
సాక్షి, జోగులాంబ : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్రమంగా తరలిస్తున్న నగదును తరలిస్తున్నారు. ఐజ మండలంలో తెల్లవారు జామున 5 గంటలకు ప్లైయిండ్ స్క్వాడ్ బృందం చేసిన తనిఖీల్లో ఐదు లక్షలను గుర్తించారు. ఐజ పట్టణానికి చెందిన షాలు అనే వ్యక్తి వాహనాన్ని తనిఖీ చేయగా అతని వద్ద ఏ డాక్యుమెంట్స్ లేని ఐదు లక్షలు రూపాయలను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
బతుకమ్మ చీరెల లారీని అడ్డుకున్న స్థానికులు
ఖమ్మం : బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించిన బతుకమ్మ చీరెలను తీసుకెళ్తున్న లారీని స్థానికులు అడ్డుకున్నారు. బతుకమ్మ చీరెలు అని స్పష్టంగా రాసి ఉన్నట్టు స్థానికులు పేర్కొన్నారు. కొత్తగూడెం చేరవేయమని చెప్పారని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. చౌటుప్పల్‌లో చీరెలను లోడ్ చేసినట్టు తెలుస్తోంది.