పోలింగ్‌కు మరో రెండు రోజులే.. కోట్లలో పట్టుబడుతున్న నోట్ల కట్టలు  | 724 Crore In Cash Gold Liquor Seized ahead Of Assembly Elections | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు మరో రెండు రోజులే.. కోట్లలో పట్టుబడుతున్న నోట్ల కట్టలు 

Nov 28 2023 12:06 PM | Updated on Nov 28 2023 12:53 PM

724 Crore In Cash Gold Liquor Seized ahead Of Assembly Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు నేటితో(నవండర్‌ 28) ముగియనుంది. మరో రెండు రోజుల్లో పోలింగ్‌ జరనుంది.  ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరిన వేళ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతోంది. ఐటీ, ఈసీ అధికారులు, రాష్ట్ర పోలీసులు చేపట్టిన తనిఖీలల్లో రోజూ కోట్లలో సొమ్మును స్వాధీనం చేసుకుంటున్నారు.

పార్టీ నేతలు, వారి అనుచరులు డబ్బులు పంచుతూ.. దొరికిపోతున్నారు. నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ. 724 కోట్ల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 292 కోట్ల నగదు రూపంలో పట్టుబడగా.. రూ.122 కోట్ల విలువ చేసే మద్యం, రూ. 40 కోట్ల డ్రగ్స్, రూ. 186 కోట్ల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక చివరి రెండు రోజుల్లో నేతలు డబ్బు పంపిణీ మరింత చేయనున్నారు.
చదవండి: ఆటో డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌తో రాహుల్‌ మాటామంతి

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ తరుపున డబ్బులు పంచుతూ ఓ పోలీస్‌ అధికారి పట్టుబడ్డారు. పట్టుబడ్డ పోలీస్‌ అధికారి కారులో రూ, 6 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. కారులోఉన్న నోట్ల కట్టలను ఆర్‌వో స్వాధీనం చేసుకున్నారు. 

ఇక మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతూ మల్లారెడ్డి కళాశాల సిబ్బంది, కళాశాల విద్యార్థులు దొరికిపోయారు. మల్లారెడ్డి కాళాశాల సిబ్బంది, విద్యార్థ/లు ఇంటింటికి తిరుగుతూ డబ్బులు పంపిణి చేస్తుండగా.. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని సంబంధిత అధికారులకు అప్పగించారు. పట్టుబడిన సొమ్మును మంత్రి మల్లారెడ్డికి చెందినదిగా అనుమానిస్తున్నారు.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement