erragadda
-
సామాన్యులకు సందడి.. ఆదివారం అంగడి..
నగరంలోని ఆదివారం అంగడికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది ఎర్రగడ్డ మార్కెట్. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ షాపింగ్ చేసేలా కాటుక బరణి నుంచి కార్ టైర్ల వరకూ అన్నీ లభ్యమవుతాయి. దీంతో ఈ మార్కెట్‌కు రాను రానూ క్రేజ్ పెరిగిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంత సామాన్యులు, మధ్యతరగతి పాలిట ‘సంత’సాన్ని నింపుతోంది. ఈ ఓపెన్ మాల్.. శ్రీమంతులకు ఆటవిడుపు.. ఆదివారం సూర్యోదయం కాకమునుపే ‘గిట్టుబాటు’ అంకెలను గుక్కతిప్పుకోకుండా పలకడంలో అక్కడ వ్యాపారులు పోటీపడుతుంటారు. ఆ రోజు అందరికీ సెలవు. కానీ, వారికి ఈ సెలవు రోజే బతుకు దెరువు. ఎర్రగడ్డ చౌరస్తా మొదలు.. ఫతేనగర్ ఫ్లైఓవర్ వరకూ విస్తరిస్తూ పోతోంది..దీని గురించిన మరిన్నివివరాలు.. – సనత్నగర్శతాబ్దం కాలం క్రితం 15–20 దుకాణాలతో మొదలైన సంత నేడు దాదాపు వెయ్యి మంది చిరువ్యాపారులకు బతుకుదెరువుకు కేంద్రంగా మారింది. రోడ్డే ఈ సంతకు అడ్డా. నాడు ఎర్రగడ్డ చౌరస్తాకే పరిమితమైన వ్యాపారాలు నేడు కిలోమీటరు పొడవున తమ షాపులను విస్తరించారు. చౌరస్తా నుంచి మొదలుకొని సనత్‌నగర్ బస్టాండ్ వరకూ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఆల్ ఇన్ వన్ అంగడి.. చిన్నా.. పెద్దా మాల్ అనే తేడా లేదు.. వాటిల్లో ఉండే ప్రతి వస్తువూ ఇక్కడ లభ్యమవుతోంది. స్రూ్కడ్రైవర్ నుంచి సూట్‌కేస్ వరకూ.. రెడీమేడ్ దుస్తుల నుంచి రేబాన్ గ్లాసెస్ వరకూ, వంటింటి పాత్రల నుంచి వయ్యారాలు ఒలకబోసే అందమైన ఆట»ొమ్మల వరకూ, నాటి గ్రామ్‌ఫోన్‌ల నుంచి నేటి స్మార్ట్ఫోన్ల వరకూ.. ఇలా ప్రతిదీ ఈ సంతలో దొరుకుతాయి. ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు ఈ మార్కెట్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎరగ్రడ్డ–సనత్‌నగర్ మార్గం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతూ సందడిగా మారుతోంది.‘సెకండ్స్’కు పెట్టింది పేరు.. ఎర్రగడ్డ సంత అంటే వస్తువులు ‘సెకండ్స్’లో అమ్ముడుపోతాయన్నది వ్యాపార వర్గాలతో పాటు వినియోగదారుల నుంచి వినిపించే మాట. షర్టులు, ఫ్యాంట్లు, గొడుగులు, సీడీలు, ఎలక్ట్రికల్, ఐరన్ వస్తువులు.. ఇలా ఎన్నో రకాల వస్తువులు సెకండ్ హ్యాండ్లో లభిస్తాయి. ఇక ప్రొక్లెయినర్ నుంచి మొబైల్ ఫోన్ వరకూ.. ఎలాంటి యంత్రాలు, వస్తువులకైనా కావాల్సిన విడి భాగాలు (స్పేర్‌పార్ట్స్)కు ఈ సంత ఫేమస్. అందుకే ఎర్రగడ్డ సంతకు ఇంత క్రేజ్. నగరం నలుమూలల నుంచి..కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, అమీర్‌పేట నుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి ఈ మార్కెట్‌ను సందర్శించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుని మరీ వెళ్తుంటారు. ప్రతి వారం 30–40 వేల మంది వినియోగదారులు ఈ మార్కెట్‌ను సందర్శిస్తుంటారని ఓ అంచనా. సీజనల్ వ్యాపారాలకు ఊపునిస్తూ..చలికాలం మొదలైతే ఇక్కడ స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మఫ్లర్లు, షాల్స్ అమ్మకాలు భారీగా జరుగుతాయి. ధాన్యపు రాశులు పోసినట్లు రోడ్లపై గుట్టలు పోస్తారు. వర్షాకాలంలో రెయిన్ కోట్లు, రంగురంగుల గొడుగులతో మార్కెట్ నిండిపోతుంది. వేసవి వచి్చందంటే కాటన్ దుస్తుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి.వందేళ్ల చరిత్రకు సాక్ష్యం..రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ వందేళ్ల చిత్రకు సాక్ష్యంగా ఇక్కడ మార్కెట్ నిలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వరకూ పశువుల సంత కూడా ఇక్కడే జరిగేది. వివిధ జిల్లాల నుంచి విభిన్న జాతుల ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను, వివిధ రకాల పంటలను రైతాంగం ఇక్కడ క్రయవిక్రయాలు జరిపేది. అయితే నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఇక్కడి పశువులను సంతను మోతీనగర్ సమీపంలోని బబ్బుగూడకు తరలించారు. సాధారణ మార్కెట్ మాత్రం ఇక్కడే కొనసాగుతూ వస్తోంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు..వివిధ జాతులకు చెందిన పిల్లులను తెచ్చి అమ్ముతుంటాను. ఎప్పటికప్పుడు తన వద్దకు వచ్చే కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు పెంపుడు జంతువులు తెస్తుంటాం. ఆదివారం వచి్చందంటే ఇక్కడ వ్యాపారం తప్పనిసరి. ఇదే మా కుటుంబ పోషణ.– ఖాన్, వ్యాపారిస్పేర్ పార్ట్స్ కోసం.. మొబైల్ ఫోన్‌కు అవసరమైన స్పేర్‌పార్ట్స్ కోసం ఎల్బీనగర్ నుంచి వచ్చా. ఇక్కడ మార్కెట్లో ఏది కావాలన్నా దొరుకుతుంది.. మొదటిసారి ఇక్కడికి రావడంతో ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కొనుగోలు చేసే ప్రతి వస్తువునూ ఇక్కడ చూశాను. – మహేష్ ఎల్బీనగర్ -
Hyderabad: 90 రోజులు ట్రాఫిక్ మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: బాలానగర్ పరిధిలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో నాలా పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు 65వ జాతీయ రహదారి మీదుగా నాలా పనుల నిమిత్తం.. బాలానగర్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 28 నుంచి జూన్ 28 వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. కూకట్పల్లి నుంచి అమీర్‌పేట, బేగంపేట వైపు, బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట్ వైపు, మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డు నుంచి అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలను మళ్లించనున్నట్లు బాలానగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరహరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ►కూకట్పల్లి నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలు కూకట్పల్లి మెట్రో రైల్ స్టేషన్ వద్ద యూ టర్న్ తీసుకుని ఐడీఎల్ లేక్ రోడ్డు, గ్రీన్‌హిల్స్ రోడ్డు, రెయిన్బో విస్టాస్, ఖలాపూర్ ఫ్లైఓవర్, పర్వతనగర్, టాడీ కాంపౌండ్, కావూరిహిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాలి. ►కూకట్పల్లి నుంచి బేగంపేట వైపు వెళ్లే ట్రాఫిక్‌ను కూకట్పల్లి వై జంక్షన్లో బాలానగర్ ఫ్లైఓవర్, న్యూ బోయిన్పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట ఫ్లై ఓవర్ మీదుగా మళ్లిస్తారు. ►బాలానగర్ నుంచి కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను బాలానగర్ ఫ్లైఓవర్ కింద, న్యూబోయిన్‌పల్లి జంక్షన్, తాడ్‌బండ్, ప్యారడైజ్ జంక్షన్, బేగంపేట్ ఫ్లైఓవర్, అమీర్‌పేట్ నుంచి మళ్లిస్తారు. ►మూసాపేట, గూడ్స్ షెడ్ నుంచి అమీర్‌పేట వైపు వెళ్లే వాహనాలను మళ్లిస్తారు ఐడీఎల్ లేక్ రోడ్, గ్రీన్ హిల్స్ రోడ్, రెయిన్బో విస్టాస్, ఖైత్లాపూర్ ఫ్లైఓవర్, పర్వత్‌నగర్, టోడీ కాంపౌండ్, కావూరి హిల్స్, నీరూస్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, యూసుఫ్‌గూడ రోడ్, మైత్రివనం, అమీర్‌పేట్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. -
HYD: పైసల్లేవ్.. మెట్రో స్టేషన్ నుంచి దూకేసింది!
సాక్షి, హైదరాబాద్: సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పెద్దావిడ మంగళవారం రాత్రి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అది గమించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలిని మారెమ్మ(70)గా గుర్తించారు. ఆమె స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ గ్రామంగా తేలింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళ మృతదేహాని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే మారెమ్మ చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
హైదరాబాద్: ఇంట్లో చెప్పకుండా కారుతో బయటకొచ్చిన బాలుడు.. అంతలోనే!
సాక్షి, అమీర్‌పేట: ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది.ఓ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్ సమీపంలోని జనచైతన్య అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న బాలుడు(17) ఇంట్లో ఎవరికి చెప్పకుండా కారు తీసుకుని వేగంగా రోడ్డుపైకి వచ్చాడు. ఈ క్రమంలో ముందుగా వెళుతున్న ఇద్దరు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. వారు కింద పడిపోవడంతో ఓ మహిళ కాలు విరిగింది. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదులు తెలిపారు. చదవండి: బోనాల జాతరలో పరిచయం.. జోగిని శ్యామలపై పాతబస్తీ మౌనిక వేధింపులు -
కొండెక్కిన కూరగాయల ధరలు
-
అనుమానం..పెనుభూతం
అమీర్‌పేట: మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో ఓ మహిళ భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ న్యూ సుల్తాన్ నగరన్‌లో గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి చెందిన భైరయ్య (33), స్వర్ణ దంపతులకు 2013 వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. యురేకా ఫోబ్స్‌లో పనిచేసే భైరయ్య కుటుంబంతో కలిసి సుల్తాన్ నగర్లో ఉంటున్నాడు. కాగా భైరయ్యకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని స్వర్ణ అనుమానం పెంచుకుంది. ఈ విషయమై తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి కూడా వారు గొడవపడ్డారు. అర్థరాత్రి నిద్రపోతున్న బైరయ్య తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేసింది. ఉదయం సమీపంలో ఉన్న బైరయ్య స్నేహితుడు శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన స్వర్ణ తన భర్తకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరింది. అక్కడికి వచ్చిన శ్రీకాంత్ రక్తపు మడుగులో పడి ఉన్న బైరయ్యను చూచి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అప్పటికే భైరయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వర్ణపై హత్య కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్ ఎర్రగడ్డలో రోడ్డు ప్రమాదం
-
వివాహితపై కత్తితో దాడి
హైదరాబాద్: వివాహితను ప్రేమ పేరుతో వేధించిన ఓ ఉన్మాది నడిరోడ్డులో ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. వేధింపులపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కక్షతో అతగాడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సనత్‌నగర్ స్వామి థియేటర్ సమీపంలోని సుభాష్‌నగర్‌కు చెందిన స్రవంతి అలియాస్ సంతు(24), హిమాయత్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ యాదగిరి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందు నుంచి ఈమెకు తమ పక్కింట్లో ఉండే రవికుమార్‌తో పరిచయం ఉంది. వివాహానంతరం కూడా రవి పలుమార్లు హిమాయత్‌నగర్ వెళ్లి స్రవంతిని కలిసేవాడు. దీంతో ఆమె భర్త యాదగిరి.. రవి కుటుంబీకుల వద్ద అభ్యంతరం తెలిపాడు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రెండుసార్లు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయని పోలీసులు రవిని ఠాణాకు పిలిపించి మందలించి పంపారు. మరింత రెచ్చిపోయి.. తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కక్షతో రవి మరింత రెచ్చిపోయి స్రవంతిని వేధించడం మొదలెట్టాడు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్రవంతి ఎర్రగడ్డ రాగా ఆమెను వెంబడిస్తూ వచ్చాడు. ఇది గమనించిన స్రవంతి స్నేహితురాలు సునీతకు ఫోన్ చేసి రవి వెంబడిస్తున్నాడని, వచ్చి తనను తీసుకువెళ్లాలని కోరింది. దీంతో సునీత తన ద్విచక్ర వాహనంపై ఎర్రగడ్డకు వచ్చింది. ఇద్దరూ రైతుబజార్ ఎదురుగా ఉండగా.. అక్కడికి వచ్చిన రవి ఆమెను తన వాహనంపై కూర్చోవాలంటూ ఒత్తిడి చేశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రవి అక్కడే ఉన్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో స్రవంతిపై దాడి చేశాడు. మెడ, తల, చేతిపై విచక్షణారహితంగా నరికాడు. స్థానికులు రవిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలపాలైన స్రవంతిని తొలుత సమీపంలోని సెయింట్ థెరిసా ఆస్పత్రికి, అక్కడ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్రవంతికి ప్రాణాపాయం లేదని గాంధీ వైద్యులు తెలిపారు. ఆమె తలపై ఒకటి, మెడపై రెండు, ఎడమ చేతిపై నాలుగు కత్తి వేట్లు ఉన్నాయని, చేతిపై బలంగా తలగడంతో చేయి వేలాడుతోందని చెప్పారు. మొత్తం 30 కుట్లు వేసిన వైద్యులు తలపై గాయానికి సంబంధించి న్యూరో సర్జన్ల అ«భిప్రాయం తీసుకోవాలని నిర్ణయించారు. -
రణరంగంగా ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆస్పత్రి
-
వడ్డీ కట్టండంలేదని దాడి,మహిళ మృతి
-
ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ఉదయం తనిఖీ చేశారు. ఒక్కో వార్డును, వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించామని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
ఎర్రగడ్డ టీబీ ఆస్పత్రిలో దారుణం
-
ఎర్రగడ్డలో రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి
హైదరాబాద్ : ఎర్రగడ్డ సమీపంలోని రహదారిపై బుధవారం రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న స్కూటర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చి... లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. వెనక కూర్చున వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఎర్రగడ్డ’లోనే..
కొత్త సచివాలయ నిర్మాణంపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం * ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మాణం * మానసిక చికిత్సాలయ స్థలంలో అసెంబ్లీ, మండలి * రెండూ ఒకే భవనంలో.. మధ్యలో సెంట్రల్ హాల్ * సచివాలయంలో తూర్పుముఖంగా సీఎం కార్యాలయం * ఢిల్లీలోని సౌత్, నార్త్ బ్లాక్ తరహాలో నిర్మాణం * రెండువైపులా మంత్రులు, అధికారుల కార్యాలయాలు * పక్షంలో తెలంగాణ సంప్రదాయ ఆకృతిలో నమూనా సిద్ధం * ఆ వెంటనే టెండర్ల కసరత్తు... వీలైనంత తొందరలో పనులు * ఆర్ అండ్ బీ అధికారులతో ఆర్కిటెక్ట్ హఫీజ్ సిబ్బంది భేటీ సాక్షి, హైదరాబాద్ కొత్త సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి ప్రాంగణంలోనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. ఆ ఆసుపత్రిని ఆనుకునే ఉన్న మానసిక వ్యాధుల చికిత్సాలయ స్థలాన్ని కూడా సేకరించి అందులో శాసనసభ, శాసనమండలి భవనాలను నిర్మించాలని కూడా నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ మేరకు పచ్చజెండా ఊపారు. దాంతో ఈ నిర్మాణాలను చేపట్టేందుకు అవసరమైన చర్యలను అధికారులు ప్రారంభించారు. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చేలా భవన నమూనాలను రూపొందించనున్నారు. వీటిని ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సిద్ధం చేయనున్నారు. ఆయన సంస్థకు చెందిన సభ్యులు బుధవారం రోడ్లు భవనాల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. మొత్తం ఎన్ని విభాగాలు, ఎంతమంది సిబ్బంది, ఎన్ని వాహనాల సామర్థ్యంతో కూడిన పార్కింగ్ అవసరం, అసెంబ్లీ, మండలి అవసరాల వంటి వివరాలు సేకరించారు. ఈ విషయంలో హఫీజ్‌కు గతంలోనే సీఎం స్వయంగా దిశానిర్దేశం చేశారు. అప్పట్లో హఫీజ్ మూడు డిజైన్లు రూపొందించగా వాటికి ఆయన కొన్ని మార్పులు సూచించారు. ఆ మేరకు పక్షం రోజుల్లో కొత్త నమూనాలు రూపొందించనున్నారు. వాటికి సీఎం ఆమోదం లభిస్తే ఆ వెంటనే టెండర్ల ప్రక్రియ మొదలు పెడతారు. నెల రోజుల్లో పనులకు శ్రీకారం చుట్టాలని యంత్రాంగం భావిస్తోంది. విమర్శలకు వెనకడుగు... మళ్లీ అదే వేగం... ప్రస్తుత సచివాలయానికి భయంకరమైన వాస్తుదోషం ఉందని సీఎం గతంలో స్వయంగా పేర్కొనడం తెలిసిందే. విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దాంతోపాటు కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండాలనే ఉద్దేశాన్ని కూడా వ్యక్తీకరించారు. ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించి ఆ స్థలంలో కొత్త సచివాలయం నిర్మించే అంశాన్ని తెరపైకి తెచ్చారు. దానిపై తీవ్ర విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమయ్యాయి. ప్రస్తుత సచివాలయం బాగా ఉన్నప్పటికీ వాస్తు పేరుతో కొత్తది నిర్మించడమంటే ప్రజాధనాన్ని వృథా చేయడమేనంటూ విపక్షాలతో పాటు సాధారణ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవడంతో అప్పట్లో సీఎం దాన్ని పక్కనపెట్టేశారు. ఈ లోపు సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో మైదానాన్ని పరిశీలించారు. కానీ, దానికి మార్కెట్ ధర ప్రకారం డబ్బులివ్వాలని రక్షణ శాఖ కోరడంతో దాన్ని పక్కన పెట్టారు. తర్వాత ఆయన ఇక కొత్త సచివాలయం మాటే ఎత్తకపోవడంతో తరలింపు యోచనను విరమించుకున్నారని భావించారు. కానీ సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలని తుది నిర్ణయం తీసుకున్నట్టు ఇటీవల రోడ్లు భవనాల శాఖ అధికారులతో బడ్జెట్ సమీక్ష సందర్భంగా వారికి వెల్లడించారు. ఆ వెంటనే హఫీజ్ సిబ్బంది వచ్చి డిజైన్ల రూపకల్పనకు రంగంలోకి దిగారు. నిర్మాణాలిలా... - దాదాపు 48 ఎకరాల స్థలంలో విస్తరించిన ఛాతీ వ్యాధుల ఆసుపత్రి స్థలంలో దాదాపు 8 అంతస్తులతో సచివాలయ భవనం నిర్మిస్తారు. ఢిల్లీలో కేంద్రప్రభుత్వ సచివాలయ భవనం తరహాలో సౌత్, నార్త్ బ్లాక్ తరహాలో నిర్మాణం ఉంటుంది. మధ్యలో తూర్పుముఖంగా సీఎం కార్యాలయం ఉంటుంది. దానికి రెండు వైపులా ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాలుంటాయి. సీఎం కార్యాలయం ఎదురుగా ఉద్యానవనాలతో కూడిన ఖాళీ స్థలముంటుంది. ప్రతి శాఖకు సంబంధించిన మంత్రీ, కార్యదర్శీ, సంబంధిత సిబ్బందీ అంతా ఒకేచోట ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. - ఛాతీ ఆస్పత్రి పక్కనే ఉన్న మానసిక చికిత్సాలయం తాలూకు 40 ఎకరాల స్థలంలో అసెంబ్లీ, మండలి కోసం ఒకే భవనం నిర్మిస్తారు. వాటిని అనుసంధానిస్తూ సెంట్రల్ హాల్ నిర్మిస్తారు. -
ఛాతీ, టీబీ ఆస్పత్రి తరలింపు అడ్డుకోండి
వాస్తు కారణంతో తరలింపు అన్యాయం హైకోర్టులో నాగం జనార్దన్‌రెడ్డి, జెడ్సన్ వేర్వేరు పిటిషన్లు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని రంగారెడ్డి జిల్లా అనంతగిరికి తరలించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో బుధవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ ఆస్పత్రిని తరలించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని, 2008లో నిర్ణయించిన విధంగా ఎర్రగడ్డలో టీచింగ్ హాస్పిటల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, వరంగల్ జిల్లాకు చెందిన బక్కా జెడ్సన్ వేర్వేరుగా ఈ వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఇందులో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్యవిద్య డెరైక్టర్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ెప్రజలకు అందుబాటులో ఉన్న ఛాతీ, టీబీ ఆస్పత్రిని 75 కిలోమీటర్ల అవతలకు తరలించేందుకు ప్రభుత్వం గతనెల 27న జీవో కూడా జారీ చేసిందని, ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకమని వారు తెలిపారు. ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో 750 బెడ్లతో టీచింగ్ ఆస్పత్రి, 150 మంది విద్యార్థులతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు 2008లో అప్పటి ముఖ్యమంత్రి ప్రకటించారని నాగం తన పిటిషన్లో వివరించారు. అదే సమయంలో ఆస్పత్రిని తరలించాలని యోచించిన అప్పటి ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి వచ్చిన నిరసనతో విరమించుకుందని తెలిపారు. వాస్తు కారణాలతో ఈ ఆస్పత్రి స్థలంలో సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఈ నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఛాతీ, టీబీ ఆస్పత్రికి వచ్చే రోగులకు గుండె, న్యూరో, కిడ్నీ తదితర విభాగాల్లో వైద్య నిపుణుల అవసరం కూడా ఉంటుందని, దీన్ని తరలిస్తే రోగులు ఇబ్బంది పడతారని జెడ్సన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ రెండు వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చే అవకాశాలున్నాయి. సీఎం కేసీఆర్ అలా చెప్పడం వెనుక కుట్ర టీబీ ఆసుపత్రి నగరం నడిబొడ్డున ఉండొద్దని, మారు మూల ప్రాంతంలో ఉంటే ప్రశాంతంగా ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పడం వెనుక కుట్ర ఉందని నాగం ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రిలోనే మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పేద రోగులపై వైఎస్‌కు ఉన్న ప్రేమ కేసీఆర్‌కు లేదని వ్యాఖ్యానించారు. -
ఎర్రగడ్డపాలు కావద్దు
సర్కార్‌పై పొన్నాల ధ్వజం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అనుభవరాహిత్యం, అవగాహనా లోపంతో కేసీఆర్ ప్రభుత్వం ఎర్రగడ్డ పాలు కావద్దని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హితవు పలికారు. తాను ఈ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నవి కావని, ప్రజా శ్రేయస్సును కాంక్షించి చెప్తున్న మాటలన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ, సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించడంపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఉద్యమాలతోనే ప్రభుత్వం ఫాస్ట్ పథకంపై వెనక్కి తగ్గిందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు భయపడే 421 జీఓను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని కార్యకర్తలు తమ దృష్టికి తెచ్చారన్నారు. పార్టీకి దూరమైన వారిని తిరిగి కలుపుకొనిపోయి బలోపేతం చేస్తామన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యల పట్ల నిలబడి పోరాడుతుందన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే మూడవ ఆర్థికశక్తిగా అవతరించేలా చేసింది, కాడెద్దుగా నడుస్తున్న వ్యవస్థను మంగళ్యాన్ వరకు తీసుకొనిపోయింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. పార్టీకి దూరమైన వారిని తిరిగి కలుపుకొనిపోయి, వారి భాగస్వామ్యంతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకే జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని అధినాయకత్వానికి పంపుతామన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తరచుగా మీడియాకెక్కడం మంచిదికాదని కార్యకర్తలంటున్నారని, పార్టీలోని కొందరు పెద్దలు దీన్ని పాటించాలని పరోక్షంగా వి.హన్మంతరావు, దానం నాగేందర్‌లాంటి నాయకులనుద్దేశించి పొన్నాల అన్నారు. -
ఎర్రగడ్డకు సచివాలయం?
వేగంగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ⇒ టీబీ ఆసుపత్రిని అనంతగిరికి తరలిస్తూ ఉత్తర్వులు ⇒ ఖాళీ అయిన స్థలంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి యోచన ⇒ నిర్మాణ డిజైన్లపై అధికారులతో సీఎం సమీక్ష ⇒ ఎనిమిది బ్లాక్‌లతో అధునాతన భవనాలు నిర్మించాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం నెరవేరుతుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ క్షయ (టీబీ), ఛాతీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి క్షయ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం రూ.7.70 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇదేరోజున సచివాలయం తరలింపుపై ఆర్అండ్బీ అధికారులతో సీఎం సమీక్ష జరపటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రస్తుత సచివాలయం దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఎర్రగడ్డ టీబీ ఆసుపత్రి 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయ సముదాయాన్ని ఎర్రగడ్డలో ఖాళీ చేయనున్న టీబీ ఆసుపత్రికి తరలించేందుకు గల సాధ్యాసాధ్యాలను ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎలా ఉండాలి.. అందులో ఎన్ని బ్లాక్‌లుండాలి.. ఎన్ని అంతస్తులుండాలి అనే వివరాలను సైతం సీఎం చర్చించినట్లు సమాచారం. సీఎం ఆఫీసుకు ప్రత్యేక బ్లాక్... తాజా ప్రతిపాదనల ప్రకారం కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయిస్తారు. ఏడు నుంచి ఎనిమిది అంతస్థుల భవనంలో సీఎం బ్లాక్ ఉంటుంది. మంత్రులకు సంబంధించి ఆరు నుంచి ఎనిమిది బ్లాక్‌లు నిర్మిస్తారు. ఒక్కో మంత్రికి రెండు అంతస్థులు కేటాయించాలనేది ప్రతిపాదన. మంత్రి కార్యాలయంతో పాటు ఆ విభాగపు కార్యదర్శి, ఉన్నతాధికారులు, విభాగపు సిబ్బంది అందులో ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 మంది మంత్రులున్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మంత్రుల సంఖ్య దాదాపు 22 వరకు పెరగనుంది. వీరికి తోడు ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి రెండు అంతస్తుల చొప్పున మొత్తం 56 అంతస్తులు నిర్మించాల్సి ఉంటుంది. అందుకే ఏడు లేదా ఎనిమిది బ్లాక్‌లుగా బహుళ అంతస్తుల సముదాయం నిర్మించాలనేది తాజా ప్రతిపాదన. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను 1888లో ఆరో నిజాం కాలంలో నిర్మించారు. సైఫాబాద్ ప్యాలెస్‌గా అప్పట్లో ప్రసిద్ధి పొందిన ఈ భవనాలను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునర్నిర్మించారు. ఈ ప్రాంతం ‘హార్ట్ ఆఫ్ ది ట్విన్ సిటీస్’గా పేరొందిన నేపథ్యంలో ఇది అత్యంత ఖరీదైన స్థలం అనడంలో సందేహం లేదు. తొలి బడ్జెట్లోనే భూముల అమ్మకం ద్వారా దాదాపు రూ.6500 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలి ప్రయత్నంగా సెక్రటేరియట్‌ను తరలించేందుకు పావులు కదుపుతోంది. బఫర్ జోన్ ఆంక్షల నేపథ్యంలో... హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించి.. గ్రేటర్ సిటీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెరువులు, కుంటల చుట్టూ బఫర్ జోన్లో పక్కా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. హుస్సేన్‌సాగర్ చుట్టూ నిర్మాణాలకు సైతం ఇవే ఆంక్షలు వర్తించనున్నాయి. అందుకే బఫర్ జోన్‌కు అవతల ఉన్న సచివాలయ స్థలాలను విక్రయిస్తే, అక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. -
ఎర్రగడ్డకు తెలంగాణ సచివాలయం ?
-
వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు పూర్తి
-
తనిఖీల్లో రూ.3.80 కోట్లు స్వాధీనం
,హైదరాబాద్: వాహనాల తనిఖీల్లో భాగంగా శుక్రవారం పోలీసులు ఎర్రగడ్డప్రాంతంలో కారులో తరలిస్తున్న రూ.3.80 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి సిబ్బందితో కలసి ఉదయం భరత్‌నగర్ చౌరస్తాలో తనిఖీలు చేశారు. అక్కడ కారును ఆపి సోదా చేయగా అక్రమంగా తరలిస్తున్న రూ.3.80 కోట్లు లభించాయి. డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని ఎన్నికల పరిశీలకులు శంకర్‌కు అప్పగించామని ఇన్స్పెక్టర్ తెలిపారు. కాగా, కారులో తీసుకువెళుతున్న నగదు ఎస్బీఐ బ్యాంక్‌కు చెందినదని, ఆధారాలు చూపితే తిరిగి ఇస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు -
పిచ్చాస్పత్రి కేసు: నాంపల్లి కోర్టుకు ఖైదీలు
హైదరాబాద్ : ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుంచి తప్పించుకున్న 11మందిలో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో వున్నారు. పట్టుబడిన ఏడుగురిని పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. వారిపై పోలీసులు ఐపీసీ 224, 435, 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా భార్యను ములాఖత్‌కు అనుమతించలేదన్న కోపంతో ఓ అండర్ ట్రయల్ ఖైదీ వేసిన పథకంతో ఆస్పత్రి నుంచి చికిత్స పొందుతున్న పదకొండుమంది నిన్న తెల్లవారుజామున పరారైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు నిన్న సాయంత్రానికి ఏడుగురిని పట్టుకోగా... మిగతావారు ముంబైలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్ను ఖురేషీ, జీవరత్న, తిరుమలేష్ కోసం వేట ముమ్మరం చేశారు. -
ఎర్రగడ్డ మారుతి షో రూంలో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ సమీపంలోని మారుతి షో రూంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మారుతి షోరూమ్‌లోని 2, 3 అంతస్తుల్లో ఉన్నకార్లకు మంటలు అంటుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పెద్దఎత్తునా మంటలు చెలరేగడంతో అక్కడి షోరూంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. -
పాఠశాలకు వెళుతూ..ప్రాణాలు కోల్పోయి
పీసీ పల్లి, న్యూస్‌లైన్: రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాలకొండ సమీపంలో ఎర్రగడ్డ వద్ద బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. మండలంలోని వెంగళాపురానికి చెందిన నేలటూరి వెంకటేశ్వర్లు, కాంతమ్మలకు ఒక్కగానొక్క సంతానం మోనిక (15) పొన్నులూరు మండలం చెరుకుంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల్లో పదో తరగతి చదువుతుంది. స్కూల్‌కు వెళ్లేందుకు బుధవారం బస్సు లేకపోవడంతో మోనిక, అదే గ్రామానికి చెందిన కళ్యాణి గ్రామంలోని గంగమ్మ గుడి వద్ద వేచి ఉన్నారు. అదే పాఠశాల్లో చదువుతున్న పసల సోని అనే విద్యార్థి బైక్‌పై అగ్రహారం వైపు వెళ్తుండటంతో వీరిద్దరూ ఎక్కారు. మార్గ మధ్యంలో లింగాల కొండ వద్ద బైక్‌కు ముందు వెళ్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. వెనుక వస్తున్న సోని కూడా బ్రేక్ వేయడంతో వేగం అదుపుకాక టైర్లు జారాయి. దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురూ కిందపడిపోయారు. వెనుక కూర్చున్న మోనిక అక్కడిక క్కడే మృతి చెందగా, కళ్యాణి తలకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న సోని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కల్యాణిని ఒంగోలు, సోనిని అగ్రహారం వైద్యశాలకు తరలించారు. వద్దన్నా వెళ్లి పరలోకం చేరావా తల్లి ‘బస్సులు లేవు పాఠశాలకు ఈ రోజు వద్దన్నా..పదో తరగతి క్లాసులు పోతాయని చెప్పి వెళ్లి తిరిగిరాని లోకాని వెళ్లవా’ అమ్మా అంటూ మోనిక తల్లి కాంతమ్మ కన్నీటి పర్యంతమైంది. మౌనిక పుట్టిన రెండేళ్లకే తండ్రి వెంకటేశ్వర్లు హైదరాబాదులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.