hayathnagar
-
హైదరాబాద్ హయత్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం
-
పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పెద్ద అంబర్‌పేట్‌లో విషాదం జరిగింది. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిని స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. బాలిక రోడ్డు దాటుతున్న విషయాన్ని గమనించకుండా వ్యాన్‌ను డ్రైవర్ రివర్స్ చేయడంతో వెనక టైర్ల కింద పడి చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మరో ఘటనలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు.. బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. శంకర్పల్లి మండల పరిధిలోని ఎన్సీడీ రాయల్ పెవిలియన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్ మండల కేంద్రానికి చెందిన శ్రీహర్ష(19)కు దొంతన్‌పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. దీంతో అతని తల్లి మోకిలతండాలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే ఉంటూ కొడుకును చదివిస్తోంది. శ్రీహర్ష నిత్యం బైక్‌పై కాలేజీకి వెళ్లివస్తుంటాడు.ఇదిలా ఉండగా బుధవారం కళాశాల ముగిసిన తర్వాత ఉప్పల్‌కు చెందిన క్లాస్మేట్ హర్షనందన్(19)ను తీసుకుని ఫ్రెషప్ అయ్యేందుకు మోకిలతండాకు వచ్చారు. సుమారు గంటపాటు రూంలో గడిపిన అనంతరం హర్షనందన్ను కాలేజీ వద్ద వదిలిపెట్టేందుకు బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. ఎన్సీడీ రాయల్ పెవిలియన్ సమీపంలో కొండకల్ వైపు అతివేగం, అజాగ్రత్తగా వెళ్తున్న ఏపీ మోడల్ పాఠశాల బస్సు వీరిని బలంగా ఢీ కొట్టింది. బైక్ నడుపుపుతున్న శ్రీహర్షకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. హర్షనందన్ పాక్షిక గాయాలతో బయటపడ్డాడు. అతన్ని శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మోకిల పోలీసులు శ్రీహర్ష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పఠాన్ చెరువుకు మెట్రో విస్తరణ..
-
ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్యాయత్నం
-
హయత్‌నగర్ చెరువులో కారు మునక కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లిన కారు కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తన ముగ్గురు పిల్లలతో కలిసి తాను ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన తండ్రి.. వేగంతో ఇమాంగూడ చెరువులోకి కారును డ్రైవ్ చేశారు.కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని భావించిన స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. చెరువులోకి దూకి తండ్రితో సహా ముగ్గురు పిల్లలను కాపాడారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నా కొడుకు దొరికాడు..తల్లి కృతజ్ఞతలు..
-
హయత్ నగర్ లో విద్యార్థి మిస్సింగ్
-
TSPSC బోర్డు రద్దు చేయాలంటూ సడక్ బంద్ కు పిలుపు
-
HYD: హయత్ నగర్లో హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడపడంతో ఓ ప్రాణం పోయింది. యాక్సిడెంట్ చేసి కారుతో సహా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ.. ఇప్పటిదాకా నిందితులను అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబం న్యాయ పోరాటానికి దిగింది. హయాత్ నగర్లో ఓ వైట్ కలర్ బెంజ్ కారు వేగంగా ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి స్పాట్లోనే చనిపోగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. మృతుడ్ని పోషం కృష్ణారెడ్డిగా గుర్తించిన పోలీసులు.. హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైట్ కలర్ బెంజ్ కారు నెంబర్ TS08EZ6717 ఆధారంగా.. ఓనర్‌ను వరాల శ్వేతారెడ్డిగా గుర్తించారు. అయితే.. మద్యం మత్తులో పవన్ రెడ్డి కారు నడిపి కృష్ణారెడ్డి మృతికి కారణమైనట్లు తేలింది. దీంతో.. మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. ఇప్పటివరకు నిందితుడ్ని అరెస్ట్ చేయలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. -
హయత్‌నగర్ బాలిక కిడ్నాప్ కేసులో ‘నాటకీయ’ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే, అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెద్ద అంబర్‌పేట్‌లో నివసించే బాలిక మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రాగా, ఓ ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి బైక్ మీద .. ఔటర్ రింగు రోడ్డు దగ్గర పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించటంతో.. ప్రతిఘటించి రోడ్డు పైకి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ హిజ్రాను సాయం అడగటంతో.. ఆమె ఆ బాలిక కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇది.. నిన్నటి వరకు తెలిసిన కిడ్నాప్ కథ. కానీ అసలు కథ వేరే ఉంది. ఆ బాలిక చెప్పిందంతా కేవలం కట్టు కథగా పోలీసులు తేల్చేశారు. అతనితో కలిసి వెళ్లి.. బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్‌చాట్‌లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. స్నాప్ చాట్‌లో ఇరువురు ఫొటోలు కూడా పంపించుకున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడంతో బయట కలుసుకోవాలనుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ ఆ బాలిక బయటికి రావడంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆ యువకడు బైక్ మీద రాగా.. అతనితో కలిసి వెళ్లింది. చదవండి: నువ్వే కావాలి అంటూ లవ్ ప్రపోజ్.. క్లోజ్‌గా వీడియో కాల్స్ మాట్లాడి.. ఏడుస్తున్నట్టు నటిస్తూ.. అసలు నాటకం అక్కడే మొదలైంది.. ఆ బాలిక పరిగెత్తుకుంటూ వెళ్లి.. తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని, పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి ప్రయత్నిస్తే.. తప్పించుకుని వచ్చానని తనకు సాయం చేయమని ఏడుస్తున్నట్టు నటిస్తూ అక్కడ ఉన్న హిజ్రాను అడిగింది. దీంతో.. ఇదంతా నిజమేనని నమ్మిన హిజ్రా.. వెంటనే ఆ బాలికకు ధైర్యం చెప్పి.. పోలీసులకు సమాచారం అందించింది. కాగా.. పోలీసులు కూడా ఆ అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మేశారు. కానీ.. విచారణలో అసలు నాటకం బయటపడింది. చదవండి: అది యాక్సిడెంట్ కాదు పక్కా మర్డర్! -
Hyderabad: బాలికపై అత్యాచారయత్నం.. కాపాడిన హిజ్రా
సాక్షి, హైదరాబాద్: హయాత్‌నగర్‌లో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఓఆర్ఆర్ పరిసరాలకు తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం చేశారు. యువకుల నుంచి తప్పించుకుని రోడ్డుపైకి చేరుకున్న బాలికను.. రక్షించిన హిజ్రా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తీవ్ర గాయాలపాలైన బాలికను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: దూసుకొచ్చిన మృత్యువు క్షణాల్లోనే ఘోరం -
హయత్ నగర్ లో బాలిక కిడ్నాప్, అత్యాచార యత్నం
-
హయత్ నగర్లో హిజాబ్ వివాదం.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని హయత్ నగర్లో హిజాబ్ వివాదం వెలుగు చూసింది. స్కార్ఫ్‌తో వెళ్లిందని ఓ పదో తరగతి అమ్మాయిని ఇంటికి పంపించేసింది స్కూల్‌యాజమాన్యం. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో.. కేసు నమోదు చేశారు. ముఖానికి స్కార్ఫ్‌తో వెళ్లిన ఆ టెన్త్ స్టూడెంట్ను.. స్కూల్ యాజమాన్యం లోనికి రానివ్వలేదు. హిజాబ్‌తో లోనికి రానివ్వమంటూ తేల్చేసింది. దీంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో వాళ్లకు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు విద్యార్థిని స్థానిక కోర్టు న్యాయమూర్తి కూతురని సమాచారం. ఇదీ చదవండి: కురచ దుస్తులెందుకు?.. తెలంగాణ హోంమంత్రి కామెంట్లపై దుమారం -
హయత్ నగర్ హత్య కేసులో సంచలన విషయాలు
-
హయత్ నగర్ రాజేష్ మృతి కేసులో కొత్తకోణం
-
ప్లాట్ కొంటున్నారా..? తస్మాత్ జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు. ఆహ్లాదకరమైన వాతావరణం.. కాలుష్య రహిత ప్రాంతం.. నగరానికి కూతవేటు దూరం.. వెరసి అతితక్కువ ధరకే హెచ్ఎండీఏ లేఅవుట్లో అమ్మకానికి ప్లాట్లు.. అంటూ రియల్ ఎస్టేట్ రంగంలోని కొంతమంది అక్రమార్కులు ప్రకటనలు చేస్తున్నారు. వీరి మాటలు నమ్మి పిగ్లీపూర్‌లో ప్లాట్లు కొనుక్కునేందుకు తొందరపడుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త..! రియల్ ముఠా చీకటి ఒప్పందం..? హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరుతో 20ఏళ్ల కిత్రం చేసిన ప్లాట్లనే కబ్జా చేసి అప్పటి లేఅవుట్ల ఆనవాళ్లు కనిపించకుండా నూతన హంగులతో ముస్తాబు చేస్తు న్న రియల్ మోసగాళ్లు తాజాగా హెచ్ఎండీఏ ప్లాట్లు గా తిరిగి విక్రయించేందుకు తెగబడుతున్నారు. పిగ్లీపూర్ గ్రామంలో కొన్ని రియల్ ముఠాలు కొంతకాలంగా తమ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ మరో సారి వేలాది మంది పేద, మధ్య తరగతి కుటుంబాల సొమ్మును కాజేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో ఒకప్పడు వివాదరహితంగా ఉన్న పిగ్లీపూర్‌లోని భూములన్నీ ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. పిగ్లీపూర్ రెవెన్యూ సర్వే నెం.12, 14, 46, 51లోని పాత లేఅవుట్లను, పార్కు స్థలాలతో పాటు ప్రభు త్వ, భూదాన్‌భూములు ఆక్రమించుకుంటున్న రియల్ మాఫియా హెచ్ఎండీఏ, పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చీ కటి ఒప్పందం చేసుకున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. లే అవుట్లలోని పార్కు స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడంతో అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పదుల సంఖ్యలో డబుల్ లేఅవుట్లు పిగ్లీపూర్‌లో రెండు, మూడేళ్లుగా హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరుతో చేపడుతున్న లేఅవుట్లన్నీ డబుల్, త్రి బుల్ లేఅవుట్లే. 20, 25 ఏళ్ల కిత్రం చేసిన పంచాయ తీ లేఅవుట్లనే హెచ్ఎండీఏ లేఅవుట్లు చేస్తున్నారు. ఈ లేఅవుట్లలోని ప్లాట్లను ప్లాన్ మ్యాప్‌లో చూపించి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇదే సర్వే నెంబర్లలో హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకుని ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత స్థలాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాట్లు విక్రయించిన తర్వాత వచ్చి న భూ వివాదాలు, ఫిర్యాదుల కారణంగా హెచ్ఎండీఏ అధికారులు ఎల్పీ నెంబర్‌ను రద్దు చేసినట్లు తెలిసింది. దీంతో ఆ స్థలంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా వదిలేశారంటే అక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అర్థమవుతోంది. చదవండి: Hyderabad: భూం ధాం!.. రూ. 12 వేల కోట్ల నుంచి 15 వేల కోట్లు లక్ష్యం ఎక్కువ కమీషన్ ఆశ చూపి.. పాత లేఅవుట్లలోని ప్లాట్లను ఆక్రమించుకుని వాటి ఆనవాళ్లు లేకుండా చేసి నకిలీ పత్రాలతో హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవడం కబ్జాదారుల పని... అనంతరం ఎక్కువ కమీషన్ ఆశచూపి ఈ డబుల్ లేఅవుట్లలోని ప్లాట్లను విక్రయించే బాధ్యత మార్కెటింగ్ కంపెనీలకు అప్పగించి చేతికి మట్టి అంటకుండా కోట్లాది రూపాయాలు సొమ్ము చేసుకుని పేదలకు కుచ్చుటోపి పెడుతున్నారు. ప్లాట్లు విక్రయాలు పూర్తి అయ్యేంత వరకూ రియల్ మాఫియా ముఠా సభ్యులు ఎక్కడా తమ పేర్లు వినిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్కెటింగ్ ఏజెంట్లు కూడా పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు ఉద్యోగాల్లో బిజీగా ఉండే వారినే టార్గెట్ చేసుకుని ప్లాట్లు విక్రయిస్తున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో తెలుస్తోంది. తక్కువ ధరకు ప్లాట్లు వస్తున్నాయనే ఆశతో తొందరపడి కొనుగోలు చేస్తే మాత్రం ఇక్కడి వివాదాస్పద భూముల వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని,ప్లాట్లు కొనేముందు అన్ని విషయాలను పరిశీలించడంతో పాటు ప్లాట్లు చేస్తున్న ప్రాంతాలను స్వయంగా సందర్శించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. -
హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ నకిలీ మద్యం.. రూ. 2 కోట్ల విలువైన..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి నకిల మద్యం బయటపడింది. శివారు ప్రాంతాల్లో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్‌శాఖ అధికారులు.. హయత్ నగర్‌లోని ఓ బెల్ట్ షాపులో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆ బెల్ట్ షాప్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు.. పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డంప్‌లపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారానికి చెందిన మద్యం వ్యాపారి బింగి బాలరాజుగౌడ్కు చెందిన గోదాంలో నకిలీ మద్యం పట్టుకున్నారు. దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలరాజు గౌడ్, కొండల్‌రెడ్డి కలిసి నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలింది. వీరిద్దరూ 20 వైన్ షాపులకు నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నట్లు నిర్ధారించారు. గతంలో కూడా బింగి బాలరాజు గౌడ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఇదే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కర్రలతో కొట్టుకున్న ప్రైవేటు కాలేజ్ విద్యార్థులు.. వీడియో వైరల్ -
హయత్ నగర్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు
-
హైదరాబాద్ హయత్ నగర్ లో దారుణం
-
హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం
-
నీతో ఉండను నన్ను వెతకొద్దు.. వెతికితే చస్తా..!
