cash seized
-
రైలులో నోట్ల కట్టలు.. రూ. 4 కోట్లకు పైగా సీజ్
చెన్నై, సాక్షి: చెన్నై తాంబరం రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. నెల్లూరు ఎక్స్‌ప్రెస్ రైలులో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురు వ్యక్తులు ఎనిమిది బ్యాగులతో ఎగ్మోర్‌లో రైలు ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, తాంబరంలో విధులు నిర్వహిస్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్లు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో తాంబరం రైల్వే స్టేషన్‌కు చేరుకుని నిందితులను పట్టుకున్నారు. నిందితులను అగరానికి చెందిన ఎస్ సతీష్, అతని సోదరుడు ఎస్ నవీన్, తూత్తుకుడికి చెందిన ఎస్ పెరుమాల్‌గా గుర్తించారు. సెకండ్ క్లాస్ ఏసీ కోచ్ (ఏ1)లో వెతకగా వారి వద్ద ఉన్న బ్యాగుల్లో రూ. 500 నోట్ల కట్టలు దొరికాయి. దీంతో పోలీసులు ముగ్గురు అనుమానితులను పోలీస్ స్టేషన్లో అదుపులోకి తీసుకుని ఆదాయపు పన్ను శాఖను అప్రమత్తం చేశారు. ఐటీ బృందాలు నిందితులను ఆదివారం లేదా సోమవారం విచారించనున్నాయి. తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నైనార్ నాగేంద్రన్‌కు చెందిన కిల్పాక్, ట్రిప్లికన్, సాలిగ్రామం ప్రాంతాలలో కూడా పోలీసులు సోదాలు చేశారు. నిందితులు నగదును ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లే ముందు బీజేపీ నేతకు సంబంధించిన ప్రదేశాల్లో ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరునెల్వేలి లోక్‌సభ నియోజకవర్గంలో పంపిణీ చేసేందుకు ఈ డబ్బును తీసుకెళ్లారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు మొదటి దశ అంటే ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. -
ఈడీ దాడులు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, అక్రమ ఆయుధాల సీజ్
చండీగఢ్: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హర్యానాలోని ప్రతిపక్ష నేతల ఇళ్లపై మెరుపు దాడులు చేపట్టింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, మరికొందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. యమునా నగర్, సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నాల్ వంటి 20 ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత మైనింగ్ వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, అతని సన్నిహితుల నివాసాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేపట్టింది. 15, 20 మంది ఈడీ అధికారులు ఆరు వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగాయి. కుటుంబంలోని అందరి సెల్ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 100 బాటిళ్ల మద్యం, రూ. 5 కోట్ల నగదు, భారీగా అక్రమ విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, నగదుతో పాటు 4 నుంచి 5 కిలోల బరువున్న మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సింగ్ యమునానగర్ మాజీ శాసన సభ్యుడు. అదే విధంగా ఎమ్మెల్యే పన్వార్ ఇంట్లోనూ దాడులు కొనసాగాయి ఆయన సోనిపట్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించిన మైనింగ్‌పై యమునానగర్, చుట్టుపక్కల జిల్లాల్లో అక్రమంగా బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హర్యానా పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. అనంతరం దీనిపై 2013లో ఈడీ మనీలాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలను నిందితులుగా పేర్కొంది. వీరు మైనింగ్ కోసం బిల్లులు, స్లిప్పులను రూపొందించడానికి నకిలీ 'ఈ-రవాణ' పథకాన్ని నడుపుతున్నట్లు ఈడీ ఆరోపించింది. -
మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 1 వరకు పోలీసు బృందాల తనిఖీల్లో మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.103 కోట్ల నగదు పట్టుబడగా ఈసారి ఎన్నికల నగదు స్వాదీనంలో 248 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
పోలింగ్‌కు మరో రెండు రోజులే.. కోట్లలో పట్టుబడుతున్న నోట్ల కట్టలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు నేటితో(నవండర్ 28) ముగియనుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరనుంది. ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరిన వేళ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతోంది. ఐటీ, ఈసీ అధికారులు, రాష్ట్ర పోలీసులు చేపట్టిన తనిఖీలల్లో రోజూ కోట్లలో సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు. పార్టీ నేతలు, వారి అనుచరులు డబ్బులు పంచుతూ.. దొరికిపోతున్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 724 కోట్ల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 292 కోట్ల నగదు రూపంలో పట్టుబడగా.. రూ.122 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 40 కోట్ల డ్రగ్స్, రూ. 186 కోట్ల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక చివరి రెండు రోజుల్లో నేతలు డబ్బు పంపిణీ మరింత చేయనున్నారు. చదవండి: ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్ మాటామంతి హైదరాబాద్‌లో బీఆర్ఎస్ తరుపున డబ్బులు పంచుతూ ఓ పోలీస్ అధికారి పట్టుబడ్డారు. పట్టుబడ్డ పోలీస్ అధికారి కారులో రూ, 6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కారులోఉన్న నోట్ల కట్టలను ఆర్వో స్వాధీనం చేసుకున్నారు. ఇక మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఓటర్లకు డబ్బులు పంచుతూ మల్లారెడ్డి కళాశాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు దొరికిపోయారు. మల్లారెడ్డి కాళాశాల సిబ్బంది, విద్యార్థ/లు ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంపిణి చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని సంబంధిత అధికారులకు అప్పగించారు. పట్టుబడిన సొమ్మును మంత్రి మల్లారెడ్డికి చెందినదిగా అనుమానిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్చ్!.. మన దాకా రానిచ్చేట్లు లేరుగా..!
ప్చ్!.. మన దాకా రానిచ్చేట్లు లేరుగా..! -
రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు.. పట్టుబడ్డ రూ. 2 కోట్ల 47 లక్షలు..
సాక్షి నెట్ వర్క్: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృత చేపడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వివిధ ప్రాంతాల్లో సరిగ్గా లెక్క చూపని, సరైన పత్రాల్లేని రూ. 2,47,30,500 నగదు, కేజీ 600 గ్రాముల బంగారం పట్టుబడ్డాయి. ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆయా నగదును, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. మంచాల: రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆగాపల్లి వద్ద మంచాల మండలం లోయపల్లికి చెందిన కె.శ్రీనివాస్ కారులో రూ.20 లక్షలు, కూకట్‌పల్లికి చెందిన సీహెచ్ రాజశేఖర్‌రెడ్డి కారులో రూ.2లక్షలు పట్టుబడ్డాయి. చిక్కడపల్లి: నిర్మల్ జిల్లా బైంసా ప్రాంతానికి చెందిన శ్రీధర్ తన కియా కారులో కేజీ బంగారం తీసుకువెళ్తుండగా గాం«దీనగర్ స్టేషన్ పరిధిలో పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. రూ.58 లక్షల విలువైన ఆ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపిస్తే అందజేస్తామని లేకపోతే ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు. హిమాయత్‌నగర్ వై జంక్షన్లో దోమలగూడ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో వెంకటరమణ అనే ద్విచక్రవాహనదారుడు నుంచి రూ.1,75,000 స్వాదీనం చేసుకున్నారు. చైతన్యపురి: బైక్‌లపై వెళ్తున్న దిల్సుఖ్నగర్ వీవీనగర్‌కు చెందిన బిరాదార్ సిద్ధేశ్వర్, సరూర్‌నగర్ ఇంద్రహిల్స్‌కు చెందిన బి.శంకర్‌రెడ్డి నుంచి రూ.60 లక్షల నగదును చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలో చెక్‌పోస్టు వద్ద స్వా«దీనం చేసుకున్నారు. చిలుకూరు: సూర్యాపేట జిల్లా చిలుకూరులో బ్యాంక్ ఉద్యోగి చీర్యాల సాయికుమార్ కారులో రూ. 45 లక్షలు ఉండటంతో ఆ డబ్బును సీజ్ చేశారు. అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలెం వద్ద ధాన్యం వ్యాపారి చింతకుంట్ల కోటేశ్వరరావుకు చెందిన కారులో రూ.7లక్షల 30వేలు లభ్యమయ్యాయి. రామగిరి: నల్లగొండ జిల్లా తిప్పర్తి వద్ద నెల్లూరు జిల్లాకు చెందిన కుంచాల సుధాకర్ కారులో పోలీసులు రూ.8 లక్షల 50 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్ చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో రూ.18,39,500, అంతారం స్టేజీ సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.7.40 లక్షలు , కొత్తూరు బైపాస్ (వై జంక్షన్)వద్ద రూ.8.85 లక్షల నగదు, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో రూ. 5.11 లక్షల నగదును పోలీసులుస్వాదీనం చేసుకున్నారు. చైతన్యపురి: సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కొత్తపేట చౌరస్తాలో గోషామహల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి సునీల్ జహంగీర్ నుంచి రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. విజయనగర్‌కాలనీ: గోల్కొండ టోలిచౌకీలోని అప్సర్ కాలనీకి చెందిన మహ్మద్ అశ్వాక్ ద్విచక్రవాహనంలో రూ.6 లక్షలు ఉన్నట్లు ఆసిఫ్‌నగర్ పోలీసులు గుర్తించారు. జియాగూడ: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పురానాపూల్ చౌరస్తాలో నార్సింగికు చెందిన ఆనంద్ నుంచి సుమారు 30 లక్షల విలువచేసే 600 గ్రాముల బంగారాన్ని స్వాదీనం చేసుకున్నారు. ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి వద్ద కామారెడ్డి నుంచి నిజామాబాద్‌కు కారులో వస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ. 50 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. -
కర్ణాటక ఎన్నికలు.. చేతులు మారుతున్న కోట్లు.. మొత్తం ఎంత సీజ్ చేశారంటే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. నాలుగు రోజుల్లో పోలింగ్ వారం రోజుల్లో నేతల భవితవ్యం తేలనుంది. ప్రజా క్షేత్రంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టేదెవరో, ఓటమితో ఇంటి బాట పట్టదేవరో తెలిపోనుంది. కాగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి. మద్యం ప్రవాహం కూడా పెరిగింది. ఈ క్రమంలో మార్చి 19న ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 305 కోట్ల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వివిధ ఏజెన్సీల ద్వారా రూ.110 కోట్ల నగదు, మొత్తం 2,346 ఎఫ్ఐఆర్లు నమోదు అయినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అదే విధంగా రూ.74 కోట్ల మద్యం, రూ.81 కోట్ల బంగారం, వెండి, రూ. 18 కోట్ల డ్రగ్స్/నార్కోటిక్స్ పట్టుబడినట్లు వెల్లడించారు. చదవండి: హింసాకాండలో 54 మంది మృతి.. మణిపూర్‌లో కనిపిస్తే కాల్చివేత ఇదిలా ఉండగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ ఐటీ అధికారుల దాడుల్లో ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మైసూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థికి చెందిన ఇంటి నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు. దాదాపుగా కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ కుమార్ రాయ్ తమ్ముడు సుబ్రహ్మణ్య రాయ్ ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు కట్టిన బాక్సులో కోటి రూపాయలను సీజ్ చేశారు. మరోవైపు పోలింగ్ దగ్గరపడుతుండటంతో పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహిస్తున్నారు. కాగా కర్ణాటకలో 15వ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో మే 10వతేదీన నిర్వహించనున్నారు. ఎన్నికల ఫలితాలు మే 13వతేదీన వెల్లడి కానున్నాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలు..రూ. 5.30 లక్షలు స్వాధీనం
సాక్షి, అనంతపురం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ధన ప్రవాహం భారీగా సాగుతోంది. అనంతపురంలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. ఈ మేరకు తాడిపత్రి టీడీపీ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 5.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ నేత వెంకట రమణను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. నగదును సమీపంలోని పోలీస్టేషన్‌కి తరలించారు. (చదవండి: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి) -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలు.. టీడీపీ నేత ఇంట్లో డబ్బుల గుట్టలు..
సాక్షి, విశాఖపట్నం: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ధన ప్రవాహం భారీగా సాగుతోంది. విశాఖలో టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. వెంకోజీపాలెంలోని అమ్మ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో పోలీసులు శనివారం సోదాలు నిర్వహించారు. టీడీపీ నేత రమేష్ నాయుడు ఇంట్లో రూ.27 లక్షలు నగదు పోలీసులు పట్టుకున్నారు. నగదును ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. చదవండి: చినబాబుకు షాక్.. అనుకున్నదొకటి.. అయ్యింది మరొకటి.. -
మంత్రి మల్లారెడ్డికి ఐటీ నోటీసులు.. సోదాల్లో ఎంత నగదు దొరికిందంటే?
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ మల్లారెడ్డి సహా, కుమారులు, అల్లుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. కాగా, తాను లేని సమయంలో తన కుమారుడితో తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి సంతకం చేయించుకున్నారని బోయినపల్లి పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్లో ఉన్న తన కొడుకుతో బలవంతంగా సంతకం చేపించుకుంటున్నారని, ఇండ్లల్లో చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. ‘‘వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు.. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా రాస్తున్నారు. చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. గందరగోళంగా రైడ్స్ చేసారు. మా దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదు. మెడికల్ కాలేజీకి సంబంధించి అన్ని అబద్ధాలు రాశారని’’ మంత్రి మల్లారెడ్డి మండిపడ్డారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఐటీ సోదాలు.. అర్ధరాత్రి హైడ్రామా -
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: గువ్వల బాలరాజు
-
బేరసారాలకు టీఆర్ఎస్ లొంగదు: ఎమ్మెల్యే బాలరాజు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ నేతలకు వల వేసేందుకు చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేసి భారీగా నగదు పట్టుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ బేరసారాలకు లొంగదని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు. ఇది కేసీఆర్ పార్టీ.. ఎవరూ కొనలేరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మరోవైపు.. తెలంగాణ సమాజం అమ్ముడుపోదన్నారు ఎమ్మెల్యే బాల్క సుమన్. నిస్సిగ్గుగా తమ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దొడ్డిదారిన అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీపై తెలంగాణ సమాజం తిరగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సాక్షిగా బీజేపీ కుట్రలు బయటపడ్డాయన్నారు. తమ ఎమ్మెల్యేలు ధైర్యంగా కుట్రను బయటపెట్టారని అన్నారు. ఇదీ చూడండి: మునుగోడు లక్ష్యంగా టీఆర్ఎస్ నేతలకు వల.. రూ.100 కోట్లతో డీల్ -
తెలంగాణలో ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ భగ్నం!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ.. అధికార పక్ష నేతలకు గాలం వేసే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో.. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నించిన మధ్యవర్తీలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. వారి నుంచి భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డీల్ విలువ సుమారు రూ.100 కోట్లు నగదు ఉంటుందని అంచనా. నోట్ల కట్టలతో పోలీసులకు చిక్కిన వారిలో రామంచంద్ర భారతి, సోమయాజుల స్వామి, నందకుమార్, తిరుపతిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారంతా ఢిల్లీకి చెందిన వారని పేర్కొన్నారు. బంజారాహిల్స్ డెక్కన్ ప్రైడ్ హోటల్ చెందిన నందకుమార్ ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నందు కిషన్ రెడ్డికి సన్నిహితుడు అని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్లాన్ చేసిందంటూ టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి స్కెచ్ వేశారని ఆరోపించింది. ఫిరాయింపుల కోసం భారీగా నగదు ఆఫర్ చేశారని పేర్కొంది. ఆపరేషన్‌లో లక్క్ష్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్థన్‌రెడ్డి, రేగ కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో డీల్ చేసిన నందు, తిరుపతి, రామ చంద్ర భారతి, సింహా యాజులు. వంద కోట్ల రూపాయల డీల్ కాగా.. స్పాట్లో 15 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే దాడి తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభ పర్వం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ప్రలోభ పర్వం గురించి సమాచారం అందుకోగానే రంగంలోకి దిగినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్‌లోని బేరసారాలు నడుస్తున్న ఫామ్ హౌజ్‌పై రైడ్ చేశామని, ముగ్గురు దొరికారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. రామచంద్రభారతి ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందింది. సింహయాజులు తిరుపతి నుంచి వచ్చాడు. నందకుమార్, సింహయాజులు.. ఫరిదాబాద్ నుంచి రామచంద్రభారతిని ఇక్కడికి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పదవులు, డబ్బు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారు. నందకుమార్ మధ్యవవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం ఉంది అని సీపీ వెల్లడించారు. -
ఈ–నగ్గెట్స్ ప్రమోటర్ల నివాసాల్లో సోదాలు
న్యూఢిల్లీ/కోల్‌కతా: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు కోల్‌కతాకు చెందిన మొబైల్ గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో శనివారం సోదాలు నిర్వహించారు. దాదాపు రూ.17 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బెడ్‌పై పేర్చిన రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టల ఫొటోను ఈడీ విడుదల చేసింది. అమీర్ ఖాన్, అతడి కుమారుడు నెజార్ అహ్మద్ ఖాన్ కలిసి ‘ఈ–నగ్గెట్స్ పేరిట మొబైల్ గేమింగ్ యాప్ ప్రారంభించారు. వారితోపాటు మరికొందరు ఈ కంపెనీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి చెందిన దాదాపు 6 నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేపట్టామని ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.17 కోట్ల నగదు లభ్యమైందని, నోట్ల కట్టల లెక్కింపు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. ఈ–నగ్గెట్స్ కంపెనీ గేమింగ్ యాప్ ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి, వాటిని తిరిగి వెనక్కి తీసుకొనే అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తోందంటూ ఫెడరల్ బ్యాంకు అధికారులు కోల్‌కతా కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కంపెనీతోపాటు ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు 2021 ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. గేమింగ్ యాప్ కంపెనీ ప్రమోటర్ల నివాసాల్లో ఈడీ సోదాలకు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర మంత్రి ఫిర్హాద్ హకీం చెప్పారు. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఈడీ సొదాలు జరుగుతుండడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్న వ్యాపారవేత్తలపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని నిలదీశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వల్ల బెంగాల్‌కు పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
కమల్ పార్టీ అభ్యర్థి ఇంట్లో రూ.10 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకున్న సమయంలో మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధ్యక్షులు, నటుడు కమల్ హాసన్‌కు సన్నిహితుడు, ఆ పార్టీ అభ్యర్థి, పారిశ్రామికవేత్త ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలుచేశారు. రూ.10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చిరాపల్లి కేకే నగర్లో నివసించే లేరోన్ మొరాయ్సి(45).. సెక్కో ప్రాపర్టీస్ పేరున భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చిరాపల్లి తూర్పు నియోజకవర్గం నుంచి ఎంఎన్ఎం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. సోమవారం ఐటీ అధికారుల బృందం తిరుచ్చిలోని అతని ఇళ్లు, కార్యాలయాలపై దాడులు ప్రారంభించారు. మంగళవారం రోజూ సోదాలు కొనసాగాయి. ఈ తనిఖీల్లో రూ.10 కోట్ల నగదు, రూ.కోట్ల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చెన్నై పల్లవరం వద్ద వాహన తనిఖీలు చేసున్న ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు ఒక కారులో తరలిస్తున్న రూ.4 కోట్ల విలువైన బంగారం, వెండినగలు పట్టుబడ్డాయి. ఈరోడ్‌లో జరిపిన తనిఖీల ద్వారా 4.5 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. -
విశాఖలో భారీగా నగదు పట్టివేత
-
సార్వతిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నగదు జప్తు
-
తమిళనాట పోలీసు కాల్పులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ఓటర్లకు పంచేందుకు దాచిన నగదును అధికారులు స్వాధీనం చేసుకునే క్రమంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. అధికారుల తనిఖీల్లో రూ.1.48 కోట్ల నగదు పట్టుబడింది. ఈ ఘటనలో టీటీవీ దినకరన్‌కు చెందిన అమ్మ మక్కల్ మున్నెట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తమిళనాడులో 38 ఎంపీ స్థానాల పోలింగ్తోపాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ఉన్నాయి. తేని జిల్లా ఆండిపట్టి అసెంబ్లీ స్థానం వాటిలో ఒకటి. ఆండిపట్టిలో ఓటర్లకు పంచేందుకు ఏఎంఎంకే నాయకులు రూ. 2 కోట్లను ఏప్రిల్ 16న పట్టణానికి తీసుకొచ్చి ఓ నేత ఆఫీస్‌లో దాచారు. డబ్బును అనేక ప్యాకెట్లలోకి చేర్చి, ఏ ప్యాకెట్‌ను ఏ వార్డుకు పంపాలో రాశారు. సమాచారం అందుకున్న ఆదాయపు పన్ను విభాగం (ఐటీ), ఎన్నికల సంఘం అధికారులు మంగళవారం పొద్దుపోయాక అక్కడికి చేరుకుని సోదాలు చేసేందుకు ప్రయత్నించారు. ఏఎంఎంకే కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తలు డబ్బు దాచిన కార్యాలయం తలుపులు పగులగొట్టి నగదును తీసుకెళ్లిపోతుండటంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. రూ. 2 కోట్లలో కార్యకర్తలు రూ. 52 లక్షలు తీసుకెళ్లగా, రూ. 1.48 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఏపీవ్యాప్తంగా రూ. 196 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం
-
పొదలకూరులో అక్రమంగా తరలిస్తున్న నగదు స్వాధీనం
-
లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు స్వాధీనం
-
దేశవ్యాప్తంగా ఎన్నికల్లో భారీగా పట్టుబడ్డ నగదు
-
విశాఖ జిల్లాలో భారీగా నగదు పట్టివేత
-
నగదు, మద్యం స్వాధీనం
సాక్షి, వీరఘట్టం (శ్రీకాకుళం): మండలంలోని రేగులపాడు సమీపంలో శుక్రవారం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఆధారాల్లేని రూ.1.50 లక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ జి.సుబ్రహ్మణ్యం పట్టుకున్నారు. వీరఘట్టం మండలం చలివేంద్రికి చెందిన అలజంగి కృష్ణ ఎల్ఐసీ ప్రీమియం కట్టేందుకు ఈ డబ్బులు తీసుకువెళుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు అతని వద్ద లేవని పోలీసులు తెలిపారు. ఈ నగదును పోలీసులకు అప్పజెప్పడంతో ఎస్ఐ జి.అప్పారావు కేసు నమోదు చేశారు. 714 మద్యం బాటిళ్లు సీజ్ సరుబుజ్జిలి: అనధికారకంగా రవాణా జరుగుతున్న మద్యం బాటిళ్లను సరుబుజ్జిలి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. సరుబుజ్జిలి ఎస్ఐ డి.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం సభ్యులు అలికాం–బత్తిలి రహదారిలో తనిఖీలు చేస్తుండా 714 క్వార్టర్ బాటిళ్లు పట్టుకున్నారు. ఎన్నికల్లో పంపిణీ కోసం ఈ మద్యం తరలిస్తున్నట్లు అనుమానం వచ్చి సరకును సీజ్ చేశారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో కానిస్టేబుళ్లు గురుమూర్తి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. నందిగాంలో రూ.68,000.. నందిగాం: ఎన్నికల నిర్వహణలో భాగంగా మండల పరిధిలో కొత్తగ్రహారం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీల్లో అనధికారంగా ఉన్న రూ.68,000 పట్టుబడిందని నందిగాం ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక సిబ్బంది శేషు, దేవదాయశాఖ ఈఓ గురునాథ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపడుతుండగా భువనేశ్వర్ నుంచి జైపూర్ వెళ్తున్న కారులో రూ.68వేలను గుర్తించారన్నారు. కారు యజమాని ఎల్.వి.ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని నగదను స్టేషన్‌కు తరలించామన్నారు. వెంకటాపురంలో రూ.51,500.. లావేరు: మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అనధికారికంగా తీసుకువెళుతున్న రూ.51,500 నగదును అధికారులు పట్టుకున్నారు. చెక్‌పోస్టు ఇన్చార్జి అల్లు సోమేశ్వరరావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం చెక్‌పోస్టు ఇన్చార్జి అల్లు సోమేశ్వరరావు, వీఆర్వో కిరణ్మయి, లావేరు పోలీసులు వాహనాలు తనిఖీ చేపడుతుండగా మండలంలోని బెజ్జిపురం గ్రామానికి చెందిన కోరాడ సాయిబాబు ద్విచక్రవాహనంతో నగదును తీసుకుని వెళుతుండగా తనిఖీల్లో పట్టుబడ్డారన్నారు. నగదు ఎలా వచ్చిందో అధికారులకు సరైన ఆధారాలను వెంటనే చూపించలేదన్నారు. దీనిపై లావేరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇచ్ఛాపురంలో రూ..2,38,500.. ఇచ్ఛాపురం: ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం చెక్‌పోస్టు, ముశ్చింద్ర చెక్‌పోస్టుల వద్ద ఎస్ఎస్టీ, ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీస్ సిబ్బంది శుక్రవారం వాహనాలను తనిఖీ చేశారు. వాహనాల్లో అనధికారంగా తరలిస్తున్న రూ.2,38,500 నగదును పట్టుకున్నారు. ఎస్ఎస్టీ, ఫ్లైయింగ్ స్క్వాడ్ తెలిపిన వివరాల మేరకు పురుషోత్తపురం చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాలోని బరంపూర్ నుంచి కొరాపుట్‌కు బోలెరో వాహనంలో వెళ్తున్న ఉమాశంకర్ సాహు వద్ద రూ.78,000, సుజ్జీవ్సుబిద్ధి వద్ద రూ.52,500, కేసి పాణిగ్రాహి వద్ద రూ.50,000 ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదుకు సంబంధించిన సరైన పత్రాలకు చూపకపోవడంతో సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఎస్టీ ఎం.గణపతి తెలిపారు. ముశ్చింద్ర గ్రామం పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.58,000 నగదును పోలీసీలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశం సీఐ కె.పైడపునాయుడు మాట్లాడుతూ సరైన ఆధారాలు లేకుండా రాజకీయ పార్టీ కరపత్రాలు, జెండాలు తరలించవద్దన్నారు. ఎటువంటి మారణాయుధాలు ఉండరాదన్నారు. పట్టణ ఎస్ఐ సింహాచలం, రూరల్ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏపీ సరిహద్దుల్లో నగదు స్వాధీనం
-
ఏపీ సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టివేత
సాక్షి, చెన్నై: హైదరాబాద్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.53 కోట్ల డబ్బును మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు చెందిన ఆ విభాగం అధికారులు గుమ్మిడిపూండి చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులో రెండు సూట్ కేసుల్లో ఉన్న నోట్ల కట్టలు బయట పడ్డాయి. వాటిని లెక్కించగా రూ.1.53 కోట్లని తేలింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన నీరజ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎవరైనా రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడికి తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. -
వరంగల్ అర్బన్‌లో భారీగా నగదు పట్టివేత
-
ఎన్నికల వేల నగదు పట్టివేత
సాక్షి, జోగులాంబ : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న నగదును తరలిస్తున్నారు. ఐజ మండలంలో తెల్లవారు జామున 5 గంటలకు ప్లైయిండ్ స్క్వాడ్ బృందం చేసిన తనిఖీల్లో ఐదు లక్షలను గుర్తించారు. ఐజ పట్టణానికి చెందిన షాలు అనే వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద ఏ డాక్యుమెంట్స్ లేని ఐదు లక్షలు రూపాయలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బతుకమ్మ చీరెల లారీని అడ్డుకున్న స్థానికులు ఖమ్మం : బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించిన బతుకమ్మ చీరెలను తీసుకెళ్తున్న లారీని స్థానికులు అడ్డుకున్నారు. బతుకమ్మ చీరెలు అని స్పష్టంగా రాసి ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు. కొత్తగూడెం చేరవేయమని చెప్పారని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. చౌటుప్పల్‌లో చీరెలను లోడ్ చేసినట్టు తెలుస్తోంది. -
రూ.33.72 లక్షల నగదు స్వాధీనం
నాగర్‌కర్నూల్ క్రైం/కందనూలు: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని అల్లీపూర్ చెక్‌పోస్టు వద్ద రూ.33.72 లక్షల నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన పల్లీల వ్యాపారి సాంబశివారెడ్డి ఆదివారం అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో ఈ నగదును తీసుకువెళ్తున్నాడు. అల్లీపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. సాంబశివారెడ్డి వాహనం లోని ఓ బ్యాగును తెరిచి చూడగా నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటికి ఎలాంటి రశీదులు చూపకపోవడంతో ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు నగదును స్వాధీనం చేసుకొని రిటర్నింగ్ అధికారి హన్మానాయక్‌కు అందజేశారు. ఈ విషయమై ఇన్‌కంట్యాక్స్ అధికారులు, జిల్లా మానిటరింగ్ కమిటీ, జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇచ్చామని హన్మానాయక్ తెలిపారు. -
190 కోట్ల నగదు.. 400 హ్యాండ్‌బ్యాగ్‌లు
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన అపార్ట్మెంట్లలో పోలీసులు సోదాలు నిర్వహించి దాదాపు రూ.190 కోట్ల (2.86 కోట్ల డాలర్ల) విలువైన నగదు, అత్యంత ఖరీదైన 400 హ్యాండ్‌బ్యాగ్‌లను జప్తు చేశారు. మరెన్నో ఆభరణాలు, చేతి గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఉన్న తీవ్ర అవినీతి ఆరోపణలే తాజా ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం. మలేసియా ప్రభుత్వానికి చెందిన 1ఎండీబీ అనే సంస్థ డబ్బునూ నజీబ్, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు కలసి కాజేశారనే ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో గతవారం రోజుల్లో నజీబ్ ఇల్లు సహా 12 చోట్ల పోలీసులు సోదాలు నిర్వహించారు. -
మట్కా రాకెట్ గుట్టురట్టు: రూ.30 లక్షలు స్వాధీనం
అనంతపురం: జిల్లా కేంద్రమైన అనంతపురంలో మట్కా రాకెట్ గుట్టు రట్టు అయింది. 15మంది నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, ముంబయి, హుబ్లి ప్రాంతాల నుంచి వచ్చి మట్కా నిర్వహిస్తున్నట్లు తమకందిన సమాచారం మేరకు పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ముంబయి, హుబ్లి జూద కంపెనీలపై ఆరా తీస్తున్నామని ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్ చెప్పారు. దీనికి సహకరించే పోలీసులను ఉపేక్షించేది లేదని, మట్కా నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సైబర్ నేరగాడు అరెస్టు
వేంపల్లె :ఏటీఎం నెంబర్లను సేకరించుకొని సెల్ ద్వారా పేటీఎంను ఉపయోగించి ఖాతాలలోని డబ్బులను దొంగలించే సైబర్ నేరగాడు షేక్ శ్రీనివాసులును వేంపల్లె పోలీసులు అరెస్టు చేసి గురువారం కోర్టుకు పంపారు. వివరాలలోకి వెళితే.. కాశినాయన మండలం నరసాపురం గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసులు ఆర్మీలో పనిచేస్తూ వ్యసనాలకు బానిసై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. విజయవాడలో గుర్రపు పందేలు ఆడుతూ డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలయ్యాడు. ఆ తర్వాత ఏటీఎం ద్వారా దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఆంధ్రా బ్యాంకుకు చెందిన ఏటీఎంలలో క్యూలో నిలబడి వారి ఏటీఎం కార్డును సేకరించుకొని సెల్‌ఫోన్ ద్వారా పేటీఎంను ఉపయోగించి ఖాతాలలోని డబ్బులను కాజేస్తూ వచ్చాడు. రాజేష్, ప్రహ్లాద, హరీష్ వేంపల్లెకు చెందిన సైఫుల్లా అనే స్నేహితుల ఏటీఎం నెంబర్ల ద్వారా డబ్బులు కాజేశాడు. ఈనెల 11వ తేదీన వేంపల్లె ఆర్ఎంఎస్ వీధికి చెందిన సైఫుల్లా పిర్యాదు చేయడంతో పోలీసులు గురువారం కడప రోడ్డులోని అగ్రికల్చర్ చెక్‌పోస్టు వద్ద షేక్ శ్రీనివాసులును అరెస్టు చేసి అతని వద్ద నుంచి మూడు ఏటీఎం కార్డులను, రూ.1000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మధుమల్లేశ్వరరెడ్డి తెలిపారు. -
పోలీసులు తనిఖీల్లో రూ. 3.50 లక్షలు స్వాధీనం
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అల్వాల్ లయోల కళాశాల వద్ద గురువారం తునిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు కారులో తరలిస్తున్న రూ. మూడున్నర లక్షల నగదును గుర్తించారు. వాటికి సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో.. పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నికల నేపథ్యంలో సోదాలు 1.26కోట్లు స్వాధీనం
-
మల్లేపల్లిలో ఇంటింటికి సెర్చ్ ఆపరేషన్
హైదరాబాద్ : హైదరాబాద్ మల్లేపల్లి ప్రాంతంలోని మాంగర్ బస్తీలో పోలీసులు అర్థరాత్రి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 350 మంది పోలీసులు 35 బృందాలుగా విడిపోయి ఈ తనిఖీలు కొనసాగించారు. ఇందులో 56 మంది నేర ప్రవృత్తి ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 తులాల బంగారం, రూ.40 వేలు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. -
చర్లపల్లి జైల్లో తనిఖీలు... సెల్ ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల వద్ద 3 సెల్ఫోన్లతోపాటు రూ.1500 నగదు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. సెల్ఫోన్లతోపాటు నగదు పోలీసు ఉన్నతాధికారు స్వాధీనం చేసుకున్నారు. పటిష్టమైన భద్రత, నిఘా ఉండే జైలులో.. ఖైదీల వద్దకు ఇవి ఎలా చేరాయంటూ ప్రశ్నించారు. దాంతో జైలు అధికారులు నీళ్లు నమిలారు. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని సదరు అధికారులను పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. -
కడపలో రూ. 13 లక్షలు స్వాధీనం
కడప నగరంలోని కోటిరెడ్ది సర్కిల్ వద్ద గురువారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్నోవా కారులో తరలిస్తున్న రూ.13 లక్షల నగదుతోపాటు 20 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నగదుతోపాటు వెండిని పోలీసులు సీజ్ చేసి కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న నగదుపై పోలీసులు కారు డ్రైవర్‌ను ప్రశ్నించారు. అతడు పొంతన లేని సమాధానాలు వెల్లడించాడు. దాంతో పోలీసులు డ్రైవర్‌ను అదుపుకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
ఓటర్లను ప్రలోభపెడుతున్న జేసీ వర్గీయులు అరెస్ట్
అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో ఓటర్లను టీడీపీ ప్రలోభపెడుతుంది. ఆదివారం ఓటర్లను డబ్బు పంపిణీ చేస్తున్న మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ వర్గానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.60 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును సీజ్ చేసి, ముగ్గురు జేసీ వర్గీయులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. అలాగే చిత్తూరు జిల్లా సదూం మండలం జోగివారిపల్లిలో తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటర్ల కు నగదు పంచుతున్న ముగ్గురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.75 వేలు స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా సంజామల మండలం రాంరెడ్డిపల్లిలో ఓటర్లకు డబ్బు పంచుతున్న టీడీపీ చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. -
ఆ డబ్బుకు అన్ని లెక్కలున్నాయి: పార్థసారధి
తన భార్య వద్ద స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి అన్ని లెక్కలు ఉన్నాయని మాజీ మంత్రి కె.పార్థసారథి వెల్లడించారు. ఆయన శుక్రవారం విజయవాడలో మాట్లాడుతూ... ఎన్నికల నిబంధనల ప్రకారం లోక్‌సభ అభ్యర్థి రూ. 70 లక్షలు వరకు ఖర్చు చేసుకోవచ్చని వివరించారు. ఎన్నికల ఖర్చు కోసం కార్పొరేట్ బ్యాంక్ అకౌంట్లో కొంత మొత్తం నగదు జమ చేయాలని, మరి కొంత మొత్తాన్ని సొంతంగా నిర్వహిస్తున్న కనస్ట్రక్షన్ కోసం చేసిన బకాయిలు చెల్లించడానికి తీసుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా పార్థసారథి సతీమణి కమల హైదరాబాద్ నుంచి నగదుతో విజయవాడకు బయలుదేరారు. వనస్థలిపురం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా కమల వద్ద ఉన్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను వ్యక్తిగత పూచికత్తుపై విడిచిపెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి కె.పార్థసారథి మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. -
రూ. 3.25 కోట్లు స్వాధీనం: అనంత ఎస్పీ
అనంతపురం పరగి చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కారులో తరలిస్తున్న రూ. 9 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఎన్నికలు నేపథ్యంలో ఇప్పటి వరకు పోలీసుల తనిఖీలలో రూ. 3.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అనంత జిల్లా ఎస్పీ సెంథిల్‌కుమార్ వెల్లడించారు. అలాగే 1100 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 4 బాంబులు, 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం సమస్యగా మారిందన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా అవుతోందని ఆ సమస్యను త్వరలో నిరోధించేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లాకు మరో 5 వేల మంది అదనపు పోలీసు సిబ్బంది అవసరం ఉందని సెంథిల్‌కుమార్ తెలిపారు.