inspection of vehicles
-
మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. రాష్ట్రంలో అక్టోబర్ 9న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్ 1 వరకు పోలీసు బృందాల తనిఖీల్లో మొత్తం రూ.241.52 కోట్ల నగదు స్వాదీనం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.103 కోట్ల నగదు పట్టుబడగా ఈసారి ఎన్నికల నగదు స్వాదీనంలో 248 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు శనివారం డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై మొత్తం 11,859 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
తనిఖీల్లో రూ.3.80 కోట్లు స్వాధీనం
,హైదరాబాద్: వాహనాల తనిఖీల్లో భాగంగా శుక్రవారం పోలీసులు ఎర్రగడ్డప్రాంతంలో కారులో తరలిస్తున్న రూ.3.80 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి సిబ్బందితో కలసి ఉదయం భరత్‌నగర్ చౌరస్తాలో తనిఖీలు చేశారు. అక్కడ కారును ఆపి సోదా చేయగా అక్రమంగా తరలిస్తున్న రూ.3.80 కోట్లు లభించాయి. డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల పరిశీలకులు శంకర్‌కు అప్పగించామని ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా, కారులో తీసుకువెళుతున్న నగదు ఎస్బీఐ బ్యాంక్‌కు చెందినదని, ఆధారాలు చూపితే తిరిగి ఇస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు