అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఓటర్లను టీడీపీ ప్రలోభపెడుతుంది. ఆదివారం ఓటర్లను డబ్బు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును సీజ్ చేసి, ముగ్గురు జేసీ వర్గీయులను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు.
అలాగే చిత్తూరు జిల్లా సదూం మండలం జోగివారిపల్లిలో తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్ల కు నగదు పంచుతున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా సంజామల మండలం రాంరెడ్డిపల్లిలో ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు.