
హయత్ నగర్‌లోని ఇనాంగూడ చెరువులోకి కారు అత్యంత వేగంగా దూసుకుపోయింది. కారులో ఉన్న తండ్రితో సహా ముగ్గురు పిల్లలను స్థానికులు కాపాడారు.
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లిన కారు కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన తండ్రి.. వేగంతో ఇమాంగూడ చెరువులోకి కారును డ్రైవ్ చేశారు.
కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని భావించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. చెరువులోకి దూకి తండ్రితో సహా ముగ్గురు పిల్లలను కాపాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