సాక్షి, హయత్‌నగర్ (హైదరాబాద్): నన్ను వెతకకండి.. ఒకవేళ వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటూ భర్తకు ఫోన్లో మెసేజ్ పెట్టి ఓ వివాహిత అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూర్‌కు చెందిన తిరందాస్ ప్రసాద్‌కు ఆరేళ్ల క్రితం పూజతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. చిన్న తగాదాల కారణంగా రెండు వారాల క్రితం పూజ తన పుట్టింటికి వెళ్లింది. ఐదు రోజుల క్రితం భర్త ప్రసాద్ వెళ్లి రాజీ కుదుర్చుకుని ఇంటికి తీసుకొచ్చాడు. శుక్రవారం నాగోల్‌లోని తన అత్త ఇంటికి వెళుతున్నానని చెప్పి పూజ తన పిల్లలను తీసుకుని వెళ్లింది. తర్వాత తాను నీతో ఉండను.. నన్ను వెతక వద్దు, వెతికితే పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని తన మొబైల్ నుంచి భర్తకు వాయిస్ మెసేజ్ పెట్టింది. దీంతో ఆందోళనకు గురైన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు) -
పిల్లలతో సహా తల్లి అదృశ్యం.. 2 నెలల క్రితం మరో వ్యక్తితో వెళ్లిందని..
సాక్షి, హైదరాబాద్ : తన ఇద్దరు పిల్లలతో సహా ఓ గృహిణి అదృశ్యమైంది. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా ఇమ్మిగనూరు మండలం నాగాలదిన్నెకు చెందిన కీరసాకరే రామకృష్ణ బతుకుదెరువు కోసం వచ్చి లేబర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంతో కలిసి పెద్దంబర్‌పేట్‌లోని శాంతినగర్‌లో అద్దె కుంటున్నాడు. భార్య స్వప్న (32) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తుంది. వారికి కూతురు లావణ్య (14), కొడుకు ప్రవీణ్ (12) ఉన్నారు. జులై 27న పనికి వెళుతున్నానని పిల్లలతో కలిసి బయటికి వెళ్లిన స్వప్న తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్క తెలిసిన వారి వద్ద వెతికినా ఫలితం లేకపోవడంతో భర్త రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్వప్న రెండు నెలల క్రితం రాము అనే వ్యక్తితో కలిసి బయటికి వెళ్లిందని ప్రస్తుతం అతనిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Independence Day: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్ -
అనుమానాస్పద స్థితిలో మూవీ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి
Assistant Director Death అనుమానాస్పద స్థితిలో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందిన ఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్ కుంట్లూర్ శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉండే మరిగంటి కార్తీక్ కుమార్(31) సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. కార్తీక్ ఈనెల 14న తన ద్విచక్ర వాహనం(ఏపీ29బీసీ0439)పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి 9 గంటలకు తన సోదరుడు సందీప్‌కు ఫోన్ చేసి మాట్లాడాడు. అనంతరం సందీప్ తిరిగి కార్తీక్‌కు ఫోన్ చేస్తే సమాధానం రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు హయత్‌నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న సాయంత్రం సమయంలో గౌరెళ్లి సమీపంలోని జీవీర్ కాలనీ సీఎన్ఆర్ క్రికెట్ అకాడమీ దగ్గర ఓ యువకుడు మృతి చెంది ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహం కార్తీక్‌ది కావచ్చనే అనుమానంతో 17న ఉదయం అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించిన కార్తీక్ కుటుంబ సభ్యులు అది కార్తీక్ మృతదేహంగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: హీరోల కోసమే వందల కోట్లు ఖర్చు, అందుకే తమిళ సినిమా నశిస్తోందంటూ నిర్మాత ఆవేదన -
రంగారెడ్డి: హయత్‌నగర్‌లో మహిళ మృతదేహం కలకలం
-
హయత్‌నగర్: దుప్పటిలో మహిళ మృతదేహం కలకలం
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక యువకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి.. వారిని అప్పగించారు. హయత్‌నగర్‌లోని తొర్రూరు రోడ్డులో ఉన్న బాతుల చెరువు సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మహిళ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. బ్లాంకెట్‌లో ఏమిటని ప్రశ్నించగా.. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానం చెప్పారు. దాంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనుమానితుల్లో ఒక వ్యక్తి తన పేరు శ్రీనివాస్ అని.. బ్లాంకెట్‌లో ఉన్నది తన భార్య మృతదేహం అని.. తమది లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. ఆమె ఎలా చనిపోయిందని అని అడిగితే.. శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పలేదు. (చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్) దీంతో అనుమానంతో పోలీసులకు వారిని పట్టించారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇక మహిళ ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతురాలిని డేగ లక్ష్మీగా గుర్తించారు. కర్ణాటకకు చెందిన డేగ లక్ష్మి, నెల్లూరుకి చెందిన శ్రీనివాస్‌కు 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహంమైంది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చాడు. తాపీమేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని.. ఈక్రమంలోనే ఆమె మృతి చెందినట్లు శ్రీనివాస్ చెప్పినట్టు సమాచారం. (చదవండి: పెన్షన్ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి) డబ్బులు లేక స్నేహితుడి సహాయంతో ఎక్కడన్నా దహన సంస్కారాలు చేద్దామని తీసుకువెళ్తున్నట్లు శ్రీనివాస్ పోలీసుల విచారణలో తెలిపాడు. పోస్ట్మామార్టం రిపోర్ట్ వచ్చాకే లక్ష్మి మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ప్రస్తుతం లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చదవండి: ఆ బాడీ దొరికితేనే సంచలన కేసు కొలిక్కి: కృష్ణానదిలో గాలింపు ముమ్మరం -
హయత్ నగర్ లో తెలంగాణ గురుకుల పాఠశాలలో 50 మందికి కరోనా
-
హైదరాబాద్‌లో సాక్షి ప్రతినిధులపై దాడి
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్‌లో కార్పొరేటర్ సామ తిరుమల్ రెడ్డి అనుచరులు సాక్షి ప్రతినిధులపై దాడికి పాల్పడ్డారు. కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డి తమ ప్లాట్‌ను కబ్జా చేశారని నల్లగొండకు చెందిన ఓ కుటుంబం ఆదివారం ధర్నా నిర్వహించింది. ఆయన ప్రచార రథాన్ని బాధిత కుటుంబం అడ్డుకుంది. కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులపై సామ తిరుమల్‌రెడ్డి అనుచరులు దాడి చేశారు. సాక్షి రిపోర్టర్ ఫోన్‌ను ధ్వంసం చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. -
చెప్తే విన్నారు కాదు, గండం తప్పింది!
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వరద ముంపు ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, సాహసాలు చేయొద్దని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను కొందరు పట్టించుకోవడం లేదు. వాగులు, వంకల్ని దాటేస్తామని మూర్ఖంగా అడుగేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే వరద కాలువలను దాటుతూ తెలంగాణ వ్యాప్తంగా పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. తాజాగా హయత్ నగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు వేర్వేరు ఘటనల్లో వాగులో చిక్కుకుని స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. భారీ వరదలతో హయత్ నగర్-మునగనూరుకు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పెద్ద ఎత్తున వరద నీరు చెరువుల నుంచి అలుగుపారడంతో రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. అయితే, బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి వరదను దాటుకుని అవతలి ఒట్డుకు చేరేందుకు యత్నించగా.. వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయింది. ఓ నలుగురు యువకులు సత్వరం స్పందించి అతనికి చేయందించి వరదలో కొట్టుకుపోతుండగా రక్షించారు. మరో ఇద్దరు యువకులు కూడా ఇదే తరహాలో వరద మధ్యలో చిక్కుకున్నారు. బైక్‌పై వారు అవతలి వైపునకు వెళ్లే క్రమంలో వరద తాకిడికి బైక్ కొట్టుకుపోయింది. ఇద్దరు యువకులను స్థానిక యువకులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. -
హయత్ నగర్ కార్పోరేటర్‌పై దాడి
సాక్షి, హైదరాబాద్: హయత్ నగర్ కార్పోరేటర్‌కు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు వరదలో ఉన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది. ఈ నేపథ్యంలో వరద పరిస్థితిని పరిశీలించేందుకు కార్పోరేటర్ సామా తిరుమల్ రెడ్డి ఆదివారం ఉదయం బంజారా కాలనీకి వెళ్లారు. గతంలో తాము నాలా భూములు కబ్జాకు గురి అవుతున్నాయని అధికారులు, కార్పొరేటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలా కబ్జాలే ముంపుకు కారణం అంటూ కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలో ఓ మహిళ... కార్పోరేటర్ చొక్కా పట్టుకుని నిలదీశారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా కార్పోరేటర్ కంగు తిన్నారు. ఆ తర్వాత స్థానికులకు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
భర్త అత్తామామల వేధింపు తాళలేక వివాహిత ఆత్మహత్యయత్నం
-
మేము ఎవరికీ భారం కాకూడదు!
హయత్‌నగర్: ‘మాకు పెళ్లిళ్లు చేయడం వల్ల మీరు అప్పుల పాలు కాకూడదు. మా కారణంగా మీరు గొడవలు పడొద్దు. చావడం తప్పే.. మా చావు కారణంగా ఎన్నో పుకార్లు పుట్టుకొస్తాయి. మేము ఎలాంటి తప్పు చేయలేదు. అయినా చావాలనుకుని చస్తున్నాం’అంటూ సూసైడ్ నోటు రాసి ఇద్దరు స్నేహితురాళ్లు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాదవరం గ్రామానికి చెందిన బాషం నారాయణ, నారాయణమ్మ దంపతులు.. కుమార్తె గౌతమి(20)తో కలసి హయత్‌నగర్ డివిజన్లోని శ్రీనివాస కాలనీలో నివాసముంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పోత్నపల్లికి చెందిన రాములు, తిరుపతమ్మ దంపతులు.. కుమార్తె మమత(20)తో కలసి రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నారు. ఇరు కుటుంబాలు గతంలో శ్రీనివాసకాలనీలో పక్కపక్కనే నివాసముండటం వల్ల గౌతమి, మమతల మధ్య స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఇంటర్ వరకు చదివారు. మమత ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తుండగా, గౌతమి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఇటీవల ఇద్దరికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. శుక్రవారం మమత తల్లిదండ్రులు పెళ్లికి వెళ్లగా, తమ్ముడు పాఠశాలకు వెళ్లాడు. గౌతమి మమత ఇంటికి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇద్దరూ ఒకే గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకున్నారు. సాయంత్రం నాలుగున్నర సమయంలో మమత తమ్ముడు ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. స్థానికులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ భారం కాకూడదని.... నా పెళ్లితో తమ్ముడి చదువు ఆగిపోకూడదంటూ మమత... నాన్నా నా చావుతో అయినా నీవు ప్రశాంతంగా ఉండు. అమ్మను బాధ పెట్టకు అని గౌతమి.. ఇరువురు వేర్వేరుగా సూసైడ్ నోట్ రాశారు. ‘మమ్మల్ని క్షమించండి. మా చావుకు ఎవరూ కారణం కాదు. మేము ఎవరికీ భారం కాకూడదు. మా పెళ్లిళ్ల కోసం మీరు అప్పులపాలు కావద్దు. మా ఆత్మహత్యకు అనేక పుకార్లు పుట్టుకొస్తాయి. ఎలాంటి తప్పు చేయలేదు. మా చావుతో ఇరు కుటుంబాల వారు ఎలాంటి గొడవలకు దిగరాదు’అంటూ ఇద్దరు కలసి మరో సూసైడ్ నోటు రాశారు. -
హయత్‌నగర్‌లో చెడ్డీగ్యాంగ్ ఆటకట్టు
-
హయత్‌నగర్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన!
సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే నగరంలోని హయత్‌నగర్‌లో ఓ అనుచిత ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీలో ఓ యువతి పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. రాజేశ్ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతూ.. అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత యువతి చురుగ్గా వ్యవహరించి.. డయల్ 100కు కాల్ చేసింది. పోలీసులు కూడా ఆమె కాల్‌కు తక్షణమే స్పందించారు. ఆమె పల్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజేశ్‌ను అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్‌కు తరలించారు. షాద్‌నగర్ శివార్లలో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలు అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిశ ఘటనలోని నిందితులు ఎన్కౌంటర్ కావడంతో పోలీసులపై ఒకవైపు ప్రశంసల జల్లు, మరోవైపు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మహిళలపై నేరాలు జరగకుండా పోలీసులు ఇకముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలు సోషల్ మీడియా నుంచి, ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపద సమయంలో డయల్ 100కు కానీ, 112కు కానీ కాల్ చేయాలని, ప్రతి ఒక్కరూ హాక్-ఐ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని.. అనుకోని పరిస్థితులు ఎదురైతే పోలీసుల సహాయం తీసుకోవాలని పోలీసు శాఖ కోరుతోంది. -
మత్తు ఇంజక్షన్ తీసుకుని డాక్టర్ ఆత్మహత్య
హయత్‌నగర్: రోగులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చే ఓ డాక్టర్ తానే మత్తు ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. లెక్చరర్స్ కాలనీలో నివసించే మంతటి మురళీధర్‌రావు కొడుకు రమేష్ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఓబుల్‌రెడ్డి ఆసుపత్రిలో మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ (అనస్తీషియన్)గా పనిచేస్తున్నాడు. అతని భార్య స్వప్న కిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్‌గా పనిచేస్తుంది. వారికి ఒక కొడుకు ఉన్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మద్య తగాదా నడుస్తోంది. గత ఆరు నెలలుగా ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. రమేష్ లెక్చరర్స్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా.. స్వప్న బీహెచ్ఈఎల్లోని ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన రమేష్ సోమవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులు నిద్రపోయాక డాబాపైకి వెళ్లి మత్తు ఇంజక్షన్ తీసుకున్నాడు, ఉదయం కుటుంబసభ్యులు వెళ్లి చూడగా అప్పటికే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రియల్ ‘దృశ్యం’!
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ ఠాణాలో అదృశ్యం కేసుగా నమోదైన రజిత కేసు దృశ్యం సినిమాను తలపించింది. ఆ సినిమా లో తన కూతురును బలవంతం చేయబోయి న వ్యక్తిని మీనా చంపేస్తే ఆ శవాన్ని మాయం చేసేందుకు సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి హీరో వెంకటేశ్ ఏ సాక్ష్యం దొరక్కుండా జాగ్ర త్త పడటం చూశాం. ఆ రీల్ లైఫ్‌కు తగ్గట్టుగానే రియల్‌లైఫ్‌లో కాస్త భిన్నంగా తనను బలవంతం చేసిన వ్యక్తి బెదిరింపులకు తలొగ్గి కన్నతల్లి హత్యలో భాగస్వామ్యమై ఎవరికీ ఏ అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేసేందుకు సుదూర ప్రయాణం చేయడం దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా నడిచింది. వీరు ఆధారాలు చెరిపేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిందితురాలి తండ్రికి వచ్చిన అనుమానం కాస్తా ఆమెను ఇప్పుడు ఏకంగా జైలు ఊచలు లెక్కించేలా చేసింది. తల్లి రజితను హత్య చేసిన కూతురు కీర్తితో పాటు కొత్త శశికుమార్‌లను రాచకొండ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అలాగే కీర్తిని ప్రేమించి అత్యాచారం చేశాడని పోక్సో యాక్ట్ కింద నమోదైన మరో కేసులో చిమ్ముల బాల్రెడ్డికి కూడా సంకెళ్లు వేశారు. ఇలా ఒక్క మిస్సింగ్ కాస్తా 3 కేసులుగా మారింది. శివకుమార్‌పై కూడా పోక్సోయాక్ట్ కేసు నమోదుచేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలను నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ సతీశ్‌లతో కలసి సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. అబార్షన్నే అడ్వాంటేజ్‌గా.. కీర్తికి అబార్షన్ అయిన విషయాన్ని ఆమె తల్లికి చెబుతానంటూ శశికుమార్ బెదిరించడం మొదలెట్టాడు. ఈ వేధింపులకు భయపడిన కీర్తి శశికి శారీరకంగా లొంగిపోయింది. ఏకాంతంలో ఉండగా ఫొటోలు, వీడియోలు తీసిన శశి తనతో శారీరక సంబంధం కొనసాగించచాలని బెదిరించాడు. తనతో సన్నిహితంగా ఉన్న విషయాన్ని బాల్‌రెడ్డితో పాటు మీ అమ్మ రజితకు చెప్తానన్నాడు. చివరకు మీ అమ్మ రజితను చంపేస్తే ఆమె నిర్వహిస్తున్న చిట్టీల డబ్బులు, సిటీలో ఉన్న ప్లాట్లు, సొంతూరులో ఉన్న భూములు నీ సొంతమవుతాయని, ఆ తర్వాత తనకు రూ. 10 లక్షలిస్తే హాయిగా బాల్‌రెడ్డిని పెళ్లి చేసుకోవచ్చని నమ్మించాడు. ఇలా అక్టోబరు 16న రజితకు నిద్రమాత్ర లి వ్వగా ఆమెకు ఏమీ కాలేదు. దీంతో 19న రాత్రి ఇంట్లో రజిత బెడ్‌పై పడుకొని ఉండగా ఆమె కళ్లలో కారం చల్లి, కడుపు మీదకు ఎక్కి చేతులు గట్టిగా పట్టుకోవడంతో శశి ఆమె మెడకు చున్నీ బిగించి చంపాడు. కీర్తి, శశికుమార్ అమ్మగా మాట్లాడిన కీర్తి... అనంతరం రజిత సెల్‌ఫోన్ నుంచి బాల్‌రెడ్డి తండ్రికి ఫోన్ చేసిన కీర్తి చికిత్స కోసం ఆçస్పత్రికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేంత వరకు అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తున్నానని రజితగా గొంతు మార్చి మాట్లాడింది. రెండ్రోజుల తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా నమ్మిద్దామనుకుంది. అప్పటికే శవం దుర్వాసన వస్తుండటంతో దాన్ని బెడ్‌షీట్‌తో చుట్టి శశి కారు డిక్కీలో వేసుకొని చౌటుప్పల్ రైల్వే ట్రాక్ రామన్నపేట పట్టాలపైకి తీసుకొచ్చి పడేశారు. బెడ్‌షీట్, దారాలను తూప్రాన్‌పేట లో పెట్రోల్ పోసి తగలబెట్టారు. కీర్తి బంధువులు మీ అమ్మ ఎక్కడికెళ్లిందంటూ అడుగు తుండటంతో తాను వైజాగ్ వెళ్లానని, నాన్న తాగొచ్చి తరచూ అమ్మతో గొడవపడేవాడని సమాధానమిచ్చింది. అక్టోబరు 26న రాత్రి హయత్‌నగర్ పీఎస్‌లో మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేసింది. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి కూతురిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు చెప్పడంతో కేసు యూటర్న్ తీసుకుంది. బాల్‌రెడ్డి తండ్రిని అడిగితే ‘వైజాగ్ ఎక్కడెళ్లింది.. మా ఇంట్లోనే ఉంది కదా’అని సమాధానమివ్వడంతో కీర్తి అబద్ధం చెబుతున్నట్టుగా పోలీసులు నిర్ధారణకొచ్చి ఆ దిశగా విచారణ చేయగా కేసు చిక్కుముడి వీడింది. కీర్తికి అబార్షన్ చేసిన అమన్‌గల్‌లోని పద్మ నర్సింగ్ హోమ్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని సీపీ మహేశ్ భగవత్ చెప్పారు. పరిచయం కాస్తా ప్రేమగా.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం నెర్నామ్లా గ్రామానికి చెంది న శ్రీనివాస్‌రెడ్డి, రజితల కుటుంబం పదేళ్ల క్రితం హైదరాబాద్ సమీపంలోని మునగనూర్‌కు వలసవచ్చింది. వీరి కుమార్తె కీర్తిరెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో బీఎస్సీ మైక్రో బయాలజీ సెకండియర్ చదువుతోంది. పొరుగింట్లో ఉంటున్న శశికుమార్ కుటుంబంతో కీర్తి కుటుంబానికి సాన్నిహిత్యం పెరిగింది. కీర్తి ఇంటర్ చదువుతున్న సమయంలో రామాంజనేయనగర్ కాలనీలో ఉంటున్న స్నేహితురాలు శిల్ప వద్దకు వెళ్తుండేది. ఈ క్రమంలో శిల్ప సోదరుడు బాల్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమ వరకు వెళ్లి వివాహం చేసుకోవాలనుకున్నారు. శారీరక సంబంధాన్ని పెట్టుకున్నారు. గతే డాది సెప్టెంబర్‌లో కీర్తి గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాలని భావించారు. అబార్షన్ తర్వాత బెడ్ రెస్ట్ అవసరం ఉండటంతో కీర్తి ఇంటిపక్కనే ఉన్న శశి సహాయం తీసుకున్నారు. సంగారెడ్డిలో ఓ ఫంక్షన్‌కు వెళ్తున్నామని, కీర్తిని కూడా పంపించాలంటూ శశి అడగటంతో తల్లి రజిత అంగీకరించింది. ఇలా సంగారెడ్డికి బదులు అమన్‌గల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అబార్షన్ చేయించిన బాల్‌రెడ్డి మళ్లీ హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. -
‘దృశ్యం సెకండ్ పార్ట్‌లా ఉంది’
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో రజిత హత్య కేసు నిందితులను పోలీసులు గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు. ప్రియుడి సహాయంతో కీర్తి తన తల్లి రజితను హత్య చేసిందన్నారు. 19న రజితను హత్య చేసి మూడు రోజుల తర్వాత రామన్నపేట రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేశారని చెప్పారు. ఆ తర్వాత మిస్సింగ్ కేసు పెట్టి.. తప్పించుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కీర్తితో పాటు ఆమెకు సహకరించిన రెండో ప్రియుడు శశిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టమన్నారు. ఈ క్రైమ్.. దృశ్యం సినిమాకు సెకండ్ పార్ట్‌లా ఉందని అభిప్రాయపడ్డారు. ‘కీర్తి, బాల్‌రెడ్డిల మధ్య లవ్ ఎఫైర్ ఉండటంతో.. వారిద్దరికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే బాల్‌రెడ్డి కీర్తిపై అత్యాచారం చేశాడు. గర్భం దాల్చిన కీర్తికి శశికుమార్ అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత కీర్తిని శశికుమార్ బ్లాక్మెయిల్ చేశాడు. అబార్షన్ విషయం ఇంట్లో చెబుతానని వేధించాడు. కీర్తి ఆస్తిపై కన్నేసిన శశి.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. కీర్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నాడు. పెళ్లికి కీర్తి తల్లి అడ్డు చెప్పడంతో ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. శశికుమార్ సహాయంతో కీర్తి తల్లిని హత్య చేసింది. మృతదేహాం తరలించేటప్పుడు కీర్తికి శశి మద్యం తాగించాడు. రజిత హత్య చేసిన తరువాత ఇంట్లోని రూ.10 లక్షలు తీసుకోవాలని భావించారు. గతంలోనే తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు కీర్తి ప్రయత్నించినప్పటికీ.. అది విఫలమైంది. కీర్తిపై అత్యాచారానికి పాల్పడ్డ బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేశాం. నిందితులపై మొత్తం నాలుగు కేసులు నమోదు చేశాం’అని సీపీ తెలిపారు. -
కీర్తి దిండు పెట్టగా.. శశి గొంతు నులిమాడు
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్‌లో కన్నతల్లినే కూతురు హత్య చేసిన కేసులో ట్విస్టుల పరంపర కొనసాగుతోంది. ప్రియుడు శశికుమార్‌తో కలిసి కీర్తి.. తన తల్లి రజితను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు సంబంధించి పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రజితను హత్య చేసినట్టు అంగీకరించిన శశికుమార్, కీర్తిలు.. హత్యకు ముందు జరిగిన విషయాలను వెల్లడించారు. 19వ తేదీన రజిత ఇంటి నుంచి కూరగాయల మార్కెట్‌కు వెళ్లింది. రజిత మార్కెట్ నుంచి తిరిగి వచ్చే సరికి ఇంట్లో కీర్తి, శశికుమార్‌లు ఇద్దరు కలిసి ఉన్నారు. దీంతో ముగ్గురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవ అనంతరం.. రజితను అడ్డు తొలగించికుంటేనే ఇద్దరం కలిసి ఉంటామని శశికుమార్ కీర్తిని ఒప్పించాడు. కీర్తి ఇంటికి బీర్ బాటిల్స్ తీసుకువచ్చాడు. రజిత లోపల గదిలో ఉండగా.. శశికుమార్, కీర్తిలు కలసి ఇంటి ఆవరణలోనే మద్యం సేవించారు. ఆ తర్వాత వారిద్దరు ఇంటి లోపలకు వెళ్లి.. లోపలి నుంచి లాక్ చేశారు. ముందుగా అనుకున్న పథకం ప్రకారం.. రజిత అరవకుండా కీర్తి ఆమె మొహంపై దిండు పెట్టింది. అదే సమయంలో శశికుమార్ చున్నీతో రజిత గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత వారిద్దరు రజిత మృతదేహాన్ని యాదాద్రి జిల్లా రామన్నపేట రైల్వేగేటు వద్ద పడవేశారు. కీర్తి మొదటి ప్రియుడు బాల్‌రెడ్డి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు నిర్దారణ అయింది. దీంతో పోలీసులు బాల్‌రెడ్డిపై కేసు నమోదు చేసేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు కీర్తిపై బాల్‌రెడ్డి అత్యాచారం చేయగా.. మరో ప్రియుడు శశికుమార్ ఆమెకు అబార్షన్ చేయించాడు. దీంతో ఆమె బాల్రెడ్డికి దూరమై.. శశికుమార్‌కు దగ్గర అయినట్టుగా తెలిసింది. కాగా, ఈ హత్యకేసు వెలుగులోకి రావడంతో శశికుమార్, బాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అలాగే సెల్ఫోన్లలోని వీడియోలు, వాట్సాప్ చాటింగ్, కాల్‌డేటా ఆధారంగా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ హత్య కేసులో బాల్‌రెడ్డి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, శశికుమార్‌తో కలిసి తల్లిని అంతమొందించిన కీర్తి.. ఆ నెపాన్ని తండ్రి శ్రీనివాస్‌రెడ్డిపై వేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. వైజాగ్ టూర్ వెళ్లానని చెప్పిన కీర్తి.. తండ్రి శ్రీనివాస్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో కీర్తి ప్రవర్తనపై శ్రీనివాస్‌రెడ్డికి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా కీర్తి నేరం చేసినట్లు ఒప్పుకుంది. చదవండి : తల్లిని చంపిన కీర్తి కేసులో మరో ట్విస్ట్ -
కీర్తి ఇలా దొరికిపోయింది..
సాక్షి, హయత్‌నగర్ : ప్రేమ మైకంలో ఓ కూతురు కన్న తల్లినే చంపేసింది. ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది. తప్పుదారిలో వెళ్తున్నావని తల్లి మందలించినందుకే ఈ పాపానికి ఒడిగట్టింది. సమాజం తలదించుకునే ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం... యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిర్నేముల గ్రామానికి చెందిన పల్లెర్ల శ్రీనివాస్‌రెడ్డి, రజిత అలియాస్ రుద్రమ్మ(38) దంపతులు. వీరికి కీర్తి ఒక్కతే కూతురు. శ్రీనివాస్‌రెడ్డి లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ బతుకుదెరువు కోసం కుటుంబంతో కలిసి పదేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునుగనూర్‌లో ఉంటూ అక్కడే ద్వారకా సాయినగర్ కాలనీలో సొంతిల్లు కట్టుకున్నాడు. కీర్తి(19) దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమె కొన్ని నెలల క్రితం పక్క కాలనీలో నివసించే కృష్ణారెడ్డి కుమారుడు బాల్‌రెడ్డితో ప్రేమలో పడింది. ఈ విషయం బయటకు పొక్కడంతో వివాహం చేసుకోవాలనుకున్నారు. ఇందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. అయితే కీర్తి కొంతకాలంగా ఇంటి పక్కన నివసించే పర్వతాలు కొడుకు శశికుమార్‌తోనూ ప్రేమాయణం నడిపిస్తోంది. ఈ విషయం తెలిసిన తల్లి ఓవైపు బాల్‌రెడ్డితో వివాహం కుదిరిన తర్వాత మరోవైపు శశికుమార్‌తో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావని కూతురును మందలించింది. తన ప్రవర్తనను మార్చుకోవాలని హెచ్చరించింది. దీనిని భరించలేని కీర్తి తన ప్రేమ వ్యవహారానికి అడ్డొస్తుందనే భావనతో తల్లిని చంపాలని నిర్ణయించుకుంది. దీనికి ప్రియుడు శశికుమార్ సహకారం తీసుకుంది. ఈ నెల 19న తండ్రి ఇంట్లో లేని సమయంలో కీర్తి, శశికుమార్‌లు కలిసి రజిత మెడకు చున్నీతో ఉరి బిగించి చంపారు. కారులో శవం తరలింపు కీర్తి తల్లి శవాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఇంట్లోనే పెట్టుకుని ప్రియుడు శశికుమార్‌తో కలిసి మూడు రోజులు గడిపింది. తర్వాత దుర్వాసన రావడంతో శవాన్ని తరలించాలని నిర్ణయించుకున్నారు. శశికుమార్ తండ్రి కారు (టీఎస్ 06 ఈఎల్ 4142)లో శవాన్ని తీసుకెళ్లి రామన్నపేట్ సమీపంలో రైలు పట్టాలపై పడేశారు. ఇదంతా జరిగిన రోజుల్లో తండ్రి డ్యూటీకి వెళ్లి ఇంటికి రాలేదు. అయితే రామన్నపేట రైల్వే పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని రెండు రోజుల పాటు వేచి చూసి దహన సంస్కారాలు నిర్వహించినట్టు తెలిసింది. తండ్రిపైకి నెట్టే యత్నం తన తండ్రి వేధింపులు భరించలేకనే తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిందని నమ్మించేందుకు కీర్తి ప్రయత్నించింది. తల్లి శవాన్ని పడేసిన తర్వాత తాను స్నేహితులతో కలిసి వైజాగ్ టూర్‌కు వెళ్తున్నానని ఈ నెల 23న తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆమె టూర్‌కు వెళ్లకుండా ప్రియుడి ఇంట్లోనే ఉంది. ఈ నెల 24న ఇంటికి వచ్చిన తండ్రి ‘అమ్మ కనిపించడం లేద’ని కీర్తికి ఫోన్ చేశాడు. దీంతో టూర్ మధ్యలో నుంచి వచ్చినట్లు నటించి కీర్తి ఇంటికి చేరుకుంది. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా తల్లి ఆచూకీ దొరకలేదు. దీంతో తన తండ్రి తరచూ తాగి వచ్చి అమ్మను వేధించే వాడని, ఈ క్రమంలో అమ్మ రజిత ఇంటి నుంచి వెళ్లిపోయిందని కీర్తి ఈ నెల 26న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇలా దొరికిపోయింది... కీర్తి ఇలా పోలీసులకు ఫిర్యాదు చేయడంపై శ్రీనివాస్‌రెడ్డి కంగు తిన్నాడు. కూతురును గుచ్చిగుచ్చి అడగడంతో పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో బంధవులకు విషయాన్ని తెలపడంతో వైజాగ్ టూర్‌కు ఎందుకు వెళ్లావు? ఎవరెవరు నీ వెంట వచ్చారు? వారి వివరాలు, ఫోన్ నంబర్లు ఇవ్వమని కీర్తిని ప్రశ్నించారు. దీంతో ఆమె పొంతన లేని సమాదానాలు చెప్పింది. ఈ విషయాన్ని శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు తెలియజేశాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా కీర్తి నేరం చేసినట్లు ఒప్పుకుంది. నిందితులు కీర్తి, ప్రియుడు శశికుమార్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. శవాన్ని పడేసిన రామన్నపేట రైల్వే పట్టాల వద్దకు కూడా తీసుకెళ్లారు. దీనిపై పోలీసులు మాత్రం అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. -
హయత్‌నగర్‌లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ బీభత్సవం సృష్టించింది. కుంట్లూరులోని ఓ వేద పాఠశాలలో చోరబడి 7 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే పసుమములలోని రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో మొబైల్, మరో ఇంట్లో కిశోర్‌స్వామి అనే వ్యక్తిని కట్టేసి.. 50వేల నగదు, 11 తులాల బంగారం దొంగిలించారు. 6 గురు దుండగులు చెడ్డీ వేసుకుని వచ్చి రాడ్లతో బెదిరించి దోపిడీకి పాల్పడినట్టు బాధిత కుటుంబాలు తెలిపాయి. ఈ విషయంపై సమచారం అందుకున్న ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సంప్రీత్ సింగ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మొత్తం ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. దొంగల కోసం 10 ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చేపడుతున్నామని తెలిపారు. తొందరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు. -
కిడ్నాపర్ రవిశేఖర్ అరెస్ట్
-
ఎట్టకేలకు పోలీసుకు చిక్కిన రవిశేఖర్
సాక్షి, హైదరాబాద్ : ఫార్మసీ విద్యార్థిని సోనీని కిడ్నాప్ చేసిన రవిశేఖర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కిడ్నాపర్ రవిశేఖర్‌ను హయత్‌నగర్ పోలీసులు ఒంగోలులో అరెస్ట్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఈ నెల 23న హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థిని రవిశేఖర్ కిడ్నాప్ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోతాననే భయంతో సోనీని అద్దంకిలో మంగళవారం తెల్లవారు జామున వదిలి పారిపోయాడు. ప్రస్తుతం సోనీ పోలీసుల సంరక్షణలో హైదరబాద్‌కు వస్తున్నారు. (చదవండి : కిడ్నాప్‌కు గురైన సోనీ క్షేమం..) -
కిడ్నాప్‌కు గురైన సోనీ క్షేమం..
-
సోనీ ఆచూకి లభ్యం
సాక్షి, హైదరాబాద్ : బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్ మిస్టరీ వీడింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఈ నెల 23న కిడ్నాపైన సోనీ ఆచూకీ ప్రకాశం జిల్లా అద్దంకిలో దొరికింది. పలు కేసుల్లో నిందితుడైన కిడ్నాపర్ రవి శేఖర్..ఆమెను అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సంరక్షణలో సోనీ.. హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. ఆమె బంధువులు కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఏడు రోజుల క్రితం హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థినిని రవిశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు. వారం రోజులు అయినా ఆచూకి లభ్యం కాకపోవడంతో కిడ్నాపర్‌ను పట్టించిన వారికి రూ. 1లక్ష నజరానా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోతాననే భయంతో సోనీని అద్దంకిలో మంగళవారం తెల్లవారు జామున వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్న సోనీ హైదరాబాద్‌కు బయల్దేరినట్లుగా తెలుస్తోంది. (చదవండి : మాటల్లో దించి కారులో..) -
యువతి అపహరణ
హయత్‌నగర్: ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రికి మాయ మాటలు చెప్పి అతడి కుమార్తెను అపహరించుకెళ్లిన సంఘటన మంగళవారం రాత్రి హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా, కొండ మల్లేపల్లికి చెందిన ఎలిమినేటి యాదయ్య బొంగుళూర్ గేటు వద్ద టీ స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె సోని(21) పిగ్లీపూర్‌లోని ఎస్ఎల్సీ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతుండగా, కుమారుడు డేవిడ్ ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. మంగళవారం ఉదయం యాదయ్య టీ స్టాల్ వద్దకు (ఏపి39 ఎక్యూ1686) కారులో వచ్చిన ఓ వ్యక్తి వచ్చి టీ తాగుతూ అతడితో మాటలు కలిపాడు. తన పేరు శ్రీధర్‌రెడ్డిగా పరిచయం చేసుకున్న అతను తన తల్లి డాక్టర్ అని, తండ్రి జడ్జి పని చేస్తున్నాడని, సోదరుడు కమిషనర్‌గా ఉన్నట్లు తెలిపారు. మీ పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో అతని మాటలు నమ్మిన యాదయ్య కుమార్తె, కుమారుడిని రాగన్నగూడ లక్ష్మి మెగా సిటీ వెంచర్ వద్దకు పిలిపించాడు. శ్రీధర్ రెడ్డి వారు ముగ్గురిని కారులో నగరానికి తీసుకొచ్చాడు. డేవిడ్‌ను బీఎన్‌రెడ్డి నగర్ వద్ద దించిన అతను తండ్రీ,కూతురిని నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పాడు. మధ్యాహ్నం వారి భోజనం కూడా పెట్టించాడు. సర్టిఫికెట్ల కోసమని ఎస్ఎల్సీ కళాశాలకు తీసుకువెళ్లాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో హయత్‌నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం వద్ద సోని పూర్తి వివరాలను తెల్ల కాగితంపై రాసి జిరాక్స్ తీసుకురావాలని యాదయ్యను పంపించాడు. అతను కారు దిగి వెళ్లిపోగానే సోనీని తీసుకుని వెళ్లి పోయాడు. వారి కోసం గాలించినా ఆచూకీ తెలియక పోవడంతో యాదయ్య బుధవారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు చక్రాల కింద నలిగి బాలుడు మృతి
హయత్‌నగర్: స్కూలుకు వెళ్లి ఓ బాలుడు అదే స్కూలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన శుక్రవారం సాయంత్రం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొహెడా గ్రామానికి చెందిన బండారి బీరప్ప, బార్గవిల పెద్దకొడుకు రిషితేజ్(4). బీరప్ప లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రిషితేజ్‌ను నెల క్రితమే స్థానికంగా ఉన్న సంకీర్త్ గ్రామర్ స్కూల్లో నర్సరీలో చేర్పించాడు. ఉదయం పాఠశాలకు వెళ్లిన రిషితేజ్ సాయంత్రం ఇంటికి స్కూలు బస్సులో బయలుదేరాడు. కొహెడాలోని హనుమాన్ దేవాలయం సమీపంలో ఉన్న ఇంటి సమీపంలో బస్సు దిగాడు. గల్లీలో ఉన్న ఇంటికి చేరేందుకు బస్సు వెనుక నుంచి నడుచుకుంటూ వెళుతూ.. ఇంటి ర్యాంపు (జారుడు బండ) పైకి ఎక్కాడు. బస్సు ముందుకు కదులుతుండగా ర్యాంపు నుంచి జారిపడి పాఠశాల బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. బస్సు చక్రాలు బాలుడి తల పైనుంచి పోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇరుకు సందులో దారిని ఆక్రమించి ఎత్తుగా నిర్మించిన ర్యాంపు బాలుడి మృతికి కారణమైందని స్థానికులు అంటున్నారు. ర్యాంపు పక్కన నుంచే బస్సు వెళ్లడంతో ర్యాంపుపైకి ఎక్కిన బాలుడు జారి బస్సు కింది పడినట్టు చెబుతున్నారు. పాఠశాల ముందు ఆందోళన బాలుడి మృతికి పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహాంతో సంకీర్త్ పాఠశాల వద్దకు ఆందోళనకు దిగారు. డ్రైవర్ నర్సింహ బస్సు దిగిన పిల్లలను పట్టించుకోకుండా బస్సు నడపడం వల్లనే దుర్ఘటన జరిగిందని దీనికి పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించి తగిన న్యాయం చేయాలని బాలల హక్కుల సంఘం నాయుడు అచ్చుతరావు డిమాండ్ చేశారు. -
హయత్‌నగర్‌లో కార్డెన్ సెర్చ్..
సాక్షి, హైదరాబాద్: హయత్‌నగర్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో 11మంది పాత నేరస్థులు, ఐదుగురు మహిళా నేరస్థులను అరెస్ట్ చేశారు. అదేవిధంగా సరైన ధ్రువపత్రాలు లేని 28 బైక్‌లు, 17 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం, గుట్కా విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
గొలుసుదొంగలకు దేహశుద్ధి
హైదరాబాద్: హైదరాబాద్‌లో గొలుసుదొంగలకు ప్రజలు బుద్ధిచెప్పారు. నగరంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోహెడ గ్రామంలో కందల లక్ష్మమ్మ అనే మహిళ మంగళవారం ఉదయం పాలు పోయాడానికి వెళ్లి వస్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. లక్ష్మమ్మ వెంటనే కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పారిపోతున్న ఇద్దరు స్నాచర్లను పట్టుకుని దేహశుద్ధిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నాలుగున్నర తులాల బంగారు గొలుసు తిరిగి దక్కడంతో లక్ష్మమ్మ ఊపిరిపీల్చుకున్నారు. ఇలాంటి దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
హయత్ నగర్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హయత్‌నగర్‌లోని హయత్బక్షీ బేగం మసీదుతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. గంగా జమున తహజీబ్‌కు ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. -
కార్పొరేటర్‌పై కేసు నమోదు
హైదరాబాద్: నగరంలోని హయత్‌నగర్ కార్పొరేటర్ సామ తిరుమల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల్‌రెడ్డి తమ ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తమ ఇంట్లో మహిళల వీడియోలను తిరుమల్‌రెడ్డి చిత్రీకరించాడని ఫిర్యాదుదారుడు పోలీసులకు వెల్లడించాడు. దీంతో వనస్థలిపురం పోలీసులు.. 448, 504, 506 సెక్షన్ల కింద కార్పొరేటర్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
యువకుడిపై కత్తులతో దాడి
హైదరాబాద్: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టిఅన్నారం సాయిదుర్గ బార్ ముందు చరణ్ అనే యువకుడిని గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దాడిచేసిన వ్యక్తులు పరారయ్యారు. చరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దాడిచేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. -
స్క్రాప్ గోడౌన్లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: హయత్ నగర్ సంఘీనగర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సినిమా షూటింగ్ సెట్టింగ్ స్క్రాప్ గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఎగిసి పడుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని భావిస్తున్నారు. -
చిల్లర అడిగితే చితకబాదారు.. ఆపై దారుణం!
-
చిల్లర అడిగితే చితకబాదారు.. ఆపై దారుణం!
హైదరాబాద్: హయత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హయత్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి... వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలోని పాన్‌షాపులో రాజేష్ అనే వ్యక్తి సిగరెట్ కొన్నాడు. సిగరెట్ కోసం కొంత డబ్బు ఇవ్వగా షాపతను వినియోగదారుడు రాజేష్‌కు నాలుగు రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో షాపు ఓనర్‌తో రాజేష్‌కు వివాదం తలెత్తింది. షాపు యాజమని, అతని స్నేహితులు కలిసి రాజేష్‌పై దాడిచేసి అతడిని విపరీతంగా కొట్టారు. దెబ్బలు తాళలేక రాజేష్ రోడ్డుమీదకు పరుగుతీశాడు. రోడ్డు దాటే ప్రయత్నం చేయగా వేగంగా వచ్చిన ఓ లారీ అతడిని ఢీకొట్టింది. దీంతో రాజేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య
హైదరాబాద్‌సిటీ: హయత్‌నగర్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న శివశంకర బ్రహ్మచారి(28) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని.. భవనం నాలుగో అంతస్తు మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలయాలతో బ్రహ్మచారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూరే కారణమని భావిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
'బావర్చి' హోటల్ సీజ్
హయత్‌నగర్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిన హయత్‌నగర్‌లోని హైవే బావర్చి హోటల్‌ను శుక్రవారం రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... హయత్‌నగర్‌లో ఉన్న హైవే బావర్చి హోటల్లో నిర్వాహకులు కొంత కాలంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఈ నెల 5న పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న నిర్వాహకులు సలీం అలియాస్ యూసఫ్‌తో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రూ.2.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించడంతో పాటు హోటల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆర్డీఓకు లేఖ రాశారు. దీనిపై విచారించిన ఇబ్రహింపట్నం ఆర్డీఓ గేమింగ్ యాక్ట్ ప్రకారం హోటల్‌ను సీజ్ చేయాలని గత బుధవారం పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్స్పెక్టర్ నరేందర్‌గౌడ్, ఎస్ఐలు సుధాకర్‌రెడ్డి, మన్మదకుమార్, నాగరాజు, వీఆర్ఓ ఫణిందర్లు శుక్రవారం హోటల్‌ను సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఆయన ఆదేశాలతో హోటల్‌పై చర్య తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ఏటీఎం చోరీకి విఫల యత్నం
హయత్‌నగర్: ఏటీఎం మిషన్‌లోని డబ్బులు దొంగిలించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా అది తెరుచుకోకపోవడంతో తిరిగి వెళ్లిన పోయిన సంఘటన సోమవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మునగనూరులోని సిండికేట్బ్యాంకు ఏటీఎం లోకి అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యకి ముఖానికి టవల్ చుట్టుకుని ప్రవేశించాడు. లోపల ఉన్న సీసీ కెమరా తీగలను కట్ చేశాడు. మిషన్డోర్ తెరిచాడు. మిషన్లోపల ఉన్న సీల్‌ను తొలగించేందుకు ప్రయత్నించాడు. సుమారుగా అరగంటసేపు ప్రయత్నించినా మిషన్ తెరుచుకోలేదు. దీంతో దుండగుడు తిరిగి వెళ్లిపోయాడు. ఉదయం బ్యాంకుకు వచ్చిన మేనేజర్ పీఎస్‌ఆర్‌బీ ప్రసాద్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ నరేందర్‌గౌడ్. ఎస్సైలు చంద్రశేఖర్, మన్మదకుమార్లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ పుటేజిలను పరిశీలించారు. క్లూస్‌టీం సభ్యులు సాక్షాలను సేకరించారు. దుండగడు స్థానికంగా లేబర్ పని చేసే వాడై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
‘బావర్చి’ లో పేకాట.. హోటల్ సీజ్!
హయాత్‌నగర్: పేకాటరాయుళ్లపై పోలీసులు కొరడా ఝళిపించారు. రహస్యంగా పేకాట ఆడుతూ జల్సా చేస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. నగర శివార్లలోని హయత్‌నగర్‌లో ఉన్న ‘బావర్చి’ హోటల్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు గురువారం రట్టు చేశారు. పేకాట ఆడుతున్న 16మందిని అరెస్టు చేసి.. వారి వద్ద నుంచి రూ. 2.37 లక్షల నగదుతో పాటు 17 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని ’బావర్చి’ హోటల్లో రహస్యంగా పేకాట తంతు కొనసాగుతోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ గుట్టును రట్టు చేసినట్టు తెలుస్తోంది. పేకాట బాగోతం నేపథ్యంలో ’బావర్చి’ హోటల్‌ను సీజ్ చేయాలని పోలీసులు రెవెన్యూ అధికారులకు నివేదించారు. -
16 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
హైదరాబాద్: హయత్‌నగర్‌లోని హైవే బావర్చి హోటల్‌పై పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 సెల్ఫోన్లు, రూ. 2.37 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
భూదాన్’ పేరుతో మోసం
- 8 మంది అరెస్టు హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుట్లూరులో భూదాన్ భూమి పేరుతో పేదలను మోసం చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని సర్వే నంబర్- 215 నుంచి 224 మధ్యగల భూమి భూదాన్ ట్రస్టుకు సంబంధించినదంటూ కొందరు వ్యక్తులు పేదలను ముగ్గులోకి దించారు. అందుకుగాను కేసీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరు పెట్టి ఒక్కో వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేశారు. వారికి నకిలీ పట్టాలు ఇచ్చి.. ఆ స్థలంలో గుడిసెలు వేయించారు. ఈ తతంగం అంతా తెలుసుకున్న అసలు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సూత్రధారులైన 8మందిని శనివారం అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే..
హయత్‌నగర్: వ్యక్తి మృతదేహాన్ని బైక్‌పై అనుమానాస్పదంగా తరలిస్తూ పట్టుబడిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని బాలుడితో కలిసి భార్యే అతడిని చంపి.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించినట్టు తేల్చారు. బాలుడితో పాటు మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ మార్కెట్ కమిటీలో ఉద్యోగిగా పనిచేసిన మెండెం పుల్లయ్య, ప్రవల్లిక దంపతులకు ఇద్ద రు పిల్లలు. ఆరు నెలల క్రితం వరుసకు మేనల్లుడయ్యే ఓ బాలుడితో ప్రవల్లిక ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. పుల్లయ్యకు ఈ విషయం తెలిసి బాలుడిని హెచ్చరించాడు. అయినా బాలుడు ప్రవల్లిక వద్దకు రావడం మానలేదు. దీంతో పుల్లయ్య భార్యాపిల్లలను తీసుకుని నగరానికి వచ్చి ఎల్బీనగర్ మైత్రినగర్‌లో ఉంటున్నాడు. ఈ నెల 22న పుల్లయ్య ఇంట్లో లేని సమయంలో ఆ బాలుడు వచ్చా డు. 23న ఇంటికి వచ్చిన పుల్లయ్యకు భార్యతో బాలు డు కనిపించాడు. కోపం కట్టలు తెంచుకున్న అతను ఇద్దరినీ కొట్టి.. బాలుడిని తన ఇంటి నుంచి పంపేశాడు. అనంతరం బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చాడు. రాత్రి మద్యం మత్తులో ఉన్న పుల్లయ్యను ప్రవల్లిక, బాలుడు కలిసి కొట్టి.. తలను గోడకేసి బాది చంపేశారు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక 24వ తేదీ రాత్రి వరకు వేచి చూశారు. 25న ఆసుపత్రిలో ఉన్న తమ బంధువులను చూసి వస్తామని పక్కింటి వ్యక్తి దగ్గర బైక్ తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు నిర్జన ప్రదేశంలో మృతదేహాన్ని పడేద్దామని బైకు మధ్యలో పెట్టుకొని బాలుడు, ప్రవల్లిక బయలుదేరారు. మృతదేహం కాళ్లు వేలాడుతూ కనిపించడంతో పెద్దఅంబర్‌పేట వద్ద పెట్రోలింగ్ పోలీసులు బైక్‌ను ఆపారు. విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. 108 సిబ్బందిని పిలిపించగా బైకు మధ్యలో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు తేలింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ప్రవల్లికతో పాటు బాలుడిని తమదైన శైలిలో విచారించగా.. తామే హత్య చేశామని చెప్పారు. దీంతో నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
మద్యం మత్తులో ఈతకు వెళ్లి..
హయత్‌నగర్: మద్యం మత్తులో ఈత కొట్టేందుకు బావిలోకి దిగిన ఓ యువకుడు నీటిలో మునిగి మృతి చెందాడు. శనివారం హయత్‌నగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీఐ నరేందర్‌గౌడ్ కథనం ప్రకారం.... మౌలాలికి చెందిన సత్తయ్య కొడుకు చిన్నా (28) కూలీ. ఇతను గతంలో తారామతిపేటలో ఖుర్షిద్ అనే వ్యక్తి వ్యవసాయ బావి వద్ద పనిచేశాడు. ఈ క్రమంలో కుషాయిగూడకు చెందిన తోటి స్నేహితులు వెంకటేశ్, జాఫర్లతో కలిసి చిన్నా ఆ బావి వద్దకు శుక్రవారం వచ్చాడు. అంతా కలిసి మద్యం తాగారు. అనంతరం ఈత కొడతానని బావిలోకి దిగిన చిన్నా..ఎంతకూ పైకి రాకపోవడంతో ఆందోళన చెందిన స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. శనివారం ఉదయం బావిలో మృతదేహం తేలియాడుతుండగా చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని నీటిలో నుంచి బయటకు తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి స్నేహితులను పిలిపించి విచారించారు. కాగా చిన్నా ఈతకు వెళ్లి మృతి చెందాడా? లేక స్నేహితుల హస్తం ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
అల్లరి చేస్తున్నాడని విద్యార్థిపై దారుణం
హయత్‌నగర్: అల్లరి చేస్తున్నాడని విద్యార్థిని హాస్టల్ వార్డెన్ చితకబాదాడు. కంటికి తీవ్రగాయమై చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... శంషాబాద్ సమీపంలోని చిన్న తూఫ్రాన్ పేటకు చెందిన దయాసాగర్ కుమారుడు మనీష్(13) హయత్‌నగర్‌లోని శ్రీ చైతన్య టెక్నో రెసిడెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి అల్లరి చేస్తున్నాడనే కారణంగా వార్డెన్ లక్ష్మణ్ అతడిని చితకబాది, తలను బెంచీకేసి కొట్టాడు. దీంతో పెదవులతో పాటు కంటిలోపల గాయాలయ్యాయి. కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో విద్యార్థి తల్లిదండ్రులు శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్డెన్‌ను కఠినంగా శిక్షించాలి: బాలల హక్కుల సంఘం విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌ను జువైనల్ యాక్ట్ ప్రకారం శిక్షించాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫీజుల రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తున్న కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ, దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. విద్యార్థికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మండల ఎస్ఎఫ్ఐ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్
హైదరాబాద్‌సిటీ: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లెక్చరర్స్ కాలనీలో చైన్‌స్నాచింగ్ జరిగింది. బోనాలపండగ సందర్భంగా బంధువుల ఇంటికి వచ్చిన సంధ్యా రాణి అనే మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా మెడలో ఉన్న 3 తులాల మంగళ సూత్రాన్ని, మరో తులం బంగారు గొలుసును ఇద్దరు దొంగలు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు-లారీ ఢీ: 10 మందికి తీవ్ర గాయాలు
హయాత్‌నగర్ : రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్ మండలం ఇనాంగూడ గ్రామ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బస్సులోని పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సును వేగంగా వెళుత్ను లారీ ఢీకొట్టింది. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హయత్‌నగర్ కుంట్లూరులో ఉద్రిక్తత
-
హయత్‌నగర్ కుంట్లూరులో ఉద్రిక్తత
హయత్‌నగర్: ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చడానికి ప్రయత్నించిన అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కుంట్లూరు శివారులో గురువారం అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న రెవెన్యూ, పంచాయతి సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. నిర్మాణాలను కూల్చకుండా అడ్డుపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనాకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
కోడి పందాలు కాస్తున్న ఐదుగురి అరెస్ట్
హయత్‌నగర్: పందాల రాయుళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. హయత్‌నగర్ పరిధిలోని కోహెడ సర్వీసు రోడ్డు సమీపంలో కోడి పందేలు కాస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.29 వేల నగదు, రెండు కోళ్లు, రెండు కత్తులు, 6 సెల్ఫోన్లు, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హయత్‌నగర్‌లో చైన్‌స్నాచింగ్
హైదరాబాద్ : హయత్‌నగర్‌లో శుక్రవారం సాయంత్రం చైన్‌స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. సుజాత అనే మహిళ నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును తెంపుకుని మాయమయ్యారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ప్రేమ వేధింపులతో టీచర్ ఆత్మహత్య
హైదరాబాద్ : ప్రేమ పేరుతో వేధింపులకు తాళలేక హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయిని ఆత్మహత్య చేసుకుంది. చందన(23) అనే ప్రైవేట్ పాఠశాల టీచర్‌ను నల్లగొండ జిల్లా చౌటుప్పటల్కు చెందిన మహేష్ కొంతకాలంగా ప్రేమించాలని వెంటపడుతున్నాడు. ఆమె తిరస్కరించినా వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె శనివారం సరూర్‌నగర్ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఉస్మానియాకు తరలించారు. -
హైదరాబాద్ లో బ్రోతల్ హౌస్ గుట్టురట్టు!
హయత్‌నగర్: ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ బ్రోతల్ హౌస్ గుట్టురట్టయింది. ఈ వ్యభిచార గృహంపై పోలీసులు దాడిచేసి నిర్వాహకురాలితోపాటు ఓ మహిళ, విటున్ని అరెస్ట్ చేశారు. శనివారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గడిశె ప్రభావతి అనే మహిళ హయత్‌నగర్ డివిజన్లోని అరుణోదయనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. బహదూర్‌పురాకు చెందిన విటుడు గాదె నాగప్పతో పాటు ఓ మహిళను, నిర్వాహకురాలిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, రూ.500 నగదును స్వాధీనం చేసుకున్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి కార్మికుడి మృతి
హయత్‌నగర్: తాటిచెట్టుపై నుంచి పడిపోవడంతో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. హయత్‌నగర్ మండలం మాజీద్‌పూర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బత్తిని బిక్షపతిగౌడ్ కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కగా మోపు తెగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న గ్రామస్తులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. -
మూడు వేల కోళ్లు మృత్యువాత
హైదరాబాద్ : ఎండల తీవ్రత కోళ్లఫారాల యజమానులను తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. ఎండ వేడిమికి హయత్‌నగర్ మండలం గడిచెరువు సమీపంలో ఓ కోళ్ల ఫారంలో శనివారం మూడు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ పరిణామంతో ఫారం నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
నలుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్
హయత్‌నగర్: హయత్‌నగర్ మండలంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల వెనుకవైపు పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2,700 నగదు, నాలుగు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. సదురు స్థావరంలో పేకాడుతున్నట్లు పోలీసులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేశారు. -
నగరంలో కోడిపందేలు: ఇద్దరి అరెస్ట్
హయత్‌నగర్ : సంక్రాంతి వచ్చిందంటే.. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల సందడి అంతా ఇంతా కాదు. క్రమక్రమంగా ఆ సంస్కృతి మిగతా తెలుగు ప్రాంతాలకు కూడా పాకుతుంది. తాజాగా గురువారం సాయత్రం నగరంలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదిరాజ్ కాలనీలో కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు పందెం రాయుళ్లతోపాటు, 2 ద్విచక్రవాహనాలు, 6 పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. -
హయత్‌నగర్ మండలంలో అగ్నిప్రమాదం
-
హయత్‌నగర్ మండలంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హయత్‌నగర్ మండలం తట్టిఅన్నారం కుత్బుల్లాపూర్ పరిసరాల్లోని అటవీప్రాంతంలో గురువారం ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మూడు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ఫైరింజన్లు వీలుకాలేదు. దీంతో సమీపంలో నుంచి ఫైరింజన్ ద్వారా మంటలార్పే ప్రయత్నాం చేస్తున్నారు. -
మహీళపై కానిస్తేబుల్ లైంగికదాడి
-
బైక్‌ను ఢీకొన్న లారీ: విదేశీ విద్యార్థి మృతి
హయత్ నగర్ (రంగారెడ్డి జిల్లా): హయత్‌నగర్ మండలం బాట సింగారం వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. శుక్రవారం మద్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఉగాండా దేశానికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలవడంతో చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
హయత్‌నగర్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ : హయత్‌నగర్ కిడ్నాప్ కేసును నగర పోలీసులు మంగళవారం ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కిడ్నాపర్లు మహేశ్, రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడు నవీన్‌ను కిడ్నాప్ చేసేందుకు మహేశ్ రూ. లక్ష సుపారీ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. మహేశ్‌కు ఆడపిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో నవీన్ కిడ్నాప్‌కు యత్నించారని పోలీసులు వెల్లడించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరు కిడ్నాపర్లు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. -
ఎక్కడికక్కడే నిలిచిపోయినన ఆర్టీసీ
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. రోడ్డు సేఫ్టీ బిల్లు రద్దు చేయాలని కోరుతూ నగరంలోని బస్ డిపోల ముందు కార్మికులు బుధవారం నాడు సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హయత్‌నగర్ డిపో ముందు కార్మికులు ధర్నా చేపట్టడంతో 254 బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు
హైదరాబాద్: నకిలీ పోలీసుల ముఠా గుట్టును రంగారెడ్డి జిల్లా పోలీసులు శుక్రవారం రట్టు చేశారు. హయత్‌నగర్ సమీపంలో పోలీసులమంటూ నలుగురు వ్యక్తులు పలువురి వద్ద నగదు డిమాండ్ చేశారు. ఆ క్రమంలో స్థానికులు వారిని పట్టుకుని... దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
హయత్‌నగర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొత్తగూడ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న మారుతి కారు హయత్‌నగర్ మండలం కొత్తగూడ వద్ద అదుపు తప్పి వంతెన గోడను ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న వరప్రసాద్(50) అనే వ్యక్తి మృతి చెందాడు. అదే కారులో ప్రయాణిస్తున్న నాగమణి(45), దేవదానం(20)లు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు, లారీ ఢీ : ముగ్గురు మృతి
హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ, కారు ఢీ కొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామంలో జాతీయరహదారి-65పై జరిగింది. గాయపడిన వారిని హయత్‌నగర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఈతకు వెళ్లి బాలుడు మృతి
-
చిన్నారి కిడ్నాప్, ఆపై తీవ్ర గాయాలు
-
సెక్యూరిటీగార్డు దారుణ హత్య
⇒తోటి గార్డే నిందితుడు ⇒ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఘటన హయత్‌నగర్: డబ్బు కోసం తోటి సెక్యూరిటీ గార్డును అతికిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఈ గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన నావల్ కిషోర్‌సింగ్ (55) నెల రోజుల క్రితం కుంట్లూరులోని నాగోల్ ఇంజినీరింగ్ కళాశాలలో సెక్యూరిటీగార్డుగా చేరాడు. ఇదే కళాశాలలో సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న ఒరిస్సాకు చెందిన బి.సక్యా కొత్తగా వచ్చిన వారిని వే ధించడం అలవాటుగా చేసుకున్నాడు. గతంలో గార్డుగా చేరిన ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి పంపేశాడు. ఇదే క్రమంలో కొత్తగా చేరిన నావల్ కిషోర్సింగ్ను కూడా వేధిస్తున్నాడు. గురువారం రాత్రి నావల్ కిషోర్‌సింగ్, సక్యాలు కళాశాల గేటు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి డబ్బు విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన సక్యా ఇనుప రాడ్‌తో కిషోర్సింగ్పై దాడి చేశాడు. తల, ఇతర శరీర భాగాలపై విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో కిషోర్‌సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్యకు సంబంధించిన సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు ఘటనా స్థలాన్ని శుభ్రం చేశాడు. తర్వాత తనకు ఏమీ తెలియనట్టుగా విధులను నిర్వహిస్తున్నాడు. నిందితుడిని పట్టుకున్న ‘అర్జున్’.... విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కళాశాల యాజమాన్యంతో పాటు పోలీసులకు సెక్యూరిటీ గార్డు సక్యాపై అనుమానం కలిగింది. పోలీసులు వెంటనే డాగ్‌స్క్వాడ్‌ను ర ప్పించారు. పోలీసు జాగిలం అర్జున్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నేరుగా అర కిలోమీటరు దూరంలో ఉన్న నిందితుడు సక్యా వద్దకు వెళ్లి అతని కాలు పట్టుకుంది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, గతంలో పెద్దఅంబర్‌పేట వద్ద జరిగిన హత్య కేసులో కూడా ‘అర్జున్’ నిందితుడి ఇంటికి వెళ్లి పట్టుకుందని తెలిసింది. -
హయత్‌నగర్‌లో పేకాట రాయుళ్ల అరెస్ట్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లు, నాలుగు బైకులతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
బాలికపై అత్యాచారం.. నిందితుడి హత్య
హైదరాబాద్: అభం శుభం ఎరుగని అమాయక బాలికపై అత్యాచారం చేసి.. బెయిల్ మీద జైలు నుంచి బయటికొచ్చి తిరుగుతున్న నిందితుడిని బాధితురాలి బంధువులు దాడి చేసి చంపేశారు. హయత్ నగర్ మండలం బలిజగూడలో గత ఏడాది ఏప్రిల్ నెలలో ఆరేళ్ల బాలికపై శ్రీను అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాలిక జరిగిన విషయాన్నితన తల్లితండ్రులకు వెల్లడించడంతో వారు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కొంత కాలానికి బెయిల్ పై విడుదలైన శ్రీను.. కొన్నాళ్ల పాటు గచ్చిబౌలిలో గడిపి, తర్వాత మళ్లీ హయత్ నగర్ ప్రాంతానికి వచ్చి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న నిందితురాలి బంధువులు కోపంతో రగిలిపోయారు. ఆవేశంతో బాలిక తండ్రి, మేనమామ, ఇద్దరు చిన్నాన్నలు కలిసి సోమవారం మధ్యాహ్నం శ్రీనుపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన నిందితుడు శ్రీను.. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడికి పాల్పడిన బాలిక బంధువులు వెంటనే పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్; నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం
హయత్ నగర్ : నగరంలోని హయత్ నగర్ బృందావన్ కాలనీలో బుధవారం పేకాటస్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 సెల్ ఫోన్లు, రూ. 9, 300 లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
పెన్షన్ల పంపిణిలో నకిలీ నోట్లు
-
స్కూల్ బస్సులు ఢీ: డ్రైవర్లకు గాయాలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ లక్ష్మానగర్పాలెంలో మంగళవారం రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు బస్సు డ్రైవర్లు గాయపడ్డారు. అయితే బస్సులోని విద్యార్థులకు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులో నుంచి కిందకి దింపి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షలు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి హయత్‌నగర్‌లోని వరుణ్ మోడల్ హైస్కూల్ చెందినదని, మరోకటి మజీద్‌పూర్‌కు చెందిన నీలకాంత్ విద్యాపీఠ్‌కు చెందిన బస్సు అని పోలీసులు తెలిపారు. -
‘బాహుబలి’షూటింగ్లో అపశ్రుతి.. నలుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న బాహుబలి సినిమా షూటింగ్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం సాయంత్రం ఫైటింగ్ సీన్ చేస్తుండగా పేలుడు సంభవించి నలుగురికి మంటలు అంటుకున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిలింసిటీలో బాహుబలి చిత్రం పోరాట దృశ్యాల చిత్రీకరణ సాగుతోంది. పెద్దఎత్తున కుంకుమను వెదజల్లేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ఫైటింగ్ సీన్లో పాల్గొనేందుకు వచ్చి పక్కనే నిల్చున్న నలుగురు ఫైటర్లకు అతి సమీపంగా అవి ఎగిసిపడ్డాయి. దీంతో ఫైటర్లు సతీష్, పాండు, గణేశ్, సంతోశ్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారు హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు. -
స్కూలు బస్సు - వాటర్ ట్యాంకర్ ఢీ
హైదరాబాద్: నగరంలో హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీలో శుక్రవారం స్కూల్ బస్సును వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దాంతో గాయపడిన విద్యార్థులను 108లో ఆసుపత్రికి తరలించారు. వాటర్ ట్యాంకర్ వాహనం అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాటర్ ట్యాంకర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త న్యాయస్థానాలు 31
సాక్షి, రంగారెడ్డి జిల్లా : న్యాయసేవలను విస్తృతం చేసేందుకు రాష్ట్ర హైకోర్టు మరో అడుగు ముందుకేసింది. న్యాయస్థానానికి వచ్చే కేసుల పరిశీలనను వేగవంతం చేయాలనే సంకల్పంతో జిల్లాకు కొత్తగా 31 కోర్టులను మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నగరం చుట్టూ జిల్లా విస్తరించి ఉండడం, ప్రజల రాకపోకలు, ఇతర కార్యకలాపాలన్నీ జిల్లా నుంచే జరుగుతున్న నేపథ్యంలో సమస్యలు సైతం జిల్లాలో ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో న్యాయస్థానానికి వెళ్లే కేసులు సైతం అధికంగా ఉన్నాయి. ఈ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు చర్యలు చేపట్టింది. జిల్లాకు హైకోర్టు మంజూరు చేసిన న్యాయస్థానాల్లో 25 జూనియర్ సివిల్ జడ్జీ కమ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్స్ కోర్టులు, మరో ఆరు జ్యుడీషియల్ సర్వీస్ సెంటర్లున్నాయి. ఇవి మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, వికారాబాద్, కూకట్పల్లి, మల్కాజిగిరి, మేడ్చల్, హయత్‌నగర్, పరిగి, చేవెళ్ల, తాండూరు ప్రాంతాల్లో వీటిని నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇవన్నీ ఈనెల 21 నుంచి అందుబాటులోకి రానున్నాయి. కొత్త న్యాయ స్థానాలిక్కడే.. జిల్లాకు కొత్తగా మంజూరైన 31 న్యాయస్థానాలను 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మల్కాజిగిరిలో రెండు, మేడ్చల్‌లో ఐదు, హయత్‌నగర్‌లో ఒకటి, మహేశ్వరంలో ఒకటి, ఇబ్రహీంపట్నంలో మూడు, కూకట్‌పల్లిలో ఆరు, రాజేంద్రనగర్‌లో మూడు, పరిగిలో మూడు, తాండూరులో మూడు, వికారాబాద్‌లో మూడు న్యాయస్థానాలు ఏర్పాటు కానున్నాయి. ఈనెల 21 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ న్యాయస్థానాల తాత్కాలిక బాధ్యతలు సమీపంలోని న్యాయమూర్తులకు అప్పగించింది. -
రూ. 15 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
గుట్టురట్టుచేసిన మూడు రాష్ట్రాల పోలీసులు రాజధాని శివార్లలో కేంద్రాలు పోలీసుల అదుపులో 15 మంది నిందితులు ఎపిడ్రిన్‌గా అనుమానం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలో నడుస్తున్న డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. బెంగళూరులో దొరికిన తీగెను లాగితే దాని డొంక రాజధాని శివార్లలోని హయత్‌నగర్‌లో కదిలింది. కేరళ, కర్నాటక, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు కలిసి ఈ రాకెట్ కేంద్రాలపై దాడులు జరిపారు. ఇందులో రూ.15 కోట్ల విలువైన ఏడు టన్నుల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి సరఫరాకు బాధ్యులైన 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్‌లోని గండిచెరువు, సూర్మైగూడ, లష్కర్గూడతో పాటు నల్లగొండలోని చౌటుప్పల్‌లో ఈ దాడులు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన దాడులు సోమవారం అర్ధరాత్రి వరకూ సాగాయి. సంబంధిత గోడవున్లలో అనధికారికంగా కొన్ని రకాల రసాయనాలు తయారు చేస్తున్నట్లు కూడా వెల్లడైంది. వాటిని, మత్తుపదార్థాల నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు తరలించారు. పట్టుబడినవి ఎపిడ్రిన్ అని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై తొలుత కేరళ పోలీసులకు ఉప్పందింది. వారు వారం కిందట ముగ్గురు అనుమానితులను ప్రశ్నించగా హైదరాబాద్‌లో మూలాలు ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేరళ, బెంగళూరుకు చెందిన యాంటి నార్కొటిక్ వింగ్ అధికారులు, పోలీసులు నిందితులను వెంట తీసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలిసి విషయాన్ని చెప్పారు. ఆ మేరకు ఎస్ఓటీ పోలీసుల సహకారంతో ఆదివారం సాయంత్రం 6 గంటలకు హయత్‌నగర్ మండలంలోని గండిచెరువులో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నేతకు చెందిన గోడవున్పై దాడి చేశారు. అక్కడి సిబ్బందిలో కొందర్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడికి సమీపంలోని లష్కర్‌గూడలో డ్రగ్ మాఫియా తలదాచుకుంటున్న గదిని కూడా సీజ్‌చేశారు. కొద్ది దూరంలో ఉన్న సాయిప్రియ కెమికల్స్ కంపెనీపై కూడా దాడి చేశారు. ఆయా ప్రాంతాలకు మీడియాను అనుమతించ లేదు. దాడుల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థికి తీవ్ర గాయాలు: కాలేజీ వద్ద ఉద్రిక్తత
హయత్‌నగర్‌లోని సెయింట్‌మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిపైకి కాలేజీ బస్బు దూసుకెళ్లింది. ఆ ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడింది. ఆ విద్యార్థిని వెంటనే కళాశాల యాజమాన్యం వైద్య చికిత్స కోసం నగరంలోని ఆసుపత్రికి తరలించింది. అయితే విద్యార్థిపై బస్సు దూసుకెళ్లిన సంఘటనపై కాలేజీ విద్యార్థులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బస్సుపై దాడి చేసి అద్దాలు పగలుకొట్టారు. దాంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను శాంతింప చేస్తున్నారు. కాలేజీ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి... కేసు నమోదు చేశారు. -
ఆరేళ్ల బాలికపై అత్యాచారం... నిందితుడు పరారీ
హయత్‌నగర్ మండలం బలిజగూడలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై శ్రీను అనే యువకుడు గత అర్థరాత్రి అత్యాచారం చేశాడు. ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లితండ్రులకు వెల్లడించింది. దాంతో వారు హయత్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీను పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
కాలేజ్ భవనంపై నుంచి దూకి.. విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్ అవంతి కళాశాల భవనంపై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం ఎల్లారెడ్డిగూడేనికి చెందిన తడ మల్లారెడ్డి కుమార్తె సంధ్యారాణి (21) హయత్‌నగర్ మండలం గుంతపల్లిలోని అవంతి కళాశాలలో బీటెక్ (ఎలక్ట్రానిక్స్) రెండో సంవత్సరం చదువుతోంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని హాస్టల్లో ఉంటోంది. బుధవారం ఎప్పటిలాగే కళాశాలకు వెళ్లింది. కొద్దిసేపటికే ఏడుస్తూ కళాశాల భవనం టైపైకి పరుగెట్టింది. విద్యార్థులు వారిస్తున్నా భవనంపై నుంచి దూకేసింది. తీవ్ర గాయాలైన ఆమెను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సంధ్య ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సమస్యల వల్లే తాను ఇలా చేశానని సంధ్య కొన ఊపిరితో ఉన్నప్పుడు చెప్పిందని విద్యార్థులు చెబుతున్నారు. చదువులో ఎప్పుడూ ముందంజే... చిన్నతనంలోనే సంధ్య తండ్రి చనిపోయారు. కూతురిని ఉన్నత స్థానంలో చూడాలని తల్లి శోభ కష్టపడి చదివించింది. సంధ్య కూడా అందుకు తగ్గట్లే చదువులో ముందుండేది. సంధ్య మరణ వార్త విని కుటుంబసభ్యులు, కళాశాల విద్యార్థులు సన్‌రైజ్ ఆసుపత్రికి తరలివచ్చారు. సంధ్యను చూసి కన్నీరుమున్నీరయ్యారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, కుటుంబ సమస్యలేవీ లేవని, ఆమెను ఎవరో ఆత్మహత్యకు పురిగొలిపి ఉంటారని చెబుతూ తల్లి శోభ విలపించారు. -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
ఐదు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి
హయత్‌నగర్: మాయ మాటాలతో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హాస్టల్లో సీటు ఇప్పిస్తానని చెప్పి నల్లగొండ జిల్లాకు మైనర్ బాలికను నగరానికి తీసుకొచ్చిన ప్రశాంత్ యువకుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఓ గదిలో నిర్బంధించి ఐదు నెలలుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక అతడి బారిన తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు పరారయ్యాడు. తనకు మాయా మాటలు చెప్పి లోబరుచుకున్నాడని బాధిత బాలిక బాలిక తెలిపింది. హాస్టల్ సీటు ఇప్పిస్తానని చెప్పి అకృత్యానికి పాల్పడ్డాడని వివరించింది. తనను వంచించిన దుర్మార్గుడిపై చర్య తీసుకోవాలని కోరింది. నిందితుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. -
హయత్‌నగర్‌లో దుండగుల దాడి.. భార్య మృతి, భర్త సీరియస్
హైదరాబాద్ శివారు ప్రాంతంలోని హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. సంఘీ టెంపుల్ వద్దకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తున్న దంపతులపై దుండగులు హత్యాయత్నం చేశారు. కత్తులతో వారిపై దాడి చేయడంతో ఇద్దరిలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. కోహెడ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇటీవలి కాలంలో శివారు ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితి బాగా క్షీణిస్తోంది. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు నిర్వహించిన సమావేశానికి హాజరైన కొందరు తిరిగి వెళ్తుండగా బస్సు మీద రాళ్లతో దాడి కూడా హయత్‌నగర్ ప్రాంతంలోనే జరిగిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో ఆంధ్రబ్యాంక్ చైర్మన్‌కు తీవ్రగాయాలు
హైదరాబాద్ నగర శివారుల్లోని హయత్‌నగర్‌లో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రబ్యాంక్ చైర్మన్ ప్రభాకర్‌తో పాటు ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ప్రభాకర్ దంపతులను నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్ ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ఆ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.