సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 1 వరకు పోలీసు బృందాల తనిఖీల్లో మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.103 కోట్ల నగదు పట్టుబడగా ఈసారి ఎన్నికల నగదు స్వాదీనంలో 248 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 11,859 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment