన్నారు. అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వల్ల తమలాంటి సీనియర్లు పార్టీ నుంచే కాదు... రాజకీయాల నుంచే తప్పుకోవాలనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ శూన్యత ఏర్పడింది, కొత్తపార్టీ పుట్టుకొచ్చే అవకాశాలున్నాయన్నారు. స్వలాభం కోసమే రాష్ట్రాన్ని విభజిస్తోందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని సమక్యంగా ఉంచే పరిస్థితి లేదు: జేసీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలకు వచ్చే ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. అలాంటి పరిస్థితి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. శనివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సానుకూలంగానే ఉందని దివాకర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పరిస్థితి లేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.