వాహనాల తనిఖీల్లో భాగంగా శుక్రవారం పోలీసులు ఎర్రగడ్డప్రాంతంలో కారులో తరలిస్తున్న రూ.3.80 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.
,హైదరాబాద్: వాహనాల తనిఖీల్లో భాగంగా శుక్రవారం పోలీసులు ఎర్రగడ్డప్రాంతంలో కారులో తరలిస్తున్న రూ.3.80 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సనత్‌నగర్ ఇన్స్‌పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి సిబ్బందితో కలసి ఉదయం భరత్‌నగర్ చౌరస్తాలో తనిఖీలు చేశారు. అక్కడ కారును ఆపి సోదా చేయగా అక్రమంగా తరలిస్తున్న రూ.3.80 కోట్లు లభించాయి.
డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల పరిశీలకులు శంకర్‌కు అప్పగించామని ఇన్స్‌పెక్టర్ తెలిపారు. కాగా, కారులో తీసుకువెళుతున్న నగదు ఎస్‌బీఐ బ్యాంక్‌కు చెందినదని, ఆధారాలు చూపితే తిరిగి ఇస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు