సాక్షి, అమీర్‌పేట: ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్‌లో కారు బీభత్సం సృష్టించింది.ఓ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎర్రగడ్డ సుల్తాన్‌నగర్ సమీపంలోని జనచైతన్య అపార్ట్‌మెంట్స్‌లో ఉంటున్న బాలుడు(17) ఇంట్లో ఎవరికి చెప్పకుండా కారు తీసుకుని వేగంగా రోడ్డుపైకి వచ్చాడు.
ఈ క్రమంలో ముందుగా వెళుతున్న ఇద్దరు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టాడు. వారు కింద పడిపోవడంతో ఓ మహిళ కాలు విరిగింది. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్‌పెక్టర్ సైదులు తెలిపారు.
చదవండి: బోనాల జాతరలో పరిచయం.. జోగిని శ్యామలపై పాతబస్తీ మౌనిక వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment